Youth Championship
-
పార్థ్ సాలుంకే ‘స్వర్ణ’ చరిత్ర
లిమెరిక్ (ఐర్లాండ్): భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి చరిత్ర లిఖించాడు. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తంమీద ఈ పోటీల్లో భారత బృందం మునుపెన్నడు లేని విధంగా ఈ టోర్నీలోనే అత్యధికంగా 11 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది. అండర్ –21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సాలుంకే... ఆర్చరీలో ఘనాపాటిలైన కొరియన్‌ను కంగుతినిపించాడు. ఫైనల్లో పార్థ్ 7–3తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ను ఓడించాడు. ప్రత్యేకించి పురుషుల రికర్వ్‌లో బంగారు పతకం సాధించిన తొలి ఆర్చర్‌గా పార్థ్ సాలుంకే ఘనత వహించాడు. మహిళల రికర్వ్‌లో ఇదివరకే దీపిక కుమారి (2009, 2011), కొమలిక బారి (2019, 2021) బంగారు పతకాలు సాధించారు. మహిళల అండర్–21 వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. భజన్ కౌర్ 7–1తో చైనీస్ తైపీకి చెందిన సు సిన్ యూపై నెగ్గింది. Parth Salunkhe's PURE DETERMINATION. 👏 India has the new 2023 World Archery Youth Champion. 🇮🇳🇮🇳🇮🇳#WorldArchery pic.twitter.com/rTDPYDCDBA — World Archery (@worldarchery) July 9, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
ఆరు పతకాలతో అదరగొట్టిన హైదరాబాదీలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో అదరగొట్టారు. మైసూర్లో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో వైష్ణవి వీరవంశం, కొమరవెల్లి లాహిరి స్వర్ణ పతకాలు సాధించారు. తనూజా కామేశ్వర్, సాహిత్ బండారం రజత పతకాలు నెగ్గగా... లావేటి ఝాన్సీప్రియ, అమితవ వీరారెడ్డి కాంస్య పతకాలు గెలిచారు. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోచ్ సుహీమ్ షేక్ మాట్లాడుతూ భవిష్యత్‌లో హైదరాబాద్ సెయిలర్లు మరిన్ని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
వెంకన్న, సిద్ధయ్యలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు సత్తా చాటుకున్నారు. బీహార్‌లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో చివరి రోజు ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు పి.వెంకన్న బాబు (94 కేజీలు) రెండు స్వర్ణాలు, ఒక రజతం... డి. సిద్ధయ్య (ప్లస్ 94 కేజీలు) మూడు స్వర్ణాలు సాధించారు. వెంకన్న బాబు స్నాచ్ (112 కేజీలు) అంశంలో రజతం నెగ్గగా... క్లీన్ అండ్ జెర్క్ (140 కేజీలు), ఓవరాల్ టోటల్ (252 కేజీలు) విభాగాల్లో బంగారు పతకాలు నెగ్గాడు. సిద్ధయ్య స్నాచ్ (98 కేజీలు), క్లీన్ అండ్ జెర్క్ (127 కేజీలు), ఓవరాల్ టోటల్ (225 కేజీలు) అంశాల్లో మూడు స్వర్ణాలు సాధించాడు. ఓవరాల్‌గా యూత్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.