sailing championship
-
సెయిలింగ్ సిస్టర్స్..
ఒడ్డున చేరే అలల్లాంటివి వారి జీవితాలు.. ఐనప్పటికీ ఎగిసిపడే కెరటాల్లా తెరచాపలై దూసుకపోతోంది వారి చైతన్యం. చాలామందికి సెయిలింగ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని తరుణంలో.. ఇదే సెయిలింగ్‌లో నేషనల్ చాంపియన్లుగా నిలుస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.. పేదరికం అడ్డంకి కాకుండా యాచ్ క్లబ్ అందిస్తున్న సహకారంతో రసూల్‌పుర ఉద్భవ్ స్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్న కొమరవెల్లి దీక్షిత, కొమరవెల్లి లాహరిలు టాప్ సెయిలింగ్ సిస్టర్స్‌గా రాణిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగానే కాకుండా భారత్ తరపున విదేశాల్లోనూ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటూ దేశ కీర్తికి భవిష్యత్ వారధులుగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో నగరానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహా్వల్, పీవీ సింధూ, నిఖత్ జరీనా రాణించినట్టే.. రానున్న కాలంలో సెయిలింగ్ క్రీడకూ ఈ అక్కాచెల్లెళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారతారేమో.. ముంగ్గురు ఆడపిల్లలున్న కుటుంబం అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు.. సామాన్య జీవనమే గగనమైన తరుణంలో అనితర సాధ్యమైన సెయిలింగ్ పోటీల్లో చాంపియన్లుగా నిలుస్తున్నారంటే ఆ అక్కా చెళ్లెల్ల ఆత్మ స్థైర్యమేంటో ఊహించవచ్చు. వీరి సామర్థ్యాలను గుర్తించిన నగరంలోని యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు సుహేమ్ షేక్ వారి విద్యతో పాటు సెయిలింగ్ శిక్షణకు సహాకారం అందిస్తున్నారు. అందివచి్చన సహకారాన్ని వినియోగించుకుంటూ.. ఈ హైదరాబాదీ సెయిలర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. సౌత్ కొరియా, భారత్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దీక్షిత కొమురవెళ్లి పోటీపడింది. ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న మరో అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకం కోసం పోరాడుతోంది. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో చెయి విరగడంతో లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు వెళ్లలేకపోయానని లహరి బాధను వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజుల క్రితమే నగరం వేదికగా జరగిన 15వ మాన్సూన్ రెగట్టా పోటీల్లో అదే గాయంతోనే పోటీ చేసి అందరి ప్రశంసలను పొందింది చెల్లి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మొదటమ్మాయి కూడా సెయిలింగ్‌లో ప్రవేశముంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెయిలింగ్‌ను కొనసాగించలేకపోయిందని తల్లి కవిత తెలిపింది. పిల్లల చదువులు, సెయిలింగ్ శిక్షణతో పాటే తనకు కూడా యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో వంట వండటానికి ఉద్యోగమిచ్చి ఉపాధి అవకాశాన్ని కల్పించారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీక్షిత విజయాలు–పతకాలుకాంస్యం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 14వ మాన్సూన్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికలవిభాగం వైఏఐ యూత్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం సెయిల్ ఇండియా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 15వ మాన్సూన్ రెగట్టా 2024.లహరి విజయాలు–పతకాలు..బంగారు పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, మొదటి వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. కాంస్యం– ఆప్టిమిస్ట్ వైఏఐ యూత్ నేషనల్స్ 2022. కాంస్యం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.ప్రతిష్ఠాత్మక సెయిలింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు.. లండన్, కొరియాలో దీక్షిత, నేషనల్స్‌లో లహరి రాణింపు.. విద్య, సెయిలింగ్‌లో యాచ్ క్లబ్ సహాయం -
ఆరు పతకాలతో అదరగొట్టిన హైదరాబాదీలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో అదరగొట్టారు. మైసూర్లో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో వైష్ణవి వీరవంశం, కొమరవెల్లి లాహిరి స్వర్ణ పతకాలు సాధించారు. తనూజా కామేశ్వర్, సాహిత్ బండారం రజత పతకాలు నెగ్గగా... లావేటి ఝాన్సీప్రియ, అమితవ వీరారెడ్డి కాంస్య పతకాలు గెలిచారు. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోచ్ సుహీమ్ షేక్ మాట్లాడుతూ భవిష్యత్‌లో హైదరాబాద్ సెయిలర్లు మరిన్ని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
భారత సెయిలర్ నేత్రకు స్వర్ణం
స్పెయిన్ వేదికగా జరిగిన గ్రాన్ కెనేరియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా సెయిలర్ నేత్రా కుమనన్ స్వర్ణ పతకంతో మెరిసింది. ఆరు రేసుల పాటు జరిగిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో బరిలోకి దిగిన ఆమె 10 నెట్ పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. తొలి మూడు రేసుల్లో నేత్ర విజేతగా నిలవగా... అనంతరం జరిగిన నాలుగో రేసులో మూడో స్థానంలో, ఐదో రేసులో నాలుగో స్థానంలో నిలిచింది. బెనీటో లాంచో రజతాన్ని, మార్టినా రినో కాంస్యాన్ని సాధించారు. -
వరుణ్ ఠక్కర్–కేసీ గణపతి జోడీకు గోల్డ్ మెడల్
Indias KC Ganapathy Varun Thakkar win Gold: ఆసియా 49ఈఆర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన వరుణ్ ఠక్కర్–కేసీ గణపతి జోడీ విజేతగా నిలిచింది. ఒమన్‌లో ఈ టోర్నీ జరిగింది. ఆసియా సెయిలింగ్ టోర్నీ చరిత్రలో వరుణ్–గణపతి జంటకిది మూడో పతకం. 2018లో ఈ జోడీ స్వర్ణం, 2019లో రజతం సాధించింది. మరోవైపు మహిళల విభాగంలో హర్షిత తోమర్–శ్వేత జోడీ రజత పతకం నెగ్గింది. చదవండి: ENG Vs Nz: మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్.. తొలి సారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు.. -
తండ్రి దినసరి కూలీ, తనయుడు ఇటలీలో జరిగే అంతర్జాతీయ పోటీలకు
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన యువ నావికుడు అంతర్జాతీయ ఘనత సాధించాడు. ఇటలీలో జరగబోయే ఆప్టిమిస్ట్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌కు 15 ఏళ్ల నావికుడు పాడిదళ విశ్వనాథ్ ఎంపికయ్యాడు. ఇతను గోవాలోని ఐఎన్ఎస్ మాండోవిలోని నేవీ బాయ్స్ స్పాట్స్ కంపెనీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటలీలోని రివా డెల్ గార్డాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే జూనియర్ బాయ్స్ యాచింగ్ జట్టులో విశ్వనాథ్ పాల్గొననున్నాడు. ఈ పోటీలు జూన్ 30న ప్రారంభమై..జూలై 10న ముగియనున్నాయి. విశ్వనాథ్ నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. సూర్యపేటకు చెందిన ఇతని తల్లిదండ్రులు నిర్మాణ రంగంలో దినసరి కూలీలు. 21 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఇక విశ్వనాథ్‌ను తన 12వ ఏటలోనే నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ఎంపిక చేసింది. ఇంతకముందు 2017లో సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ రెగట్టాలో రజత పతకం సాధించాడు. అప్పటి నుంచి ఆప్టిమిస్ట్ తరగతిలో జాతీయ జట్టులో పాల్గొంటున్నాడు.. ఆసియన్ ఛాంపియన్షిప్, ఒలంపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించడమే తన లక్ష్యమని విశ్వనాథ్ తెలిపాడు. ప్రొఫెషనల్ నావికుడు కావాలనే తన కల త్వరలోనే నిజం కాబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. 12ఏళ్ల వయస్సులో తనను ఎంపిక చేసినందుకు నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు. -
ఆసియా సెయిలింగ్ పోటీలకు ప్రీతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హుస్సేన్ సాగర్ వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన హైదరాబాద్ యాట్ క్లబ్ (వైసీహెచ్) సెయిలర్లు ప్రీతి కొంగర, ఝాన్సీ ప్రియ, లక్ష్మీ నూకరత్నం గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా–ఓసియానియా అంతర్జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు వీరు ముగ్గురు ఎంపికయ్యారు. ఒమన్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. ఇందులో చైనా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు 16 దేశాలకు చెందిన 300 మంది సెయిలర్లు తలపడనున్నారు. భారత్ నుంచి 5 చొప్పున బాలబాలికలను ఈ టోర్నీకి ఎంపిక చేయగా అందులో ఆరుగురు హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన వారే కావడం విశేషం. బాలుర విభాగంలో విజయ్ కుమార్, సచిన్, విశ్వనాథ్‌లు మాజీ వైసీహెచ్ సెయిలర్లు కాగా వారు ప్రస్తుతం ఆర్మీ, నేవీ సెయిలింగ్ స్కూల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ప్రీతి నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా... ఝాన్సీ, లక్ష్మీ రసూల్‌పురా ఉద్భవ్ స్కూల్ విద్యార్థులు. వీరంతా ఆర్థికంగా చాలా వెనకబడిన కుటుంబాలకు చెందిన వారైనప్పటికీ కోచ్ సుహేమ్ షేక్ ఆధ్వర్యంలో సెయిలింగ్‌పై ఆసక్తితో ఆటలో గొప్పగా రాణిస్తున్నారు. -
ఓవరాల్ చాంపియన్ ప్రీతి
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన సెయిలర్ ప్రీతి కొంగర రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. పలువురు మేటి సెయిలర్లు పాల్గొన్న ఈ జాతీయ స్థాయి టోర్నీలో ఏకంగా మూడు టైటిళ్లతో ఆమె సత్తా చాటింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ప్రీతి 34 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని అందుకోవడంతో పాటు బాలికల విభాగంలోనూ చాంపియన్‌షిప్ టైటిల్‌ను, ఉత్తమ సెయిలర్ ట్రోఫీలను గెలుచుకుంది. ఓవరాల్ కేటగిరీలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు), విజయ్ కుమార్ (67 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు) తొలి రెండు స్థానాలను దక్కించుకోగా... ఉమా చౌహాన్ (78 పాయింట్లు) మూడోస్థానంతో సరిపెట్టుకుంది. బాలుర కేటగిరీలో విజయ్ కుమార్ 67 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. రాజ్ విశ్వకర్మ (118 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అక్షయ్ (118 పాయింట్లు) మూడోస్థానంతో టోర్నీని ముగించాడు. ఆప్టిమిస్ట్ లైట్ ఫ్లీట్ బాలికల కేటగిరీలో మౌనిక (వైసీహెచ్), బాలుర విభాగంలో సోమనాథ్ రాథోడ్ (వైసీహెచ్), డెబ్యూటెంట్స్ కేటగిరీలో కె. రాజేశ్వరి టైటిళ్లను అందుకున్నారు. ఆరు రోజుల పాటు హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 131 మంది సెయిలర్లు సందడి చేశారు. ఈ పోటీల న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ రికే వ్యవహరించారు. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ యాట్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహేమ్ షేక్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన ప్రీతి కొంగర టైటిల్‌కు మరింత చేరువైంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో శనివారం మూడు రేసులు జరుగగా ప్రీతి తొలి రేసులో విజేతగా నిలిచింది. మిగతా రెండు రేసుల్ని వరుసగా 8వ, 4వ స్థానంతో ముగించింది. ప్రస్తుతం బాలికల మెయిన్ ఫ్లీట్ ఈవెంట్లో ప్రీతి కొంగర 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... రెండో స్థానంలో ఉన్న రితిక డాంగి (ఎస్ఎస్ఎస్ భోపా ల్) ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం 32 పాయింట్లు ఉండటం విశేషం. ఉమా చౌహాన్ (ఎస్ఎస్ఎస్ భోపాల్; 66 పాయింట్లు) మూడోస్థానంలో నిలిచింది. ఆదివారం మరో మూడు రేసులు జరగనున్నాయి. ఇందులోనూ సత్తా చాటితే ట్రోఫీ ప్రీతి సొంతం కానుంది. బాలుర కేటగిరీలో తృష్ణ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన విజయ్ కుమార్ 60 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. రాజ్ విశ్వకర్మ (ఎన్ఎస్ఎస్ భోపాల్, 90 పాయింట్లు), కలవ్య బాథమ్ (ఎన్ఎస్ఎస్ భోపాల్; 102 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గ్రీన్ ఫ్లీట్ ఈవెంట్ బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్లే తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. సుప్రియ (55 పాయింట్లు), వైష్ణవి (74 పాయింట్లు), శ్రీహర్షిత (127 పాయింట్లు) మెరుగైన స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో ప్రవీణ్ (34 పాయిం ట్లు), నిఖిల్ (35 పాయింట్లు), మల్లేశ్ (36 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
అగ్రస్థానంలో విజయ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా ఫ్లీట్ రేసింగ్‌లో తృష్ణ సెయిలింగ్ క్లబ్ బెంగళూరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ టీమ్ ఈవెంట్లో గురువారం నాటికి 30 రేసులు ముగియగా తృష్ణ క్లబ్‌కు చెందిన విజయ్ కుమార్ (7) అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఎనిమిది రేసుల్లో తృష్ణ క్లబ్ ఏడు రేసుల్లో విజేతగా నిలిచింది. ఎన్ఎస్ఎస్ భోపాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమా చౌహాన్ (5), ఏకలవ్య (5) చెరో ఐదు రేసుల్లో గెలుపొంది వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్ యాట్ క్లబ్ తరఫున పోటీల్లో పాల్గొన్న ప్రీతి కొంగర 4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా... విశ్వనాథ్ (4 పాయింట్లు) ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
కొంగర ప్రీతికి రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రీతి కొంగర సత్తా చాటింది. యాట్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో ప్రీతి సబ్ జూనియర్ బాలికల చాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు, తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్ చాంపి యన్‌గా అవతరించి మరో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. జూనియర్ విభాగంలో సిఖాన్షు సింగ్ తెలంగాణ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. బి.కిరణ్‌కు తెలంగాణ రాష్ట్ర జూనియర్ చాంపియన్ టైటిల్ దక్కింది. సబ్ జూనియర్ ఆప్టిమిస్ట్ లైట్ కేటగిరీలో కె. నందిని విజేతగా నిలవగా... సోమ్‌నాథ్ రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ లైట్ ఫ్లీట్ చాంపియన్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా టోర్నమెంట్లో జరిగిన 12 రేసుల్లో ఏడింటిలో విజేతగా నిలిచిన ప్రీతి కొంగర (హైదరాబాద్ యాట్ క్లబ్) 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. యాట్ క్లబ్‌కే చెందిన లక్ష్మీ నూకరత్నం 51 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా... ఝాన్సీ ప్రియ 54 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఆకట్టుకున్న ప్రీతి, సిఖాన్షు సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రీతి కొంగర, సిఖాన్షు సింగ్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో బుధవారం జరిగిన రేసుల్లో వీరిద్దరూ సత్తా చాటారు. వేగంగా వీస్తోన్న గాలులకు ప్రతికూల వాతావరణానికి ఎదురొడ్డి నిలిచి తమ తమ విభాగాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రెండో రోజు బుధవారం పోటీల అనంతరం సబ్ జూనియర్ ఆప్టిమిస్ట్స్ విభాగంలో 8 పాయింట్లతో ప్రీతి తొలి స్థానంలో కొనసాగుతోంది. ఎల్. ధరణి 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఎల్. ఝాన్సీ ప్రియ 27 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన నాలుగో రేసులో లక్ష్మీ నూకరత్నం విజేతగా నిలిచింది. ప్రీతి రెండో స్థానంతో ముగించింది. ఐదో రేసులో ప్రీతి, లక్ష్మి నూకరత్నం, ధరణి, ఝాన్సీ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఆరో రేసులో అంచనాలను తలకిందులు చేస్తూ ఝాన్సీ విజేతగా నిలవగా లక్ష్మి, ప్రీతి, ధరణి తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్ లేజర్ విభాగంలో టీఎస్‌సీకి చెందిన సిఖాన్షు సింగ్ 8 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. నిత్య బాలచందర్ (టీఎన్‌ఏఎస్) 17 పాయింట్లతో రెండో స్థానంలో, బి. కిరణ్ (టీఎస్సీ) 20 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు. జూనియర్ అండర్–18 ఫ్లీట్ విభాగంలో బుధవారం మొత్తం 7 రేసులు జరుగగా... సిఖాన్షు సింగ్ ఆరు రేసుల్లో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించాడు. మరో రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. -
అగ్రస్థానంలో ప్రీతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లలో పెద్ద టోర్నీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ తొలిరోజు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. హుస్సేన్‌సాగర్ జలాల్లో మంగళవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్ తొలిరోజు పోటీల్లో అమ్మాయిల హవా కొనసాగింది. హైదరాబాద్‌కు చెందిన భారత నం.3 సెయిలర్ ప్రీతి కొంగర తన ప్రతిభను ప్రదర్శిస్తూ తొలిరోజు పోటీల్లో విజేతగా నిలిచింది. హైదరాబాద్ యాట్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మూడు రేసుల్లో ప్రీతి రాణించింది. రెండు రేసుల్ని అగ్రస్థానంతో ముగించిన ఆమె మూడో రేసులో రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 4 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎల్. ధరణి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా... 22 పాయింట్లతో ఎల్. ఝాన్సీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరికి పోటీనిచ్చిన మరో సెయిలర్ లక్ష్మీ నూకరత్నం చివరకు 17వ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. తొలి రెండు రేసుల్లో ఒక విజయం, మరోదాంట్లో మూడోస్థానంలో నిలిచిన లక్ష్మి.. మూడో రేసును నిర్ణీత సమయం కన్నా ముందే ప్రారంభించి అనర్హతకు గురైంది. దీంతో ఆమె 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వికారాబాద్‌కు చెందిన అజయ్ 30 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. సంతోష్ (34 పాయింట్లు) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. తెలంగాణ సెయిలింగ్ సంఘం (టీఎస్ఏ), భారత యాటింగ్ సంఘం, హైదరాబాద్ యాట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 60 మంది సెయిలర్లు తలపడ్డారు. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. -
జితేశ్‌కు ఆరు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో సందడి చేసిన సీనియర్ మల్టిక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ యాటింగ్ నోడ్ (ఏవైఎన్) సెయిలర్ జితేశ్ అదరగొట్టాడు. ఈఎంఈ సెయిలింగ్ సంఘం, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ సంఘం (ఎల్సీఏఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా ఆరు టైటిళ్లను జితేశ్ కైవసం చేసుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ ట్రోఫీ, లేజర్ రేడియల్ ఓపెన్ ట్రోఫీ, ఎస్ఎస్సీ రోలింగ్ ట్రోఫీ, వైఏఐ కటారి బౌల్ అవార్డు, లెఫ్టినెంట్ కెల్లీరావు ట్రోఫీ, మేజర్ ఏఏ బాసిత్ ట్రోఫీలను అతను హస్తగతం చేసుకున్నాడు. దేశంలోని 17 ప్రముఖ సెయిలింగ్ క్లబ్‌లకు చెందిన మొత్తం 192 మంది సెయిలర్లు ఈ పోటీల్లో తలపడ్డారు. ఇందులో 22 మంది మహిళా సెయిలర్లూ పోటీపడ్డారు. టోర్నీలో పాల్గొన్న వారిలో 68 ఏళ్ల మురళీ కనూరి, 13 ఏళ్ల అన్షురాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఓవరాల్ విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్సీఏఐ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ కేటగిరీలో జితేశ్ 16 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకోగా, హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్) 27 పాయింట్లతో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్) 33 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ (అండర్–21) విభాగంలో శిఖర్ గార్గ్ (ఎన్ఎస్ఎస్, 90 పాయింట్లు), నాగార్జున (టీఎస్సీ, 133 పాయింట్లు), అథర్వ్ తివారీ (ఈఎంఈఎస్‌ఏ, 213 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఈఎంఈఎస్‌ఏ వైస్ కమాండర్ టీఎస్ఏ నారాయణ్, షూటర్ గగన్ నారంగ్, రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లేజర్ రేడియల్ ఓపెన్: 1. జితేశ్ (ఏవైఎన్), 2. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 3. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ). మహిళలు: 1. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ), 2. రమ్య శరవణన్ (సీఈఎస్సీ), 3. జయలక్ష్మి (టీఎన్‌ఎస్‌ఏ). వైయు–19: 1. ఎన్. హేమంత్ (టీఎస్సీ), 2. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. నవీన్ (టీఎస్ఎస్ఏ). ఏఎం: 1. షరీఫ్ ఖాన్ (ఏవైఎన్), 2. సీడీఆర్ ఎంఎల్ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ). లేజర్ 4.7 ఓపెన్: 1. రమిలాన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. రితిక (ఎన్ఎస్ఎస్), 3. సిఖాన్షు సింగ్ (టీఎస్సీ). అండర్–19 బాలురు: 1. సిఖాన్షు సింగ్ (టీఎస్సీ), 2. సంజయ్‌రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్ (ఎన్ఎస్ఎస్). అండర్–16 బాలికలు: 1. రితిక (ఎన్ఎస్ఎస్), 2. సంచిత (ఈఎంఈఎస్‌ఏ), 3. అశ్విని (ఈఎంఈఎస్‌ఏ). అండర్–18 బాలికలు: 1. సాన్య (ఈఎంఈఎస్‌ఏ), శ్రద్ధ వర్మ (ఎన్ఎస్ఎస్), 3. నిత్య (టీఎన్‌ఎస్‌ఏ). ఆర్ఎస్:ఎక్స్: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. డేన్ కోయిలో (జీవైఏ), 3. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). ఫిన్: 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. వివేక్ (ఏవైఎన్). 470 క్లాస్: 1. పీపీ ముత్తు–ఎస్సీ సింఘా, 2. అయాజ్–ఉప్కార్ సింగ్, 3. అతుల్ లిండే–సీహెచ్ఎస్రెడ్డి 470 యూత్: బినూబ్, అఖిల్ (టీఎస్సీ). -
లేజర్ రేడియల్‌లో శ్రీను జోరు
సాక్షి, హైదరాబాద్:హుస్సేన్‌సాగర్ జలాల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ చాంపియన్‌షిప్‌లో శనివారం ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ ఎ.శ్రీను ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. లేజర్ రేడియల్ విభాగాల్లో ఆర్మీ యాటింగ్ నోడ్ (ఏవైఎన్) సెయిలర్లను వెనక్కి నెట్టి 11, 12 రేసుల్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. పదో రేసులో జితేశ్ (ఏవైఎన్) విజేతగా నిలిచాడు. లేజర్ స్టాండర్డ్లోనూ ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ దిలీప్ కుమార్ 11 రేసులో తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. మిగతా రెండు రేసుల్ని ఏవైఎన్ సెయిలర్లు జితేశ్, ఇస్రాజ్ అలీ సొంతం చేసుకున్నారు. లేజర్ 4.7 ఈవెంట్లో జరిగిన మూడు రేసుల్లో వరుసగా సిఖాన్షు సింగ్ (టీఎస్సీ), ఆశిష్ (ఎన్ఎస్ఎస్), దుర్గాప్రసాద్ (ఎన్బీఎస్సీ) విజేతలుగా నిలిచారు. 470 క్లాస్ విభాగాన్ని పీపీ ముత్తు–ఎస్సీ సింఘా జోడీ హస్తగతం చేసుకుంది. మూడు రేసుల్లోనే ఈ జోడీనే అగ్రస్థానంలో నిలిచింది. ఆర్ఎస్:ఎక్స్ ఈవెంట్లో మన్‌ప్రీత్ సింగ్, ఇబాద్ అలీ తొలి రెండు రేసుల్ని నెగ్గగా... డేనీ కోయిలో (ఈఎంఈఎస్‌ఏ) చివరి రేసులో విజయాన్ని అందుకున్నాడు. ఫిన్ విభాగంలోని మూడు రేసుల్లో వరుసగా జస్వీర్ సింగ్, స్వతంత్ర సింగ్, వివేక్‌లు తొలిస్థానంలో నిలిచారు. -
హర్‌ప్రీత్ సింగ్ జోరు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో కనువిందు చేస్తోన్న ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీల్లో రెండోరోజూ ఆర్మీ యాటింగ్ నోడ్ (ఏవైఎన్) సెయిలర్ల హవా కొనసాగింది. గురువారం లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, 470 క్లాస్, ఫిన్ ఈవెంట్లలో జరిగిన అన్ని రేసుల్లోనూ ఏవైఎన్ సెయిలర్లే విజేతలుగా నిలిచారు. లేజర్ స్టాండర్డ్ నాలుగు, ఐదు రేసుల్లో హర్‌ప్రీత్ సింగ్ విజేతగా నిలిచాడు. చివరిదైన ఆరో రేసును జితేశ్ గెలుపొందాడు. రేడియల్ ఈవెంట్ నాలుగు, ఐదు, ఆరు రేసుల్ని వరుసగా జితేశ్, హర్‌ప్రీత్ సింగ్, షరీఫ్ ఖాన్ చేజిక్కించుకున్నారు. లేజర్ 4.7 ఈవెంట్లో రితిక (ఎన్ఎస్ఎస్), అజయ్ (ఈఎంఈఎస్‌ఏ) వరుసగా నాలుగు, ఐదు రేసుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 470 క్లాస్‌లో పీపీ ముత్తు–ఎస్సీ సింఘా జంట నాలుగు, ఆరు రేసుల్ని గెలుచుకోగా... అతుల్–సీహెచ్ఎస్ రెడ్డి జోడీ ఐదో రేసులో విజేతగా నిలిచింది. ఆర్ఎస్:ఎక్స్ విభాగం నాలుగో రేసులో ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ డేన్ కోయిలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. జెరోమ్, మన్‌ప్రీత్ సింగ్ మిగతా రేసుల్లో ముందంజ వేశారు. ఫిన్ విభాగంలో నాలుగో రేసును వివేక్ సొంతం చేసుకోగా.. మిగతా రెండు రేసుల్లో స్వతంత్ర సింగ్ విజేతగా నిలిచాడు. -
లేజర్ స్టాండర్డ్‌లో జితేశ్ ఆధిపత్యం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో సందడి చేస్తోన్న ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో జితేశ్ (ఆర్మీ యాటింగ్ నాడ్–ఏవైఎన్) తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించాడు. లేజర్ స్టాండర్డ్ ఈవెంట్లో బుధవారం మూడు రేసులు జరుగగా... రెండింటిలో జితేశ్ విజేతగా నిలిచాడు. మొదటి, మూడు రేసుల్లో అగ్రస్థానాన్ని జితేశ్ అందుకోగా, రెండో రేసులో జితేశ్‌ను వెనక్కినెట్టి ముజాహిద్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు. లేజర్ రేడియల్ విభాగంలోనూ ఏవైఎన్ క్రీడాకారుల హవా కొనసాగింది. రేడియల్ తొలి రేసులో హర్‌ప్రీత్ సింగ్, రెండో రేసులో జితేశ్ గెలుపొందారు. లేజర్ 4.7 తొలి రెండు రేసుల్లో ఎన్ఎస్ఎస్కు చెందిన ఆశిష్ విశ్వకర్మ, రమిలాన్ యాదవ్.. మూడో రేసులో టీఎస్ఈ సెయిలర్ సిఖాన్షు సింగ్ గెలుపొందారు. 470 క్లాస్ ఈవెంట్‌ను ఏవైఎన్ సెయిలర్లు హస్తగతం చేసుకున్నారు. తొలి రేసును అతుల్–సీహెచ్ఎస్ రెడ్డి, రెండో రేసును పీపీ ముత్తు–ఎస్సీ సింఘా, మూడో రేసును పీపీ ముత్తు–ఎస్సీ సింఘా గెలుచుకున్నారు. ఆర్ఎస్:ఎక్స్ విభాగం తొలి రేసును ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ డేనీ కోయిలో గెలుపొందాడు. రెండు, మూడు రేసుల్లో ఏవైఎన్ క్రీడాకారులు వరుసగా మన్‌ప్రీత్ సింగ్, జెరోమ్ కుమార్ నెగ్గారు. ఫిన్ విభాగంలో మూడు రేసుల్లో వరుసగా స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), జస్వీర్ సింగ్ (ఏవైఎన్), ఎంకే యాదవ్ (ఏవైఎన్) విజేతలుగా నిలిచారు. -
నేవీ సెయిలింగ్ జట్టుకు రాష్ట్ర విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సెయిలింగ్‌లో సత్తా చాటుతోన్న తెలంగాణ విద్యార్థులు సి. కార్తీక్, బి. సంతోష్‌లు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరూ నేవీ సెయిలింగ్ జట్టుకు ఎంపికయ్యారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లో ఎనిమిదో తరగతి చదువుతోన్న సి. కార్తీక్ (మహబూబ్‌నగర్), సంతోష్ (జనగాం) నేవీ జట్టుకు ఎంపికయ్యారని సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా తెలిపారు. కృష్ణపట్నంలో జరిగిన యూత్ నేషనల్, ఇంటర్నేషనల్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన వీరిద్దరూ గోవా మండోవికి చెందిన ‘నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ బ్యాచ్–2’లో చోటు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా నేడు గోవాలోని నేవీ స్కూల్లో చేరనున్నారు. ఇక్కడ వీరికి చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ శిక్షణను అందిస్తారు. విద్యాభ్యాసం అనంతరం వీరిద్దరూ ఇండియన్ నేవీలో భాగమవుతారు. ఈసందర్భంగా టీఎంఆర్ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు వీరి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్‌లో గొప్పగా రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఐఎఫ్ఎస్ షఫీయుల్లా ఆకాంక్షించారు. -
జైకిరణ్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో షేక్‌పేట్ మోడల్ స్కూల్ విద్యార్థి బి. జైకిరణ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హుస్సేన్‌సాగర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో జైకిరణ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం ఓపెన్ కేటగిరీలో జరిగిన చివరి రెండు రేసుల్లో విజేతగా నిలిచిన చున్నుకుమార్ (త్రిష్ణ సెయిలింగ్ క్లబ్) 48 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. ఎన్ఎస్ఎస్ భోపాల్‌కు చెందిన ఉమా చౌహాన్ 53 పాయింట్లతో రజతాన్ని గెలుచుకుంది. కాంస్యాన్ని సాధించిన హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్ జైకిరణ్ 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. చివరి రోజు పోటీల్లో కిరణ్ అంచనాలకు తగ్గట్లు రాణించాడు. బాలికల విభాగంలో ఉమా చౌహాన్ (53 పాయింట్లు) పసిడి పతకాన్ని గెలుచుకుంది. రితిక (104 పాయింట్లు), సంచిత పంత్ (120 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. మొత్తం 111 మంది సెయిలర్లు తలపడిన ఈ టోర్నీలో ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ బాలికల కేటగిరీలో సీహెచ్ జ్ఞాపిక ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల కార్యదర్శి బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. -
ఆకట్టుకున్న విజయ్, విక్రమ్
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లో శనివారం జరిగిన మూడోరోజు పోటీల్లో ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన విజయ్ 49 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్ బి. జైకిరణ్ మూడో స్థానంలో ఉన్నాడు. కర్ణాటక త్రిష్ణ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన చున్ను కుమార్ 41 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉన్నాడు. హైదరాబాద్ యాట్ క్లబ్లో శిక్షణ పొంది ఆర్మీ స్కూల్‌కు ఎంపికైన విజయ్ శనివారం జరిగిన రెండు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఉమా చౌహాన్ (ఎన్ఎస్ఎస్ భోపాల్) 49 పాయింట్లతో విజయ్‌తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచింది. -
రిషబ్, జూహీ దేశాయ్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో ఐదు రోజులుగా సందడి చేసిన సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. ఈ పోటీల్లో యాటింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెయిలర్లు రిషబ్ నాయర్, జూహీ దేశాయ్ సత్తా చాటారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో లేజర్ 4.7 విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. లేజర్ 4.7 అండర్–18 ఓపెన్ కేటగిరీలో రిషబ్ నాయర్ 27 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్ఎస్ఎస్కు చెందిన సతీశ్ యాదవ్ (31 పాయింట్లు), రామ్ మిలన్ యాదవ్ (38 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల కేటగిరీలో జూహీ దేశాయ్ 113 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. రజతాన్ని సాధించిన కె. రజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ) 185 పాయింట్లతో రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన దిలీప్ కుమార్ లేజర్ రేడియల్ ఓపెన్ కేటగిరీలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మీ యాటింగ్ నాడ్ (ఏవైఎన్)కు చెందిన రమ్య శరవణన్ మహిళల లేజర్ రేడియల్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం రాణించిన మోహిత్ సైనీ (ఏవైఎన్) లేజర్ స్టాండర్డ్ ఓపెన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన గితేశ్ (ఏవైఎన్) లెఫ్టినెంట్ కమాండర్ కెల్లీ ఎస్ రావు స్మారక ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వ హించిన ఈ పోటీల్లో 15 క్లబ్‌లకు చెందిన 195 మంది సెయిలర్లు పాల్గొన్నారు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో 48 మంది, లేజర్ రేడియల్ విభాగంలో 67 మంది, లేజర్ 4.7 కేటగిరీలో 35, ఆర్ఎస్:ఎక్స్ విభాగంలో 16, 470 క్లాస్ కేటగిరీలో 24 మంది, ఫిన్ కేటగిరీలో ఐదుగురు సెయిలర్లు పోటీపడ్డారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 470 క్లాస్: 1. అతుల్ లిండే– సీహెచ్ఎస్ రెడ్డి (ఏవైఎన్), 2. ప్రవీణ్ కుమార్– సుధాన్షు శేఖర్ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం), 3. సోను జాతవ్– ఆర్కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం). ఆర్ఎస్: ఎక్స్: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 3. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ 4.7 ఓపెన్: 1. రిషబ్ నాయర్ (వైసీహెచ్), సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్). లేజర్ 4.7 అండర్–16 బాలురు: 1. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. ఎ. సంజయ్ రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్ విశ్వకర్మ (ఎన్ఎస్ఎస్). లేజర్ 4.7 బాలికలు: 1. నిత్య బాలచంద్రన్ (టీఎన్‌ఎస్‌ఏ), 2. సంచిత పతం (ఈఎంఈఎస్), 3. ఆర్. అశ్విని (ఈఎంఈఎస్). లేజర్ 4.7 అండర్–18 బాలికలు: 1. జూహీ దేశాయ్ (వైసీహెచ్), 2. కె. రంజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ). ఫిన్: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్). లేజర్ స్టాండర్డ్ ఓపెన్: 1. మోహిత్ సైనీ (ఏవైఎన్), 2. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్), 3. గితేశ్ (ఏవైఎన్). లేజర్ స్టాండర్డ్ అండర్–21 యూత్: 1. పునీత్ కుమార్ సాహూ (ఐఎన్డబ్ల్యూసీటీ–ఎం), 2. నాగార్జున (టీఎస్సీ), 3. యమన్దీప్ (ఈఎంఈఎస్సీ). లేజర్ స్టాండర్డ్ అప్రెంటీస్ మాస్టర్: 1. బీకే రౌత్ (ఈఎంఈఎస్‌ఏ), 2. పర్వీందర్ సింగ్ (ఈఎంఈఎస్‌ఏ), 3. చంద్రకాంత రావు (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే). లేజర్ రేడియల్ ఓపెన్: 1. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 2. గితేశ్ (ఏవైఎన్), 3. ఇస్రాజ్ అలీ (ఏవైఎన్). లేజర్ రేడియల్ మహిళలు: 1. రమ్య శరవణన్ (ఏవైఎన్), 2. తను బిసేస్ (ఎన్ఎస్ఎస్), 3. అనన్య (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ రేడియల్ అండర్–19 యూత్: 1. రమ్య శరవణన్ (ఏవైఎన్), 2. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. ఎం. కోటేశ్వరరావు (టీఎస్సీ). లేజర్ రేడియల్ అప్రెంటీస్ మాస్టర్: 1. ధర్మేంద్ర (ఏవైఎన్), 2. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 3. బీకే శర్మ (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ రేడియల్ మాస్టర్: 1. సీడీఆర్ ఎంఎల్ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే). లేజర్ రేడియల్ గ్రేట్ గ్రాండ్‌మాస్టర్: 1. మురళీ కనూరి (ఎస్ఎస్సీ). -
ఆకట్టుకున్న దిలీప్ కుమార్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ మల్టీకాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ నాలుగోరోజు పోటీల్లో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ (ఈఎంఈఎస్‌ఏ) క్రీడాకారుడు దిలీప్ కుమార్ ఆకట్టుకున్నాడు. లేజర్ రేడియల్ విభాగంలో జరిగిన పోటీల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం జరిగిన మూడు రేసుల్లో రెండింటిలో తొలి మూడు స్థానాల్లో నిలిచాడు. పదో రేస్‌లో రన్నరప్‌గా నిలిచిన దిలీప్... పదకొండో రేస్‌లో మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పన్నెండో రేస్‌లో వాతావరణంతో పాటు గాలి గమనంలో విపరీతమైన మార్పులు రావడంతో దిలీప్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మెరుగైన స్థానంలో నిలిచాడు. ఆర్ఎస్: ఎక్స్ ఈవెంట్లోనూ ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ కమలపతి ఓజా రాణించాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లేజర్ స్టాండర్డ్ రేస్–10: 1. మోహిత్ సైనీ (ఏవైఎన్), 2. గితేశ్ (ఏవైఎన్), 3. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). రేస్–11: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్), 2. మోహిత్ సైనీ (ఏవైఎన్), 3. ఉపమన్యు దత్తా (ఐఎన్‌డబ్ల్యూటీసీ). రేస్–12: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్), 2. బీకే రౌత్ (ఈఎంఈఎస్‌ఏ), 3. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). లేజర్ రేడియల్ రేస్–10: 1. ఇస్రాజ్ అలీ (ఏవైఎన్), 2. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 3. గితేశ్ (ఏవైఎన్). రేస్–11: 1. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 2. ఎం. కోటేశ్వరరావు (టీఎస్సీ), 3. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ). రేస్–12: 1. రమ్య (ఏవైఎన్), 2. తను (ఎన్ఎస్ఎస్), 3. చింతన్ (ఈఎన్‌డబ్ల్యూటీసీ). ఆర్ఎస్: ఎక్స్ రేస్–10: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్‌సింగ్ (ఏవైఎన్), 3. మనోజ్ కుమార్ (ఏవైఎన్). రేస్–11: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కమలపతి (ఈఎంఈఎస్‌ఏ). రేస్–12: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కేదార్నాథ్ తివారీ (ఈఎంఈఎస్‌ఏ), 3. మన్‌ప్రీత్ (ఏవైఎన్). ఫిన్ రేస్–10: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. వివేక్ (ఏవైఎన్). రేస్–11: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. నవీన్ కుమార్ (ఏవైఎన్), 3. వివేక్ (ఏవైఎన్). రేస్–12: 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 3. నవీన్ (ఏవైఎన్). లేజర్ 4.7 రేస్–10: 1. కె. గౌతమ్ (వైసీహెచ్), 2. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. ఎన్. హేమంత్ (టీఎస్సీ). రేస్–11: 1. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. ఆశిష్ (ఎన్ఎస్ఎస్), 3. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్). రేస్–12: 1. నవీన్ కుమార్ (టీఎన్‌ఎస్‌ఏ), 2. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. కె. గౌతమ్ (వైసీహెచ్). -
అగ్రస్థానంలో ముజాహిద్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజూ అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. లేజర్ స్టాండర్డ్ విభాగంలో రెండు రోజులుగా సత్తా చాటుతోన్న మోహిత్ సైనీ శుక్రవారం జరిగిన రేసుల్లో వెనకబడగా... ముజాహిద్ ఖాన్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విభాగం ఏడో రేసులో ఇండియన్ నేవల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ ముంబైకు చెందిన ఉపమన్యు దత్తా, ఎనిమిదో రేసులో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన బీకే రౌత్, తొమ్మిదో రేసులో ముజాహిద్ ఖాన్ (ఆర్మీ యాటింగ్ నాడ్) విజేతలుగా నిలిచారు. ముజాహిద్ ఎనిమిదో రేసులోనూ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లేజర్ రేడియల్ రేస్–7: 1. గితేశ్ (ఏవైఎన్), 2. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 3. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్). రేస్–8: 1. సచిన్ సింఘా (ఈఎంఈఎస్‌ఏ), 2. ఎం. సురేశ్ కుమార్ (ఏవైఎన్), 3. రమ్య శరవణన్ (ఏవైఎన్). రేస్–9: 1. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 2. తరుణ్ భాటియా (ఎస్ఎస్సీ), 3. సచిన్ సింఘా (ఈఎంఈఎస్‌ఏ). 470 క్లాస్ రేస్–7: 1. ప్రిన్స్–మహేశ్ (ఏవైఎన్), 2. సోను–ఆర్కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 3. ప్రవీణ్‌కుమార్–సుధాన్షు (ఈఎన్‌డబ్ల్యూటీసీ). రేస్–8: 1. అతుల్–సీహెచ్ఎస్ రెడ్డి (ఏవైఎన్), 2. ప్రిన్స్ నోబెల్–మహేశ్ (ఏవైఎన్), 3. మను–ఎస్సీ సింఘా (ఈఎంఈఎస్‌ఏ). రేస్–9: 1. సోను–ఆర్కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 2. ప్రవీణ్–సుధాన్షు (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 3. అతుల్–సీహెచ్ఎస్ రెడ్డి (ఏవైఎన్). ఆర్ఎస్: ఎక్స్ రేస్–7: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ), 3. కె. అర్జున్ రెడ్డి (ఏవైఎన్). రేస్–8: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్ (ఏవైఎన్), 3.అర్జున్‌రెడ్డి (ఏవైఎన్). రేస్–9: 1. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 2. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ), 3. జెరోమ్ కుమార్ (ఏవైఎన్). ఫిన్ రేస్–7 : 1. గుర్జీత్ సింగ్, 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్). రేస్–8 : 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్). రేస్–9 : 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. వివేక్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్). లేజర్ 4.7 రేస్–7: 1. రిషబ్ నాయర్ (వైసీహెచ్), 2. ఎ. సంజయ్ రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. నవీన్ కుమార్(టీఎన్‌ఎస్‌ఏ). రేస్–8: 1. రామ్ మిలాన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. ఎన్. హేమంత్ (టీఎస్సీ), 3. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్). రేస్–9: 1. కె. గౌతమ్ (వైసీహెచ్), 2. సతీశ్‌యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. రిషబ్ నాయర్ (వైసీహెచ్). -
హైదరాబాద్‌లో సెయిలింగ్ సందడి
హైదరాబాద్: జాతీయ స్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ సన్నద్ధమైంది. ప్రతి ఏడాది ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ పేరిట జరుగనున్న ఈ టోర్నీని తొలిసారి ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది సెయిలర్లు ఇందులో తలపడతారని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ వైస్ కమాండర్, మేజర్ జనరల్ నారాయణ తెలిపారు. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా సెయిలర్లకు ర్యాంకులు కేటాయిస్తామని చెప్పారు. ఈ ర్యాంకులు జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అర్హతగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పోటీల్లో సీనియర్ మల్టీక్లాస్ ర్యాంకింగ్ రెగెట్టాతో పాటు, లేజర్ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు. సాగర్‌లో పరిశుభ్రత కార్యక్రమం... హైదరాబాద్ సెయిలింగ్ వీక్ జరుగనున్న నేపథ్యంలో ‘మిలిట్రీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్’ (ఎంసీఈఎంఈ) విద్యార్థులు ‘గ్రీన్ బ్రిగేడ్ వాక్’, ‘సేవ్ లేక్ క్యాంపెయిన్’, ‘ఫిట్ హైదరాబాద్ స్వచ్ఛ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 6000 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సరస్సులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఆయన హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొంటూ చెత్తా చెదారాన్ని తొలగించారు. వ్యాయామం ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన 3.5 కి.మీ నడకలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్ సంఘం గౌరవ కార్యదర్శి మేజర్ అలోక్‌కుమార్, లెప్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న అజహర్ -
రేపటి నుంచి సెయిలింగ్ శిబిరం
సాక్షి, హైదరాబాద్: సెయిలింగ్ క్రీడపై ఆసక్తి ఉన్న చిన్నారులకు మంచి అవకాశం. వేసవిలో ఈ క్రీడపై పట్టు పెంచుకునేందుకు వీలుగా ఈఎంఈ సెయిలింగ్ ఆసోసియేషన్ (ఈఎంఈఎస్‌ఏ) శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఆదివారం నుంచి హుస్సేన్‌సాగర్‌లో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. సెయిలింగ్‌లోని అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోనూ ఏప్రిల్ 1 వరకు శిక్షణనిస్తారు. ఆసక్తి గల వారు ఆదివారం ఉదయం 11 గంటలలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం హుస్సేన్‌సాగర్ సమీపంలోని ఈఎంఈ సెయిలింగ్ క్లబ్‌ను సందర్శించాలి. -
అగ్రస్థానంలో విజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు రాష్ట్ర సెయిలర్ల హవా కొనసాగింది. హుస్సేన్ సాగర్ జలాల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన విజయ్ సబావత్, దుర్గాప్రసాద్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. శనివారం రెండు రేసులు ముగిసేసరికి విజయ్ 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దుర్గాప్రసాద్ 10 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. తమిళనాడుకు చెందిన నీలానంద్ 12 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ సెయిలింగ్ సంఘం, హైదరాబాద్ యాట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో ఆరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 71 మంది సెయిలర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీ మంగళవారంతో ముగుస్తుంది.