![Congress leader Son Sridhar Died With Sudden Heart stroke In Khammam Heart attack - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/10/congress-leader-son-sridhar-died-sudden-heart-stroke-khammam-heart-attack.jpg.webp?itok=mJhVRVVc)
సాక్షి, ఖమ్మం: ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. కాగా ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్‌స్ట్రోక్‌తో మరో యువకుడు మరణించాడు.
కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్(31) గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం జిమ్‌కు వెళ్లి వచ్చిన కాసేపటికే శ్రీధర్ ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కొడుకు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. అయితే ఆదివారమే (జులై 9న) శ్రీధర్ సోదరుడు కుమారుడి బారసాల జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రేణుకచౌదరి కూడా హాజరయ్యారు. కాగా రాధా కిషోర్ రేణుకచౌదరికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల వ్యవధిలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదం నింపింది. ఆయన కుటుంబాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు.
చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ!
Comments
Please login to add a commentAdd a comment