వెంకన్న, సిద్ధయ్యలకు స్వర్ణాలు | Youth championship team was runner-up in Andhra Pradesh. | Sakshi
Sakshi News home page

వెంకన్న, సిద్ధయ్యలకు స్వర్ణాలు

Published Sat, Feb 27 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

వెంకన్న, సిద్ధయ్యలకు స్వర్ణాలు

వెంకన్న, సిద్ధయ్యలకు స్వర్ణాలు

సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు సత్తా చాటుకున్నారు. బీహార్‌లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో చివరి రోజు ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు పి.వెంకన్న బాబు (94 కేజీలు) రెండు స్వర్ణాలు, ఒక రజతం... డి. సిద్ధయ్య (ప్లస్ 94 కేజీలు) మూడు స్వర్ణాలు సాధించారు. వెంకన్న బాబు స్నాచ్ (112 కేజీలు) అంశంలో రజతం నెగ్గగా... క్లీన్ అండ్ జెర్క్ (140 కేజీలు), ఓవరాల్ టోటల్ (252 కేజీలు) విభాగాల్లో బంగారు పతకాలు నెగ్గాడు. సిద్ధయ్య స్నాచ్ (98 కేజీలు), క్లీన్ అండ్ జెర్క్ (127 కేజీలు), ఓవరాల్ టోటల్ (225 కేజీలు) అంశాల్లో మూడు స్వర్ణాలు సాధించాడు. ఓవరాల్‌గా యూత్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement