
ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో.. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అంకిత తడబడటం... భజన్ కౌర్ రాణించినా ఫలితం లేకపోవడంతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 0–6 (51–52, 49–54, 48–53)తో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. దీపిక, అంకిత ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీపిక, అంకిత సంధించిన బాణాలకు 4,6,7 పాయింట్లు కూడా రావడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment