HYD: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం లేదు: సీవీ ఆనంద్‌ | Hyderabad CP CV Anand Comments On Ganesh Nimajjanam At Tank Bund, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్డీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డులో నిమజ్జనం: సీపీ సీవీ ఆనంద్‌

Published Fri, Sep 13 2024 1:15 PM | Last Updated on Fri, Sep 13 2024 5:04 PM

Hyderabad Cp Cv Anand Comments On Ganesh Nimajjanam

సాక్షి,హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాలతో ఈసారి ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ నిమజ్జనం లేదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్‌13) ఆయన మీడియాతో మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో గణేష్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నిమజ్జన విధుల్లో మొత్తం 18వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. 

ఈ ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలులేదని హైకోర్టు గతేడాదే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల అమలు కోసం ఎన్డీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డులో విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం జరగనుంది. 

	గణేష్ నిమజ్జనాలపై సీవీ ఆనంద్ కీలక ప్రెస్ మీట్

ఇదీ చదవండి.. కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement