సెయిలింగ్ చాంప్స్ కౌషల్, విష్ణు జోడి | koushal, vishnu pair won sailing championship | Sakshi
Sakshi News home page

సెయిలింగ్ చాంప్స్ కౌషల్, విష్ణు జోడి

Published Sat, Aug 20 2016 12:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

koushal, vishnu pair won sailing championship

సాక్షి, హైదరాబాద్: హోబీ-16 ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో కౌషల్ కుమార్ యాదవ్, విష్ణు ప్రసాద్ జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరిగిన 10 రేసుల్లో ఈ జోడి 12 పాయింట్లు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా... జస్‌ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ జోడి 26 పాయింట్లతో రెండో స్థానంలో, ఆశిష్ కుమార్, నగి బెహరా జోడి 29 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాయి.


 రెండో రోజు ఫలితాలు


 ఏడో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. దిలీప్ సర్మాహ్- దర్శన్ 3. జస్‌ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. ఎనిమిదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. ఆశిష్ కుమార్- నగి బెహరా, 3. జస్‌ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. తొమ్మిదో రేసు: 1. జస్‌ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్, 2.  కౌషల్ -విష్ణు ప్రసాద్, 3. ఆశిష్ కుమార్- నగి బెహరా. పదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. అమన్‌కుమార్- యాసన్ అలీ, 3. జస్‌ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్.     

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement