టెక్నాలజీ పరంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఈ రోజు చిల్లర కొట్టులో ఏదైనా వస్తువు కొనాలన్నా.. పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన వస్తువులు కొనాలన్నా డబ్బు జేబులో ఉండాల్సిన అవసరమే లేదు. అంతా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతోంది.
వినియోగదారులు మాత్రమే కాకుండా షాప్ ఓనర్లు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ విధానానికి అలవాటు పడిపోతున్నారు, దీంతో డబ్బు తీసుకోవడానికన్నా ఆన్‌లైన్ విధానానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ 'ఎన్. చంద్రశేఖరన్' తనకు ఎదురైన ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన షేర్ చేసుకున్నారు.
చంద్రశేఖరన్ ఉదయం రన్నింగ్‌కి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలనిపించిందని, అయితే కొట్టు పెట్టుకున్న వ్యక్తి డబ్బు తీసుకునే సమయం లేదని, యూపీఐ చేయమని చెప్పినట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023లో వెల్లడించారు.
ఇదీ చదవండి: 'భారత్ ఎన్‌సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి!
నిజానికి దీన్ని బట్టి చూస్తే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా అభివృద్ధి చెందాయనేది ఇట్టే అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో బహుశా యూపీఐ మాత్రమే వినియోగంలో ఉంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ఆటో డ్రైవర్లు కూడా డిజిటల్ పేమెంట్ విధానానికి అలవాటు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment