స్నాచింగ్..క్యాచింగ్ | Snacing catching | Sakshi
Sakshi News home page

స్నాచింగ్..క్యాచింగ్

Published Sat, Dec 27 2014 11:10 PM | Last Updated on Fri, Sep 7 2018 2:16 PM

స్నాచింగ్..క్యాచింగ్ - Sakshi

స్నాచింగ్..క్యాచింగ్

నగల చోరీలో 77 శాతం రికవరీ
ఈ ఏడాది మొత్త 21, 035 కేసులు
మహిళలపై తగ్గిన నేరాలు

 
నగరంలో పోలీసుల సంఖ్య....
 

మంజూరైన పోలీసుల సంఖ్య    12401
ప్రస్తుతం పనిచేస్తున్నవారు    9744
ప్రస్తుతం ఖాళీ పోస్టులు    2657

 
సిటీబ్యూరో: హైదరాబాద్‌ను నేరరహిత, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ కాంక్షకు అనుగుణంగా నగర పోలీసు శాఖ ఆరు నెలలుగా ముందుకు సాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన రాష్ర్టంలో పోలీసు సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సిటీ పోలీసు 2014  రౌండప్‌పై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసుఅధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది 19,110  కేసులు నమోదు కాగా, ఈ సారి 21,035 నమోదయ్యాయన్నారు.  గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది రికవరీ శాతం 57కు పెరిగిందన్నారు. అయితే చైన్‌స్నాచింగ్ కేసుల్లో 77 శాతం రికవరీ చేసి రికార్డు సృష్టించామన్నారు. ఓ పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టినా, మరో పక్క  నేరగాళ్లను జైళ్లలో పెట్టడానికి పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని పేర్కొన్నారు. నేరాల నిరోధం, బాధితులకు సత్వర న్యాయం కోసం అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ రూ.30 కోట్లు కేటాయించిందని వివరించారు. నేరాల నిరోధానికి ఐదు నెలలుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఠాణాల్లో పారిశుద్ధ్య పనులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించామన్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ప్రతి 15 రోజులకోసారి యూఐ మేళా నిర్వహిస్తున్నామన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అవుతున్నాయన్నారు. మహిళలపై గత ఏడాది 3,173 నేరాలు జరిగితే ఈ సారి 2,790 కేసులు నమోదయ్యాయన్నారు. జీపీఎస్ గుప్పిట్లోకి గస్తీ వాహనాల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, జాయింట్ పోలీసు కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు పాలరాజు, వెంకటేశ్వరరావు, డాక్టర్ రవిందర్, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, సుధీర్‌బాబు, లింబారెడ్డి, రంగనాథ్, ఎల్.ఎస్.చౌహాన్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, పాపయ్య, సత్యనారాయణ, నాగరాజు, బాబురావు, పి.యాదగిరి, ఎం.రామ్మోహన్‌రావు, ఎల్.టి.చంద్రశే ఖర్, రంజన్త్రన్‌కుమార్, కె.విజేందర్‌రెడ్డి, బి.గంగారామ్, అమరేందర్‌రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఏఐలు పాల్గొన్నారు.
 
 
 చేధించిన కేసులు (శాతాల్లో)
 
బందిపోటు దొంగతనాలు    97
సూడోపోలీసు    91
చైన్‌స్నాచిగ్‌లు    77
ఇళ్లలో చోరీలు    55
దోపిడీలు    53
హత్యచేసి దోపిడీ    39
దృష్టి మళ్లించి    39
ఆటోమొబైల్    34
 
సీసీఎస్ ఛేదించిన కేసులు..
 
►నైజీరియన్ జాబ్ ఫ్రాడ్
► }లంక కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్
► మిలటరీ రహస్యాలు చేరవేస్తున్న గుట్టు రట్టు
► పాకిస్తాన్ కేంద్రంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న 14 మంది అరెస్టు
►డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు
►15 కేసుల్లో 36 మందిని అరెస్టు చేసి రూ.13.60 కోట్ల స్వాధీనం
 
►బొల్లారం ఠాణాలో    అతితక్కువగా    13    చోరీలు జరిగాయి
►ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు అత్యధికంగా బేగంపేట ఠాణాలో ఆరు కేసులు నమోదు.
►  ఆస్తి కోసం హత్యలు ఈ ఏడాది మూడు జరిగాయి.
►  బొల్లారం, కామాటిపురా,డబీర్‌పురా, హబీబ్‌నగర్‌లలో స్నాచింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
►  అత్యధికంగా మారేడ్‌పల్లిలో నలుగురు మహిళపై అత్యాచార కేసులు నమోదయ్యాయి.
►  అత్యధికంగా వరకట్న కేసులు ముషీరాబాద్ ఠాణాలో నాలుగు నమోదయ్యాయి.
 
 టాస్క్‌ఫోర్స్ ఛేదించిన కేసులు
 
► కరుడు గట్టిన చైన్‌స్నాచర్ సయ్యద్‌సయ్యీద్ హుస్సేన్ అరెస్టు. మిస్టరీ వీడిన 228 కేసులు
► 54 మంది దొంగలను అరెస్టు చేసి 59 వాహనాలను స్వాధీనం
► అక్రమంగా ఆయుధాలు కలిగిన 47 మందిని అరెస్టు
► 26 డ్రగ్స్ కేసులలో  60 మంది నిందితులను అరెస్టు
► 1554 కేసులు ఛేదించి 2,564 మంది నిందితులను అరెస్టు
 
నగర పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు..
 
► కొత్త ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలు
► బ్లూకోల్డ్స్ బైక్స్
► సాయుధ బలగాల గస్తీ
► పిటిషన్ మేనేజ్‌మెంట్ సర్వీస్
► డైలీ పెర్‌ఫార్మెన్స్ రిపోర్టు (డీపీఆర్)
► కమ్యూనిటీ పోలీసింగ్
►  {పతి ఠాణాకు ఫేస్‌బుక్ సౌకర్యం
► {Vూప్ ఎస్‌ఎమ్‌ఎస్ సర్వీస్
► పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఎస్‌ఎమ్‌ఎస్ పంపడం
►   {Mైమ్ మ్యాపింగ్
► స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం
► ఈవ్‌టీజింగ్ నిరోధానికి షీ-టీమ్స్ ఏర్పాటు
► {పజలు ప్రశాంత జీవనం గడిపేందుకు 24 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగం
► పీపుల్స్ ఫ్రెండ్లీ అండ్ సాఫ్ట్ స్కిల్  ట్రైనింగ్ నేటి వరకు 3000 మంది పోలీసులకు దీనిపై శిక్షణ పూర్తి చేసుకున్నారు.
►  పేకాట క్లబ్బుల మూసివేత
► క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలానా
►    ఠాణాలో సిబ్బందికి పని విభజన
►    సేఫ్ కాలనీ
► మార్కెటింగ్ ఇంటెలిజెన్స్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement