ఒడ్డున చేరే అలల్లాంటివి వారి జీవితాలు.. ఐనప్పటికీ ఎగిసిపడే కెరటాల్లా తెరచాపలై దూసుకపోతోంది వారి చైతన్యం. చాలామందికి సెయిలింగ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని తరుణంలో.. ఇదే సెయిలింగ్‌లో నేషనల్ చాంపియన్‌లుగా నిలుస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.. పేదరికం అడ్డంకి కాకుండా యాచ్ క్లబ్ అందిస్తున్న సహకారంతో రసూల్‌పుర ఉద్భవ్ స్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్న కొమరవెల్లి దీక్షిత, కొమరవెల్లి లాహరిలు టాప్ సెయిలింగ్ సిస్టర్స్‌గా రాణిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగానే కాకుండా భారత్ తరపున విదేశాల్లోనూ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటూ దేశ కీర్తికి భవిష్యత్ వారధులుగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో నగరానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహా్వల్, పీవీ సింధూ, నిఖత్ జరీనా రాణించినట్టే.. రానున్న కాలంలో సెయిలింగ్ క్రీడకూ ఈ అక్కాచెల్లెళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారతారేమో..
ముంగ్గురు ఆడపిల్లలున్న కుటుంబం అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు.. సామాన్య జీవనమే గగనమైన తరుణంలో అనితర సాధ్యమైన సెయిలింగ్ పోటీల్లో చాంపియన్‌లుగా నిలుస్తున్నారంటే ఆ అక్కా చెళ్లెల్ల ఆత్మ స్థైర్యమేంటో ఊహించవచ్చు. వీరి సామర్థ్యాలను గుర్తించిన నగరంలోని యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు సుహేమ్ షేక్ వారి విద్యతో పాటు సెయిలింగ్ శిక్షణకు సహాకారం అందిస్తున్నారు. అందివచి్చన సహకారాన్ని వినియోగించుకుంటూ..
ఈ హైదరాబాదీ సెయిలర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. సౌత్ కొరియా, భారత్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దీక్షిత కొమురవెళ్లి పోటీపడింది. ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న మరో అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకం కోసం పోరాడుతోంది. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో చెయి విరగడంతో లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు వెళ్లలేకపోయానని లహరి బాధను వ్యక్తం చేసింది.
అయితే కొన్ని రోజుల క్రితమే నగరం వేదికగా జరగిన 15వ మాన్‌సూన్ రెగట్టా పోటీల్లో అదే గాయంతోనే పోటీ చేసి అందరి ప్రశంసలను పొందింది చెల్లి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మొదటమ్మాయి కూడా సెయిలింగ్‌లో ప్రవేశముంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెయిలింగ్‌ను కొనసాగించలేకపోయిందని తల్లి కవిత తెలిపింది. పిల్లల చదువులు, సెయిలింగ్ శిక్షణతో పాటే తనకు కూడా యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో వంట వండటానికి ఉద్యోగమిచ్చి ఉపాధి అవకాశాన్ని కల్పించారని సంతోషాన్ని వ్యక్తం చేసింది.
దీక్షిత విజయాలు–పతకాలు
కాంస్యం– అప్టిమిస్ట్ బాలికల విభాగం
వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల
విభాగం 14వ మాన్‌సూన్ రెగట్టా 2023.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల
విభాగం వైఏఐ యూత్ నేషనల్స్ 2023.
వెండి పతకం–
ఆప్టిమిస్ట్ వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023.
వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం
వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల
విభాగం సెయిల్ ఇండియా 2024.
వెండి పతకం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ
నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం
2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2024.
బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 15వ మాన్‌సూన్ రెగట్టా 2024.
లహరి విజయాలు–పతకాలు..
బంగారు పతకం– ఆప్టిమిస్ట్
బాలికల విభాగం, మొదటి
వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2023.
వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023.
కాంస్యం– ఆప్టిమిస్ట్ వైఏఐ
యూత్ నేషనల్స్ 2022.
కాంస్యం– ఆప్టిమిస్ట్ 2వ
వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.
వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.
ప్రతిష్ఠాత్మక సెయిలింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు..
లండన్, కొరియాలో దీక్షిత,
నేషనల్స్‌లో లహరి రాణింపు..
విద్య, సెయిలింగ్‌లో
యాచ్ క్లబ్ సహాయం
Comments
Please login to add a commentAdd a comment