
సెయిలింగ్ విజేత కుషాల్, హర్షిత జోడి
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ సెయిలింగ్ సంఘానికి చెందిన కుషాల్, హర్షిత జోడి చాంపియన్‌గా నిలిచింది. హుస్సేన్ సాగర్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఏడు రేసుల్లో ఓవరాల్‌గా 9 పాయింట్లు సాధించి ఈ జోడి అగ్రస్థానాన్ని సంపాదించింది.
తెలంగాణ సెయిలింగ్ సంఘంకు చెందిన రెండు జట్లు... రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దిలీప్, ఐశ్వర్య (తెలంగాణ) జోడి 12 పాయింట్లు సాధించి రన్నరప్‌గా నిలవగా... జస్‌ప్రీత్ సింగ్, రాగిణి (తెలంగాణ) జోడి 18 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ అమ్మాయి అరుంధతికి బెస్ట్ యంగెస్ట్ సెయిలర్ అవార్డు లభించింది.