Ganesh nimajjanam
-
గణనాథుల భారీ క్యూ.. ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనం (ఫొటోలు)
-
HYD: రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తి: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: రేపు ఉదయంలోగా నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనంపై మంగళవారం(సెప్టెంబర్17) మధ్యాహ్నం సీవీ ఆనంద్ మీడియాకు అప్డేట్ ఇచ్చారు.‘హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్,సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. నిమజ్జనం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం.మండప నిర్వాహకులతో మాట్లాడి త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాం.షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశాం.నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి.నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలని కోరుతున్నాం.మీడియాలో లైవ్ టెలికాస్ట్ చూడాలని కోరుతున్నాం. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్ -
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
ట్యాంక్‌బండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి.. గణేష్ నిమజ్జనం సమీక్ష (ఫొటోలు)
-
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల నిమజ్జనం..ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి (ఫొటోలు)
-
నిమజ్జనానికి అంతా రెడీ: జీహెచ్ఎంసీ మేయర్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సోమవారం(సెప్టెంబర్16) నిమజ్జనంపై సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.’నిమజ్జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఆదేశించాం.ట్యాంక్‌బండ్‌పై క్రేన్స్ ఏర్పాటు చేశాం. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం జరుగుతుంది. నాతోపాటు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వేలసంఖ్యలో సిబ్బంది, అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం’అని మేయర్ చెప్పారు.కాగా, హైదరాబాద్‌లో మంగళవారం(సెప్టెంబర్ 17) నిమజ్జనం జరగనున్న విషయం తెలిసిందే. నిమజ్జనం కోసం పోలీసులు పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్, నాలుగు గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనం..అనుభవాల నుంచి పాఠాలు -
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
కర్నూలులో గణేష నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం
-
తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగలా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..
-
నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు -
HYD: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం లేదు: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఈసారి ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఆయన మీడియాతో మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నిమజ్జన విధుల్లో మొత్తం 18వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలులేదని హైకోర్టు గతేడాదే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల అమలు కోసం ఎన్డీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డులో విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం జరగనుంది. ఇదీ చదవండి.. కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
Tank Bund: ఘనంగా మూడో రోజు వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)
-
టెక్సస్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం
-
Live: హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనం..తగ్గని జోష్
-
కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్
-
సింగర్ల పాటలు..శోభాయాత్రలో డ్యాన్సులు..
-
భక్తితో ప్రాణం పెట్టి పాడారు..!
-
అద్భుతమైన పాటలు..!
-
గణపతి రూపాన్ని మార్చకండి..అన్ని రూపాలకు మూలం గణనాధుడు
-
వేలం పాటలో రూ.1.26 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
-
వరంగల్ లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనంలో సీపీ రంగనాథ్ డాన్స్
-
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
గౌరమ్మ తనయుడు గంగమ్మ ఒడికి
గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. బొజ్జ గణపయ్య భోగభాగ్యాలను కనులారా వీక్షించేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. నగరమే వేదికగా నలుచెరగులా అలరారిన గణేశుని దివ్య మంగళరూపాలను వరుసగా వీక్షించే అరుదైన సందర్భానికి స్వాగతం పలుకుతోంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది. శోభాయాత్ర మార్గాన్ని చార్మినార్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ్మద్ మహమూద్ అలీ బుధవారం ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి పరిశీలించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లను నడపనున్నారు. హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం గురువారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి దాదాపు 19 కిలోమీటర్ల మేర భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. ఇతర వాహనాలకు నో.. ► నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులను తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గం: ● కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్– బషీర్‌బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది: ► ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేది: ► ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతోకలుస్తుంది. ► వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ► నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ► వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ► వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు పార్కింగ్ ఇలా: ► హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ► అవి... ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. రాచకొండ పరిధిలో... ► గురువారం ఉదయం 6 నుంచి 29 రాత్రి 8 గంటల వరకు రాచకొండ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిమజ్జన వాహనాలకు మినహా సాధారణ వెహికిల్స్‌కు సరూర్‌నగర్ ట్యాంక్, సఫిల్‌గూడ, కాప్రా ట్యాంక్, అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులు నిర్మాణంలో ఉన్నందున రామంతాపూర్ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గంలో వచ్చే నిమజ్జన వాహనాలను హబ్సిగూడ స్ట్రీట్‌నం–8 లేదా ఉప్పల్ క్రాస్ రోడ్లో మళ్లించి, సర్వే ఆఫ్ ఇండియా మీదుగా, ఏక్ మినార్ మసీదు, హబ్సిగూడ, తార్నాక మీదుగా వెళ్లాలి. ► బైరామల్‌గూడ నుంచి చంపాపేట, చెంగిచర్ల నుంచి ఉప్పల్, నేరేడ్మెట్ నుంచి సఫిల్‌గూడ, ఆర్కే పురం నుంచి ఈసీఐఎల్, లాలాగూడ టీ జంక్షన్ నుంచి మిర్జాల్‌గూడ వరకు సాధారణ వాహనాలకు, గూడ్స్ వాహనాలకు అనుమతి లేదు. భక్తులు తమ వాహనాలను సరస్వతి శిశు మందిర్, సరూర్‌నగర్ పోస్ట్ ఆఫీసు, ఇందిరా ప్రియదర్శిని పార్క్‌లలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ► నిమజ్జనం పూర్తయిన వాహనాలు ఇందిరా ప్రియదర్శిని పార్క్ మీదుగా సరూర్‌నగర్ పాత పోస్ట్ ఆఫీసు క్రాస్‌రోడ్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్ పోస్ట్ ఆఫీసు వైపున తీసుకోవాలి. సైబరాబాద్ పరిధిలో.. ► బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రెజ్ నుంచి ఎర్రగడ్డ, ఫిరోజ్‌గూడ నుంచి కూకట్పల్లి గోద్రెజ్ వై జంక్షన్, గూడెన్మెట్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్లలో వాహనాలకు అనుమతి లేదు. అశోక్‌నగర్, బీరంగూడ నుంచి వచ్చే వాహనాలు బాచుపల్లి, గండిమైసమ్మ, ఓఆర్ఆర్ వద్ద మళ్లిస్తారు. ► సంగారెడ్డి నుంచి కూకట్పల్లి వైపు వచ్చే వాహనాలను ఓఆర్ఆర్ మీదుగా మళ్లిస్తారు. నిమజ్జన వాహనాలకు ఫతేనగర్ ఫ్లై ఓవర్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్, ఫోరంమాల్ ఫ్లై ఓవర్, బాబూజగ్జీవన్‌రామ్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్ల మీదుగా ప్రవేశం లేదు. హెల్ప్‌లైన్స్ ఏర్పాటు: ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9010203626 లను సంప్రదించవచ్చు. -
నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
ప్రకాశం: మండలంలోని పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు చేశారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్టర్ ట్రక్కులో గణపతి విగ్రహాన్ని ఉంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు వైపులా ఇనుప పైపులు ఉంచి డెకరేషన్ చేశారు. గ్రామోత్సవం అనంతరం పొలాల్లోని నీటి గుంటల్లో నిమజ్జనం చేసేందుకు పొలాల బాటలో వెళుతుండగా విద్యుత్ తీగలు డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురవడంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా కిందకు దిగారు. ప్రమాదంలో చమిడిశెట్టి శ్రీను(35), తడకమల్ల నాగేంద్రం (11) విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పడంతో వెంటనే వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడు శ్రీనుకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. నాగేంద్రం 8వ తరగతి చదువుతున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం దేవకుమార్ తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటాం పొట్లపాడులో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పార్టీలో చురుకై న పాత్రను శ్రీను పోషించాడని, ఒక కార్యకర్తను పోగొట్టుకోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉండి శ్రీను లేని లోటును తీర్చుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్.సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కండె గంగయ్య, దర్శి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల కాశయ్య, నాయకులు ఉన్నారు. -
వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ..
కరీంనగర్‌రూరల్: ఎనిమిది రోజులపాటు వినాయకుడికి నిష్టతో రెండుపూటల పూజలు చేసిన ఓ పూజారి నిమజ్జనోత్సవం బుధవారం రాత్రి చివరిపూజచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన తిరువరంగం పాపయ్యశాస్త్రి(45) పూజారిగా పనిచేస్తున్నాడు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చెర్లభూత్కూర్‌లోని వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నాడు. చివరిరోజు బుధవారం రాత్రి వినాయకుడి పూజలు పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై ఇరుకుల్లకు బయల్దేరాడు. చెర్లభూత్కూర్ నుంచి మొగ్ధుంపూర్ రోడ్డుపైకి వచ్చిన ఆయన వెహికిల్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వనజ, కుమారుడు భరద్వాజ్, కూతురు హోత్రి ఉన్నారు. -
Ganesh Nimajjanam Photos: హుస్సేన్ సాగర్ లో గణేషుడి నిమజ్జనం (ఫొటోలు)
-
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం సందడి
-
Ganesh Nimajjanam 2023 Photos: ఘనంగా వినాయక నిమజ్జనాలు.. భక్తుల సందడి (ఫోటోలు)
-
నిమజ్జనం.. మరింత వేగవంతం!
హైదరాబాద్: గణేష్ నవరాత్రుల్లో అత్యంత కీలక ఘట్టం సామూహిక నిమజ్జనం. దీనికోసం పోలీసులు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దాదాపు మధ్య మండలం మొత్తాన్నీ సాధారణ వాహనాలకు ‘నో ఎంట్రీ జోన్’గా మారుస్తారు. ఈ కారణంగానే ఈ క్రతువును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మరో టెక్నిక్‌ను అమలులోకి తెస్తున్నారు. విగ్రహం ఉంచే ప్లాట్‌ఫామ్ కింద ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్, మధ్యమండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లుతో పాటు ఇతర ఉన్నతాధికారులు దీన్ని శనివారం రాత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పడేసే పని ఉండదు... మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వాహనాల్లో హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకువస్తారు. అక్కడ నిమజ్జనం కోసం సిద్ధం చేసి ఉంచిన క్రేన్ల ప్లాట్‌ఫామ్ పైకి వీటిని ఎక్కిస్తారు. సాగర్ నీటి ఉపరితలం వద్దకు చేరిన తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌పై ఉండే సిబ్బంది విగ్రహాన్ని నీళ్లల్లోకి తోస్తారు. కొన్ని సందర్భాల్లో విగ్రహం ప్లాట్‌ఫామ్ వైర్‌కు పట్టుకోవడం, దాన్ని తప్పించి నీళ్లల్లో వేయడం జరుగుతుంటుంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసులు గడిచిన ఆరేళ్ల నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హుక్‌ను వాడుతున్నారు. ఈసారి దానికంటే వేగంగా నిమజ్జనం పూర్తి చేయడానికి మరో కొత్త విధానం అవలంబించనున్నారు. ప్లాట్‌ఫామ్‌కు కింద ప్లాస్టిక్ డ్రమ్స్... ఈ విధానంలో భాగంగా విగ్రహాలను ఉంచే ప్లాట్‌ఫామ్‌కు కింది వైపు ఓ పక్కన ఒకటి లేదా రెండు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఉన్న విగ్రహాన్ని నీటి ఉపరితలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత ప్రత్యేకంగా నీటిలోకి వేయాల్సిన అవసరం ఉండదు. క్రేన్ ఆపరేటర్ ప్లాట్‌ఫామ్‌ను కిందికి దించితే సరిపోతుంది. ఽఖాళీ డ్రమ్ము ఉన్న భాగం పైకి ఉండిపోయి.. మరోవైపు కిందికి వెళ్తుంది. ఫలితంగా ప్లాట్‌ఫామ్ పైన ఉన్న విగ్రహం ఆ వైపునకు పడిపోతుంది. ఈ విధానంగా నిమజ్జనం ఎవరి ప్రమేయం లేకుండా సాధారణ సమయం కంటే నాలుగు నుంచి ఆరు నిమిషాల ముందే ముగుస్తుంది. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాట్ల పరిశీలన... ట్యాంక్‌బండ్ ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదింది. దీంతో ఈ ఏడాది దానిపై అవసరమైన సంఖ్యలోనే క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ఎత్తు లేకుండా మధ్యస్తంగా ఉన్న వాటినే నిమజ్జనం చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో గతం కంటే ఎక్కువ క్రేన్లు ఉండనున్నాయి. వీటి ద్వారానే పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. సాగర్ చుట్టూ ఉండే అన్ని క్రేన్ల ప్లాట్‌ఫామ్‌లకు ఖాళీ డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. సామూహిక నిమజ్జనం సమీపిస్తుండటంతో అక్కడి ఏర్పాట్లను నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్రేన్ల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపులకు తీసుకుంటున్న చర్యల్లో అనేక మార్పులు చేర్పులను సూచించారు. -
గణేశ్ శోభాయాత్రలో.. డీజే ఆపినందుకు ఒక్కసారిగా.. వ్యక్తిపై కత్తితో దాడి!!
నల్గొండ: గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి మిర్యాలగూడ డీసీఎం యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకన్నపై కత్తితో దాడి చేశాడు. మిర్యాలగూడ పట్ణంలోని వాసవీనగర్‌లో నివాసముంటున్న సుంకరబోయిన వెంకన్న డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శనివారం నిర్వహిస్తున్న శోభాయాత్రలో పాల్గొన్నాడు. వాడపల్లిలో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో పట్టణంలో నిర్వహిస్తున్న శోభాయాత్రలో మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన నాగరాజు కూడా పాల్గొన్నాడు. నాగరాజు గంజాయి మత్తులో డీజేకు అనుగుణంగా నృత్యం చేస్తూ శోభాయాత్రను ముందుకు సాగనివ్వడం లేదు. దీంతో శోభాయాత్ర నిర్వాహకులు డీజేని ఆపి ముందుకు సాగుతున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు వెంట తెచ్చుకున్న కత్తితో వెంకన్నపై దాడి చేశాడు. గమనించిన కొందరు నాగరాజుని అడ్డుకుని గాయపడిన వెంకన్నను ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నను డీఎస్పీ వెంకటగిరి కలిసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
వైరల్ అవుతున్న మహేష్ బాబు కొడుకు, కూతురు వినాయకుడి నిమజ్జనం
-
ట్రాఫిక్ పోలీసుల రూట్ స్టడీ!
హైదరాబాద్: ‘గణేష్ విగ్రహాలతో ఊరేగింపుగా వచ్చే ఒక్క లారీకీ ఆటంకాలు ఏర్పడకూడదు. ఎక్కడా ట్రాఫిక్ జామ్స్‌కు తావుండకూడదు. 29వ తేదీ తెల్లవారుజాము సమయానికే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి రావాలి’ – గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలివి. ఈ నెల 28న జరిగే ఈ క్రతువు కోసం అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణాల వారీగా నిమజ్జనం రూట్లను అధ్యయనం చేస్తూ, మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు నేతృత్వంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, డి.శ్రీనివాస్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల ఎత్తు ఆధారంగా మార్గం... సామూహిక నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో ట్రాఫిక్ అధికారుల పాత్ర కీలకం. ఊరేగింపు మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటంతో పాటు ఆ ప్రభావం మరుసటి రోజు ట్రాఫిక్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వివిధ మార్గాల్లో ఉన్న పాట్‌హోల్స్ మరమ్మతులు, చెట్టు కొమ్మల నరికివేత తదితర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మండపం ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన పత్రంలో విగ్రహం ఎత్తు, నిమజ్జనం జరిగే తేదీ, ప్రాంతం ఉంటున్నాయి. ఈ వివరాలు సేకరించిన ట్రాఫిక్ ఠాణాల వారీగా అధ్యయనం చేస్తున్నారు. సదరు విగ్రహం ఊరేగింపు జరిగే మార్గాల్లో ఉన్న వంతెనలు, వాటి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్డు నుంచి వంతెన ఎంత ఎత్తులో ఉందో దాని కంటే కనిష్టంగా ఐదు అడుగుల తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకే ఆయా రూట్లలో క్లియరెన్స్ ఇస్తున్నారు. ట్రాలీ లేదా లారీ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటూ ఇలా చేయనున్నారు. మిగిలిన వాటికి నిర్ణీత సమయం ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్‌లో హోల్డింగ్ ఏరియా... నిమజ్జనానికి విగ్రహాలను తీసుకువచ్చే ప్రతి వాహనానికీ పోలీసు విభాగం సీరియల్ నెంబర్‌తో కూడిన స్టిక్కర్ ఇస్తుంటుంది. ఈసారి ఇందులో విగ్ర హం ఎత్తును పొందుపరుస్తున్నారు. ఆయా వాహనాలకు ముందు భాగంలో అతికించి ఉండే దీన్ని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాలోని పోలీసు సిబ్బంది పరిశీలిస్తారు. విగ్రహం ఎత్తు ఆధారంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్‌లోని వాటిని పంపిస్తారు. నిమజ్జనం రోజున ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీలున్నంత వరకు 29వ తేదీ తెల్లవారేసరికి నిమజ్జనం పూర్తి చేసి, ఈ రెండు రూట్లను సాధారణ వాహనాలను అందుబాటులోకి తేవాలని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ కొన్ని విగ్రహాల నిమజ్జనం మిగిలి ఉంటే పీవీఎన్ఆర్ మార్గ్‌ను హోల్డింగ్ ఏరియాగా చేసి వాటితో ఉన్న వాహనాలను అక్కడికి పంపిస్తారు. ఆపై ఆ మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న క్రేన్ల వద్ద క్రమపద్దతిలో నిమజ్జనం చేయడుతూ... రెండు మార్గాలను సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోపక్క పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్ మండపాల వద్దకు స్వయంగా వెళ్తున్న నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అక్కడి పరిస్థితులు, మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హుస్సేనిఆలం, కామాటిపుర, మొఘల్‌పురాలో ఆనంద్ పర్యటించారు. తెలుగుతల్లి జంక్షన్ మూసివేతతో.. రాజధానిలో ఎన్ని నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ ఉన్నప్పటికీ... హుస్సేన్‌సాగర్‌కు ప్రత్యేకత ఉంది. బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులోని విగ్రహాలన్నీ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్‌వైపు వస్తాయి. అయితే కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులు, జంక్షన్ల వద్ద కీలక మార్పు చేర్పులు జరిగాయి. తెలుగుతల్లి చౌరస్తా మూసివేతతో పాటు సచివాలయం ముందు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడం, ఎన్టీఆర్ మార్గ్‌లో ఫుట్‌పాత్ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఏడాది నిమజ్జనం ప్రక్రియలో స్వల్పమార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగుతల్లి జంక్షన్ మూసివేత నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా విగ్రహాలతో వచ్చే లారీలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి... ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద యూ టర్న్ తీసుకుని ట్యాంక్‌బండ్ వైపు రానున్నాయి. ఫార్ములా ఈ–రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్లను ట్రాఫిక్ అధికారులు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పీవీఎన్ఆర్ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా పక్కన ఓ నిమజ్జనం ఘాట్ నిర్మించిన అధికారులు అక్కడ అదనంగా మూడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎం వాహనాల్లో వచ్చే మధ్య స్థాయి ఎత్తు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. -
నిమజ్జనం నిరుటి మాదిరే
సాక్షి, సిటీబ్యూరో: వినాయకచవితి పండగ సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడి వారు అక్కడే తమకు దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా కొలనులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీ నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనులతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనుల్ని నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనుల్ని బేబీపాండ్స్గా వ్యవహరిస్తున్నారు. నిర్వహణలేక వ్యర్థాలతో నిండిపోయిన బేబిపాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు. -
హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాల ఏర్పాటు
-
తీన్మార్ డ్యాన్సులు, స్టెప్పులతో గణేషుడికి వీడ్కోలు
-
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం (ఫొటోలు)
-
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల శోభయాత్ర (ఫొటోలు)
-
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టం.. హుస్సేన్‌సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు (ఫొటోలు)
-
ఇక కీలక ఘట్టమే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులని తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గం ►కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ (పీవీఎన్ఆర్) మార్గ్ సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది.. ►ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేది.. ►ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది. ►వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ►నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ►వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ►వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కి.మీ పరిధిలో సందర్శకులకు పార్కింగ్.. హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి.. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. హెల్ప్లైన్ల ఏర్పాటు: ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 94905 98985, 90102 03626లను సంప్రదించవచ్చు. ఇంత రాద్ధాంతమా: తలసాని కవాడిగూడ: వినాయక నిమజ్జనంపై కొన్ని శక్తులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ర్యాలీలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో వినాయక చవితి ఏర్పాట్లు జరగలేదన్నారు. ప్రజలను కొందరు గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు మండపాల నిర్వాహకులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ట్యాంక్‌బండ్‌పై క్రేన్ల ఏర్పాటు ఎట్టకేలకు ఈసారి సైతం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయని తెలుస్తోంది. నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపు వారం రోజులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బీజేపీ నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని, ఓ దశలో తామే చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం తరపునే అన్నీ నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొనడం తెలిసిందే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఎన్టీఆర్ మార్గ్‌వైపు 9 క్రేన్లు, ట్యాంక్‌బండ్‌పై 16 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు పీపుల్స్‌ప్లాజా దగ్గర రెండు బేబిపాండ్లు, ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్పార్కువద్ద 3 బేబిపాండ్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. ఫ్లైఓవర్లు బంద్ వినాయక నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నిమజ్జనం పూర్తయ్యే వరకూ నిమజ్జనం జరిగే చెరువులు, ట్యాంక్‌లు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. పలుచోట్ల ట్రాఫిక్, మళ్లింపులు ఉంటాయన్నారు. అత్యవసర సహాయం కోసం 040–23002424, 85004 11111లను సంప్రదించవచ్చు. ఏర్పాట్లు ముమ్మరం రేపటి గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 74 కోనేర్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. బాలాపూర్ నుంచి శోభాయాత్ర పొడవునా 303 కి.మీ మేర ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జీహెచ్ఎంసీతోపాటు వివిధ విభాగాలు ఏర్పాట్లు చేశాయి. 303.30 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది. -
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
ఘనంగా గణేష్ నిమజ్జనం (ఫోటోలు)
-
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
Hyderabad: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సీఎస్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హాని కారక కెమికల్స్‌ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని సీఎస్ వివరించారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎస్ సూచించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చదవండి: (ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!) -
Hussain Sagar: ఈ ఏడాది కాలుష్యం తగ్గింది
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది గణేష్ నిమజ్జనంతో పోలిస్తే.. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. కాలుష్యంపై బుధవారం తుది నివేదిక విడుదల చేసింది. ఇందులో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, అనంతరం సాగర జలాలను నాణ్యతను పరిశీలించి నివేదికను వెలువరించింది. ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి నీటి నాణ్యతను ప్రయోగశాలలో పరిశీలించారు. నిమజ్జనం సమయంలో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పట్టిందని, కరిగిన ఘనపదార్థాల మోతాదు పెరిగిందని, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని, భార లోహాల మోతాదు సైతం పెరిగిందని వెల్లడించింది. నిమజ్జనం అనంతరం భారీగా వర్షాలు కురవడంతో.. సాగరంలో భారీగా వరద నీరు చేరి ఆయా కాలుష్యాల మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సాగర్ జలాల నాణ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల మేరకే ఉన్నట్లు తెలిపింది. -
గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే!
అకేషన్ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది. భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. Photo Courtesy: Hi Hyderabad Twitter Page గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Photo Courtesy: Hi Hyderabad Twitter Page -
గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్య
-
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఫొటోలు
-
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్‌నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్‌తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్‌దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్‌గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్‌బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్‌రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్‌రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్‌పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్‌రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్‌పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్‌రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్‌గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్‌మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్‌పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్‌నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్‌లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్‌తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్‌లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్‌లకు అనవసర మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్‌లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
5వ రోజు గణేష్ నిమజ్జనం
-
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై గందరగోళం
-
ట్యాంక్‌బండ్‌లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జన ట్రయల్ రన్
-
జాగ్రత్త గణేశా..!
-
ట్యాంక్‌బండ్‌లో 5వ రోజు గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్‌బండ్‌లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
హబ్సిగూడలో గ్యాంగ్ వార్
తార్నాక: గణేష్ నిమజ్జన ర్యాలీ సందర్బంగా డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్‌కు దారితీసింది. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8లో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...ఈనెల 14న రాత్రి 1.30గంటల ప్రాంతంలో రామంతాపూర్ రహదారిలోని మధురాబార్ సమీపంలో వినాయక నిమజ్జన ర్యాలీ కొనసాగుతోంది. ఈ సందర్బంగా అనిల్ అనే కారు డ్రైవర్, రామంతాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి సతీష్ మధ్య డ్యాన్స్ విషయంలో గొడవ జరిగింది. దీంతో వారిరువురు రెండు గ్యాంగులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. స్థానికులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సతీష్ తన స్నేహితులతో కలిసి హబ్సిగూడ రవీంద్రనగర్ ఎస్ఆర్ అపార్టుమెంట్ వద్ద ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో అనిల్ 15 మందితో కలిసి అక్కడికి వచ్చి సతీష్, అతని స్నేహితులపై దాడికి దిగగా, సతీష్ అతని స్నేహితులు ప్రతి దాడి చేశారు. ఇరువర్గా లు రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టుకున్నారు. అనిల్ గ్రూప్ వ్యక్తులు సతీష్‌ను కర్రలతో చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయందోళనకు గోనయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసు లు గాయపడిన సతీష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాతో వెలుగులోకి...? రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు వెలుగులోకివచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజీ వీడియోవైరల్‌గా మారడంతో కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ముగ్గురు నిందితుల అరెస్టు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఓయూ సబ్ ఇన్స్పెక్టర్ హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. రామంతాపూర్‌కు చెందిన అనిల్, హబ్సిగూడకు చెందిన కరుణాకర్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
వైరల్ వీడియో: ఒక్కసారిగా అంబులెన్స్ రావడంతో..
పుణె: వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ అంబులెన్స్ రావడంతో భక్తులు నిట్టనిలువుగా చీలిపోయి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటన పుణెలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పుణెలోని లక్ష్మీనగర్ రోడ్డులో వినాయక శోభాయాత్ర గురువారం అట్టహాసంగా సాగుతున్న వేళ అదే దారిలో అంబులెన్స్ వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన అంబులెన్స్ చూసిన అక్కడి భక్తులు, ప్రజలు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. రోడ్డు మీద రద్దీని క్లియర్ చేసి.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా దారి కల్పించారు. వినాయక శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు, భక్తులు రోడ్డుకిరువైపులా నిలువుగా చీలిపోయి.. అంబులెన్స్ ముందుకు కదిలేందుకు వీలుగా దారి ఇచ్చారు. కొందరు యువకులు అంబులెన్స్ ముందు పరిగెడుతూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాహనం ముందుకు కదిలేలా చూశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఆపత్కాలంలో మానవీయత ఉట్టిపడేలా వ్యవహరించిన పుణె వాసులను నెటిజన్లు కొనియాడారు. -
పుణెలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
-
హైదరాబాద్ : కన్నుల పండుగ నిమజ్జనోత్సవం
-
గణేష్ శోభయాత్రలో జోగి బ్రదర్స్
-
కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు
-
గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్య
-
అప్డేట్స్: ఘనంగా నిమజ్జనం
హైదరాబాద్ : ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఈ సారి వినాయకుడు పూర్తిగా మునగటం విశేషం. మహాగణపతిని సాగనంపటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఎటువంటి ఆటంకం లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఘనంగా నిమజ్జనం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ....గణేష్ నిమజ్జనంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతి భద్రతలను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దేశం మొత్తం చూస్తుందని, లక్షల మంది భక్తులు ఆయనను దర్శించుకున్నారన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం, శోభాయాత్రను హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. చార్మినార్ చేరుకున్న బాలాపూర్ గణనాధుడు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పాతబస్తీలో అపశ్రుతి పాతబస్తీ బహుదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెట్టె సమయంలో రవీందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడి పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర చికిత్స కోసం వెంటనే అతడిని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్ ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ మార్గ్‌లో గణేశుని నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. ఖైరతాబాద్ గణేశుని మహా నిమజ్జనానికి రెడీగా ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్టీఆర్ మార్గ్‌లోని వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్‌వైపు మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఖైరతాబాద్ గణేశుడు బాలాపూర్ లడ్డు @ రూ. 17.60 లక్షలు బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు. బాలాపూర్ లడ్డు వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య వినాయకుల శోభాయాత్ర వైభవోపేతంగా జరుగుతోంది. శోభాయాత్ర సందడితో రహదారులన్ని కొత్త రూపు సంతరించుకున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కదిలిన బాలాపూర్ గణేశుడు బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర అనంతరం లడ్డు వేలం పాట జరగనుంది. గతేడాది లడ్డు రూ. 16.60 లక్షలు పలికింది. దీంతో ఈ సంవత్సరం లడ్డు వేలం పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలాపూర్ గణేశుడు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రేన్ నెంబర్ 6 వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల్లో బొజ్జగణపయ్యల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాయి. నగరంలోని వీధులన్నీ శోభయాత్ర వెలుగులను సంతరించుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొదటిసారిగా గూగుల్ మ్యాప్స్‌లో ‘శోభాయాత్ర’
సిటీలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర జరగనున్న నిమజ్జనోత్సవం కోసం అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, శానిటేషన్, ఫైర్, వైద్యారోగ్య, విపత్తుల నివారణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీంను నియమిస్తున్నారు. ఈ టీంలో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి వీరు వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడతారు. ఆయా చెరువులు, కొలనులు, హుస్సేన్‌సాగర్ వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. అటు బందోబస్తు కోసం పోలీసులు..ఇటు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.గూగుల్‌మ్యాప్స్‌లో శోభాయాత్రను అప్డేట్ చేస్తారు. తద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ♦ శోభాయాత్ర 391 కి.మీ. ♦ వైద్యశిబిరాలు 27 ♦ నిమజ్జనం కోసం వసతులు 32 ప్రాంతాల్లో ♦ స్టాటిక్ క్రేన్లు 93 ♦ మొబైల్ క్రేన్లు 134 ♦ ట్రాఫిక్ సిబ్బంది 2100 ♦ ప్రత్యేక బస్సులు 550 ♦ ఆంక్షలు 66 ప్రాంతాల్లో ♦ హెల్ప్‌లైన్ నంబర్లు: 04027852482 , 9490598985 ,9010203626 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మహా ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర మార్గం పొడవునా రహదారులకు మరమ్మతులతోపాటు అవసరమైనంత పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లతోపాటు టాయ్లెట్లు తదితర సదుపాయాలు కల్పిస్తారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముఖ్యమైన 32 ప్రదేశాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ♦ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే 391 కిలోమీటర్ల మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్ ఏర్పాటు. ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్.ఎఫ్.ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తారు. మొత్తం 194 గణేష్ యాక్షన్టీమ్ల ఏర్పాటు . ♦ నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు..92 మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు. ♦ 32 ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్లు, 134 మొబైల్ క్రేన్ల ఏర్పాటు. ఈసారి నీటిపారుదల శాఖ ద్వారా కాకుండా జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ♦ 23 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీరు నింపి నిమజ్జనానికి ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో రోడ్ల రీకార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితరమైన వాటికి సంబంధించి 176 పనులకు రూ. 9.29 కోట్ల ఖర్చు. ♦ ఎస్సార్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆటంకాలు లేకుండా ప్రయాణం సాపీగా సాగేలా మరమ్మతులు. ♦ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమిస్తారు. ♦ సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్ల ఏర్పాటు . ట్యాంక్ బండ్, సరూర్‌నగర్ వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలు. పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్‌లో 7 బోట్లు, 44 స్పీడ్ బోట్లు. హుస్సేన్ సాగర్‌లో పదిమంది గజ ఈత గాళ్లు. ♦ జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్ల ఏర్పాటు. ఇందుకు రూ.99.41 లక్షల ఖర్చు. ♦ నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం చేస్తారు. ♦ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్ల ఏర్పాటు. ♦ రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్ విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు. ♦ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువులో నిమజ్జనం ద్వారా వెలువడే వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేకంగా వెయ్యి మంది నియామకం. ♦ జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 115 వాటర్ క్యాంప్‌ల ద్వారా 30,52,000 వాటర్ ప్యాకెట్ల పంపిణీ. ♦ శోభాయాత్ర మార్గంలో 36 ఫైర్ ఇంజన్ల ఏర్పాటు. ♦ విద్యుత్ శాఖ ద్వారా హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు మొత్తం 101 అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. ♦ శోభాయాత్ర మార్గంలో చెట్ల కొమ్మల నరికివేత. ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ హార్టికల్చర్ టీమ్ నియామకం. నిమజ్జనోత్సవానికి 550 ప్రత్యేక బస్సులు సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 12వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య 550 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిధానీ, లిబర్టీనుంచి ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, లకిడికాఫూల్ నుంచి బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, ఆల్‌ఇండియారేడియో నుంచి కోఠీ. ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, గాజుల రామారం, కూకట్పల్లి, పటాన్చెరు, బోరబండ, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడువన్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బ్రేక్‌డౌన్స్‌కు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఈడీ తెలిపారు. ఒకవేళ ఆకస్మాత్తుగా చెడిపోయినా వెంటనే వాటికి మరమ్మతులు చేసేందుకు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డు పై నుంచి పక్కకు తప్పించేందుకు సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఖైరతాబాద్: నగరంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని, సాగర తీరంలో క్రేన్ నెం.6 వద్ద ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావించేందుకు 20 ఫీట్లకు పైగా లోతు పెంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహాగణపతి నిమజ్జన ఊరేగింపు 12వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్దకు 12గంటలకు చేరుకుంటుందని, అన్ని పనులు పూర్తిచేసి ఒంటి గంటలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనాల సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దీని ద్వారా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 55 వేలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటుచేశారని, ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయయని, 12వ తేదీ చివరి రోజు 36 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విద్యాసాగర్, హెచ్ఎండీఏ ఎస్ఈ వరీందర్, ఎలక్ట్రికల్ డీఈ వేణుగోపాల్, ఐ అండ్ పిఆర్ రవికుమార్, మెడికల్ అండ్ హెల్త్ నాగేందర్ తదితరులు ఉన్నారు. కాగా ఖైరతాబాద్ మహాగణపతి మండపం వద్ద కూడా ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. -
ఈసారీ అడ్వాన్స్డ్ హుక్స్!
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకు క్రేన్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్డ్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లోని 138 క్రేన్లకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వీటి పనితీరును పరీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఉండే 40 క్రేన్లకు వాడుతున్నారు. వీటి వినియోగంపై మురళీధర్ గురు–శుక్రవారాల్లో క్రేన్ ఆపరేట్లకు శిక్షణ ఇచ్చారు. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్ళిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్ అడ్వాన్డ్స్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీన్ని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. ఇలాంటివి హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 క్రేన్లకు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ రిలీజ్ హుక్స్ ఈ హుక్స్ వినియోగించిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్‌గా రిలీవ్ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 క్రేన్లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేశాం. క్రేన్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా గంటకు 10 విగ్రహాలకు బదులుగా 25 నిమజ్జనం చేయవచ్చు. ఈ హుక్స్ పనితీరు పట్ల క్రేన్ ఆపరేటర్లు సైతం సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని అన్ని క్రేన్లకు వీటిని వాడటంతో పాటు కొన్నింటిని రిజర్వ్‌లో ఉంచుతున్నాం. – టి.మురళీధర్, శ్రీచక్ర ఇంజినీరింగ్ -
ట్యాంక్ బండ్ : గణేష్ నిమజ్జనాల కోలాహలం
-
టెక్నికల్ గణేషా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే... గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్‌ను సిటీ కాప్స్ ఆన్లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్లైన్లోనే దాఖలు చేసి దాని ప్రింట్‌ఔట్‌తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. తనిఖీలపై పర్యవేక్షణ... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్‌ను టీఎస్ కాప్ యాప్‌లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. మండపాల జియో ట్యాగింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్‌కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. -
హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
భారీ భద్రత
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చవితి సందడి మొదలైంది. బుధవారం నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా, రూఫ్‌టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలు, నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ ‘స్టాండ్ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు. కమిషనరేట్లలో ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల, పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతో పాటు కీలక మండపాలను ప్రతిరోజు బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీ చేయనున్నాయి. మండపాల వద్ద ఉండే వలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల్ని గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణనివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 10న మొహర్రం కావడంతో బీబీకా ఆలం ఊరేగింపు సైతం జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 62వేల మండపాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికి నగర పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా 10,702 మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయినవే కావడం గమనార్హం. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేçస్తున్న సందర్భంలో సాధారణంగా అనుమతి తీసుకోవట్లేదు. సాగర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు... కీలక నిమజ్జనాలు జరిగే హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎన్.విశ్వప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సాగర్‌లో 25వేల నుంచి 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజైన బుధవారం నుంచి ఈ సందడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారీ ప్రతి క్రేన్ వద్ద నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలు, సమయాలు తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అవలంభిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది ఉపకరిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పటిష్ట నిఘా, బందోబస్తు కోసం గతేడాది మాదిరే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల సూచనలివీ... ♦ మండపం వద్ద నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలి. ♦ గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అనేది గమనిçస్తుండాలి. ♦ పార్కింగ్ ప్రాంతాలు, అక్కడ నిలిపి ఉంటున్న వాహనాలపైనా కన్నేసి ఉంచాలి. ♦ రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదు. ♦ మండపం పైనుంచి వెళ్లే కరెంట్ తీగలు, హైటెన్షన్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ♦ అక్రమ విద్యుత్ కనెక్షన్లు నేరమే కాదు... ప్రమాదం కూడా అనేది గుర్తుంచుకోవాలి. ♦ రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమం. ♦ మండపం దాదాపుగా మండే స్వభావం ఉన్న థర్మకోల్, చెక్క తదితర వస్తువులతో నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వెలిగించే దీపాలు, అగరబత్తీలు, హారతి కర్పూరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరం. ♦ ఇతరుల మనోభావాలు దెబ్బతినే, రెచ్చగొట్టేలా చేసే చర్యలు, వ్యాఖ్యలు ఉండకూడదు. విగ్రహాలవివరాలివీ... సంవత్సరం విగ్రహాలు 2006 15,000 2007 16,500 2008 18,200 2009 19,400 2010 20,600 2011 21,900 2012 25,000 2013 30,000 2014 37,600 2015 42,400 2016 56,000 2017 58,000 2018 60,000 2019 62,000 (దాదాపు) -
హుస్సేన్‌సాగర్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ♦ కర్బాలామైదాన్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ ఫ్లైవర్ మార్గాన్ని అనుసరించాలి. ♦ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్‌రోడ్ లేదా మింట్ కాంపౌండ్ వైపు పంపిస్తారు. ♦ తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు. ♦ గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా పంపిస్తారు. -
సమన్వయంతో సక్సెస్ చేద్దాం
సాక్షి, సిటీబ్యూరో: అన్ని శాఖలు, విభాగాలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు సమన్వయంతో పనిచేసి ఈ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాల నిర్వాహణపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ కమిషనర్లు అనిల్ కుమార్, చౌహాన్, జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుతున్నప్పటికీ ప్రతి సారి కొత్త అంశాలతో ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయల కల్పనతో పాటు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఏవిధమైన తప్పుడు ప్రచారాలు జరిగినా వాటిని నమ్మొద్దన్నారు. వాటిని పంపేవారి సమాచారాన్ని అధికారులకు అందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామన్నారు. దీనిలో భాగంగా 254 క్రేన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని అన్ని గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. రూ.8.24 కోట్ల వ్యయంతో క్రేన్లు, వాహనాలు, రూ.9.20 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిమజ్జన చెరువుల క్లీనింగ్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నామని వివరించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో పారిశుధ్య నిర్వహణకుగాను గణేష్ యాక్షన్ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు రూ.కోటి రూపాయల వ్యయంతో 36,674 అదనపు లైట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమజ్జనం సందర్భంగా 115 ప్రత్యేక క్యాంపుల ద్వారా 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. ఈ ఏడాది మరింత మంది విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. దాదాపు 21 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఐదు కంపెనీల సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు నియమిస్తున్నట్లు వివరించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు గాను ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందాలని, దరఖాస్తు చేసిన ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్‌ను జారీచేయనున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శోభాయాత్ర దారిపొడువునా పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిర్ణీత సమయం కంటే ముందు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ వారు అభిప్రాయపడ్డారు. -
గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి భద్రతా పరంగా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దాదాపు 21,000 మంది పోలీసులతో, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘నగరంలోని 5 జోన్లకు 5 ప్రత్యేక రంగుల ఇండికేషన్ స్టిక్కర్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 7000కు పైగా గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించాం. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉదయమే జరిగేలా ఉత్సవ కమిటీని కోరామని’ తెలిపారు.