విప్లవాత్మక మార్పే ‘గతి శక్తి’ లక్ష్యం: ప్రధాని మోదీ | Transformative initiative aimed at revolutionising India's infrastructure | Sakshi
Sakshi News home page

విప్లవాత్మక మార్పే ‘గతి శక్తి’ లక్ష్యం: ప్రధాని మోదీ

Published Mon, Oct 14 2024 4:50 AM | Last Updated on Mon, Oct 14 2024 4:50 AM

Transformative initiative aimed at revolutionising India's infrastructure

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ‘పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌(పీఎంజీఎస్‌–ఎన్‌ఎంపీ)’లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని పూర్తి చేయడంలో ఈ పథకం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. పీఎంజీఎస్‌–ఎన్‌ఎంపీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మోదీ ‘ఎక్స్‌’వేదికగా ప్రశంసించారు.

 ‘దేశ మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మకంగా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ‘పీఎం గతిశక్తి’ఉద్భవించింది. ఇది మలీ్టమోడల్‌ కనెక్టివిటీని గణనీయంగా మెరుగు పరిచింది, వివిధ రంగాలలో వేగవంతమైన, మరింత ప్రభావవంతమైన అభివృద్ధికి దారితీసింది. వివిధ వాటాదారుల ఏకీకరణతో లాజిస్టిక్‌లకు ప్రోత్సాహం లభించింది. జాప్యాలను తగ్గించింది. చాలా మందికి కొత్త అవకాశాలను సృష్టించింది. గతిశక్తి కారణంగా వికసిత్‌ భారత్‌ అనే మా స్వప్నం సాకారం చేసే దిశలో దేశం వేగంగా ముందుకుసాగుతోంది. ఇది అభివృద్ధిని,, పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement