Tata Sons Chairman
-
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
ఒడిదుడుకులకు సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్‌లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్‌తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు. -
కొబ్బరినీళ్లు తాగాలంటే అదే చేయమన్నారు - టాటా సన్స్ చైర్మన్
టెక్నాలజీ పరంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఈ రోజు చిల్లర కొట్టులో ఏదైనా వస్తువు కొనాలన్నా.. పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన వస్తువులు కొనాలన్నా డబ్బు జేబులో ఉండాల్సిన అవసరమే లేదు. అంతా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతోంది. వినియోగదారులు మాత్రమే కాకుండా షాప్ ఓనర్లు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ విధానానికి అలవాటు పడిపోతున్నారు, దీంతో డబ్బు తీసుకోవడానికన్నా ఆన్లైన్ విధానానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ 'ఎన్. చంద్రశేఖరన్' తనకు ఎదురైన ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన షేర్ చేసుకున్నారు. చంద్రశేఖరన్ ఉదయం రన్నింగ్‌కి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలనిపించిందని, అయితే కొట్టు పెట్టుకున్న వ్యక్తి డబ్బు తీసుకునే సమయం లేదని, యూపీఐ చేయమని చెప్పినట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023లో వెల్లడించారు. ఇదీ చదవండి: 'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి! నిజానికి దీన్ని బట్టి చూస్తే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా అభివృద్ధి చెందాయనేది ఇట్టే అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో బహుశా యూపీఐ మాత్రమే వినియోగంలో ఉంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ఆటో డ్రైవర్లు కూడా డిజిటల్ పేమెంట్ విధానానికి అలవాటు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్‌లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్‌లైన్, రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్‌తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. -
సీఎం జగన్ ను కలిసిన టాటా సన్స్ ఛైర్మెన్
-
సీఎం జగన్‌ను కలిసిన టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. ఏపీలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం) -
ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం
ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్‌గ్రేడ్ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో చంద్రశేఖరన్ ఈ విషయాలు చెప్పారు. సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్‌ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వివరించారు. అత్యుత్తమ కస్టమర్ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐ–ఎస్ఏటీఎస్లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. -
ఇక టాటావారి ఎయిరిండియా
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021 అక్టోబర్‌లో... గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు. ‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఎస్ఐబీ కన్సార్షియం నుంచి రుణం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు. టాటా వయా న్యూఢిల్లీ టు టాటా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి... ► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు. ► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. ► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది. ► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది. ► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది. ► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు. ► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ. ► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది. ► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి. ► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. ► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది. విమానయానం బలపడుతుంది ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది. – జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం. – ఎయిరిండియా ప్రకటన కొత్త అధ్యాయం ప్రారంభం నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌లైన్‌ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
భారత్‌కు సువర్ణావకాశం
ముంబై: ఏకైక సరఫరా మార్కెట్‌గా చైనాపై ప్రపంచం అధికంగా ఆధారపడడం కరోనా తర్వాత తగ్గిపోతుందని, ఇది భారత్‌కు మంచి అవకాశమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గ్రూపు కంపెనీ టీసీఎస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆన్లైన్లో నిర్వహించగా.. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) విధానానికి మారుతోందని.. టీసీఎస్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. చైనాతోపాటు మరో 50 దేశాల్లో టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా దేశాల్లోని ఉద్యోగులను స్థానిక ప్రాజెక్టులతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులకూ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏజీఎంలో వాటాదారులు వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించగా.. ప్రస్తుతం ఈ విధానానికి మళ్లడం అన్నది ఖర్చుతో కూడుకున్నదంటూ.. కరోనా తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంటి నుంచే పని చేయవచ్చని చంద్రశేఖరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీసీఎస్ కేంద్రాల్లో 25 శాతం మందే పనిచేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఊహించి రాసినవిగా పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సరికొత్త ధోరణిగా పరిగణిస్తూ దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. అనుసంధానం, కంప్యూటర్ పరికరాలే కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. -
టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ
ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ .. తనకు ఆ హోదాపై ఆసక్తేమీ లేదని సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. అసలు టాటా గ్రూప్‌లో ఏ పదవీ తనకు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిస్త్రీ వివరించారు. అంతిమంగా వ్యక్తుల కన్నా సంస్థ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తానని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఆదివారం ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ‘నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను. ఎన్సీఎల్ఏటీ నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. నాకు టాటా సన్స్ చైర్మన్ హోదా గానీ టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌హోదాపై గానీ ఆసక్తేమీ లేదు. అయితే, బోర్డులో చోటు సాధించడం సహా మైనారిటీ షేర్‌హోల్డరుగా హక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాను‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. మిస్త్రీని చైర్మన్‌గా తిరిగి తీసుకోవాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా గ్రూప్.. సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మిస్త్రీ బహిరంగ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు నాలుగేళ్ల క్రితం చైర్మన్ హోదా నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని పునఃనియమిస్తూ ఎన్సీఎల్ఏటీ 2019 డిసెంబర్లో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలు గ్రూప్ సంస్థలు, టాటా ట్రస్ట్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది. ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘మన పరుగు ను కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు. కీలక ముందడుగు..: ‘టాటా కంపెనీల పునర్వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎకోసిస్టమ్... దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ఎకోసిస్టమ్ ఏర్పాటుకు టాటా మోటార్స్... గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి పనిచేస్తుందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘‘టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్ నుంచి చార్జింగ్ వసతుల నెట్వర్క్ విషయమై టాటా మోటార్స్ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్
హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సోమవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో పరిశోధన కోసం ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
గతవారం బిజినెస్
నియామకాలు టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక టీసీఎస్ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్ గోపీనాథన్ ఎంపికయ్యారు. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఎన్.గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. అంచనాల్ని మించిన టీసీఎస్ దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ తెలిపింది. విమానాల్లో... మహిళలకు మాత్రమే!! ఎయిర్ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇది దేశీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఎయిర్‌బస్ ఏ320లో ఎకానమీ క్లాస్‌లోని మూడవ వరుసలో ఉన్న ఆరు సీట్లను జనవరి 18 నుంచి మహిళలకు కేటాయించామని ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్ పరిశ్రమలో ఇలాంటి సేవలు ప్రారంభించడం ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్థాన్‌లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన ఎయిర్టెల్... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కస్టమర్ల ఫోన్ నంబర్‌నే బ్యాంకు ఖాతా నంబరుగా కూడా ఉపయోగించుకోవచ్చని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై వార్షికంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలిపారు. 6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే! సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది. మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్లో కొన్ని వస్తువుల బాస్కెట్ ధరను 2016 డిసెంబర్‌తో పోలిస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. వాహన విక్రయాలు ఢమాల్ పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్ డిమాండ్‌ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడయ్యాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్ స్థాయికి పడిపోయాయి. క్షీణించిన వ్యాపార విశ్వాసం దేశంలో వ్యాపార విశ్వాసం క్షీణించింది. 2017 జనవరి–మార్చి క్వార్టర్లో వ్యాపారం మెరుగ్గా వుండబోదన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ విశ్వాసం 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది. నగదు కొరతతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కంపొసైట్ బిజినెస్ ఆప్టిమిజమ్ ఇండెక్స్ 2017 తొలి త్రైమాసికంలో 65.4 వద్ద ఉంది. 2016 జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే సూచీలో 23.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంకు నుంచి మెరుగైన ఫలితాలు గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29% అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది. ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,708 కోట్లు దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు (గైడెన్స్) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది. ఈ నెల 23 నుంచి బీఎస్ఈ ఐపీఓ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. రూ.1,500 కోట్లు సమీకరిస్తుందన్న అంచనాలున్న ఈ ఐపీఓ ఈ నెల 25న ముగుస్తుంది. వచ్చే నెల 3న బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా బీఎస్ఈలో వాటాలు ఉన్న సంస్థలు 1.54 కోట్లషేర్లను (దాదాపు 30 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఈ షేర్ ధర గరిష్టంగా రూ.500 ఉండొచ్చని అంచనా. డిసెంబర్లో ఎగుమతులు పైకే ట్రంప్ ఎన్నికతో అనిశ్చితిని, దేశీయంగా డీమోనిటైజేషన్ను ఎదుర్కొని మరీ దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లోనూ వృద్ధి దిశగా పయనించాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతం వృద్ధితో 23.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం స్వల్పంగా 0.46 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. 2015 డిసెంబర్లో వాణిజ్య లోటు 11.5 బిలియన్ డాలర్లుగా ఉండగా... గత డిసెంబర్లో వాణిజ్య లోటు 10.36 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. డీల్స్.. డీపీ వరల్డ్ గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. పోర్ట్, లాజిస్టిక్స్ రంగంలో దశలవారీగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయేమ్ పేర్కొన్నారు. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సర్వీసుల రంగంలో మరో కన్సాలిడేషన్ డీల్‌కు తెరతీస్తూ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్, హౌసిం గ్డాట్కామ్ సంస్థలు విలీనం కానున్నాయి. తద్వారా దేశీయంగా అతి పెద్ద ఆన్లైన్ రియల్టీ సేవల సంస్థ ఆవిర్భవించనుంది. ఇది వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం 55 మిలియన్ డాలర్లు సమీకరించనుంది. అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం, మెక్‌డొనాల్డ్.. చైనా, హాంగ్‌కాంగ్ వ్యాపారానికి సంబంధించి నియంత్రిత వాటాను విక్రయించింది. ఈ వాటాను 208 కోట్ల డాలర్లకు చైనా ప్రభుత్వ సంస్థ సిటిక్, కార్లైల్ గ్రూప్‌కు అమ్మేశామని మెక్‌డొనాల్డ్ తెలిపింది. -
టాటా సన్స్ చైర్మన్‌గా ఆర్నాబ్ గోస్వామి?
న్యూఢిల్లీ: ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానెల్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న ఆర్నాబ్ గోస్వామికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా, ఫాలోవర్లు మాత్రం పుంఖానుపుంఖంగా ఉన్నారు. ఆర్నాబ్ తన పదవికి రాజీనామా చే సినట్లు వార్త వెలువడగానే ఆగమేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన రీతిలో ట్వీట్లు చేశారు. స్వీట్లు పంచారు. ‘ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్ చైర్మన్ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్ నిష్క్రమణతో టైమ్స్ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్లో, నేడు టైమ్స్ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్ఎమ్మెస్ పోల్ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?..... ‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్కో మారేగా హర్ ఛానెల్ సే ఏక్ ఆర్నాబ్ నిక్లేగా.....ఆర్నాబ్ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్ నుంచి పాత న్యూస్ అవర్ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి. ఆర్నాబ్ గోస్వామి రాజీనామా గురించి తానుగానీ, టైమ్స్ నౌగాని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత్ మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కనుక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని....తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ మీడియా చానెల్ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగులుతున్నాయి. Arnab Goswami 'resigns' from Times Now. To start his own venture. After being one unofficially. He will now officially become S.C. Judge. — Sorabh Pant (@hankypanty) 1 November 2016 Arnab the new Chairman of Tata Sons? — ClooneyOfKerala (@sidin) November 1, 2016 -
మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్ మిస్టరీ!
బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం చెప్పపెట్టకుండా తొలగించిన టాటా గ్రూప్ కారణమిదే అంటున్న ఇన్సైడర్లు దేశ కార్పొరేట్ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన.. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడం.. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీని... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే సాగనంపారు. దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా అర్ధంతరంగా, అత్యంత అగౌరవమైనరీతిలో ఎందుకు తొలగించారు. మిస్త్రీని తొలగించడానికి కారణమైన సోమవారం నాటి బోర్డ్ మీటింగ్‌లో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఒక జాతీయ మీడియా చానెల్ తన ఎక్స్‌క్లూజివ్ కథనంలో వివరించింది. ఆ వివరాలివి.. సాధారణంగా టాటా సన్స్ బోర్డ్ సమావేశాలు ప్రశాంతంగా ఒకింత ఊహించేరీతిలోనే జరుగుతాయి. కానీ సోమవారం నాటి భేటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ భేటీలోనే సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించాలన్న షాకింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ ఘటన గురించి విశ్వసనీయంగా తెలిసిన ఇద్దరు కంపెనీ ఇన్సైడర్లు (ఒకరు ఈ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారు కూడా) అసలు ఏం జరిగిందో వివరించారు. మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్‌లో గందరగోళంతోపాటు అసాధారణ దృశ్యాలు కనిపించాయని వారు వివరించారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని తెలుస్తోంది. ఇతరత్రా కేటగిరీలో భాగంగా బోర్డు భేటీ ముందుకు వచ్చే అదనపు అంశంగా దీనిని చేపట్టినట్టు ఒక ఇన్సైడర్ తెలిపారు. (టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?) తన తొలగింపు అంశం చర్చకు రావడంతో షాక్ తిన్న మిస్త్రీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అక్రమమని మండిపడ్డారు. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇచ్చిన తర్వాత బోర్డు ఎదుట దీనిపై చర్చించాలని, అప్పుడు తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నట్టు బోర్డు ఆయనకు స్పష్టం చేసింది. ఆ న్యాయసలహా తనకు చూపించాల్సిందిగా మిస్త్రీ డిమాండ్ చేయగా.. ఇదేమీ కోర్టు హియరింగ్ కాదంటూ తోసిపుచ్చింది. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయాలని మిస్త్రీ నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టాటా సన్స్ బోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. అయితే, టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు కారణం ఏమిటన్న దానిపైనా ఇన్సైడర్లు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారని చెప్తున్నారు. టాటా గ్రూప్‌లోని ఎన్నో కంపెనీలు ఉండగా మిస్త్రీ సారథ్యంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతా కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. టాటా గ్రూప్ సంప్రదాయ మర్యాదలు పాటించడం కంటే.. అంతర్జాతీయ పద్ధతి అయిన ఒక్కవేటుతో మిస్త్రీని తొలగించడానికి బోర్డు మొగ్గు చూపిందని మరో ఇన్సైడర్ వివరించారు.