revolutionary changes
-
విప్లవాత్మక మార్పే ‘గతి శక్తి’ లక్ష్యం: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్(పీఎంజీఎస్–ఎన్ఎంపీ)’లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని పూర్తి చేయడంలో ఈ పథకం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. పీఎంజీఎస్–ఎన్ఎంపీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మోదీ ‘ఎక్స్’వేదికగా ప్రశంసించారు. ‘దేశ మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మకంగా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ‘పీఎం గతిశక్తి’ఉద్భవించింది. ఇది మలీ్టమోడల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగు పరిచింది, వివిధ రంగాలలో వేగవంతమైన, మరింత ప్రభావవంతమైన అభివృద్ధికి దారితీసింది. వివిధ వాటాదారుల ఏకీకరణతో లాజిస్టిక్లకు ప్రోత్సాహం లభించింది. జాప్యాలను తగ్గించింది. చాలా మందికి కొత్త అవకాశాలను సృష్టించింది. గతిశక్తి కారణంగా వికసిత్ భారత్ అనే మా స్వప్నం సాకారం చేసే దిశలో దేశం వేగంగా ముందుకుసాగుతోంది. ఇది అభివృద్ధిని,, పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
త్వరలో విద్యాకమిషన్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యాకమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధికల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో సీఎం శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు.ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని..విద్యావేత్తలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు. భేటీలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్.విశ్వేశ్వరరావు, శాంతాసిన్హా, ఆల్దాస్ జానయ్య, పద్మజాషా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. నియమాకాలు, నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణలోపంతో పాఠశాలవిద్యలో తెలంగాణ 35వ స్థానంలో ఉందని వారు సీఎంకు వివరించారు. పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని.. తద్వారా విద్యార్థులు చేరడానికి ఆసక్తి కనపరుస్తారని సూచించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని వివరించారు.అంగన్వాడీల్లోనే మూడో తరగతి వరకు ప్రీసూ్కల్‌లో బోధన అందేలా చూసి, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎం తెలిపారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామన్నారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయా లని ఆల్దాస్ జానయ్య సీఎంను కోరారు. తాము చదువుకున్న ఉస్మానియాలో ప్రస్తుతం విద్యాప్రమాణాలు పడిపోయాయని హరగోపాల్, శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.విద్యావ్యవస్థలో మార్పులపై విధానపత్రం రూపొందిస్తే.. దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి, దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య చెప్పగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, తాను, భట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’బిల్లు! తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్స్ యూనివర్సిటీపై శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం ముసాయిదా రూపొందించిందని చెప్పారు. అందరికీ హైదరాబాద్‌లోనే శిక్షణ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్‌లు) ఏర్పాటు చేసే విషయం సమావేశంలో చర్చకొచి్చంది. అయితే అందరూ హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు పోటీ పడతారని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోనే అందరికీ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)తో పాటు న్యాక్ క్యాంపస్‌ను ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలున్న ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. పీపీపీ మోడల్లో స్కిల్స్ వర్సిటీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం (పీపీపీ)తో స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పనున్నారు. మూడు, నాలుగేళ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సరి్టఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. -
బాబు దండగ అంటే.. జగన్ పండగ చేశారు..
ఇక వ్యవసాయం దండగ.. దాని పని అయిపోయింది.. రైతులు వేరే పనులు చూసుకోండి.. వ్యవసాయానికి ఉచిత కరెంట్ అట! సాధ్యమయ్యే పనేనా? కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి’. ఈ మాటలు అన్నది ఎవరని తెలుగు ప్రజలు ఎవరిని అడిగినా ‘చంద్రబాబునాయుడు’ అని టక్కున సమాధానమిస్తారు. రైతులంటే ఆయనకు చులకన. వ్యవసాయం అంటే దరిద్రం అని భావన. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర ఆయనది. ‘ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఆధారపడిన వృత్తి వ్యవసాయం. ఆరుగాలం శ్రమిస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతుల కష్టాలు కళ్లారా చూశాను కాబట్టే వారి కోసం ఎందాకైనా.. అంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రభుత్వాల పరంగా ఎంత చేసినా తక్కువే’ అని సీఎం వైఎస్ జగన్ తరచూ చెబుతుంటారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఎంత తేడా ఉందో పై రెండు ఉదాహరణలే నిదర్శనం. ఇలాంటి చంద్రబాబుకు ఈనాడు రామోజీ నిత్యం బాకా ఊదుతున్నారు. వ్యవసాయ రంగ పితామహుడు చంద్రబాబే అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. దింపుడు కల్లం ఆశలతో ఉన్న టీడీపీని ఎలాగైనా సరే బతికించాలని బరితెగింపు రాతలు రాస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఆలోచన వినూత్నం.ప్రపంచ స్థాయి ఆవిష్కరణ. వ్యవసాయాధారిత దేశాలన్నీ అనుసరించదగ్గ గొప్ప విధానం. వీటికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. వీటి గురించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి కూడా నివేదించాం.– తోమియో షిచిరీ, కంట్రీ మాజీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (యూఎన్వో) జాతీయ స్థాయిలో అధ్యయనం జరగాలి ఆర్బీకేల ద్వారా సంక్షేమ పథకాల అమలుతో పాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు బాగుంది. వాటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు చర్చ, అధ్యయనం జరగాలి. ఆర్బీకేలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తున్నాం. -అమితాబ్‌కాంత్,సీఈవో, నీతి ఆయోగ్ రామోజీ.. కళ్లకు పచ్చగంతలు తీసి చూడు...మొత్తంగా వ్యవ‘సాయం’ రూ. 1,86,548 కోట్లుచంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు నిండా మునిగారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. – పంపాన వరప్రసాదరావు ధాన్యపు సిరులు..పంట ఉత్పత్తులుఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు బ్రేకయ్యాయి. బాబు హయాంలో గరిష్టంగా 2017–18లో 167.22 లక్షల టన్నుల దిగుబడులు నమోదు కాగా, గడచిన ఐదేళ్లలో 2019–20 సీజన్లో గరిష్టంగా 175.12 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇదే గరిష్ట దిగుబడులు.. 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 162.04 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే బాబు హయాంతో పోల్చుకుంటే 8 లక్షల టన్నులకు పైగా పెరిగింది . మరో పక్క కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతులకు అండగా నిలిచేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.ఇలా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7746.31 కోట్ల విలువైన 22.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి కేవలం రూ.3322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించగలిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 37.73 లక్షల మంది రైతులకు రూ.65,258 కోట్లు చెల్లించారు. గ్యాప్ సరి్టíఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయి ధరలు లభించేలా కృషి చేస్తోంది. ఇప్పటికే 3,524 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు గ్యాప్ సరి్టఫికేషన్ ద్వారా 1673 మంది రైతులు లబ్ధి పొందారు. ఆర్బీకేలు.. ఆదర్శం ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. ఇవి ప్రతి రైతును గ్రామస్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. గ్రామల్లో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలను వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. వీటిలో 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ఇక్కడ స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్‌్కలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. మెరుగైన సేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్, బ్యాంకింగ్ సేవల కోసం 9,277 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు.ఈ క్రాప్ ప్రామాణికంగా ధాన్యంతో సహా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన రైతులకు అందిస్తున్నారు. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు గోదాములు, కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్స్ వంటి మౌలిక వసతుల కల్పనతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది.పొరుగు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), నీతి ఆయోగ్, ఐసీఎఆర్, నాబార్డు, ఆర్బీఐ ఇలా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆర్బీకేలను సందర్శించి వీటి సేవలను కొనియాడారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ వైఎస్సార్ రైతు భరోసా పథకం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నికల్లో ఇచి్చన హామీ కంటే మిన్నగా ఏటా 3 విడతల్లో ఒక్కో విడతకు రూ.13,500 చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు 1.65 లక్షల కౌలు రైతులు, 94 వేల అటవీ భూ సాగు రైతులతో సహా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి 4 విడతల్లో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా, 5 విడతల్లో రూ.67,500 సాయం అందించారు. నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల చొప్పున రెట్టింపు పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో రూ.37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ ముగిసేలోపే పంట నష్ట పరిహారం ► ఈ ప్రభుత్వంలో ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం అందజేత. ►ఇందుకోసం రూ.2వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు. ►తిత్లీ తుఫాన్ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారం అందజేత ►ఈ ఐదేళ్లలో 34.41లక్షల మంది రైతులకు రూ.3261.60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందజేత ►39.07లక్షల మంది రైతులకు బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్లు అందజేత ►ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతులకు రూ.2050.53 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందజేత ►2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిపి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారం జమ పాడి రైతులకు వెన్నుదన్నుగా.. మూగజీవాల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తూ రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ వాహనాలæ ద్వారా 8.81లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించగలిగారు. ఆర్బీకేల్లో నియమించిన 6548 పశుసంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశువైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు.ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 16.72 కోట్ల లీటర్ల పాలను సేకరించగా, రూ.762.88 కోట్లు చెల్లించారు. 40 నెలల్లో ఏడుసార్లు అమూల్ పాల ధరలను పెంచడంతో, ఆమేరకు ప్రైవేటు డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాటికి పాలు పోసే రైతులు రూ.4911 కోట్ల మేర లబ్ధి పొందగలిగారు. చేయూత, ఆసరా లబ్ధి్దదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడిగేదెలు, ఆవులు, 1.35లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మరో పక్క రూ.385 కోట్ల పెట్టుబడితో మూతపడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆక్వా రైతులకు అడుగడుగునా అండగా.. మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతీ కౌంట్‌కు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేస్తోంది. పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరించుకునేలా చేసింది. ఆక్వా జోన్ పరిధిలోని 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. బాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74లక్షల టన్నులు పెరిగితే. ఈ ప్రభుత్వ హయాంలో 6.94లక్షల టన్నులు పెరిగింది.ఎగుమతులు కూడా 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు జరిగితే. ప్రస్తుతం రూ.20వేల కోట్ల విలువైన 3.30లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులవుతున్నాయి. స్థానిక వినియోగం పెంచేందుకు జిల్లా స్థాయిలో ఆక్వా హబ్‌లు, 4వేలకుపైగా అవుట్‌లెట్స్‌తో పాటు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. ఈ దశలో దేశంలోనే తొలిసారి ఆక్వా రైతులకు బీమా సదుపాయం కలి్పంచింది. వరుసగా రెండుసార్లు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. మరో పక్క మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఈ ఐదేళ్లలో ఏటా సగటున 1.16 లక్షల మందికి రూ.538 కోట్ల మత్స్యకార భృతిని అందించారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచడం ద్వారా ఈ ఐదేళ్లలో రూ.148 కోట్ల సబ్సిడీని అందించింది. మౌలిక వసతులతో మెరుగైన సేవలు► టీడీపీ ఐదేళ్లలో 4.99 లక్షల మంది రైతులకు కేవలం రూ.1488.20 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించింది. ► ఈ ఐదేళ్లలో రూ.1052.42 కోట్లతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయిలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు. ► వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.366.25 కోట్లు సబ్సిడీ అందించింది. ► 6362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్స్, 31,356 ఇతర యంత్ర పరికరాలు అందజేత ► ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1584.61 కోట్లతో 500 టన్నులు, 1000 టన్నుల సామర్థ్యంతో గోదాములతో కూడిన 2536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు ► అందుబాబులోకి వచ్చిన గోదాములు – 554 ►వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివి«ధ రకాల మౌలిక సదుపాయాల కల్పన. ► 60 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.19.95 లక్షల అంచనాతో 97 ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జ్‌ల నిర్మాణం ► రూ.210 కోట్లతో 147 నియోజకవర్గ, 10 జిల్లా స్థాయి, 4 రీజనల్ స్థాయి ల్యాబ్స్‌తో పాటు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో గుంటూరులో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు ► అందుబాటులోకి వచి్చన జిల్లా స్థాయి ల్యాబ్స్ – 127 ► మరో 154 వెటర్నరీ, 35 ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి ఉద్యాన పంటల హబ్‌గా ఏపీ ► 2018–19లో సాగవుతున్న ఉద్యాన పంటలు 42.5 లక్షల ఎకరాలు ► ప్రభుత్వ ప్రోత్సాహంతో 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరుగుదల ► 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు ► 2022–23 నాటికి ఏకంగా 368.89 లక్షల టన్నులు ► దీంతో సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం వద్ధి రేటు సాధన ► బాబు హయాంలో జరిగిన అరటి ఎగుమతులు – 24వేల టన్నులు ► కాగా ఈ 5ఏళ్లలో జరిగిన అరటి ఎగుమతులు– ఏకంగా 1.75లక్షల టన్నులు ► అరటి ఎగుమతుల కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా కిసాన్ రైళ్లు ఏర్పాటు ► గతంలో మిరప ఎగుమతి – 12లక్షల టన్నులు ► ప్రస్తుతం జరిగిన మిరప ఎగుమతి – 16 లక్షల టన్నులు ► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిందు, తుంపర పరికరాలకు ఈ ప్రభుత్వం చెల్లించిన నిధులు రూ. 800.16 కోట్లు ► ఈ ఐదేళ్లలో సబ్సిడీ రూపంలో చెల్లించిన నిధులు – రూ.2669.65 కోట్లు ► తద్వారా కొత్తగా సాగులోకి తీసుకొచి్చన ఎకరాలు – 7.33లక్షల ఎకరాలు ► దీనివల్ల లబ్ధి పొందిన రైతులు 2.60లక్షల మందిరామోజీవి దుర్మార్గపు రాతలే..వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ, ఆర్బీకేలు, ఇతర విప్లవాత్మక కార్యక్రమాలేవీ రామోజీ కళ్లకు కనిపించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తిస్తే.. ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని బాబు విస్మరించారు. ఆ బకాయిలు సహా.. పరిహారం పెంచి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఇది కూడా తనకు కనిపించనట్లు రామోజీ నటిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రగతిని ప్రశంసించడం కూడా విస్మరించి దుర్మార్గపు రాతలు రాస్తుండటం రామోజీకే చెల్లింది.ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. 10,778 ఆర్బీకేలు, వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్‌లు.. ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు అన్నదాతలకు సేవలందిస్తున్నారు. స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్‌్కల ద్వారా సత్వర సేవలు అందుతున్నాయి. సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు.. చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో ఓ వలంటీర్, 9,277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు. ఆర్బీకే ఛానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. ఏపీలో తగ్గిన ఆత్మహత్యలు : కేంద్రమంత్రి ప్రకటన మూడేళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. కానీ చావులతో రాజకీయాలు చేయడం రామోజీ, చంద్రబాబు ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య తక్కువగా ఉందంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ దుష్టచతుష్టయం మాత్రం లోలోన కుళ్లిపోతుంటారు. ఒక పక్క రైతులను అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం అర క్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతిపరులా? కాదా? అనేకోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో రూ.1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన రూ. 3.50 లక్షలు విత్‌డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కలి్పంచేవారు. చాలా కాలం తర్వాత ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ ఐదేళ్లలో 2014–18 మధ్య 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున రూ.22.50 కోట్లు అందించారు. రూ.7లక్షల పరిహారం ఇస్తున్నఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క ఏపీలోనే రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. రాజకీయాలకు అతీతంగా బాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునః పరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.23.70 కోట్ల ఆర్థికసాయం అందించింది. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిసి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. దేశం మొత్తం ఏపీని చూస్తోంది.. మాది తమిళనాడు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక అగ్రి ల్యాబ్స్(33) మా రాష్ట్రంలోనే ఉన్నాయనుకునే వాడ్ని. కానీ ఏపీలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో నాణ్యతతో ఏర్పాటు చేశారు. ఇక్కడి ల్యాబ్స్, సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచి్చన ‘రైతు భరోసా కేంద్రాలు’ గొప్ప ప్రయోగం. గ్రామ స్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు. – డాక్టర్ కె.పొన్ను స్వామి, జాయింట్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ ఈ క్రాప్ విప్లవాత్మక మార్పు ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర పొందగలగడమనే ప్రధాన సమస్యకు ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (పంటల నమోదు) ద్వారా శాస్త్రీయ పరిష్కారాన్ని ఏపీ ప్రభుత్వం చూపించింది. రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో ఈ క్రాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. పంటల వారీ దిగుబడి అంచనాలతో ఏయే పంట ఉత్పత్తులు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా మార్కెట్లను అనుసంధానిస్తే ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం గొప్ప విషయం. – ప్రొఫెసర్ విజయ్ పాల్ శర్మ, చైర్మన్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ -
విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ ‘సంకల్పం’
సాక్షి, అమరావతి: విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, కనీవినీ ఎరుగని పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం.. వాటిలోని పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడానికి ‘సంకల్పం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు.. ఎదుర్కొని పరిష్కారం వెతకాలి.. భిన్న మనస్తత్వాలు ఉన్న బృందాన్ని కలుపుకుని విజయవంతంగా పనిచేయగలగాలి.. ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి’.. వంటివాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లూ పరిమితమైంది. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. తొలిదశలో భాగంగా 1,300 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు శిక్షణ మొదలైంది. పాఠశాల విద్యాశాఖ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి. మూడు దశల్లో మూడేళ్లపాటు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 1,300 పాఠశాలల్లో (జిల్లాకు 50 స్కూళ్లు) సంకల్పం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి శుక్రవారం ఒక గంట సమయాన్ని ఇందుకు కేటాయించారు. మొదటి దశలో 26 జిల్లాల్లోని 1,011 పాఠశాలల్లో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇటీవల మరో 289 పాఠశాలలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మొత్తం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మరో 2,600 స్కూళ్లలో ప్రవేశపెట్టనుంది. సంకల్పం అమలు ఇలా.. జిల్లాకు 50 చొప్పున 26 జిల్లాల్లో హైస్కూళ్లు ఎంపిక మొత్తం 1,300 ప్రభుత్వ హైస్కూళ్లలో కార్యక్రమం వచ్చే విద్యా సంవత్సరంలో 2,600 స్కూళ్లకు విస్తరణ మూడో ఏడాది మొత్తం 6,790 స్కూళ్లలో శిక్షణ 6–8 తరగతుల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై తర్ఫీదు మూడేళ్లల్లో మూడు దశల్లో 13 లక్షల మందికి శిక్షణ 2,600 మంది ఉపాధ్యాయులకు శిక్షణ గతేడాది ఫిబ్రవరిలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్సీఈఆర్టీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘సంకల్పం’ శిక్షణను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 130 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు 13 జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు (డైట్స్) నుంచి 52 మంది ఫ్యాకల్టీలు, ఒక్కో స్కూల్‌కు ఇద్దరు చొప్పున 26 జిల్లాల నుంచి 2,600 మంది ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. వీరు ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్ ప్రకారం శిక్షణనిస్తారు. శిక్షణ రోజు ఇచ్చిన టాస్‌్కలను విద్యార్థులు స్వయంగా మ్యాజిక్ షీట్ల ఆధారంగా పూర్తి చేస్తున్నారు. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను శిక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విద్యార్థులకు స్వీయ–నిర్వహణ, సమస్య–పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వంటి వివిధ కార్యాచరణ–ఆధారిత జీవిత నైపుణ్యాలను విద్యలో అంతర్భాగం చేయడం దేశంలో మన రాష్ట్రంలోనే ప్రారంభమైందని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కౌమారదశలో ఉన్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, వారి ఉజ్వల భవిష్యత్‌కు దోహదం చేస్తుందన్నారు. ఈ 11 అంశాలపై శిక్షణ.. సమాజంలో అనేక సందర్భాల్లో వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఇంటి నుంచి మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగా ఎదురయ్యే అంశాలు 11 ఉన్నట్టు అంతర్జాతీయ సర్వే ద్వారా గుర్తించారు. ఆ అంశాలపై వివిధ దశల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ‘కాగి్నటివ్, సోషల్, ఎమోషనల్’ అనే మూడు భాగాలుగా విభజించింది. ఏడాదికి ఒక అంశంపై మూడేళ్లపాటు శిక్షణ ఇవ్వనుంది. కాగ్నిటివ్‌లో.. సమస్యల పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, సెల్ఫ్ మేనేజ్మెంట్, సృజనాత్మకతపై శిక్షణ ఉంటుంది. విద్యార్థులు తమ ఇల్లు, పరిసరాల్లో గుర్తించినవి, వారికి అవగాహన ఉన్న అంశాలపై తొలి ఏడాది శిక్షణనిస్తున్నారు. సోషల్ విభాగంలో.. ఎదుటివారిపై సానుభూతి ఎప్పుడు చూపాలి (ఎంపతి), నిశ్చయత (అసెర్టివ్నెస్), చర్చించి సమస్యను పరిష్కరించడం (నెగోషియేషన్), పరస్పర సహకారం (కొలాబరేషన్), కమ్యూనికేషన్ వంటి అంశాలు ఉన్నాయి. రెండో ఏడాది మొత్తం ఈ అంశాలపైనే శిక్షణ ఉంటుంది. ఎమోషనల్ (భావోద్వేగాలు) విభాగంలో.. స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్), అనుకూలత అంశాలపైనా శిక్షణ ఉంటుంది. వీటన్నింటిపైనా కార్యాచరణ ఆధారిత (క్రీడలు, పరిశీలన) ద్వారా మూడో ఏడాది శిక్షణ ఉంటుంది. -
ఒడిదుడుకులకు సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్‌లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్‌తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు. -
కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు గత ఏడు దశాబ్దాలుగా ప్రజా న్యాయస్థానంగా వ్యవహరిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఎంతో విశ్వాసంతో వచి్చన వేలాది మంది పౌరులు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందారని పేర్కొన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడానికి భయపడాల్సిన పని లేదని ప్రజలకు సూచించారు. నిస్సంకోచంగా కోర్టులకు రావొచ్చని చెప్పారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజేఐ మాట్లాడారు. వ్యవస్థీకృత ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పిస్తుందని వివరించారు. ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి కోర్టులో ప్రతి కేసు రాజ్యాంగబద్ధమైన పాలనకు పొడిగింపేనని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ఉద్ఘాటింటారు. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు సైతం ప్రారంభించామని తెలిపారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం పొందడానికి కోర్టులను చివరి మజిలీగా భావించాలన్నారు. 2023 నవంబర్ 25 నాటికి సుప్రీంకోర్టు 36,068 తీర్పులను ఆంగ్ల భాషలో వెలువరించిందని చెప్పారు. ఈ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువాదించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం రాజ్యాంగానికి ఉందని తెలియజేశారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు ఏర్పాటు చేయాలి: రాష్ట్రపతి నైపుణ్యం కలిగిన యువతను న్యాయ వ్యవస్థలోకి తీసుకురావడానికి, వారి ప్రతిభకు సాన పెట్టడానికి అఖిల భారత జ్యుడీషియల్ సరీ్వసు ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. న్యాయం పొందే విషయంలో పౌరులకు ఖర్చు, భాష అనే అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిమితులను తొలగించాలన్నారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రజలే కేంద్రంగా న్యాయ వ్వవస్థను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. యువత న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలివ్వాలన్నారు. పార్లమెంట్ అభేద్యమైనది: ఉపరాష్ట్రపతి ప్రజాస్వామ్యానికి ఆత్మ పార్లమెంట్ అని ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తగ్గించలేవని పేర్కొన్నారు. పార్లమెంట్ అభేద్యమైనదని స్పష్టం చేశారు. పార్లమెంట్ అధికారాల్లో జోక్యం రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఏడడుగుల ఈ అంబేడ్కర్ విగ్రహాన్ని శిల్పి నరేష్ కుమావత్ రూపొందించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న రాష్ట్రపతి ముర్ము, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. చిత్రంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ -
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆన్లైన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలను విస్తృతంగా అందించనున్నారు. అత్యాధునిక కార్డ్ ప్రైం సాఫ్ట్వేర్, ఈ–స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సేవలు అందుబాటులోకి తేనున్నారు. కార్డ్ ప్రైం ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్లో సమర్పించే వెసులుబాటు కల్పించారు. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు దస్తావేజులను వారే స్వయంగా రూపొందించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్లైన్లోనే చెల్లించే సదుపాయం కల్పించారు. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ–సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత ఉంటుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు మార్పు జరుగుతుంది. ఆధునిక సాంకేతికత ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను నిర్మూలించవచ్చు. ఈ–స్టాంపింగ్‌తో వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ–స్టాంపింగ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఈ స్టాంపింగ్‌తో స్టాంపుల కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడినట్లు అవుతుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఎల్) బ్రాంచ్‌లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)లో ఈ స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల ద్వారా ఈ– స్టాంపులను విక్రయిస్తారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సైతం పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 1,680 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. అనంతరం మిగిలిన సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లూ మొదలవుతున్నాయి. ఐరిస్‌తో వేలిముద్రల సమస్యకు పరిష్కారం ఈ సిగ్నేచర్ కోసం వేలిముద్రలు పడటంలేదనే ఫిర్యాదులు రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సమస్య పరిష్కారానికి ఐరిస్ యంత్రాలు కొనుగోలు చేసింది. అవసరమైతే మరికొన్ని కొనేలా ఆదేశాలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్రలు పడకపోయినా ఐరిస్ (కళ్లు) ద్వారా ఆ పక్రియను పూర్తి చేయవచ్చు. అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మొద్దు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేటయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భ ద్రత ఉంటుంది. డిజిటల్ రిజిస్టర్డ్ డా క్యుమెంట్ అందుబాటులోకి వస్తుంది. ఫిజి కల్ డాక్యు మెంట్‌తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్‌కు గుర్తింపు ఉంటుంది. ఈ– సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ వెరిఫికేషన్‌తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే వెరిఫై చేసుకునే సదుపాయం ఉంది. నూతన విధానంలో∙భద్రతా ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందుతుంది. ఈ విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ అనేది ‘వాస్తవం’. నూతన విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది అవాస్తవం. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్‌పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులకు ‘జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్’ను వినియోగించుకోవచ్చు. -
CM Jagan: పేదవిద్యార్థులకు ఇక ప్రపంచస్థాయి కోర్సులు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు.. అదీ అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులు ఉచితంగా అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్(edX)తో ఎంవోయూ కుదర్చుకుంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ అధికారం చేపట్టాక పేద విద్యార్థులకు సంక్షేమ పథకాల ద్వారా అండగా, ఆసరాగా నిలవడంతో పాటు.. విద్యారంగానికి సంబంధించిన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆయన ధృడ సంకల్పం.. ఇవాళ ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు వేసినట్లయ్యింది. -
ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నారు. పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయతకు మారు పేరుగా పాలన సాగుతోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రూ.3.02 లక్షల కోట్లు సాయం గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. ఆయా వర్గాలకు లబ్ధి ఇలా ♦ నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. -
జగనన్న అమ్మఒడితో అందరికీ చదువుకునే అవకాశం
-
AP: ఇక ‘ఈ–పాఠశాల’.. విద్యా రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు
సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీఈఆర్టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్సీఈఆర్టీ నిమగ్నమైంది. ప్రస్తుతం 4వ తరగతి నుంచి నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు బైజూస్ సంస్థ ద్వారా కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎస్సీఈఆర్టీ అదే తరహాలో ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్సీఈఆర్టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్ఫారం, ఐఎఫ్బీ ప్లాట్ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్ చానెల్)లో అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రకమైన కంటెంట్ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూపొందించి యూట్యూబ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు కొంత సంశయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే అన్ని అధికారిక చానెళ్లలో ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది. బైజూస్ ఈ–కంటెంట్ ఉన్నా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే ఇది నాన్ లాంగ్వేజెస్ (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్)కు మాత్రమే పరిమితమైంది. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ–కంటెంట్‌ను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించింది. వీరు 10వ తరగతి వరకు ఈ–కంటెంట్ పాఠ్యాంశాలను ట్యాబుల్లోనే చదువుకోవచ్చు. అయితే బైజూస్ ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈసీఆర్‌టీ) ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) కూడా ప్రభుత్వం ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా ముందు 8వ తరగతిలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను చేపట్టిన ఎస్సీఈఆర్టీ మరో రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత వరుసగా 9, 7, 6 తరగతులకు రూపొందిస్తారు. 10వ తరగతికి 2024–25లో సిలబస్ మారుస్తామని.. ఆ తర్వాత ఈ–కంటెంట్‌ను రూపొందిస్తామని ఎస్సీఈఆర్టీ అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నాటికి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగానే పాఠ్యాంశాలు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పాఠ్యాంశాలు ఉండేలా ఎస్సీఈఆర్టీ చర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెనుకబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ఈ–కంటెంట్ రూపకల్పనలో యథాతథంగా అనుసరిస్తున్నారు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేటప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరాగా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు. చదవండి: ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభం -
శక్తికాంత్‌కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు’ లభించింది. మహమ్మారి కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకుగాను ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంతదాస్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. భారత దేశం నుంచి 2015లో మొట్టమొదటిసారి అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈ అవార్డు దక్కింది. కీలక సమయాల్లో గవర్నర్ శక్తికాంతదాస్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తాజాగా పేర్కొంది. పేమెంట్ వ్యవస్థసహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపింది. కరోనా మహమ్మారిని ప్రస్తావిస్తూ, కీలక సవాలును భారత్ ఎదుర్కొనగలిగినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అందరూ భిన్నమైన ప్రాధాన్యతలను కలిగి ఉన్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయడంలో సాధారణంగా కష్టాలు ఎదుర్కొంటుంటారని పేర్కొన్న పబ్లికేషన్, ఆయా సమన్వయ చర్యల్లో దాస్ చక్కటి ప్రగతి సాధించగలిగారని వివరించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ, వైరస్‌ను ఎదుర్కొనడానికి నిరంతర పోరాటం అవసరం అన్నారు. ఇటు సాంప్రదాయ పద్ధతుల్లో అటు అసాధరణమైన రీతిలో ఈ పోరాట చర్యలు ఉండాలన్నారు. -
డేటా సెంటర్లపై రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
ముంబై: డేటా సెంటర్ల పరిశ్రమలోకి వచ్చే ఆరేళ్ల కాలంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీంతో మరో 5,000 మెగావాట్ల సామర్థ్యం డేటా సెంటర్ల పరిశ్రమలో ఏర్పాటవుతుందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ఆరు రెట్లు పెరగనుందని, మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డేటా సెంటర్లలో విప్లవాత్మక మార్పునకు స్థానికంగానే డేటా నిల్వ నిబంధనను కారణంగా పేర్కొంది. గడిచిన కొన్నేళ్లలో అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ సహా ఎన్నో కంపెనీలు డేటా సెంటర్ల వ్యాపారంపై ప్రకటనలను ఈ నివేదిక ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ విప్లవానికి ఇంటర్నెట్, మొబైల్ వినియోగం విస్తరణ, ప్రభుత్వ ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, నూతన టెక్నాలజీల అమలు, సోషల్ మీడియా, ఈకామర్స్, ఓటీటీల విస్తరణ తదితర అంశాలు దోహదపడినట్టు ఇక్రా తెలిపంది. దీనికితోడు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విద్యుత్ అందించడం, స్టాంప్ డ్యూటీలో రాయితీలు తదితర నియంత్రణపరమైన అనుకూల విధానాలు పెట్టుబడులు రావడానికి దోహదం చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యంలో 70–75 శాతం ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్‌లోనే ఉన్నట్టు తెలిపింది. డేటా సెంటర్ల పరిశ్రమ ఆదా యం 2024–25 వరకు వార్షికంగా 17–19 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. -
‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గతంలో నిరుపేద అవ్వకు పెన్షన్ కావాలన్నా.. కూలీనాలీ చేసుకుంటే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు కావాలన్నా.. రైతు తన వ్యవసాయ భూమి వివరాలు పట్టాదార్ పాస్ పుస్తకంలో నమోదు చేయించుకోవాలన్నా.. అధికారులు లేదా రాజకీయ నాయకుల చుట్టూ రోజుల తరబడి తిరిగితే గాని పనులు జరగని పరిస్థితి. ఒక్కొక్కసారి రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు పెట్టినా పని పూర్తికాక ఇబ్బందులు పడిన వారున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే చాలు.. చిన్న కష్టం కూడా పడకుండా దరఖాస్తు చేసుకుంటే.. రేషన్ కార్డు, పింఛన్లు, మంజూరు పత్రాలను వలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారులు ఎవరన్నది గ్రామస్తులందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించాకే లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తున్నారు. అవ్వాతాతలకు ప్రతి నెలా 1నే పింఛను డబ్బులు వలంటీర్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్ సరుకులు సైతం ప్రతి ఒక్కరికీ ఇంటివద్దే అందుతున్నాయి. ఈ సేవలు అందించడం వల్లే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా ఏపీ 17 జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. కోటిన్నరకు పైగా సమస్యల పరిష్కారం ఒకప్పుడు గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శి కూడా ఉండే వారు కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ఇప్పుడు కనీసం 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలందిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ వంటివి 70 వేలకు పైబడి భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి. ప్రతి గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. కుగ్రామంలో ఉండే గ్రామ సచివాలయంలోనూ డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల ఏర్పాటు తర్వాత 2020 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 2.18 కోట్లు వినతులందగా.. 2.11 కోట్ల వినతులను అధికారులు పరిష్కరించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1.62 కోట్ల వినతులకు గానూ, 1.57కోట్ల వినతులను పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ఏ పని ఉన్నా ఆ ఊరిలోనే పరిష్కరించేలా గ్రామ సచివాలయాల్లో 545 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నిధులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,625 కోట్లను 70–15–15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో రూ.1,939 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. చదవండి: రికవరీలో ఏపీ బెస్ట్ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు -
కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం
సీఎం వైఎస్ జగన్ ఆలోచనల్లోంచి పుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనతి కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. మారుమూల కుగ్రామంలో ఉన్నా, నగరంలో ఉన్నా.. ఒకే సమయంలో ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ.. దేశానికే ఆదర్శం అయింది. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగకుండా.. ఉన్న ఊళ్లోనే పనులు అవుతున్నాయి. సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి 543 రకాల ప్రభుత్వ సేవలు ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,00,69,911 వినతులు నమోదు కాగా, అందులో 94.05 లక్షల వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కేంద్రం కూడా ప్రశంసించింది. పైరవీలకు తావే లేదు ► గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలో పైరవీల వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడినట్లయింది. గతంలో పేదింటి అవ్వకు పెన్షన్ కావాలన్నా.. నిరుపేద కుటుంబానికీ రేషన్ కార్డు కావాలన్నా.. ఓ రైతు తన పేరున పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలన్నా.. ఛోటా మోటా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా పని కాని పరిస్థితి. ► ఇప్పుడు అర్హులై ఉంటే చాలు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి గరిష్టంగా పది రోజుల్లో రేషన్‌కార్డు, పింఛన్లు మంజూరు అవుతున్నాయి. ► 4.41 లక్షల మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం పది రోజుల వ్యవధిలో 4.11 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. 16.36 లక్షల మంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత వ్యవధిలోనే 15.90 లక్షల మందికి మంజూరయ్యాయి. 52 వేల మందికి కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే మంజూరు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా.. ► రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సర్పంచి, వార్డు కౌన్సిలర్ వంటి స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేరు. ఇలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లే పెద్ద దిక్కయ్యారు. ► గతంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో వంటి వారు నాలుగైదు ఊర్లకు కలిపి ఒకరుండే వారు. వీధి దీపాలు, మురుగు కాల్వలు, రోడ్లపై గుంతలు వంటి సమస్యలన్నీ వారే పరిష్కరించాల్సి వచ్చేసింది. ► రాష్ట్రంలో 2018 ఆగస్టులోనే గ్రామ సర్పంచిల పదవీ కాలం ముగిసినా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించని కారణంగా ఇప్పటికీ గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేరు. ► కరోనా వంటి విపత్కర సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలైనా, ఇతర కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగడానికి గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వలంటీర్ల వ్యవస్థే ప్రధాన కారణం. ► కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా 3 నెలల వ్యవధిలో ఆరు సార్లు ఇంటింటి సర్వే చేశారంటే అది ఈ వ్యవస్థ వల్లే అనేది స్పష్టం. 4 లక్షల మందికి ఉద్యోగాలు.. ► సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించింది. కేవలం 4 నెలల వ్యవధిలో భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 19.50 లక్షల మందికి పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించింది. దేశ చరిత్రలో ఇదో అరుదైన రికార్డుగా రాజకీయ నిపుణులు పేర్కొన్నారు. ► ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలకు 10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధిపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ► ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల గ్రామ, వార్డు వలంటీర్లను కూడా కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లయింది. సచివాలయాల్లో మరిన్ని సౌకర్యాలు ► సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందు కోసం మండలానికి ఇద్దరు చొప్పున 1,340 మంది శిక్షకులు, 1,340 ఆధార్ నమోదు కిట్లను అందుబాటులో ఉంచారు. ► ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కాజా గ్రామ సచివాలయంలో ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించారు. ► సచివాలయాల్లో బ్రాంచ్ పోస్టాఫీసుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తొలి దశలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో 115 చోట్ల బ్రాంచ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేస్తారు. -
యుద్ధ మేఘాలు
-
ఎప్పుడో చంపేయాల్సింది
వాషింగ్టన్/బాగ్దాద్/టెహ్రాన్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్ మీడియా వెల్లడించింది. లెబనాన్ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్ విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్‌లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జాతీయ జెండా ఇమేజ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్లో ‘‘ఇరాన్ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్‌పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఇరాక్ నుంచి వెనక్కి రండి ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. ఇరాకీల సంబరాలు బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. మరో యుద్ధం భరించలేం: ఐరాస గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు. ఎవరీ ఖాసీం సులేమాని? 1955లో ఇరాన్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట. సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్–ఖుద్స్ బలగాల చీఫ్ అయిన జనరల్ సులేమానికి పేరుంది. ఇరాన్ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్ బాండ్, ఎర్విన్ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు. -
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, విశాఖపట్నం: విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభించి చదివే ప్రతి కోర్సు విద్యార్థికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏయూ వ్యవస్థాపక వీసీ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మాట్లాడుతూ చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణం. విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం దేశంలో 14వ స్థానంలో ఉండటం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. వర్సిటీకి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం కరువైందన్న విషయం గుర్తించాం. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని వీసీ ప్రసాదరెడ్డి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కితేనే ఏయూని దేశంలో మొదటి 5 విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా నిలబెట్టగలం. సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే 77 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమైపోతున్నారు. సీఎం జగన్‌ను సన్మానిస్తున్న గ్రంథి మల్లిఖార్జునరావు, మంత్రులు సురేష్, ముత్తంశెట్టి చదువుల దీపం వెలిగిద్దాం.. ఒక దీపం గది మొత్తం వెలుగునిచ్చినట్లుగా చదువుల దీపం కుటుంబం రూపురేఖల్ని మార్చేస్తుంది. భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి కేవలం మంచి చదువు మాత్రమే. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి స్థానానికి చేరుకున్నప్పుడే సాధ్యం. ఇందుకు ఉదాహరణ ఐఆర్ఎస్కి ఎంపికైన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆయన ఏడో తరగతి వరకూ తెలుగు మీడియంలో, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదివారు. ఆ అడుగు వెయ్యకుంటే ఐఆర్ఎస్ సాధించలేకపోయేవారు. చదువుల పట్ల తపన ఉన్న సురేష్‌కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించాం. పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు.. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూమ్లు, బ్లాక్‌బోర్డులు, మంచినీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టాం. తొలిదశలో రూ.3,600 కోట్లతో 15 వేల పాఠశాలల స్థితిగతులు మారుస్తాం. మూడుదశల్లో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలో బోధన అమలు చేస్తాం. 2024 నాటికి మన పిల్లలంతా పదో తరగతి పరీక్షల్ని ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు. వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయో విద్యావంతులు, పూర్వ విద్యార్థులు సలహాలు ఇవ్వాలి’’. టెక్ మహీంద్ర క్యాంపస్‌కు ఆహ్వానం ఈ కార్యక్రమానికి హాజరైన టెక్ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ ఏపీలో మహిళా రక్షణ బిల్లు ప్రవేశపెట్టిన సీఎంకి అభినందనలు తెలిపారు. ఏపీలో అతి పెద్ద ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర క్యాంపస్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కలలు ఎలా సాకారమయ్యాయో చూసేందుకు తమ క్యాంపస్‌ని సందర్శించాలని సీఎంను గుర్నానీ ఆహ్వానించారు. రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం.. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు అందచేస్తే పూర్వ విద్యార్థుల సంఘం నుంచి అంతే మొత్తాన్ని సేకరించి వడ్డీతో కార్యక్రమాలు నిర్వహిస్తామని జీఎంఆర్ గ్రూప్స్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ విద్యార్థులకు మంచి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అసోసియేషన్ రూ.50 కోట్లు సమీకరించిన తర్వాత తనను కలిస్తే నెల రోజుల్లో రూ.50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అభినందనీయమని గ్రంథి మల్లిఖార్జునరావు చెప్పారు. హాస్టల్, రీడింగ్ రూమ్‌కు శంకుస్థాపన ఏయూలో 200 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించే జీఎంఆర్ హాస్టల్‌తో పాటు రీడింగ్ రూమ్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా మహిళల నీరాజనం సాయంత్రం 4.53 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ 5.10కి అక్కడి నుంచి బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరారు. మహిళల రక్షణకు చరిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దారిపొడవునా థాంక్యూ సీఎం సార్ నినాదాలతో ప్రజలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నీరాజనాలు పలికారు. -
ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?
జరిగిన కథ: చైనా శాస్త్రవేత్తలు కోతికి మనిషి మెదడును సెట్ చేయడంతో ‘కోతిలోకం’లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కొద్దికాలంలోనే కోతికి మనిషి బుద్ధులు వచ్చాయి. తలకొన అడవిలో రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార కోతి గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్‌లూ ఆయుధాలు తీశాయి. కాని అవి నకిలీ ఆయుధాలు కావడంతో ఇరువర్గాల్లో ఒక్క కోతి కూడా గాయపడలేదు. తరువాయి భాగం:‘‘ఇలా అయితే లాభం లేదు. బాహాబాహీకి దిగి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం’’ బస్తీమే సవాల్ అని అరుస్తూ బాహాబాహీకి దిగాయి రియల్ ఎస్టేట్ కోతి గ్యాంగులు.సరిగ్గా పది నిమిషాల తరువాత...‘‘ఆగండి’’ అనే అరుపు వినబడింది. రెండు గ్యాంగులూ కొట్లాట ఆపి ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాయి.‘‘ఎవరు మీరు? శాంతిదూతా?’’ అడిగింది గ్యాంగ్‌లో ఒక కోతి.‘‘కాదు. ఎల్ఐసీ ఏజెంట్‌ని. నా పేరు పొదుపేష్ కుమార్. ఏటూరునాగారం అడవి నుంచి వస్తున్నాను’’ అన్నది కొత్తగా వచ్చిన ఆ కోతి.‘‘మాతో నీకేం పని?’’ అడిగింది గ్యాంగ్‌లో కోతి.‘‘బాహాబాహీ రక్ష అని కొత్త పాలసీ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ టాక్ ఎబౌట్..’’ అన్నది ఎల్ఐసీ కోతి.‘చెప్పి చావు’ అన్నట్లుగా చూశాయి రెండుగ్యాంగుల కోతులు.ఎల్ఐసీ కోతి చెప్పటం మొదలు పెట్టింది:‘‘బాహబాహీ రక్షలో... డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొట్లాటలో మీ పళ్లు విరిగాయనుకోండి మీరు ఒక్కపైసా జేబులో నుంచి తీయాల్సిన పనిలేదు. డెంటల్ ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు వస్తాయి. మీ తలకు గాయాలుఅయ్యాయనుకోండి...హెడ్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయి. టైమ్ బాగోలేక మీరు పోయారనుకోండి....‘అమర జ్యోతి’ ఇన్సూరెన్స్ స్కీం కింద మీ కుటుంబ సభ్యులకు అక్షరాలా.....ఇంత డబ్బు వస్తుంది....’’ఎల్ఐసీ కోతి నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతుంది. పొదుపేష్ కుమార్ స్పీచ్ ధాటికి రెండు కొతి గ్యాంగులూ మూర్ఛపోయాయి.‘‘అయ్యో పాపం!’’ అనుకుంటూ తలకొన కోతి ఒకటి తాడి చెట్టు ఎక్కి...తాటికల్లు తెచ్చి వాటి ముఖం మీద చల్లింది. అప్పటికిగాని వాటికి మెలకువ రాలేదు.రెండు కోతిగ్యాంగులూ కాస్త తెరుకున్నాయో లేదో...‘‘నమస్కారం. నా పేరు వివాహిత్ విందా. వికారబాద్ అడవిలో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. కోతి మ్యారేజ్ బ్యూరోలలో రెండు తెలుగు స్టేట్స్లో మనదే టాప్. మీకు తెలుసు...పెళ్లి అనేది నూరేళ్ల పంట... ఆ పంట ఫలాలు చేతికందాలంటే మాలాంటి మ్యారేజ్ బ్యూరోలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి. మునుపటి రోజులు కాదు...ఒక కోతికి పెళ్లి జరగాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు. ఎప్పుడైతే మనిషి మెదడు జన్యువులను మన మెదడులో ప్రవేశ పెట్టారో...మనిషి ఆచారవ్యవహారాలు కూడా మనకు వచ్చాయి. అందులో కట్నకానుకలు కూడా ఒకటి. ఈ సిస్టమ్ మనలోకి వచ్చాక మన జాతిలో ‘మ్యారేజ్’ అనే మాటే వినబడం లేదు. కోట్లకు కోట్లు పోసి ఎక్కడ పెళ్లిళ్లు చేస్తామండీ!ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మాలాంటి మ్యారేజ్ బ్యూరోల అవసరం వస్తుంది. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి చాలు...వారం తిరక్కుండానే...ఒక మంచి ఆడకోతిని చూసి మ్యారేజ్ చేసే బాధ్యతను మా మ్యారేజ్ బ్యూరో తీసుకుంటుంది... ఇందుకు మీరు పెద్దగా ఇవ్వాల్సిందేమీ లేదు...మీరు పుచ్చుకున్న కట్నకానుకల్లోనే కొంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుంది...’’ ఇలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూనే....‘‘హాbŒ ...హాచ్...హాచ్’’ అని మూడుసార్లు గట్టిగా తుమ్మింది మ్యారేజ్ బ్యూరో కోతి.అయిదు నిమిషాలు తిరిగేలోపే...అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో నుంచి మూడుకోతులు దిగాయి. తుమ్మిన కోతిని అమాంతం ఎత్తి అంబులెన్స్‌లో పడేశాయి. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఆకోతి అరిచేలోపే చేతికి సెలైన్ పెట్టేశాయి.కొద్దిసేపటి తరువాత...అంబులెన్స్ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టుకు దగ్గర్లో ఏడంతస్తుల ఖరీదైన భవంతి ఉంది.చాలా ఎత్తులో అమర్చిన బోర్డ్‌లో...‘చచ్చినా చావనివ్వం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్’ అనే అక్షరాలు కనిపించాయి.అంబులెన్స్ నుంచి దిగిన మ్యారేజ్‌బ్యూరో కోతికి మాత్రం చుక్కలు కనిపించాయి.‘‘ఏం జరుగుతోంది?!’’ అని అరిచేలోపే....తీసుకెళ్లి ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’లో చేర్చి ఫేస్‌కు మాస్కులు పెట్టారు! ‘‘వామ్మో...వాయ్యో...’’ అంటూ ఆ హాస్పిటల్ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది మిసెస్ వివాహిత్ విందా.డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక కోతి అక్కడికి వచ్చి...‘‘మీ ఆయన పేరు వామ్మో నా? వాయ్యో నా? రెండిట్లో ఏది?’’ అని అడిగింది.‘‘రెండూ కాదండీ...మా ఆయన పేరు వివాహిత్ విందా...’’ అంటూ మళ్లీ ఏడుపు అందుకొంది ఆ కోతి ఇల్లాలు.‘‘ఒహో...సిక్స్ బై టు...సెవెన్ ఇంటూ ఫోర్ పేషెంటా!’’‘‘ఆయన పేరు పేషెంట్ కాదండీ...వివాహిత్ విందా’’‘‘నా బొంద...మాకంటూ ఒక భాష ఏడ్చింది కదా... ఆ భాషలోనే మాట్లాడుకుంటాం! నువ్వు అట్టే కన్ఫ్యూజ్ కాకు. మీ ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించడం జరిగింది. పది నిమిషాలు ఆలస్యమైతే మీకు దక్కేవాడు కాదు. సమయానికి మా అంబులెన్స్ రాబట్టి ప్రాణాలతో మిగిలాడు’’ అని చెప్పింది ఆ డాక్టర్ కోతి.రెండు రోజులు తరువాత వివాహిత్ విందాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.‘‘అయ్యా! మూడు తుమ్ములు తుమ్మిన పాపానికి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్లా!’’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ ముందు వీలైనంత దీనంగా నిలబడ్డాడు వివాహిత్ విందా.‘‘మీ వేలి గోరు స్కాన్ చేయడానికి ఇంతైంది...మీ కాలి గోరు స్కాన్ చేయడానికి, అందులో మట్టిని స్కాన్ చేయడానికి ఇంతైంది...మీరు తుమ్మినప్పుడు బయటికి వచ్చిన సూక్ష్మజీవులు మామూలు సూక్ష్మజీవులేనా...ఈ మధ్య ప్రాణాంతకంగా తయారైన సకోనతుమ్తుమ్ రకం సూక్ష్మజీవులా? అనేది తేల్చడానికి ఇంతైంది...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు సూపరింటెండెంట్ కోతి.ఆయన చెప్పింది వింటూ ‘హాచ్’ అని తుమ్మాడు వివాహిత్ విందా....అంబులెన్స్ వస్తున్న చప్పుడు వినిపించి ‘నన్ను రక్షించండి బాబోయ్’ అని వెనక్కి చూడకుండా పరుగెత్తాడు. – యాకుబ్ పాషా -
కేన్సర్‌పై పోరాటానికి నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది వైద్య నోబెల్ వరించింది. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్ అలిసన్ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లను నోబెల్ వైద్య బహుమతికి విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది. కేన్సర్ రోగాన్ని నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలిసన్, హొంజోలు మాత్రం ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్ అలిసన్, తసుకు హొంజోలు అభివృద్ధి చేశారు. బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్‌ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కేన్సర్ చికిత్స విషయంలో మన దృక్పథాన్ని సమూలంగా మార్చింది’ అని శ్లాఘించారు. ‘రోగ నిరోధక శక్తి కణాలకు కేన్సర్ కణాలపై పోరాడే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి అలిసన్. అలాగే రోగ నిరోధక కణాలపై పీడీ–1 అనే ప్రొటీన్‌ను గుర్తించి అది కూడా కేన్సర్ కణాలపై పోరాటానికి బాగా ఉపయోగపడుతుందని తసుకు హొంజో తెలియజెప్పారు’ అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు కార్ల్–16 వీరికి బహుమతిని అందజేస్తారు. గౌరవంగా ఉంది: అలిసన్ ‘ప్రఖ్యాత నోబెల్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. నా పరిశోధన ఇంత గొప్పగా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి అందించిన చికిత్స ద్వారా కోలుకున్న రోగులను కలుసుకోవడం గొప్ప ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రానికి, కేన్సర్‌కు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్న మా జిజ్ఞాసకు ఆ రోగులే సజీవ సాక్ష్యాలు’ అని జేమ్స్ అలిసన్ వెల్లడించారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ–సెల్స్ (తెల్ల రక్త కణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్ఏ–4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రజ్ఞుల్లో అలిసన్ ఒకరు. మరింత మందిని కాపాడుతా: హొంజో తసుకు హొంజో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి గతంలో కన్నా అత్యంత ఎక్కువ మంది కేన్సర్ రోగులను కాపాడేందుకు తన పరిశోధనను కొనసాగిస్తానని చెప్పారు. ‘నా కృషి వల్లే రోగం నయమైందని ఎవరైనా రోగులు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. నా గోల్ఫ్ క్లబ్లో సభ్యుడైన ఓ వ్యక్తి ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. మీ వైద్యం వల్లే నేను బతికున్నాను. ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. అంతకన్నా ఆనందం ఏముంటుంది?’ అని చెప్పారు. ఏమిటీ ఇమ్యునోథెరపీ? కేన్సర్ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూఅదుçపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం. ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలే (టీ–లింఫోసైట్స్–తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాల మధ్య తేడాను టీ–కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ రిసెప్టార్లను వాడతారు. వీటిని చెక్‌పాయింట్స్ అంటారు. సాధారణంగా కేన్సర్ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ–సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ–సెల్స్ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ–కణాలు కేన్సర్ కణాలను గుర్తించేలా చేస్తారు. ఇక రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ–సెల్స్ అధికమై అవి కేన్సర్ కణాలపై దాడి చేస్తాయని అంచనా. చివరగా మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ–కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి. -
శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమ్మిట్’
వాషింగ్టన్: ప్రపంచంలో సాంకేతికంగా అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్ సెకన్‌కు 2 లక్షల ట్రిలియన్ గణనలను చేస్తుందని తెలిపారు. ఇంధన రంగం, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో మరింత పరిశోధనలకు ఈ సూపర్ కంప్యూటర్ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ పేరు ‘సమ్మిట్’. ఇప్పటివరకు సూపర్ కంప్యూటర్‌గా ఉన్న టైటాన్ కంటే సమ్మిట్ ఎనిమిది రెట్లు శక్తిమంతమైనదని దీనిని అభివృద్ధి చేసిన యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. కొన్ని రకాల పరిశోధన విభాగాల్లో సెకన్‌కు మూడు బిలియన్ బిలియన్ల మిశ్రమ గణనలను కూడా చేయగలగడం దీని ప్రత్యేకత. -
140 ఏళ్లు బతికేస్తాం..!
దావోస్: ఆరోగ్యరంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం 140 ఏళ్లకు పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరి కొన్ని దశాబ్దాల్లోనే ఇది సాకారం కానుందన్నారు. కృత్రిమ మేథ సహకారంతో చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో ‘ఆరోగ్యరంగాన్ని మారుస్తున్న నాలుగోతరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ‘ఆరోగ్యరంగంలో కృత్రిమ మేథను వినియోగించడం వల్ల వైద్య నిపుణులు త్వరితగతిన, అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు’ అని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఆస్పత్రి నిర్వహణ రూపురేఖలే మారిపోతాయనీ, సిబ్బంది సంఖ్యతో పాటు ఆస్పత్రి ఖర్చులు భారీగా తగ్గిపోతాయని వెల్లడించారు. మెడిసిన్, సాంకేతికతల కలయికతో ప్రపంచం మరింత ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. ‘రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనుషుల సగటు ఆయుఃప్రమాణం 140 ఏళ్లకు చేరుకుంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పౌరుల బాధ్యతగా మారడంతో ఆస్పత్రులు కేవలం నామమాత్రంగా మారుతాయి. ప్రమాదానికి గురయ్యే రోగిని ఆస్పత్రికి తరలించేలోపే అంబులెన్సులోని వైద్య సిబ్బంది రోగి ఆరోగ్యచరిత్రను 5జీ టెక్నాలజీ సాయంతో వేగంగా సేకరించి చికిత్సను ప్రారంభిస్తారు’ అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిపుణులు తెలిపారు. శరీరంలో కార్టిసాల్, గ్లూకోజ్ స్థాయిల్లో ఏమాత్రం తేడా వచ్చినా హెచ్చరించే పరికరాలను రూపొందిస్తున్నట్లు నోకియా సంస్థ అధ్యక్షుడు రాజీవ్ సూరీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో నాణ్యమైన మందుల్ని వేగంగా రోగులకు అందించగలమనీ, వ్యాధుల్ని కూడా చాలాముందుగానే పసిగట్టగలమని పేర్కొన్నారు. -
ప్రపంచశక్తిగా భారత్ !
అహ్మదాబాద్: భారత్‌ను ప్రపంచశక్తిగా తీర్చిదిద్దేందుకు సృజనాత్మకత ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్పు తీసుకొస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. దూరదృష్టితో మోదీ భారత్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని కొనియాడారు. అటు ప్రధాని మోదీ కూడా ఇజ్రాయెల్ సృజనాత్మకతను ప్రశంసించారు. నవభారత నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహించే వ్యవస్థను నెలకొల్పేందుకు కృషిచేస్తోందన్నారు. నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఏర్పాటుచేసిన ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టెక్నాలజీ’ (ఐ క్రియేట్)ను మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ, నెతన్యాహు దంపతులు పతంగులు ఎగురవేశారు. భారత పర్యటన స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని నెతన్యాహు అన్నారు. మేమిద్దరం యువకులమే! పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ఐ క్రియేట్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన యువ వ్యాపారవేత్తలు, వాణిజ్య ప్రముఖులనుద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించారు. ప్రతి రంగంలో భారత్‌తో భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ యువత భారత్‌లో పర్యటించి ఐ క్రియేట్ ద్వారా శక్తిసామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంతో భారత్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్పు ద్వారా ప్రపంచశక్తిగా భారత్ మారేందుకు ఆయన పనిచేస్తున్నారు. నైపుణ్యత, సృజనాత్మకత ద్వారా దీన్ని సాధిస్తున్నారు’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ‘నేను, మోదీ ఇద్దరు యువకులమే. ఆశావాద ధృక్పథంతో ముదుకెళ్తున్నాం. మా ఆలోచనలు నిత్య యవ్వనం’ అని పేర్కొన్నారు. నవభారత నిర్మాణానికి... సృజనాత్మక వ్యవస్థ ద్వారా నవభారత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నిధులు, స్థలాలు, మార్గదర్శకులను ఇవ్వటంతోపాటు ఇతర వసతులు కల్పించి వారిలోని సామర్థ్యానికి పదును పెట్టేందుకే ‘ఐ క్రియేట్’ను ఏర్పాటుచేశామన్నారు. అనంతరం, సబర్‌కంఠ జిల్లాలోని వాద్రాద్ గ్రామంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్’ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. భారత్ ఓ స్వప్నంతో ముందుకెళ్తున్న దేశమని నెతన్యాహు ప్రశంసించారు. ఇజ్రాయెల్ సాంకేతికతతో గుజరాత్ రైతులు సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా నెతన్యాహు ప్రశంసించారు. అట్టహాసంగా రోడ్ షో మోదీ, నెతన్యాహుల రోడ్ షో అహ్మదాబాద్ వీధుల్లో ఘనంగా సాగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 8 కి.మీ. మేర పటిష్ట భద్రత నడుమ ఈ రోడ్ షో జరిగింది. రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు భారత్, ఇజ్రాయెల్ పతకాలు చేతిలో పట్టుకుని బారులు తీరారు. మోదీకి కానుక భారత పర్యటన సందర్భంగా మోదీకి నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్–మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్–పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. ‘గతేడాది ఇజ్రాయెల్ పర్యటనలో నాకు ఈ వాహనాన్ని చూపించారు. చెత్త నీటిని కూడా ఇది శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ వాహనాన్ని నెతన్యాహు కానుకగా ఇచ్చా రు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుంది. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
స్నాచింగ్..క్యాచింగ్
నగల చోరీలో 77 శాతం రికవరీ ఈ ఏడాది మొత్త 21, 035 కేసులు మహిళలపై తగ్గిన నేరాలు నగరంలో పోలీసుల సంఖ్య.... మంజూరైన పోలీసుల సంఖ్య 12401 ప్రస్తుతం పనిచేస్తున్నవారు 9744 ప్రస్తుతం ఖాళీ పోస్టులు 2657 సిటీబ్యూరో: హైదరాబాద్‌ను నేరరహిత, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ కాంక్షకు అనుగుణంగా నగర పోలీసు శాఖ ఆరు నెలలుగా ముందుకు సాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన రాష్ర్టంలో పోలీసు సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సిటీ పోలీసు 2014 రౌండప్‌పై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసుఅధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది 19,110 కేసులు నమోదు కాగా, ఈ సారి 21,035 నమోదయ్యాయన్నారు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది రికవరీ శాతం 57కు పెరిగిందన్నారు. అయితే చైన్‌స్నాచింగ్ కేసుల్లో 77 శాతం రికవరీ చేసి రికార్డు సృష్టించామన్నారు. ఓ పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టినా, మరో పక్క నేరగాళ్లను జైళ్లలో పెట్టడానికి పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని పేర్కొన్నారు. నేరాల నిరోధం, బాధితులకు సత్వర న్యాయం కోసం అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ రూ.30 కోట్లు కేటాయించిందని వివరించారు. నేరాల నిరోధానికి ఐదు నెలలుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఠాణాల్లో పారిశుద్ధ్య పనులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించామన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ప్రతి 15 రోజులకోసారి యూఐ మేళా నిర్వహిస్తున్నామన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అవుతున్నాయన్నారు. మహిళలపై గత ఏడాది 3,173 నేరాలు జరిగితే ఈ సారి 2,790 కేసులు నమోదయ్యాయన్నారు. జీపీఎస్ గుప్పిట్లోకి గస్తీ వాహనాల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, జాయింట్ పోలీసు కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు పాలరాజు, వెంకటేశ్వరరావు, డాక్టర్ రవిందర్, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, సుధీర్‌బాబు, లింబారెడ్డి, రంగనాథ్, ఎల్.ఎస్.చౌహాన్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, పాపయ్య, సత్యనారాయణ, నాగరాజు, బాబురావు, పి.యాదగిరి, ఎం.రామ్మోహన్రావు, ఎల్.టి.చంద్రశే ఖర్, రంజన్త్రన్‌కుమార్, కె.విజేందర్‌రెడ్డి, బి.గంగారామ్, అమరేందర్‌రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఏఐలు పాల్గొన్నారు. చేధించిన కేసులు (శాతాల్లో) బందిపోటు దొంగతనాలు 97 సూడోపోలీసు 91 చైన్స్నాచిగ్లు 77 ఇళ్లలో చోరీలు 55 దోపిడీలు 53 హత్యచేసి దోపిడీ 39 దృష్టి మళ్లించి 39 ఆటోమొబైల్ 34 సీసీఎస్ ఛేదించిన కేసులు.. ►నైజీరియన్ జాబ్ ఫ్రాడ్ ► }లంక కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ ► మిలటరీ రహస్యాలు చేరవేస్తున్న గుట్టు రట్టు ► పాకిస్తాన్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 14 మంది అరెస్టు ►డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు ►15 కేసుల్లో 36 మందిని అరెస్టు చేసి రూ.13.60 కోట్ల స్వాధీనం ►బొల్లారం ఠాణాలో అతితక్కువగా 13 చోరీలు జరిగాయి ►ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు అత్యధికంగా బేగంపేట ఠాణాలో ఆరు కేసులు నమోదు. ► ఆస్తి కోసం హత్యలు ఈ ఏడాది మూడు జరిగాయి. ► బొల్లారం, కామాటిపురా,డబీర్‌పురా, హబీబ్‌నగర్‌లలో స్నాచింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ► అత్యధికంగా మారేడ్‌పల్లిలో నలుగురు మహిళపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. ► అత్యధికంగా వరకట్న కేసులు ముషీరాబాద్ ఠాణాలో నాలుగు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ ఛేదించిన కేసులు ► కరుడు గట్టిన చైన్‌స్నాచర్ సయ్యద్సయ్యీద్ హుస్సేన్ అరెస్టు. మిస్టరీ వీడిన 228 కేసులు ► 54 మంది దొంగలను అరెస్టు చేసి 59 వాహనాలను స్వాధీనం ► అక్రమంగా ఆయుధాలు కలిగిన 47 మందిని అరెస్టు ► 26 డ్రగ్స్ కేసులలో 60 మంది నిందితులను అరెస్టు ► 1554 కేసులు ఛేదించి 2,564 మంది నిందితులను అరెస్టు నగర పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు.. ► కొత్త ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలు ► బ్లూకోల్డ్స్ బైక్స్ ► సాయుధ బలగాల గస్తీ ► పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీస్ ► డైలీ పెర్ఫార్మెన్స్ రిపోర్టు (డీపీఆర్) ► కమ్యూనిటీ పోలీసింగ్ ► {పతి ఠాణాకు ఫేస్బుక్ సౌకర్యం ► {Vూప్ ఎస్ఎమ్ఎస్ సర్వీస్ ► పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఎస్ఎమ్ఎస్ పంపడం ► {Mైమ్ మ్యాపింగ్ ► స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ► ఈవ్‌టీజింగ్ నిరోధానికి షీ-టీమ్స్ ఏర్పాటు ► {పజలు ప్రశాంత జీవనం గడిపేందుకు 24 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగం ► పీపుల్స్ ఫ్రెండ్లీ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ నేటి వరకు 3000 మంది పోలీసులకు దీనిపై శిక్షణ పూర్తి చేసుకున్నారు. ► పేకాట క్లబ్బుల మూసివేత ► క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలానా ► ఠాణాలో సిబ్బందికి పని విభజన ► సేఫ్ కాలనీ ► మార్కెటింగ్ ఇంటెలిజెన్స్