సాక్షి,హైదరాబాద్: రేపు ఉదయంలోగా నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనంపై మంగళవారం(సెప్టెంబర్17) మధ్యాహ్నం సీవీ ఆనంద్ మీడియాకు అప్డేట్ ఇచ్చారు.‘హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్,సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. నిమజ్జనం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం.మండప నిర్వాహకులతో మాట్లాడి త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.
ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాం.షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశాం.నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి.నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలని కోరుతున్నాం.మీడియాలో లైవ్ టెలికాస్ట్ చూడాలని కోరుతున్నాం.
ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment