
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో అదరగొట్టారు. మైసూర్‌లో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో వైష్ణవి వీరవంశం, కొమరవెల్లి లాహిరి స్వర్ణ పతకాలు సాధించారు. తనూజా కామేశ్వర్, సాహిత్ బండారం రజత పతకాలు నెగ్గగా... లావేటి ఝాన్సీప్రియ, అమితవ వీరారెడ్డి కాంస్య పతకాలు గెలిచారు. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోచ్ సుహీమ్ షేక్ మాట్లాడుతూ భవిష్యత్‌లో హైదరాబాద్ సెయిలర్లు మరిన్ని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.