నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అశేష జనవాహిని మధ్య మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో పూర్తయింది. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం మధ్యాహ్నానికే అనంత చతుర్దశి ముగుస్తుందని చెప్పిన అధికారులు గతేడాది తరహాలోనే నిమజ్జనం కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగానే ముగించారు.