తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం
పోటీలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా మరోసారి సెయిలింగ్ సందడి మొదలైంది. సాగర్ వేదికగా గురువారం తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగు రంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో అలరించారు.
తెలంగాణ సెయిలింగ్ సంఘం, యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ దేశంలోనే అతిపెద్ద ఛాంపియన్íÙప్‌లో ఒకటి కావడం విశేషం. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్ మాట్లాడుతూ.. ఈ సారి 29 ఈఆర్ స్కిఫ్, 420 డబుల్ హ్యాండర్స్ విభాగాలను జోడించడంతో అన్ని కేటగిరీల్లో రికార్డు ఎంట్రీలు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో ప్రతిభావంతులను గుర్తించి తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం, ముఖ్యంగా చైనాలో జరిగే 2026 ఆసియా క్రీడలు, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment