Tata Sons Chairman Met Andhra Pradesh CM YS Jagan At Tadepalli, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌

Published Wed, Sep 21 2022 7:47 PM | Last Updated on Wed, Sep 21 2022 9:27 PM

Tata Sons Chairman met Andhra Pradesh CM YS Jagan at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా  ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. ఏపీలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్‌, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. 

చదవండి: (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement