ముంబై: డేటా సెంటర్ల పరిశ్రమలోకి వచ్చే ఆరేళ్ల కాలంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీంతో మరో 5,000 మెగావాట్ల సామర్థ్యం డేటా సెంటర్ల పరిశ్రమలో ఏర్పాటవుతుందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ఆరు రెట్లు పెరగనుందని, మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డేటా సెంటర్లలో విప్లవాత్మక మార్పునకు స్థానికంగానే డేటా నిల్వ నిబంధనను కారణంగా పేర్కొంది. గడిచిన కొన్నేళ్లలో అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్ సహా ఎన్నో కంపెనీలు డేటా సెంటర్ల వ్యాపారంపై ప్రకటనలను ఈ నివేదిక ప్రస్తావించింది.
దేశంలో డిజిటల్ విప్లవానికి ఇంటర్నెట్, మొబైల్ వినియోగం విస్తరణ, ప్రభుత్వ ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, నూతన టెక్నాలజీల అమలు, సోషల్ మీడియా, ఈకామర్స్, ఓటీటీల విస్తరణ తదితర అంశాలు దోహదపడినట్టు ఇక్రా తెలిపంది. దీనికితోడు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విద్యుత్ అందించడం, స్టాంప్ డ్యూటీలో రాయితీలు తదితర నియంత్రణపరమైన అనుకూల విధానాలు పెట్టుబడులు రావడానికి దోహదం చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యంలో 70–75 శాతం ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్‌లోనే ఉన్నట్టు తెలిపింది. డేటా సెంటర్ల పరిశ్రమ ఆదా యం 2024–25 వరకు వార్షికంగా 17–19 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment