న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్‌లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు.
భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్‌తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment