Khairatabad vinayaka
-
గంగమ్మ ఒడికి మహా గణపతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అశేష జనవాహిని మధ్య మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో పూర్తయింది. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం మధ్యాహ్నానికే అనంత చతుర్దశి ముగుస్తుందని చెప్పిన అధికారులు గతేడాది తరహాలోనే నిమజ్జనం కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగానే ముగించారు. నేటి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర 12 గంటలకల్లా పూర్తవుతుందని భావించినా అశేష జనవాహిని ట్యాంకు బండ్ కు తరలిరావడంతో కాస్త ఆలస్యమైంది. ఖైరతాబాద్ లోని సెన్సేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాత గేటు, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు మొత్తంగా 3 కిలోమీటర్ల మేరకు చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఉదయం తక్కువ మంది భక్తులు రావడంతో ఉత్సాహంగా ప్రారంభమైన శోభాయాత్ర, క్రమక్రమంగా భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలిరావడంతో నెమ్మదించింది. అయినా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా అధికారులు మహాగణనాథుని గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాల నుంచి తరలివస్తున్న గణనాథుల నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. -
గంగమ్మ ఒడికి మహా గణపతి
-
ముందుగానే మహాగణపతి నిమజ్జనం
-
ముందుగానే మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్: ఈ ఏడాది సైతం ఖైరతాబాద్ మహాగణపతిని ముందస్తుగా నిమజ్జనం జరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. తెలంగాణలో మొత్తం 94,856 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్‌లో 25,850 విగ్రహాలు ఉన్నాయని, ఇప్పటికి 40 శాతం విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని, 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 15 మంది ఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది ఇన్స్పెక్టర్లు, 1,187 మంది ఎస్ఐలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. 18 ప్లటూన్ల కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
-
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతినిస్తారు. గురువారం 12గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. గతానికి భిన్నంగా ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 10 క్రేన్లు, అప్పర్ ట్యాంకు బండ్‌పై 24 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం నగరంలో 12వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రూట్లో 2వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్, ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. 14వ మైలు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. నల్గొండ నుంచి 2500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ బాలాపూర్ వినాయక నిమజ్జనానికి ఉత్సవకమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం స్వామివారిని నిమజ్జనానికి తరలిస్తారు. ఈసారి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అనంతరం బాలాపూర్ వినాయక శోభాయాత్ర ప్రారంభంకానుంది. -
తొలిపూజ చేసిన గవర్నర్ దంపతులు