క్వాలిఫయింగ్ టోర్నీలో భజన్ కౌర్‌కు స్వర్ణం
అంటాల్యా (టర్కీ): మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఈవెంట్‌లో భారత ఆర్చర్ భజన్ కౌర్ స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఫైనల్లో భజన్ కౌర్ 6–2 (28–26, 29–29, 29–26, 29–29)తో మొబీనా ఫలా (ఇరాన్)పై విజయం సాధించింది.
భారత స్టార్ ఆర్చర్ ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి నిరాశ పరిచింది. నేరుగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక 4–6 (28–26, 27–25, 23–26, 24–25, 27–29) తో యెలాగుల్ రమజనోవా (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయింది.
భారత్‌కే చెందిన అంకిత 4–6 (27–27, 27–28, 29–27, 27–27, 28–29)తో మొబీనా ఫలా (ఇరాన్) చేతిలో పరా జయం పాలైంది. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మిక్స్‌డ్ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment