ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కు ఏకైక స్వర్ణ పతకం దక్కింది. అల్బేనియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ చిరాగ్ చికారా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
అబ్దీమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో జరిగిన ఫైనల్లో చిరాగ్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (2022లో) తర్వాత ప్రపంచ అండర్–23 చాంపియన్íÙప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ రెజ్లర్‌గా చిరాగ్ గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment