కార్డియాలజీ విభాగానికి మహర్దశ
కార్డియాలజీ విభాగానికి మహర్దశ
Published Wed, Sep 14 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి మహర్దశ వచ్చింది. ఈ విభాగానికి ఇటీవల రెండు డీఎం కార్డియాలజీ సీట్లు మంజూరైన విషయం విదితమే. ఈ సీట్లలో బుధవారం డాక్టర్ శరత్‌చంద్ర, డాక్టర్ రాజ్‌కుమార్ చేరారు. వీరితో పాటు రెండు రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో డీఎం కార్డియాలజీ కోర్సు పూర్తి చేసి సీనియర్ రెసిడెంట్‌గా డాక్టర్ శ్రీకాంత్ వచ్చారు. ప్రస్తుతం ఈ విభాగంలో హెచ్‌ఓడీ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అలి సేవలందిస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు పీజీలు, ఒక సీనియర్ రెసిడెంట్ రాకతో ఈ విభాగంలో వైద్యసేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా బుధవారం కార్డియాలజీ విభాగంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎం సీట్లు వచ్చేందుకు కషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్‌తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇకపై ఈ విభాగంలో సేవలు మరింత విస్తత పరుస్తామన్నారు. రోగులు, పరికరాలు ఉన్నాయని, ఉన్నతమైన సేవలందించేందుకు ఇదే మంచి అవకాశమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి కంటే మిన్నగా ఇక్కడ వైద్యసేవలు అందించేందుకు కషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఎండోక్రై నాలజిస్టు డాక్టర్ పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement