Chandrasekharan
-
ఉత్సాహంగా టిడ్కో గృహ ప్రవేశాలు
కాకినాడ : టీడీపీ పాలనలో జరిగిన అసంపూర్ణ నిర్మాణాలు, లోపాలను సరిచేసి ప్రైవేటు లేఅవుట్లలో ఉండే బహుళ అంతస్తుల భవనాల తరహాలో రూపుదిద్దుకున్న టిడ్కో గృహాలను శుక్రవారం జిల్లా కేంద్రం కాకినాడలో లబ్ధిదారులకు అప్పగించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి విడత 1,152 మందికి ఇళ్ల పత్రాలు, తాళాలు అప్పగించారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఇళ్లను చూసుకుని లబ్ధిదారులు మురిసిపోయారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్న చొరవ వల్ల లబ్ధిదారుల సొంతింటి కల సాకారమైందన్నారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రూ.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమకూర్చిన రెండు ఉచిత బస్సులను మంత్రి సురేష్ ప్రారంభించారు. అవినీతిపరుడిని వెనుకేసుకొస్తున్న పవన్ టీడీపీ, జనసేన పొత్తుకు ఎలాంటి అజెండా లేదని, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబును పవన్‌కళ్యాణ్ వెనకేసుకురావడాన్ని మంత్రి తప్పుబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలిస్తున్నట్టు చెప్పారు. అమ్మఒడి వంటి ప్రయోజనాలు కల్పించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
కొబ్బరినీళ్లు తాగాలంటే అదే చేయమన్నారు - టాటా సన్స్ చైర్మన్
టెక్నాలజీ పరంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఈ రోజు చిల్లర కొట్టులో ఏదైనా వస్తువు కొనాలన్నా.. పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన వస్తువులు కొనాలన్నా డబ్బు జేబులో ఉండాల్సిన అవసరమే లేదు. అంతా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతోంది. వినియోగదారులు మాత్రమే కాకుండా షాప్ ఓనర్లు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ విధానానికి అలవాటు పడిపోతున్నారు, దీంతో డబ్బు తీసుకోవడానికన్నా ఆన్లైన్ విధానానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ 'ఎన్. చంద్రశేఖరన్' తనకు ఎదురైన ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన షేర్ చేసుకున్నారు. చంద్రశేఖరన్ ఉదయం రన్నింగ్‌కి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలనిపించిందని, అయితే కొట్టు పెట్టుకున్న వ్యక్తి డబ్బు తీసుకునే సమయం లేదని, యూపీఐ చేయమని చెప్పినట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023లో వెల్లడించారు. ఇదీ చదవండి: 'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి! నిజానికి దీన్ని బట్టి చూస్తే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా అభివృద్ధి చెందాయనేది ఇట్టే అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో బహుశా యూపీఐ మాత్రమే వినియోగంలో ఉంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ఆటో డ్రైవర్లు కూడా డిజిటల్ పేమెంట్ విధానానికి అలవాటు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
ఆగ్నేయాసియాకు టాటా స్టీల్ గుడ్‌బై!
ముంబై: లాభసాటిగా లేని వ్యాపారం నుంచి తప్పుకోవాలనే వ్యూహంలో భాగంగా ఆగ్నేయాసియా వ్యాపారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఇదే సమయంలో దేశీ వ్యాపారంపై ఫోకస్ పెంచినట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాటాదారులకు దీర్ఘకాలంలో లబ్ధి చేకూర్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఎన్సీఎల్టీ ప్రక్రియలో ఉన్న భూషణ్ స్టీల్‌ను సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగమేనన్నారు. ‘‘ఈ కొనుగోలుతో మా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మార్కెట్లో గట్టిపోటీ ఇస్తాం. దీనికోసం కోర్టు ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి ఉంటాం. యూరోపియన్ కార్యకలాపాల పరంగా యాంటీ–ట్రస్ట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ డీల్‌ను పూర్తిచేస్తామనే నమ్మకం ఉంది. బ్రిటిష్ స్టీల్ పెన్షన్ పథకం పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తిచేశాం’’ అని వివరించారాయన. గతనెలలో జర్మనీ స్టీల్ కంపెనీ థిస్సెన్క్రప్తో కుదిరిన జాయింట్ వెంచర్ ద్వారా యూరప్‌లో వ్యయ సమన్వయం, టెక్నాలజీపై దృష్టిసారించినట్లు తెలిపారు. -
తిరుమలలో రతన్‌టాటా, చంద్రశేఖరన్
సాక్షి, తిరుమల : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆదివారం రాత్రి తిరుమల వచ్చారు. ఇక్కడి పద్మావతి గృహాల వద్ద వారికి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో ఈవో, జేఈవోలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే టీటీడీకి ఐటీ పరంగా టాటా సంస్థలకు చెందిన టీసీఎస్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. టీటీడీ భవిష్యత్ అవసరాలు, భక్తుల సౌకర్యాల కల్పనకోసం మరింత సహకారం అందిస్తామని రతన్‌టాటా, చంద్రశేఖరన్ టీటీడీ అధికారులకు హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం వీరు శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
టాటా వెయిట్‌లాస్ చికిత్స!
గ్రూపులో టెక్నాలజీ కంపెనీలన్నీ టీసీఎస్ కిందకు ► ఇన్ఫ్రా కంపెనీలన్నీ మరో కంపెనీగా మార్పు ►గ్రూపు ఆధ్వర్యంలోని కంపెనీల సంఖ్య కుదింపు ► సరిపడని వాటిని విక్రయించడం ► చంద్రశేఖరుడి సారథ్యంలో మొదలైన కసరత్తు ముంబై: ఉప్పు తయారీ నుంచి సాఫ్ట్వేర్ సేవల వరకు ఎన్నో రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా గ్రూపులో మేధోమథనం మొదలైంది. 100కు పైగా కంపెనీలు, ఒకే రంగంలో కూడా ఒకటికి మించి కంపెనీ లు ఉండడంపై గ్రూప్ పునరాలోచనలో పడింది. ఇలా అయితే పర్యవేక్షణ సరిగా ఉండడం లేదన్న అభిప్రాయం యాజమాన్యంలో మొదలైంది. దీనికి పరిష్కారంగా కంపెనీల సంఖ్యను క్రమబద్ధీకరించే పనిలో పడింది. ముందుగా టెక్నాలజీ కంపెనీలను టీసీఎస్ గొడుకు కిందకు తీసుకురావాలనుకుంటోంది. ఈ దిశగా గ్రూపు పునర్వ్యవస్థీకరణపై కార్యాచరణ మొదలైనట్టు స్వయంగా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ ఇటీవల వెల్లడించారు. టీసీఎస్ కిందకు పలు కంపెనీలు టాటా గ్రూపు పునర్వ్యవస్థీకరణ టెక్నాలజీ కంపెనీలతో మొదలు కానుంది. టెక్నాలజీకి సంబంధించి టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలన్నింటినీ టీసీఎస్ కిందకు తీసుకురావాలనేది ప్రణాళిక. ఒకవేళ టీసీఎస్‌లో ఇమడలేని చిన్న కంపెనీలేవైనా ఉంటే వాటిని విక్రయించే ఆలోచనతో ఉంది. కంపెనీలు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ లోపించి పనితీరు మెరుగ్గా ఉండడం లేదన్నది గ్రూపు భావన. అందుకే ఈ దిశగా ఆలోచనలు చేస్తోందన్నది ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం. అయితే, టీసీఎస్‌లో ఏ కంపెనీలను విలీనం చేయాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం మాత్రం జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూపునకు టీసీఎస్ అక్షయపాత్ర లాంటిది. గ్రూపునకు సమకూరే మొత్తం లాభాల్లో మూడింట రెండు వంతులు ఒక్క టీసీఎస్ నుంచే వస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి టాటా ఎలెక్సీ అనే మరో కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉంది. ఇది టెక్నాలజీ ఉత్పత్తుల ఇంజనీరింగ్ సంస్థ. ఇంకా ఈ రంగానికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత లర్నింగ్ ఉత్పత్తులను విక్రయించే టాటా ఇంటరాక్టివ్ సిస్టమ్స్‌తోపాటు టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ పేరుతో ఇంకో కంపెనీ కూడా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ తర్వాత ఇన్ఫ్రా ఇన్ఫ్రా రంగంలోని కంపెనీలను కూడా ఒక్కటిగా చేయాలని టాటా గ్రూపు యోచన. ఏసీలు, ఎయిర్‌కూలర్లను విక్రయించే వోల్టాస్ ఇంజనీరింగ్, నీటిశుద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ సేవలందిస్తోంది. అలాగే, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా ఉంది. ఇది బ్రిడ్జిలు, ఎయిర్ పోర్టుల రంగంలో ఉంది. ఇక టాటా ప్రాజెక్ట్స్ రోడ్లు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ విభాగాల్లో సేవలు అందిస్తోంది. గ్రూపునకు కొత్త కళ 103 బిలియన్ డాలర్ల టాటా గ్రూపు చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఆరంభంలో బాధ్యతలు చేపట్టారు. టీసీఎస్‌ను టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మార్చిన వారిలో ఈయన కూడా ఒకరు. అంతకుముందు టాటా– మిస్త్రీల వివాదంతో గ్రూపు సతమతమయింది. దీనివల్ల టాటా గ్రూపు ప్రతిష్ట కూడా కొంచెం ప్రమాదంలో పడింది. దీంతో టీసీఎస్‌కు బాస్‌గా ఉన్న చంద్రశేఖరన్‌ను చైర్మన్ పదవికి తగిన వ్యక్తిగా యాజమాన్యం ఎంచుకుంది. చేపట్టిన బాధ్యతల్లో తనదైన ముద్రవేసే తత్వం చంద్రది. ఈ తరహా వ్యక్తి కావడంతో టాటా గ్రూపు పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించారు. రాబడుల నిష్పత్తిని పెంచడం, దేశీయ వినియోగంపై దృష్టి సారించడం, టాటా బ్రాండ్లను బలోపేతం చేయడం, కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని రంగాల్లోనూ దూసుకుపోవడం ద్వారా గ్రూపు విలువను పెంచడంపై దృష్టి నిలిపారు. గ్రూపు కంపెనీల్లో కొన్ని ఒకదానిలో ఒకటి వాటాలు కలిగి ఉండగా (క్రాస్ హోల్డింగ్), ఆ వాటాలను ప్రమోటర్లు కొనుగోలు చేయాలనేది ఓ ప్రణాళిక. తాజాగా కంపెనీల క్రమబద్ధీకరణపైనా కరసరత్తు మొదలైంది. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే, ‘‘వేగంగా పరిగెత్తాలంటే లావుగా ఉంటే కుదరదు. సన్నబడాల్సిందే’’ అని చంద్రశేఖరన్ తాజాగా పేర్కొనడం గమనార్హం. నష్టాలతో ఉన్న కంపెనీలతో గ్రూపు విలువను పెంచలేమని కూడా ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా స్పష్టం చేశారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
-
ముగ్గురు సీపీఎం నేతలకు యావజ్జీవం
కోజికోడ్: సంచలనం సష్టించిన టి.పి.చంద్రశేఖరన్ హత్య కేసులో కేరళ సీపీఎంకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సహా 11 మందికి ప్రత్యేక కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష వేసింది. కోజికోడ్ జిల్లాలోని ఓంచియామ్ గ్రామంలో సీపీఎం పెత్తనాన్ని నిరసిస్తూ తిరుగుబాటు చేసి రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ నెలకొల్పిన చంద్రశేఖరన్ 2012 మే 4న దారుణంగా హత్యకు గురయ్యారు. ఏడుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆయనపై 51 సార్లు కత్తిపోట్లు పొడిచినట్లు శవపరీక్షలో తేలింది. సీపీఎంకు చాలా కాలం సేవలందించిన నేతను సొంత పార్టీ నేతలే చంపించడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పినరయి విజయన్, అచ్యుతానందన్ వర్గాల మధ్య ఇది పెద్ద వివాదమే రేపింది. కాగా రాజకీయ కారణాలతోనే చంద్రశేఖరన్‌ను హత్య చేశారని జడ్జి అభిప్రాయపడ్డారు. .