Global City
-
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి మీడియాతో మాట్లాడారు. హైదరా బాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణా, గోదావరి మంచి నీరు, మెట్రో రైల్ తదితరాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఒక్క శాతం ప్రజలకైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన వేల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో డివిజన్ల విభజనలో అక్రమాలు జరిగాయని, కొంతమందికి లబ్ధి చేకూరేలా ఈ ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. సచివాలయంలో మజీద్, మందిర్లను రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేశారని, వాటిపై పోరాటాలు చేస్తామని తెలిపారు. పార్లమెంటులో ప్రస్తావిస్తాం: ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మసీద్, మందిర్ కూల్చివేతల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఉత్తమ్ చెప్పారు. కార్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని, ఎంఐఎం పార్టీ నేతలు అంటున్నారని విమర్శించారు. మసీదు కూల్చివేతపై కేసీఆర్ నిర్ణయాన్ని అసదుద్దీన్ స్వాగతించడం దారుణమన్నారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని పేర్కొన్నారు. రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాం ఆనవాళ్లను చెరిపేసే కుట్ర: రేవంత్ రాష్ట్రంలో నిజాం ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చెరిపేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే సచివాలయం, ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారని, చారిత్రక కట్టడాలను తొలగించి చరిత్రను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరోవైపు కేంద్రంలో కూడా హిందుత్వ ఎజెండాతో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆలయాల కూల్చివేతలపై బీజేపీ, ఎంఐఎంలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావోద్వేగాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో గుడి, మసీదు కూల్చివేతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘గ్రేటర్’ కసరత్తు షురూ! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎ న్నికల కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. పక్కా ప్రణాళికతో ఈసారి ఎన్నికలను ఎదుర్కొనాలని, జీహెచ్ ఎంసీలో అతి పెద్ద పార్టీగా అవతరించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నేతలు నిర్ణయిం చారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. సీఎల్పీ నే త భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, విక్రమ్‌గౌడ్, అనిల్ కుమా ర్ యాదవ్‌లతో పాటు ఒకరిద్దరు మినహా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై ఉత్తమ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 24లోపు 150 డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికలు నాలుగు నెలలలోపే జరుగుతాయని, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 3 నెలల సమయం ఉండేలా అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని ఉత్తమ్ సూచిం చినట్టు సమాచారం. కాగా, సెక్రటేరియట్ లో దేవాలయం, రెండు మసీదుల కూల్చివేతపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని, ప్ర భుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాల ని, బీజేపీ, ఎంఐఎంల ద్వంద్వ వైఖరిని ఎం డగట్టాలని సమావేశం నిర్ణయించింది. -
హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ మంత్రి కె.తారకరామారావు కోరారు. హైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలు తీర్చగలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్ మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఎస్ఆర్డీ వివరాలు.. ఈ సందర్భంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ గురించి అమిత్ షాకు కేటీఆర్ వివరించారు. ఎస్ఆర్డీలో భాగంగా స్కైవేలు, ప్రధాన కారిడార్లు (166 కి.మీ), ప్రధాన రోడ్డు (348 కి.మీ), ఇతర రహదారులు (1,400 కి.మీ)ల అభివృద్ధికి సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ఫేజ్–1లో రసూల్‌పుర జంక్షన్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇంటర్ స్టేట్ వైర్లెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1.62 ఎకరాల భూమి అవసరమవుతుందని వివరించారు. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భూమిని బదలాయించాలని కోరారు. ఈ భూమిని జీహెచ్ఎంసీకి బదలాయించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్ర హోం శాఖ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 2017లో కేంద్ర హోం శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం ఎస్ఎన్ స్వామి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు సంయుక్తంగా జరిపిన సర్వేలో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల స్టేషన్లో కమ్యూనికేషన్ ఇన్స్టాలేషన్ ఎలాంటి ప్రభావానికి లోనుకాదని, కేవలం స్టాఫ్ క్వార్టర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపు, స్టోర్‌రూం మాత్రమే ప్రభావితమవుతాయని నివేదిక సమర్పించిందని వివరించారు. అయితే కేంద్ర హోం శాఖ నుంచి భూమి బదలాయింపుపై ఇప్పటివరకు ఆదేశాలు జారీ కాలేదని చెప్పారు. ఫార్మాసిటీకి సాయం కావాలి.. ఫార్మా రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా రూపొందించిన హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ప్రతిపాదిత హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్‌ను సమీకృతం చేసుకుంటూ 19,333 ఎకరాల్లో ప్రణాళికలు రచించిన హైదరాబాద్ ఫార్మా సిటీ ఆవశ్యకతను గోయల్‌కు వివరించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలసిన కేటీఆర్..హెచ్‌పీసీపై వివరాలందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఐఐటీ ఈ ప్రాజెక్టును సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా, ‘నిమ్జ్’(నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్)గా గుర్తించిందన్నారు. ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 8,400 ఎకరాల్లో పనులకు డీపీఆర్, డిజైన్లు సిద్ధమయ్యాయని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు కూడా పొందామని వివరించారు. తొలి విడత పనుల్లో బాహ్య మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు, నీటి వసతికి రూ.1,318 కోట్లు, అంతర్గత మౌలిక వసతుల్లో భాగంగా 50 శాతం వ్యయం (రూ.2,100 కోట్లు) భరించాలని కోరారు. డిజైన్ సెంటర్‌కు అనుమతులివ్వండి.. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, ప్రచార శాఖతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. ఈ ప్రతిపాదిత నేషనల్ డిజైన్ సెంటర్.. కన్సల్టెన్సీ సర్వీసులు, దేశంలో డిజైన్ రంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు, భారత డిజైన్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు, మార్కెటింగ్, ఎక్స్పో, ఎగ్జిబిషన్, డిజైన్ వర్క్‌షాప్‌లకు ఉపయోగపడుతుం దని వివరించారు. డిజైన్ సెంటర్లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచ స్థాయి నిపుణులు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. డిజైన్ సెంటర్ బిల్డింగ్‌ను రూపొందించడంలో, మెంటార్‌గా వ్యవహరించేందుకు ఆపిల్ స్టోర్ రూపకర్త టిమ్ కొబె సహా ఆటోమోటివ్ వింగ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా మోటార్స్ డిజైన్ విభాగం హెడ్ ప్రతాప్ బోస్ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అకాడమీ ప్రోగ్రాంల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఫిన్లాండ్లోని ఆల్టో యూనివర్సిటీ ఆసక్తిగా ఉందన్నారు. రైల్వే సైడింగ్ వసతి కల్పించండి.. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే సైడింగ్ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్ కోరారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న గ్రానైట్ పరిశ్రమల నుంచి ప్రస్తుతం లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయని, వీటి వల్ల నిర్వాహకులకు ఖర్చుల భారం అధికమవుతోందన్నారు. అలాగే హైద రాబాద్–విజయవాడ మధ్య కొత్తగా రోజువారి ప్యాసింజర్ రైలును మంజూరు చేయాల్సిందిగా కోరారు. మాచర్ల, మట్టంపల్లి, జన్పహాడ్, దామరచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ టౌన్ల మీదుగా ఈ కొత్త రైలును నడపాలని కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా కేటీఆర్ వెంట తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
విశ్వనగరానికి పక్కా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరాన్ని అసలు సిసలు విశ్వనగరం (గ్లోబల్ సిటీ)గా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటి సమస్య లను ముందుగానే అంచనావేసి పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర ‘మాస్టర్ ప్లాన్’రూపొందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సన్నద్ధం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్లో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్‌లో రాష్ట్ర కేబినెట్ మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ నగర సమగ్రాభివద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తోపాటుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరాభివృద్ధికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిధులతోపాటు ఇతరత్రా నిధులను కూడా సమకూరుస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పనిపూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తామని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న నగరం, ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ఉన్న నగరం, ట్రిపుల్ ఆర్ అవతల విస్తరించే నగరం ఇలా మూడు యూనిట్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. పెరుగుతున్న వలసలకు తగ్గట్లుగా.. ‘హైదరాబాద్ శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్యపూర్వక జీవనం, పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలిరావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్‌కు తరలుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలరీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశాలు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే.. నగర జీవితం నరకప్రాయం కాక తప్పదు’అని సీఎం పేర్కొన్నారు. నాడు స్వర్గమే.. కానీ నేడు! ‘నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అని హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్‌షా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. రాన్రానూ పరిస్థితి మారిపోయింది. మూసీ మురికితో నిండిపోయింది. నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం మరింత దుర్భరంగా మారడం ఖాయం. అందుకే మనమంతా ఇప్పుడే మేల్కోవాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి దానికి తగ్గట్లుగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అమలు చేయాలి’అని కేసీఆర్ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ‘హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంతుంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై ఓ స్పష్టమైన నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లుగా ఏం చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఢిల్లీ, బెంగళూరులతోపాటు చైనా రాజధాని బీజింగ్ కూడా ప్రస్తుతం జనజీవనానికి అనుకూలంగా లేదు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే మనకు కూడా విషమ పరిస్థితులు తప్పవు. నగర ప్రజల జీవితాన్ని సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది’అని సీఎం చెప్పారు. పచ్చదనం పెరగాలి ‘హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండీఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. దీంతో నగరంలో పచ్చదనం కరువవుతోంది. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరమంతా కాలుష్యమయం అవుతుంది. అందుకే అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. 1.50 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి. హైదరాబాద్ నగరాన్ని ఓఆర్ఆర్ లోపలున్న నగరం, ఓఆర్ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ వరకుండే నగరం, ట్రిపుల్ ఆర్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీలను ప్లాన్ చేసి వీటికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కేబినెట్ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు. సిటీ జనాభా పెరుగుతోంది! ‘నగరాలకు వలసలను ఆపలేం. అనేక అనుకూలతలున్న హైదరాబాద్‌కు వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు. పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడం ఒక్కటే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి. వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఒక్క హెచ్ఎండీఏకి సాధ్యం కాదు. మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది’అని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనచారి పాల్గొన్నారు. -
గ్లోబల్ సిటీగా హైదరాబాద్ : కేసీఆర్
హైదరాబాద్: నగరాన్ని గ్లోబల్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్ లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్ఎండిఏ పై మాత్రమే పెట్టకుండా, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధికి జిహెచ్ఎంసి నిధులపైనే ఆధారపడకుండా ఇతరత్రా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు. అప్డేట్ కాకపోతే అంతే.. ‘హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున యువత వలస వస్తోంది. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ కారణాల వల్ల ప్రతీ ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్‌లో పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు వచ్చిపోతున్నారు. ఇదంతా ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశం. చాలా సంతోషకరమైన విషయం కూడా. కానీ, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే మాత్రం నగర జీవిత నరకప్రాయంగా మారక తప్పదు’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్ లో మంచినీటి రిజర్వాయర్‌ను ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. మెట్రోరైలును శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ. 55 వేల కోట్లతో నగరాల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో రూ. 55 వేల కోట్లతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ. 15 వేల కోట్ల చొప్పున రూ. 45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రూ. 55 వేల కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ‘ఫోకసింగ్ ఆన్ అర్బన్ తెలంగాణ’కార్యక్రమం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర నివేదిక ఆధారంగా పనులు... ‘వచ్చే ఏడాది నుంచి వరుసగా మూడేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రహదారులు, పార్కులు, చెరువులు, మురికి కాలువలను అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఈ పనులు చేయడానికి నిధుల కొరత లేదు. ఇందుకోసం రూ. 55 వేల కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌కు రూ. 45 వేల కోట్లు, ఇతర నగరాలకు రూ. 10 వేల కోట్లు ఇస్తాం. ఈ నిధులతో ఏ పనులు చేయాలనే విషయంలో మున్సిపల్‌శాఖ సమగ్ర నివేదిక రూపొందించాలి. దాని ప్రకారం పనులు చేసుకుంటూ పోవాలి. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని రకాల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి. అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలి. లే అవుట్లలో గ్రీన్‌ల్యాండ్ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసే విధానానికి స్వస్తి పలకాలి. గ్రీన్ కవర్ కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. చెరువులను శుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి. హైదరాబాద్‌లోని గండిపేట, హియాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపాలి. మురికినీరు చెరువుల్లో కలవకుండా చూడాలి. మురికినీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ప్రతి నగరానికీ అవసరమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి’అని సీఎం కేసీఆర్ చెప్పారు. సమావేశంలో మంత్రి కె. తారక రామారావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలకశాఖ కమిషనర్ శ్రీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఖమ్మం మేయర్ పాపాలాల్, నిజామాబాద్ మేయర్ సుజాత, రామగుండం మేయర్ కె. లక్ష్మీనారాయణ, కమిషనర్లు పాల్గొన్నారు. -
విశ్వనగరానికి ఓ విజన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం గ్లోబల్ సిటీగా మారాలంటే సరికొత్త విజన్ అవసరం అంటున్నారు వివిధ రంగాలకు చెందిన నిపుణులు. ట్రాఫిక్ కష్టాలు.. గుంతలమయమైన రహదారులు.. శ్వాసకోశ వ్యవస్థలను దెబ్బతీస్తోన్న వాయు కాలుష్యాన్ని సమూలంగా పారదోలాలని, చారిత్రక మూసీనది.. హుస్సేన్‌సాగర్.. దుర్గం చెరువు సహా వివిధ జలాశయాలను పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామంటున్న పాలకులు ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ అంశాలు, నగర చరిత్ర, వారసత్వ కట్టడాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కంకణబద్ధులు కావాలని సరికొత్త విజన్‌ను ఆవిష్కరించారు. రాజకీయ పక్షాలు, ప్రభుత్వం, ఆయా విభాగాలు పూర్తిస్థాయిలో భాగస్వాములైతేనే ఈ విజన్ సాకారమౌతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ‘ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్’ సంస్థ ఆధ్వర్యంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైలాగ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అన్న అంశంపై ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు నిపుణులు పలు అంశాలపై గ్రేటర్‌ను విశ్వనగరంగా మార్చాలంటే ప్రభుత్వ విజన్ ఎలా ఉండాలో నిర్దేశించారు. ఈ సదస్సులో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరుణా గోపాల్, జి.రామేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, వేదకుమార్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నరసింహారెడ్డి, కేశవ్, తిలోత్తమ్, సక్సేనా, శ్రావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో విశ్వనగర విజన్ ఇలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. పర్యావరణం.. ప్రస్తుత పరిస్థితి: గ్రేటర్ పరిధిలో ఫార్మా పరిశ్రమలు.. వాహన విస్ఫోటనంతో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. త్వరలో మన సిటీ ఢిల్లీని అధిగమించనుంది. గాలిలో చేరుతోన్న అతి సూక్ష్మధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో చేరి గుండెపోటుకు కారణమవుతున్నాయి. విజన్ ఇదీ: రోజువారీగా పరిశ్రమలు, వాహనాలు, ఇతరత్రా ఎన్ని టన్నుల కాలుష్యం గాలిలో కలుస్తుందో శాస్త్రీయంగా లెక్కించాలి. కాలుష్యానికి కారణమవుతున్న వారిని గుర్తించి కట్టడి చేయాలి. గ్రేటర్‌వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత కాలుష్యం నమోదవుతుందో మొబైల్యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ప్రతి సిటిజన్‌కు ఉండాలి. మూసీ, సాగర్, చెరువుల పరిరక్షణ ప్రస్తుత పరిస్థితి: చారిత్రక మూసీ నది డంపింగ్‌యార్డుగా మారింది. అడుగడుగునా ఆక్రమణలతో మూసీ చిన్నబోయింది. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సుమారు 185 చెరువులు కాలుష్యకాసారంగా మారాయి. విజన్ ఇదీ: మూసీ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు తక్షణం నడుంబిగించాలి. పారిశ్రామిక వాడల్లోనే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి శుద్ధిచేసిన అనంతరమే మూసీలోకి వదలాలి. జలాశయాలు, మూసీపై ఆక్రమణలు తొలగించాలి. తీరైన రహదారులు ప్రస్తుత పరిస్థితి: గ్రేటర్లో రహదారులు అడుగుకో అగాథంలా మారాయి. ట్రాఫిక్, గుంతల రోడ్లపై ప్రయాణం తో జనం నడుమునొప్పితో కుదేలవుతున్నారు. విజన్: రహదారులను విస్తరించాలి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆక్రమణలను నిరోధించి తీరైన ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలి. మల్టీలెవల్ ఫ్లైఓవర్ల కన్నా రోడ్ల విస్తరణ, గుంతలను తక్షణం పూడ్చి సిటిజన్లకు ఉపశమనం కల్పించాలి. ప్రజారవాణా.. ప్రస్తుతం: గ్రేటర్లో వాహన విస్ఫోటనం జరుగుతోంది. నిత్యం 50 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండటంతో ట్రాఫికర్ సిటిజన్లను బెంబేలెత్తిస్తోంది. విజన్: మెట్రో రైళ్లతోపాటు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) వంటి ప్రజారవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఉంటేనే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజారవాణా వినియోగం పెరుగుతుంది. నిరంతర నీటిసరఫరా.. ప్రస్తుతం: వందల కిలోమీటర్ల దూరం నుంచి సిటీకి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాల్లో 40 శాతం సరఫరా నష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. విజన్: గ్రేటర్లో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల తాగునీటిని నిరంతరాయంగా(24 గంటలపాటు) సరఫరా చేసేలా సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలి. మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రస్తుతం: గ్రేటర్ శివార్ల లో పదకొండు మున్సి పల్ సర్కిళ్ల పరిధిలో డ్రైనేజి వ్యవస్థ లేక 40 లక్షల మంది సతమతమవుతున్నారు. విజన్: గ్రేటర్ హైద రాబాద్ వ్యాప్తంగా సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,100 కోట్లతో డ్రైనేజి మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి గ్రేటర్లో మూసీ, సాగర్ ప్రక్షాళనతోపాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. – ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త మహిళల భద్రతకు పెద్దపీట వేయాలి గ్రేటర్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వారు స్వేచ్ఛగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వాతావరణం కల్పించాలి. ఆయా సమస్యల పరిష్కారానికి పౌరసమాజం నుంచి ప్రభుత్వం అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలి. – శ్రావ్యారెడ్డి, విఅండ్షి ఫౌండేషన్ అధ్యక్షురాలు -
ఇలా అయితే మనది గ్లోబల్ సిటీ కాదు: కేటీఆర్
నగరంలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా చిన్నపాటి వర్షానికే రోడ్లు పాడైపోతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితి కారణంగా.. 9 గంటలకు సమావేశానికి రావాల్సిన తాను 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని తెలిపారు. అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకపోతే మనది గ్లోబల్ సిటీ కాదని ఆయన చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. రోడ్లు వేసిన వెంటనే వాటికి తూట్లు పొడుస్తున్నారని గుర్తుచేశారు. ఇకమీదట రోడ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. -
గ్రేటర్ బడ్జెట్ రూ.5,600 కోట్లు
♦ గ్లోబల్‌సిటీ, రహదారులు, ♦ గృహ నిర్మాణాలకు పెద్దపీట సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి (2016-17) జీహెచ్ఎంసీ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.5,600 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. గతనెలలోనే దీన్ని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ.. ఇప్పటిదాకా వివరాలు వెల్లడి కాలేదు. స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో జీహెచ్ఎంసీ స్పెషలాఫీసరే బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదించి, ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం లాంఛనంగా ఆమోదిస్తుంది. కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో సమాచారం నిమిత్తం కొత్తగా కొలువు దీరే సభ ముందుంచనున్నారు. అంతకుమించి మార్పులేమీ ఉండబోవని తెలుస్తోంది. రహదారులు, వరద కాలువలపై బడ్జెట్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పేదలకు గృహ నిర్మాణం, శుద్ధ జలం, గ్రీన్ హైదరాబాద్ వంటి వాటికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. కొత్త బడ్జెట్లో అత్యధికంగా ఎస్సార్డీపీ పనులకు రూ.1000 కోట్లు, రహదారులకు 860 కోట్లు చూపారు. రహదారుల నిర్వహణకు 110.73 కోట్లు, నాలాల నిర్వహణకు రూ.76.61 కోట్లు చూపారు. వరద కాలువలు, రహదారులు, ఫ్లై ఓవర్లకు కలిపి రూ.2,180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్‌ను రూ.5,550 కోట్లకు ఆమోదించగా, రివైజ్డ్ బడ్జెట్లో దాన్ని రూ. 5091 కోట్లకు తగ్గించారు. -
విశ్వనగరంగా హైదరాబాద్
-
ఉప్పల్‌లో ప్రాపర్టీ షో!
ఈనెల 31న ఎస్బీఐ, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించడం, వినూత్న ప్రణాళికల్ని ప్రకటించడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి ప్లాట్లు, ఫ్లాట్లు కొనేందుకు దూరంగా ఉన్న కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాంతంలో కొనాలి? ఏ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలి? వంటి అనేక అంశాలపై సమగ్ర రూపమిచ్చేందుకు ఈనెల 31న ఎస్బీఐ, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ మైదానంలో తొలి ప్రాపర్టీ షో జరగనుంది. - సాక్షి, హైదరాబాద్ {పతికూల సమయంలోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టాలంటే సరైన ప్రాంతం ఉప్పల్. మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతుండటం, ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ కూతవేటు దూరంలో ఉండటం, ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ఉప్పల్ ప్రాంతం ఉండటం వంటి కారణాలనేకం. మనం కోరుకున్న విధంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకుంటే అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లోనే స్థిరాస్తిని కొనుగోలు చేయాలి. అంతేతప్ప తక్కువకు వస్తుంది కదా అని నగరానికి దూరంగా వెళ్లి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొనరాదు. మనం తీసుకోవాలనుకునే ప్రాంతం ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు చేరువగా ఉంటే మరీ ఉత్తమం. మొత్తం 34 స్టాళ్ల ద్వారా 50కి పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నారు. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లుంటాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే ఫ్లాట్లు, రూ.40 లక్షల నుంచి కోటికిపైగా పలికే లగ్జరీ విల్లాలు, గజం రూ.5 వేలు నుంచి ప్రారంభమయ్యే ప్లాట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇకపై ప్రతి ఏటా జనవరిలో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి ఎటువైపో.. అభివృద్ధి అనేది ఎటువైపు పయనిస్తుందో అంచనా వేశాకే స్థిరాస్తి కొనుగోళ్లకు ముందడుగు వేయాలి. అయితే ఈ విషయంలో ఉప్పల్ ముందు వరుసలోనే ఉంటుంది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పరిశ్రమల నుంచి పరిశోధన సంస్థల వరకు, ఆసుపత్రుల నుంచి వినోద కేంద్రాల వరకు అన్ని రంగాలకూ ఉప్పల్ పెట్టింది పేరు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, జెన్‌ప్యాక్ట్, జీవీకే బయోసెన్సైస్ వంటి పరిశోధన సంస్థలున్నాయిక్కడ. అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లకూ కొదవేలేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఇన్నర్ రోడ్డు మీదుగా త్వరగానే చేరుకోవచ్చు. హైదరాబాద్‌లో మొత్తం 50 వేల ఎక రాల్లో విస్తరించనున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో.. ఉప్పల్ ప్రాంతం కూడా ఉంది. క్లస్టర్-3లో భాగంగా ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ రానుంది. దీనికి అనుసంధానంగా ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. అంటే మొత్తం 36.1 చ.కి.మీ.లో ఐటీ కంపెనీలు కొలువుదీరనున్నాయన్నమాట. ఇప్పటికే హబ్సిగూడలో జెన్‌ప్యాక్ట్ ఐటీ పార్కు, రామంతాపూర్‌లో నూజివీడు సీడ్స్ ఐటీ, ఐటీ ఆధారిత సెజ్, ఇదే ప్రాంతంలో ఎన్ఎస్ఎల్ సంస్థ ఎరేనా టౌన్సెంటర్లున్నాయి. పోచారంలో రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్‌లు తమ కార్యాలయాలను నెలకొల్పాయి కూడా. {పతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మెట్రో రైల్ తొలిసారిగా పరుగులు పెట్టేది కూడా ఇక్కడి నుంచే. నాగోల్ నుంచి మెట్టుగూడ.. 8 కి.మీ. దూరం మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలో హబ్సిగూడ, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియాల్లో మెట్రో స్టేషన్లుంటాయి. మరోవైపు నాగోల్- శిల్పారామం మార్గంలో 28 కి.మీ. దూరం మెట్రో రైలు వస్తుంది. ఇది కూడా పూర్తయితే ఇటు సికింద్రాబాద్‌కు, అటు హైటెక్ సిటీకి ప్రయాణ సమయమూ తగ్గుతుంది. పాల్గొనే సంస్థల్లో కొన్ని.. ఏవీ కన్స్ట్రక్షన్స్, ఎస్వీ, ఎస్వీసీ, వినాయక బిల్డర్స్, రమేష్ కన్స్ట్రక్షన్స్, సత్యవాణి, ట్రాన్స్‌కాన్ లైఫ్ స్పేసెస్, ఆకృతి బిల్డర్స్, హరిణి, ఐడియా వంటి 34 నిర్మాణ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. -
‘పోలీసు భవనానికి’ కమిటీ
* సీసీ టీవీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటుకూ కార్యవర్గం * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు నూతనంగా నిర్మించనున్న నగర పోలీసు కమిషనర్ హెడ్‌క్వార్టర్, సీసీకెమెరాల ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దేందుకు అత్యాధునిక హంగులతో 24 అంతస్థుల పోలీసు హెడ్ క్వార్టర్‌ను బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటుకు కూడా మరో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిషనరేట్ భవనంలో పది జిల్లాలతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే లక్ష సీసీకెమెరాల నిర్వాహణను ఈ రూమ్‌తో అనుసంధానం చేస్తారు. ఈ భవనంలో వీడియో వాల్, వైర్లెస్ సిస్టం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, కంట్రోల్ సెన్సార్స్, నెట్వర్క్ డివెజైస్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల వీడియో అండ్ ఆడియో కాన్ఫరెన్స్ సెంటర్, జీయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (జీఐఎస్), ఏరియల్ సర్వేతో పాటు అత్యవసర సేవలైన డయల్ 100, అగ్నిమాపక అంబులెన్స్, క్రైమ్ హాట్‌స్పాట్ అనలైసిస్, కమాండో టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, సిటీలో ఉన్న ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పాటు అదనంగా అత్యవసర సమయాల్లో రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, రోడ్డు భవనాల శాఖ, ఆరోగ్యం, రవాణా శాఖలకు తోడ్పాటు అందించే విధంగా నిర్మిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ పోలీసు క్వార్టర్స్ ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్శ, సభ్యులుగా డీజీపీ అనురాగ్‌శర్మ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, హోం శాఖల ప్రిన్సిపల్స్, ఫైనాన్స్ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, ఎం.మహేందర్‌రెడ్డి ఉంటారు. వీరు ఈ కమిటీ మెగా ప్రాజెక్ట్ కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చడం,టెండర్ల నిర్వహణకు ముందు ప్లాన్ అప్రూవల్ చేయడం, పీఎంయూ - టెక్నికల్ కమిటీ ప్రతిపాదించిన పనులను పర్యవేక్షించడం, ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష, పాలసీ నిర్దేశాలు, నాణ్యతాప్రమాణాలు, ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడానికి సానుకూల వాతావరణం కల్పించడంపై దృష్టిసారిస్తారు -రాజీవ్‌శర్శ ‘సీసీటీవీ సిస్టం’ కమిటీ సీసీటీవీ సర్వే లెన్స్ సిస్టం ఉన్నత స్థాయి కమిటీకిచైర్మన్గా సిటీ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సభ్యులుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పైన పేర్కొన్న విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు. - మహేందర్‌రెడ్డి -
స్నాచింగ్..క్యాచింగ్
నగల చోరీలో 77 శాతం రికవరీ ఈ ఏడాది మొత్త 21, 035 కేసులు మహిళలపై తగ్గిన నేరాలు నగరంలో పోలీసుల సంఖ్య.... మంజూరైన పోలీసుల సంఖ్య 12401 ప్రస్తుతం పనిచేస్తున్నవారు 9744 ప్రస్తుతం ఖాళీ పోస్టులు 2657 సిటీబ్యూరో: హైదరాబాద్‌ను నేరరహిత, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ కాంక్షకు అనుగుణంగా నగర పోలీసు శాఖ ఆరు నెలలుగా ముందుకు సాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన రాష్ర్టంలో పోలీసు సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సిటీ పోలీసు 2014 రౌండప్‌పై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసుఅధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది 19,110 కేసులు నమోదు కాగా, ఈ సారి 21,035 నమోదయ్యాయన్నారు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది రికవరీ శాతం 57కు పెరిగిందన్నారు. అయితే చైన్‌స్నాచింగ్ కేసుల్లో 77 శాతం రికవరీ చేసి రికార్డు సృష్టించామన్నారు. ఓ పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టినా, మరో పక్క నేరగాళ్లను జైళ్లలో పెట్టడానికి పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని పేర్కొన్నారు. నేరాల నిరోధం, బాధితులకు సత్వర న్యాయం కోసం అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ రూ.30 కోట్లు కేటాయించిందని వివరించారు. నేరాల నిరోధానికి ఐదు నెలలుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఠాణాల్లో పారిశుద్ధ్య పనులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించామన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ప్రతి 15 రోజులకోసారి యూఐ మేళా నిర్వహిస్తున్నామన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అవుతున్నాయన్నారు. మహిళలపై గత ఏడాది 3,173 నేరాలు జరిగితే ఈ సారి 2,790 కేసులు నమోదయ్యాయన్నారు. జీపీఎస్ గుప్పిట్లోకి గస్తీ వాహనాల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, జాయింట్ పోలీసు కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు పాలరాజు, వెంకటేశ్వరరావు, డాక్టర్ రవిందర్, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, సుధీర్‌బాబు, లింబారెడ్డి, రంగనాథ్, ఎల్.ఎస్.చౌహాన్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, పాపయ్య, సత్యనారాయణ, నాగరాజు, బాబురావు, పి.యాదగిరి, ఎం.రామ్మోహన్రావు, ఎల్.టి.చంద్రశే ఖర్, రంజన్త్రన్‌కుమార్, కె.విజేందర్‌రెడ్డి, బి.గంగారామ్, అమరేందర్‌రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఏఐలు పాల్గొన్నారు. చేధించిన కేసులు (శాతాల్లో) బందిపోటు దొంగతనాలు 97 సూడోపోలీసు 91 చైన్స్నాచిగ్లు 77 ఇళ్లలో చోరీలు 55 దోపిడీలు 53 హత్యచేసి దోపిడీ 39 దృష్టి మళ్లించి 39 ఆటోమొబైల్ 34 సీసీఎస్ ఛేదించిన కేసులు.. ►నైజీరియన్ జాబ్ ఫ్రాడ్ ► }లంక కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ ► మిలటరీ రహస్యాలు చేరవేస్తున్న గుట్టు రట్టు ► పాకిస్తాన్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 14 మంది అరెస్టు ►డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు ►15 కేసుల్లో 36 మందిని అరెస్టు చేసి రూ.13.60 కోట్ల స్వాధీనం ►బొల్లారం ఠాణాలో అతితక్కువగా 13 చోరీలు జరిగాయి ►ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు అత్యధికంగా బేగంపేట ఠాణాలో ఆరు కేసులు నమోదు. ► ఆస్తి కోసం హత్యలు ఈ ఏడాది మూడు జరిగాయి. ► బొల్లారం, కామాటిపురా,డబీర్‌పురా, హబీబ్‌నగర్‌లలో స్నాచింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ► అత్యధికంగా మారేడ్‌పల్లిలో నలుగురు మహిళపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. ► అత్యధికంగా వరకట్న కేసులు ముషీరాబాద్ ఠాణాలో నాలుగు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ ఛేదించిన కేసులు ► కరుడు గట్టిన చైన్‌స్నాచర్ సయ్యద్సయ్యీద్ హుస్సేన్ అరెస్టు. మిస్టరీ వీడిన 228 కేసులు ► 54 మంది దొంగలను అరెస్టు చేసి 59 వాహనాలను స్వాధీనం ► అక్రమంగా ఆయుధాలు కలిగిన 47 మందిని అరెస్టు ► 26 డ్రగ్స్ కేసులలో 60 మంది నిందితులను అరెస్టు ► 1554 కేసులు ఛేదించి 2,564 మంది నిందితులను అరెస్టు నగర పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు.. ► కొత్త ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలు ► బ్లూకోల్డ్స్ బైక్స్ ► సాయుధ బలగాల గస్తీ ► పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీస్ ► డైలీ పెర్ఫార్మెన్స్ రిపోర్టు (డీపీఆర్) ► కమ్యూనిటీ పోలీసింగ్ ► {పతి ఠాణాకు ఫేస్బుక్ సౌకర్యం ► {Vూప్ ఎస్ఎమ్ఎస్ సర్వీస్ ► పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఎస్ఎమ్ఎస్ పంపడం ► {Mైమ్ మ్యాపింగ్ ► స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ► ఈవ్‌టీజింగ్ నిరోధానికి షీ-టీమ్స్ ఏర్పాటు ► {పజలు ప్రశాంత జీవనం గడిపేందుకు 24 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగం ► పీపుల్స్ ఫ్రెండ్లీ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ నేటి వరకు 3000 మంది పోలీసులకు దీనిపై శిక్షణ పూర్తి చేసుకున్నారు. ► పేకాట క్లబ్బుల మూసివేత ► క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలానా ► ఠాణాలో సిబ్బందికి పని విభజన ► సేఫ్ కాలనీ ► మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ -
గ్రేటర్ గ్రిడ్ కార్యాచరణేదీ..?
దాహార్తిని తీరిస్తేనే విశ్వనగర ఖ్యాతి జిల్లాలతోపాటే నగరంలోనూ చేపట్టాలి అప్పుడే సత్ఫలితాలు సాధ్యమంటున్న నిపుణులు సీఎం అనుమతికోసం అధికారుల ఎదురుచూపు సిటీబ్యూరో: సర్కార్ లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా నాలుగు కోట్ల పైమాటే. అందులో కోటి జనాభా రాష్ట్ర రాజధాని గ్రేటర్ పరిధిలోనే ఉంటుంది. కోటి మంది జనాభా దాహార్తి తీరిస్తేనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు సగం విజయవంతమైనట్టేనని నిపుణులు అంటున్నారు. మహానగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్.. గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తేనే రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడుతుందని, తద్వారా ఈ పథకం సాకారమై నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషిస్తుండడం విశేషం. ఆర్‌డబ్ల్యూఎస్‌తోపాటే చేపడితేనే సత్ఫలితాలు.... ఔటర్ రింగ్‌రోడ్డు లోపల సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను జలమండలి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ మేరకు జలమండలి రూ.13,495 కోట్ల అంచనాతో నగరంలో ప్రతి ఇంటికీ మంచినీళ్లిచ్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై కార్యాచరణ మొదలు పెట్టేందుకు సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)కు అప్పగించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాల్లో గ్రిడ్ పనులపైనే ప్రధానంగా దృష్టిసారించడంతో గ్రేటర్‌పై తాత్కాలికంగా ప్రతిష్టంభన నెలకొంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల మధ్యనున్న మహానగరానికి నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లా గ్రిడ్ పనులతోపాటే మొదలుపెడితేనే సర్కార్ ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. జాప్యం జరిగితే వ్యయ అంచనాలు భారీగా పెరిగి సర్కార్‌కు ఆర్థికంగా గుదిబండగా మారే ప్రమాదం ఉందని వారంటున్నారు. విశ్వనగరానికి గ్రిడ్ అవసరం... గ్రేటర్ పరిధిలో ప్రతి వ్యక్తికి నిత్యం 135 లీటర్ల చొప్పున (తలసరి నీటిలభ్యత) తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలి. లేకుంటే విశ్వనగర ఖ్యాతి అందుకోవడం కష్టమే. కృష్ణా మూడోదశతోపాటు నాలుగో దశ కూడా అవసరం. గోదావరి, కృష్ణా జలాలతో మహానగరంలో ప్రతి ఇంటికీ పుష్కలంగా తాగునీటిని అందించడం కష్టమేమి కాదు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రిడ్ పనులతోపాటు గ్రేటర్‌గ్రిడ్ పనులను తక్షణం మొదలుపెడితేనే రెండింటి మధ్య సమన్వయం ఉంటుంది. - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ -
5 కేసీఆర్!
లక్ష్యం రూ.5 వేల కోట్లు అనే దాన్ని సంక్షిప్తంగా ఆంగ్లంలో TR (అంటే టార్గెట్) 5K ఇట - ప్రయారిటీ ప్రోగ్రామ్స్.. .. అంటూ పేర్కొన్నారు. దీన్ని సంక్షిప్తంగా వాడుకలో 5 కేసీఆర్‌గా వ్యవహరిస్తున్నారు. 5K Cr అంటే 5000 కోట్లు లక్ష్యమన్నమాట. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం.. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం.. ఇది ప్రభుత్వం తరచూ చెబుతున్న మాట. దాన్ని సాధించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరం. నగరానికి సంబంధించినంతవరకు జీహెచ్ఎంసీ ఆదాయమే పెద్ద దిక్కు. విశ్వనగరంలో భాగంగా అంతర్జాతీయస్థాయి రాచబాటలు.. నింగినంటే బహుళ అంతస్తుల భవనాలు.. ఆకాశమార్గాల్లో జంక్షన్లు.. తదితర సదుపాయాలు అందుబాటులోకి తేవాలంటే కోట్లాది నిధులు కుమ్మరించాలి. వీటికి నిధులిచ్చేది ప్రభుత్వమే అయినా స్థానిక సంస్థగా వీలైనన్ని నిధులు రాబట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ భావించారు. ప్రజలపై అదనపు భారం మోపకుండా.. కొత్త పన్నులేవీ విధించకుండా.. ఎక్కువ నిధులు ఎలా సాధ్యమో ఆలోచించారు. ఆయా విభాగాల వారీగా పరిశీలనలు చేసి.. ఏ విభాగం నుంచి ఎన్ని నిధులు వసూలయ్యేందుకు వీలుంటుందో పరిగణనలోకి తీసుకున్నారు.. వాటిపై కసరత్తు చేసి ఒక అంచనాకు వచ్చారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు ఆదాయమార్గాలపై శ్రద్ధ చూపితే.. కొంత ఎక్కువ కష్టపడితే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.5 వేల కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరవచ్చని అంచనా వేశారు. దాన్ని సాధించేందుకు తరచూ అధికారులు, ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలంటే ఆయా పన్నులను వసూలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా ఏయే విభాగాల ద్వారా ఎన్ని నిధులు వచ్చే అవకాశముందో సంక్షిప్తంగా వివరిస్తూ ఒక లేఖ రూపొందించారు. లక్ష్యాన్ని సాధించేందుకుగాను ఆయా విభాగాల ఉన్నతాధికారులకు, జోనల్, డిప్యూటీ కమిషనర్లకు దాన్ని పంపించారు. టార్గెట్‌ను చేరుకోవడంతోపాటు చేపట్టాల్సిన ప్రజాసదుపాయాల గురించీ సదరు లేఖలో పొందుపరిచారు. టార్గెట్‌లో భాగంగా ఆస్తిపన్నుతోపాటు ట్రేడ్ లెసైన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు, వినోదపన్ను, వృత్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ ఫీజులు, తదితరమైన వాటిని ప్రస్తావించారు. చేయాల్సిన పనుల్లో స్లమ్ ఫ్రీసిటీ, గ్రీన్ హైదరాబాద్, లేక్ ప్రొటెక్షన్ తదితర కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఇదండీ 5 కేసీఆర్ కథాకమామిషు ఆదాయం పెంచుకునేందుకు చేసిన సూచనల్లో కొన్ని.. * జీహెచ్ఎంసీ డేటాబేస్ మేరకు ఆస్తిపన్ను జాబితాలో 1.50 లక్షల నివాసేతర(వాణిజ్య) భవనాలున్నాయి. వీటన్నింటికీ ట్రేడ్ లెసైన్సులివ్వడం ద్వారా ఫీజులు వసూలు చేయాలనేది లక్ష్యం. ఇలాంటి భవనాల వారందరికీ నోటీసులిచ్చి ఈనెలాఖరులోగా ట్రేడ్ లెసైన్సులు జారీ చేసి, డిసెంబర్ నెలాఖరులోగా ఫీజులు వసూలు చేయాలనేది యోచన. * టీఎస్ఎస్పీడీసీఎల్ గణాంకాల మేరకు గ్రేటర్లో 4.50 లక్షల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లున్నాయి. అంటే ఇవన్నీ వ్యాపార సంస్థలే. ఇవన్నీ ట్రేడ్ లెసైన్సులు పొందాల్సి ఉందని కమిషనర్ గుర్తించారు. సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులకు ఈ వివరాలందజేయాలని నిర్ణయించారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇలాంటి వాటన్నింటినుంచి ట్రేడ్‌లెసైన్సు ఫీజు వసూలు చేయాలనేది లక్ష్యం. తద్వారా జీహెచ్ఎంసీకి ట్రేడ్ * ప్రకటనల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.25 కోట్లుండగా, ఇది రూ.100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. * ప్రధాన రహదారుల వెంబడి ఉన్న భవనాలను మరోమారు తనిఖీలు చేసి.. వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, నివాస భవనాల జాబితాలోనే ఉన్నవాటిని గుర్తించి వాటికి వాణిజ్య భవనాల కనుగుణంగా ఆస్తిపన్ను విధించాలని భావించారు. * జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 160 సినిమాహాళ్లున్నాయి. వీటన్నింటి నుంచి 20 శాతం వినోదపన్నుగా జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. కానీ.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువ చూపుతూ.. టిక్కెట్ల ధరలను తగ్గించి చూపుతూ వీలైనంత వరకు జీహెచ్ఎంసీకి చెల్లించే వాటాలో కోత విధిస్తున్నాయి. వీటిని గాడిలో పెడితే కోట్ల రూపాయల ఆదాయం రాగలదని అంచనా. అలాగే ఇతరత్రా వినోద కేంద్రాలు సైతం లక్షలాదిరూపాయలు ఆర్జిస్తున్నా, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన వినోదపన్నును చెల్లించడం లేదు. అలాంటి వాటన్నింటినీ గుర్తించి, రావాల్సిన పన్నును వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. * ఇలా వివిధ మార్గాల ద్వారా రూ.5 వేల కోట్లు (అంటే 5ఓ ఇట ) లక్ష్యంగా నిర్దేశించడంతోపాటు ఎక్కువ పన్నులు వసూలు చేసే సిబ్బందికి రెట్టింపు ప్రోత్సాహకాలనూ ప్రకటించారు. -
గ్లోబల్ సిటీగా హైదరాబాద్
►రక్షణకు ప్రత్యేక చర్యలు ►జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ►‘పబ్లిక్ సేప్టీ ►ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’పై సదస్సు ►హాజరైన వివిధ శాఖల అధికారులు సనత్‌నగర్: ‘మన నగరం-మన రక్షణ-మన బాధ్యత’ నినాదంతో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రతి సిటిజన్ రక్షణ బాధ్యత తనదిగా భావించే విధంగా వినూత్న కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో గురువారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్-2013 అండ్ రూల్స్-2014’పై వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పట్టణ ప్రణాళికాధికారులు, అగ్నిమాపక, ఎక్సైజ్, ఆర్టీసీ, విద్యాశాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొని పబ్లిక్ సేప్టీ కోసం తీసుకోవాల్సిన అంశాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధికారులు మాట్లాడుతూ.. నగరంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ఫైరింజన్ కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, చాలా వ్యాపార, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవన్నారు. నిర్మాణ అనుమతుల సందర్భంలోనే రక్షణకు సంబంధించి అన్ని కోణాలను పరిశీలించాలని నిర్ణయించారు. పోలీసింగ్ వ్యవస్థ నిఘాతో పాటు నగరంలోని ప్రజల భద్రతపై పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాలన్నారు. ఆర్టీసీపరంగా ఎంజీబీఎస్, జూబ్లీ, పికెట్‌తో పాటు ఐటీ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రోనాల్డ్ రోజ్, సత్యనారాయణతో పాటు డిప్యూటీ కమిషనర్లు సోమరాజు, విజయ్‌రాజ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని అధునాత సేఫ్టీ పరికరాలు ఆకట్టుకున్నాయి. ►‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ కింద నగరంలో ముందస్తుగా లక్ష కెమెరాల ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ►చిన్నచిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్ వరకు లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యం తీసుకురానున్నారు. రహదారులు, పబ్లిక్ ప్రాంతాలు, కూడళ్లలో ప్రభుత్వం తరుపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ►తాగి అల్లరి చేసేవారి ఆట క ట్టించేందుకు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగేందుకు ఆస్కారం లేకుండా చేయనున్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అవకాశాల స్వర్గంగా ఆధునిక హంగులు సొంతం చేసుకోనున్న మన జిల్లా త్వరలోవిశ్వ విపణిలో ఆధునిక నగరాల సరసన చేరనుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతుంది. గ్లోబల్‌సిటీగా మలచాలనే కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. షాంైఘై, చండీగఢ్ సిటీల తరహాలో పక్కా ప్రణాళికతో నగర శివార్లను అభివృద్ధిచేసే దిశగా అడుగులు వేస్తోంది. చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్ మురికి మయంగా తయారుచేసిన గత పాలకుల నిర్వాకాలకు భిన్నంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఘట్కేసర్, శామీర్‌పేట ప్రాంతాల్లో మధ్యస్థ విమానాశ్రయాలు, రేడియల్ రహదారులు, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు నూతన కారిడార్లు, మౌలిక వసతులు ఇలా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్గనిర్దేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా రానున్న ఐదేళ్లలో మూడు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న సర్కారు.. అందుకనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా జిల్లాలోని రెండు వేల చిన్ననీటి పారుదల చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. రీజినల్ రింగ్‌రోడ్డు: ప్రస్తుతం ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతల రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి 60-70 కిలోమీటర్ల దూరంలో నగరాన్ని చుట్టుతూ ఈ రోడ్డు నిర్మితమవుతుంది. రెండు రింగ్‌రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మలచాలని సర్కారు యోచిస్తోంది. ఫార్మా, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిధి అంతటికీ ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించారు. రెండు ఎయిర్‌పోర్టులు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికితోడు జిల్లాలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో శివార్లు శరవేగంగా అభివృద్ది చెందుతాయని అంచనా వేసిన సర్కారు.. శామీర్‌పేట, ఘట్కేసర్ ప్రాంతాల్లో మధ్యతరహా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు భూసేకరణపై దృష్టి సారించింది. కనెక్టివిటీ: కొత్త పరిశ్రమల స్థాపన, నగరీకరణ ఇక పూర్తిగా ఔటర్ రింగ్‌రోడ్డు బయటే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలను మెరుగు పరచనుంది. దీనికి కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)ను విస్తరించాలని నిర్ణయించింది. శివారు ప్రాంతాలకు ఈ రైళ్లను పొడిగించడం ద్వారా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పారిశ్రామికవాడలు: పారిశ్రామిక అవసరాలకు జిల్లా యంత్రాంగం 19వేల ఎకరాలను సిద్ధం చేసింది. క్లస్టర్లుగా పరిశ్రమలను నోటిఫై చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్త సంస్థలకు కేటాయించేందుకు వీలుగా భూదాన్ యజ్జబోర్డు, సీలింగ్, యూఎల్సీ భూములతో ల్యాండ్‌బ్యాంకును తయారు చేస్తోంది. -
గ్లోబల్‌కి Welcome
ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ కాలేజీ. మరో మూడు గంటల్లో పరీక్ష హాలుకు వెళ్లాల్సిన వాళ్ల చేతుల్లో పుస్తకాలు. అక్కడి వాతావరణం నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఆ పక్కనే పచ్చిక మైదానంలో కొంతమంది స్టూడెంట్స్ హాట్‌హాట్‌గా డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన పీహెచ్డీ స్టూడెంట్ సునీతగౌరీ కాస్త ఆసక్తిగా టాపిక్‌లోకి ఇన్వాల్వ్ అయింది. ఆమెను చూసి అంతా స్నేహపూర్వకంగా విష్ చేశారు... సునీత: ఏంటీ టాపిక్? హాట్ హాట్ డిస్కషన్. జ్యోతి: కమ్... కమ్... ఇంట్రస్టింగ్ టాపిక్కే... గ్లోబల్ సిటీ. సునీత: గ్లోబల్ సిటీ అయితే లాభమా? నష్టమా? శ్రావణ్: లాభనష్టాలు కాదు. అయితే ఎట్లుంటది! సిటీ మొత్తం మారిపోతది కదా! మన క్యాంపస్కొచ్చే వరకూ వైఫై... అసలు జర్నీ చేసినమా అనేది తెల్వదు! కల్చర్ మొత్తం చేంజ్ అయితది. పవన్: అంత చేంజ్ రావాలంటే జనం సహకరించాలి కదా. పృథ్వీ: సింగపూర్, యూకే.. ఇలా చాలాచోట్ల గ్లోబల్ సిటీస్ సక్సెస్ అయ్యాయి. క్విక్ చేంజ్ వచ్చింది. మన హైదరాబాద్కేం తక్కువ. సునీత: ఏం తక్కువ కాదు. కానీ అక్కడ సిస్టమ్ ఉంటుంది. రూల్స్ ఎవరూ అతిక్రమించరు. ఇక్కడిలా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉండదు. అంటే... ముందుగా మౌలిక వసతులు మెరుగుపడాలి. పబ్లిక్‌లోనూ మార్పు వస్తే... సింగపూర్ ఏం ఖర్మ... సింగపూర్‌కే హైదరాబాద్‌ను మోడల్ చేయొచ్చు. సమీర: అక్కడి దాకా ఎందుకు... ముంబై, చెన్నై, బెంగళూరు చూడండి. అక్కడ బస్టాప్‌లు రోడ్డు పక్కకు ఉంటయి. అక్కడే బస్సులు ఆగుతయి. మన సిటీలో ఎక్కడబడితే అక్కడే ఆగుతయి. దీన్ని గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకోవాలి. పవన్: అవును అందుకే పొలిటికల్ లీడర్స్ మారాలి. అడ్మినిస్ట్రేషన్‌లో పొలిటీషియన్స్ జోక్యం తగ్గితే మార్పు వస్తుంది. సిటీలో సవాలక్ష సమస్యలున్నయి. వాటి మీద దృష్టి పెట్టాలి. బాలుమహేష్: అందుకే గ్రీనరీని కాపాడాలమ్మా. మన చిన్నప్పటి నుంచి చెట్ల గురించి చదువుకుంటున్నం. ఒక్కసారన్న పాటించినమా? ఎంతసేపూ చదువులు, ర్యాంకులు! దీన్ని గ్లోబల్ సిటీ చేయాలంటే యూత్‌పైనే బాధ్యత ఎక్కువ ఉంది. జ్యోతి: బాబూ! ఈ సిటీని చూడ్డానికి ఎక్కడెక్కడి దేశాల వాళ్లో వచ్చారు. నిజాం కాలం నాటి హైదరాబాద్‌ను మోడల్‌గా తీసుకొనే వాళ్లట. మనలను చూసే వాళ్లు గ్లోబల్ సిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలేదు. ఉన్న కట్టడాలు రక్షించుకుని, పరిసరాలు కాపాడుకుంటే అదే పదివేలు. అరే... ఒక్కసారి చార్మినార్‌కు పొయి చూడుర్రి. దాని చుట్టూ వెహికల్స్ రొద. అందమైన కట్టడం చరిత్ర మసకబారుతోంది. ఇట్లయితే గ్లోబల్ సిటీ మాటెట్లున్నా, చార్మినార్‌ను ఫ్యూచర్లో గూగుల్‌లో సెర్చ్ చేసి చూసుకోవాల్సొస్తది. సమీర: అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా? మరి స్లమ్స్‌లో ఉండే వాళ్ల పరిస్థితి ఏంది? లక్ష్మణ్: సిటీలో చదువుకోవడానికి ఇబ్బంది లేదు. ఉద్యోగాలే సమస్య. దాంతో బాగ చదువుకున్నోళ్లు ఇతర దేశాలకు వెళ్తున్నారు. గ్లోబల్ స్థాయిలో హైదరాబాద్‌ను తీసుకెళ్తే మనోళ్లు దేశాలు పట్టుకు తిరిగే సమస్య ఉండదు కదా! దానికోసం సిటీని పూర్తిగా మార్చాలి. శ్రావణ్: అదెలా సాధ్యం? కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వరకూ అంతా కలిసిపోయింది. ఎలా వేరు చేస్తారు. పృథ్వీ: ఎనీ హౌ... గ్లోబల్ సిటీగా మార్చాలనే నిర్ణయానికి వెల్కం చెబుదాం. దాంతో పాటే పబ్లిక్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ కూడా కావాలి. అదే విధంగా కామన్ మ్యాన్‌కి కూడా ఇది నా సిటీ అనే భావన ఉండాలి. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తేవాలనే ఆలోచన రావాలి. లక్ష్మణ్: వస్తుంది. సిటీ కొన్నేళ్లకయినా మారుతుంది. మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ సమస్యలు ఇలా ఉంటాయా? గ్లోబల్ ఎఫెక్ట్ వస్తే లుక్ ఇలా ఉంటుంది. సునీత: ఏ మార్పు వచ్చినా... మన కల్చర్ మాత్రం పాడవ్వకుండా ఉండాలి బాబూ! లెట్స్... గో.