
స్పెయిన్ వేదికగా జరిగిన గ్రాన్ కెనేరియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా సెయిలర్ నేత్రా కుమనన్ స్వర్ణ పతకంతో మెరిసింది. ఆరు రేసుల పాటు జరిగిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆమె 10 నెట్ పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. తొలి మూడు రేసుల్లో నేత్ర విజేతగా నిలవగా... అనంతరం జరిగిన నాలుగో రేసులో మూడో స్థానంలో, ఐదో రేసులో నాలుగో స్థానంలో నిలిచింది. బెనీటో లాంచో రజతాన్ని, మార్టినా రినో కాంస్యాన్ని సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment