
సాక్షి, తిరుమల : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆదివారం రాత్రి తిరుమల వచ్చారు. ఇక్కడి పద్మావతి గృహాల వద్ద వారికి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో ఈవో, జేఈవోలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఇప్పటికే టీటీడీకి ఐటీ పరంగా టాటా సంస్థలకు చెందిన టీసీఎస్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. టీటీడీ భవిష్యత్ అవసరాలు, భక్తుల సౌకర్యాల కల్పనకోసం మరింత సహకారం అందిస్తామని రతన్‌టాటా, చంద్రశేఖరన్ టీటీడీ అధికారులకు హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం వీరు శ్రీవారిని దర్శించుకోనున్నారు.