కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగిస్తే వైద్యరంగంలో పెను మార్పులు
- షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్
కంచికచర్ల : కమ్యూనికేషన్ టెక్నాలజీని వైద్య రంగంలో కూడా ఉపయోగించుకోవచ్చని, ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చని శ్రీహరికోటలోని షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
స్థానిక మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ స్కోప్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషన్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాటిలైట్ రంగంలో కమ్యూనికేషన్ విభాగంలో వచ్చిన మార్పులను వివరించారు. వివిధ బ్యాండ్‌లను ఏయే శాటిలైట్స్‌ను లాంచ్ చేయటానికి వినియోగిస్తారనే వివరాలు వెల్లడించారు.
తొలిసారిగా ఎక్స్‌టెండెడ్, సీ బ్యాండ్‌లను వినియోగించింది భారతదేశమేనని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ విభాగానికి వె చ్చిస్తున్న డబ్బును స్లైడ్స్ ద్వారా చూపించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు భవిషత్ తరాలకు అందించే విధంగా అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేబీకే రావు, వైస్ చైర్మన్ నిమ్మగడ్డ శ్రీనివాసరావు, డెరైక్టర్ ఎన్.కృష్ణ, సీఈవో పాండురంగారావు, సీఈసీ హెచ్‌వోడి ప్రొఫెసర్ గురవారెడ్డి, ప్రొఫెసర్ ఆకుల వెంకటనరేష్‌బాబు, వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.