koushal
-
సింగిల్ టేక్‌లో రెండు పేజీల డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచిన బిగ్‌బాస్ కౌశల్
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ సినిమాలో చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. కౌశల్ చెప్పిన అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్‌ను ఈ రోజు మధ్యహ్నం చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్‌ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’కు విజయం తధ్యం
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. ‘అతడు ఆమె ప్రియుడు’చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’ ట్రైలర్ వచ్చేసింది
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన "అతడు ఆమె ప్రియుడు" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. -
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం (యూఎస్ఏ) సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. ఆయన నా దర్శకత్వంలో రూపొంది మంచి విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందర’ చిత్రాలకు రచయితగా పని చేశారు. యండమూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని’ అన్నారు. యండమూరి మాట్లాడుతూ... ‘రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. చదవండి: హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి! -
బిగ్‌బాస్: కౌశల్‌కు కరోనా భయం, ఏం జరిగిందంటే!
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతంగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం కరోనా కోరలు చాస్తోంది. దీంతో పలు షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే 50 మందికి మించకుండ షూటింగ్ నిర్వహించాలనే నిబంధనల మేరకు కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుకుంటున్నారు. అయినప్పటికి నటీనటులు ఇతర చిత్ర బృందంలోని వ్యక్తులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో మిగతా వారంత కరోనా పట్ల ఆందోళన చెందుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్‌కు సైతం కరోనా భయం పట్టుకుంది. దీంతో అతడు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలినట్లు వెల్లడించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్ మోడలింగ్‌లో దూసుకుపోతున్నాడు. దీంతో అతడు నెల రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని దీంతో కౌశల్ ఇంటి దారి పట్టక తప్పలేదు. ఇక నెల రోజుల తర్వాత భార్య పిల్లలను కలుస్తుండటంతో అతడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని, ఎప్పుడైనా ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) చదవండి: బిగ్‌బాస్: లైవ్‌లో రెమ్యూనరేషన్ బయట పెట్టిన కంటెస్టెంట్ టాలీవుడ్లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం -
కౌశల్ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?
బిగ్‌బాస్ సెకండ్ సీజన్ పాపులర్ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్ కౌశల్. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో.. బయటకు వచ్చాక అంతకు మించి చేశాడు. గొప్పలకు పోయి ఎన్నో తిప్పలు పడ్డాడు. పీఎమ్ఓ ఆఫీస్ నుంచి తనకు కాల్ వచ్చిందని, డాక్టరేట్ పట్టా ఇవ్వనున్నట్లు ఇలా ఏవోవే చెప్పి నవ్వులపాలయ్యాడు. అయితే బిగ్‌బాస్ తెచ్చిన పాపులార్టీని ఉపయోగించుకుని ఏదో చేద్దామనుకున్న కౌశల్‌కు ఎలాంటి ప్రయోజనం కలగలేదనిపిస్తోంది. కౌశల్ పేరిట ఓ ఆర్మీ అప్పట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ చేసిన పోరాటానికి అతని ఫాలోవర్స్ 2కే రన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కౌశల్ ఆర్మీపైనా.. ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీని ద్వారా ఏర్పాటు ఫౌండేషన్, సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నంటి ద్వారా కౌశల్ పేరు మీడియాలో మార్మోగిపోయింది. కౌశల్ ఆర్మీని నడిపించిన అభిమానులు రోడ్డు మీదకు రావడం, మీడియా గడపలు తొక్కడం ఎంతటి దుమారం లేపిందో అందరికీ తెలిసిందే. అయితే మరో సారి కౌశల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న కౌశల్‌ను.. మీడియా ప్రతినిధి ఓ ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్నకు కౌశల్ చెప్పిన సమాధానం మూలంగా అతడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. బిగ్‌బాస్ మూడో సీజన్లో టాప్3 కంటెస్టెంట్ల పేర్లు చెప్పండని రిపోర్టర్ అడగా.. నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ అంతా వారికే సపోర్ట్ చేస్తుంది.. అప్పుడు మిగతావారికి అన్యాయం జరుగుతుంది అని సమాధానం చెప్పాడు. ఇక ఈ విషయంపై నెటిజన్లు కౌశల్ ఏకిపారేస్తున్నారు. ఇంకా అదే భ్రమలో ఉన్నాడా? ఇంకా ఆ ఆర్మీ ఉందా? అంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తుండగా.. అతని ఫాలోవర్స్ మాత్రం మంచి సమాధానమిచ్చావ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. -
బిగ్‌బాస్ : కౌశల్ టాప్ త్రీ లో ఉండడట!
బయట కౌశల్ ఆర్మీ విజృంభిస్తుంటే.. లోపల మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన శ్యామలను నాని.. టాప్ త్రీలో ఎవరు ఉంటారని అడిగితే.. కౌశల్ పేరు చెప్పలేదు. అసలే కౌశల్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ పేరును చెప్పలేదని శ్యామలను విపరీతంగా ట్రోల్చేశారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన అమిత్ కూడా ఇదే బాటలో సాగుతూ.. రోల్‌రైడా, గీతా, సామ్రాట్ టాప్ త్రీలో ఉంటారని.. రోల్, సామ్రాట్ ఇద్దరిలో ఏవరైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. సోషల్ మీడియాలో కౌశల్‌కు సపోర్ట్‌గా భారీగానే మద్దతు లభిస్తోంది. అయితే అది పెయిడ్ క్యాంపెన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్ల గురించి చాలానే చర్చ జరుగుతుంది. దీప్తి తరపున కూడా పెయిడ్ క్యాంపెన్ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్గా కౌశల్ ఫాలోవర్స్ నిర్వహించిన 2కే రన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపైనా.. పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కౌశల్ విన్నర్ కావాలని, అవుతాడని సోషల్ మీడియా కోడై కూస్తుంటే.. హౌజ్‌మేట్స్ మాత్రం కౌశల్ పేరు అసలే ప్రస్తావించడం లేదు. వాళ్లు కావాలని అలా అంటున్నారో, ఏదైనా పథకం ప్రకారం మాట్లాడుతున్నారో తెలియదు కానీ కౌశల్ మాత్రం టాప్త్రీలో గాని, ఫైనల్లోగానీ ఉంటాడని పొరపాటున కూడా చెప్పడం లేదు. బయట జరిగే టీవీ షోల్లో... పాల్గొనే వ్యక్తులు మాత్రం కౌశల్ విన్నర్ అవుతాడని చెప్పుకొస్తున్నారు. మాధవీలత, సంజన, యాంకర్ రష్మీ ఇలా ఎంతోమంది కౌశలే బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడికి ఓట్లు ఎక్కువ వచ్చాయని, అయినా సరే కావాలనే నూతన్‌ను ఎలిమినేట్ చేశారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రజల ఓట్లకు వ్యతిరేకంగా బిగ్‌బాస్ నిర్ణయం తీసుకున్నాడని.. బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ షోలో బిగ్‌బాస్ చెప్పిందే జరుగుతుంది.. చెయ్యాలనుకున్నదే చేస్తాడు.. కాబట్టి ఏదైనా జరుగొచ్చు. బయటి విషయాలతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ వ్యవహరిస్తాడేమో చూడాలి. అయినా ఈ కార్యక్రమం కూడా చివరి అంకానికి చేరుకుంది కాబట్టి... ఇంకా షో లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. చివరకు ఎవరు మిగులుతారో.. ఎవరు టైటిల్ కొడతారో చూడాలి. -
బిగ్‌బాస్ : దీప్తి ఎలిమినేషన్ ఖాయం!
బిగ్‌బాస్ షో చివరి అంకానికి రాబోతోంది. ఇక మిగిలింది కొన్ని రోజులే. దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సాగిన బిగ్‌బాస్ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ, పూజ, తనీష్, కౌశల్‌లో మరి తనీష్, కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఎలిమినేషన్ అంటే చాలు తెగ టెన్షన్ పడిపోయి, గాబర పడిపోయే దీప్తి గతవారం ఆ ప్రక్రియలో లేకపోయేసరికి కాస్త ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈ సంబరం ఎంతో సేపు లేదు. ఈ వారం మళ్లీ నామినేషన్లోకి వచ్చాక.. తనలో మళ్లీ అదే టెన్షన్. అందరితో కలిసి ఉన్నానని, ఎవరు తనను నామినేట్ చేసుంటారా అని గణేష్‌తో తన గోడును వెల్లిబుచ్చుకుంటుంటే.. కౌశల్ మధ్యలో వచ్చి.. ‘తనను ఎవరు నామినేట్ చేసుంటారో తనకు ఐడియా ఉంద’ని.. నామినేషన్లోకి రావాలంటే మినిమమ్ నాలుగు ఓట్లైనా రావాలని.. మరి ఎవరు వేశారో ఆలోచించుకోండంటూ దీప్తితో చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్లోకి వచ్చింది. మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్ చేస్తారో లేదో చూడాలి. లేక బిగ్‌బాస్ ఏదైనా ట్విస్ట్ అని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చూసుకుంటే ఈ సారి దీప్తి, పూజలపై వేటు పడే అవకాశమే ఎక్కువ. ఎందుకుంటే కౌశల్ ఎలాగూ సేవ్ అయిపోతాడు అది వేరే విషయం.. తనీష్‌పై సోషల్ మీడియాలో నెగెటివిటి ఉన్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి.. దీప్తి చేసే చేష్టలకు, అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. పూజకు మరీ అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి తను కూడా వెళ్లే అవకాశమూ ఉంది. ఈ వారాంతానికి షోలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో? ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్. -
బిగ్‌బాస్ : గాయంతో నూతన్ ఔట్!
ఏదైనా జరుగొచ్చు అంటే ఏంటో శుక్రవారం నాటి బిగ్‌బాస్ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. అంతా సరిగానే ఉందనకునే సమయానికి టాస్క్‌లో నూతన్ నాయుడికి గాయం అవడం.. అతన్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తున్నట్లు బిగ్‌బాస్ తెలపడం.. హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేం ఏం జరిగిందో చూద్దాం.. పబ్లిక్ కాలర్స్ వర్సెన్ బిగ్‌బాస్ హౌస్ కాల్ సెంటర్ టాస్క్‌లో బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్లుగా కౌశల్, రోల్ రైడాలను హౌస్మేట్స్ ఎంచుకున్నారు. అనంతరం వీరిద్దరికి కెప్టెన్సీ టాస్క్‌ను వివరించాడు బిగ్‌బాస్. ‘గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు టేబుల్స్‌పై రెడ్, గ్రీన్ బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులతో పిరమిడ్ నిర్మించాలి. ఆ క్రమంలో మిగతా హౌస్మేట్స్ వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ బాక్సులు, పిరమిడ్ ఆకారంలో పేర్చి కాపాడుకుంటారో వారే విజేతలు. ఈ టాస్కుకు పూజ సంచాలకులుగా వ్యవహరిస్తార’ని టాస్క్‌ను వివరించాడు. ఇక ఈ ఆటలో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయం తెలిసిందే. బజర్ మోగగానే.. కౌశల్ గ్రీన్ బాక్సులున్న టేబుల్‌ను ఎంచుకుని పిరమిడ్‌ను నిర్మిస్తుండగా.. గణేష్, తనీష్, సామ్రాట్, అమిత్‌లు అందరూ కలిసి కౌశల్‌ను చుట్టుముట్టేశారు. ఏకధాటిగా బంతుల వర్షం కౌశల్‌పై కురిపించారు. మరో వైపు రోల్ రైడాను టార్గెట్ చేస్తూ... గీత, దీప్తి, శ్యామల బంతులను గురి పెట్టారు. కానీ, వారి ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న రోల్‌రైడా పిరమిడ్‌ను నిర్మించేసి.. గట్టిగా పట్టుకుని కాపాడుకుంటూ ఉన్నాడు. కౌశల్ పిరమిడ్‌ను నిర్మించడం సంగతేమో కానీ, కనీసం ఆ బాక్సులను కూడా కాపాడుకోలేకపోయాడు. ఇక కౌశల్ మద్దతుదారులైన గీత, శ్యామల, నూతన్‌ల సలహా మేరకు ఆడుతూ.. కిందపడిపోయిన బాక్సులను తీసుకుంటూ.. వాటిని పిరమిడ్‌లా పేర్చుతూ ఉన్నాడు. ఇక రోల్ రైడాను ఏమాత్రం టార్గెట్ చేయని తనీష్, సామ్రాట్, గణేష్, అమిత్‌లు.. కౌశల్‌ను మాత్రం గట్టిగానే రౌండప్ చేశారు. కౌశల్ స్నేహితుడైన నూతన్.. రోల్ రైడా నిర్మించి, కాపాడుకుంటున్న పిరమిడ్‌ను కూల్చే ప్రయత్నం చేశాడు. రోల్ రైడాపై ధాటిగా బంతులతో దాడి చేశాడు. నూతన్ ఈ క్రమంలో పూజతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మళ్లీ రోల్ రైడాను టార్గెట్ చేసి బంతులు విసురుతుండగా.. నూతన్ భుజానికి గాయమైంది. అంతకు ముందే అతని భుజానికి గాయమైందని తెలిపిన నూతన్‌ను.. తనీష్, గణేష్‌లు కన్ఫెషన్ రూమ్‌కు తీసుకెళ్లారు... వైధ్యుల బృందం వచ్చి పరీక్షించసాగారు. ఈ సమయంలో కౌశల్‌కు కొంత సమయం దొరికింది కానీ.. సామ్రాట్, అమిత్‌ల ధాటికి వాటిని కాపాడుకోవడం కష్టమైంది. ఇక టాస్క్ ముగిసే సమయానికి కౌశల్ 69, రోల్ రైడా 76 బాక్సులతో పిరమిడ్‌ను నిర్మించారు. ఈ టాస్క్‌లో రోల్ రైడా విజయం సాధించినట్లు పూజ బిగ్‌బాస్‌కు తెలిపింది. అనంతరం.. కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న నూతన్‌కు.. తీవ్రగాయమైనందువల్ల, వైద్యుల సలహా మేరకు తనను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపి వైద్యం అందించాలనుకుంటున్నామని బిగ్‌బాస్ తెలిపాడు. కౌశల్‌ను కన్ఫెషన్ రూమ్‌కు రావాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తనను హౌస్‌లోంచి బయటకు వెళ్లమంటున్నారని నూతన్ కౌశల్‌కు తెలిపాడు. అనంతరం ఇంటి సభ్యులందరికి...నూతన్ భుజానికి తీవ్ర గాయమైనందున నూతన్‌ను హౌస్ నుంచి బయటకు పంపేస్తున్నామని బిగ్‌బాస్ తెలిపాడు. ఒకవైపేమో.. నూతన్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచారని.. మళ్లీ ఇంటిలోకి వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న నూతన్ నాయుడు, దీప్తి సునయన, రోల్ రైడా, పూజా రామచంద్రన్, శ్యామల, గీతా మాధురి,లో ఎవరు ఎలిమినేట్ కానున్నారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. దీప్తి సునయన ఎలిమినేట్ కానుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనపై పెరిగిన నెగెటివిటినే ఇందుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మరి ఇంతకి ఎవరు ఎలిమినేట్ కానున్నారో, ఏం జరుగనుందో చూడాలి. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.. ఏదైనా జరుగొచ్చు. -
బిగ్‌బాస్ : అసలు మజా ఈ వారమే!
బిగ్‌బాస్ అంటేనే ఏదైనా జరుగొచ్చు. అది హౌజ్‌మేట్స్ పిచ్చితనం వల్ల కావచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల వల్ల కావచ్చు. ఎందుకంటే సోమవారం కార్యక్రమంలో ఏదో అనుకుంటే ఇంకెదో జరిగింది. కెప్టెన్ అయినందుకు తనీష్, కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ దృష్ట్యా అమిత్ ఈసారి కూడా ఎలిమినేషన్ పక్రియలో చోటు లేదు. మిగతా ఇంటి సభ్యులందరిని ఇద్దరి చొప్పున ఓ జట్టు కట్టారు. ‘వారిలోంచి ఒకరు సేవ్ అవుతారు. మరొకరు డేంజర్‌జోన్‌లోకి వెళ్లి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారు. అయితే ఇందులో ఎవరి కారణాలు వారు విన్నవించుకోవచ్చు. ఆ కారణాలను పరిగణలోకి తీసుకుని తనీష్, అమిత్‌లు ఎవరిని సేవ్ చేయాలో, ఎవరిని డేంజర్ జోన్లో ఉంచాలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ ఈ వారం నామినేషన్ ప్రక్రియ’ అంటూ బిగ్‌బాస్ తెలిపాడు. అయితే బిగ్‌బాస్ ఇచ్చింది ఒకటి. అక్కడ జరిగిందొకటి. ఎలిమినేషన్‌లోంచి సేవ్ అయి బయటకు వచ్చిన వారు కూడా తనీష్, అమిత్‌లతో పాటుగా నిర్ణయం తీసుకున్నారు. సరే అదంతా వదిలేద్దాం.. వారంతా ఏం చేసినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. సేవ్ అయి బయటకు వచ్చిన వారు, డేంజర్ జోన్లోకి వెళ్లి నామినేట్ అయిన వారి కథ ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు డేంజర్ ప్లేసుల్లో ఐదు జంటలు నిలబడ్డాయి. సామ్రాట్-పూజ, గీతామాధురి-కౌశల్, నూతన్ నాయుడు-దీప్తి, శ్యామల-దీప్తి సునయన, రోల్ రైడా-గణేష్‌లు ఐదు జంటలుగా నిలబడ్డారు. మొదటి బెల్ మోగగానే సామ్రాట్, పూజలు వచ్చి వారు హౌజ్‌లో ఎందుకు ఉండాలనే కారణాలను చెప్పుకొచ్చారు. మొదట్నుంచీ నెగెటివ్‌గా ఉంటూ ఈ మధ్యే కొంచెం మారుతు.. పాజిటివ్ వైపు వస్తున్నానని, నా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇంకాస్త సమయం కావాలంటూ.. సామ్రాట్ తన కారణాలను వెల్లడించాడు. నేను వచ్చింది మధ్యలోనే ఇంకాస్త సమయం కావాలి అందరిని అర్థం చేసుకోవడానికి,అందరితో కలిసిపోవడానికి అంటూ పూజ చెప్పుకొచ్చింది. ఇక తనీష్, అమిత్‌లు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి.. పడుతూ, లేస్తూ.. ఎత్తు పల్లాలు చూసి .. ఇప్పుడిప్పుడే తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడని.. సామ్రాట్‌ను సేవ్ చేసి పూజను డేంజర్ జోన్లోకి పంపాడు. ఇక బయటకు వచ్చిన సామ్రాట్ వారిద్దరు కలిసి తీసుకునే నిర్ణయాల్లో తలదూర్చాడు. రెండో జంటగా.. కౌశల్, గీతా మాధురిలు వచ్చారు. తాను హౌజ్‌లో మొదటునుంచీ, ఒంటరి పోరాటం చేస్తున్నానని, బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్లోనైనా.. మానసికంగా, శారీరకంగా తన వంతు కృషి చేస్తున్నాని, ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని కౌశల్ తన కారణాలను తెలిపాడు. హౌజ్‌లో తాను ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదని, ప్రశాంత వాతావరణం ఉంటుందని, అందరితో కలిసి బాగుంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాని గీత తన కారణాలను తెలిపింది. తనీష్, సామ్రాట్, అమిత్‌లు చర్చించుకుని.. గత వారం ఎలిమినేషన్ తనను డిస్సాప్పాయింట్ చేసిందని గీత అన్నారని.. హౌజ్‌లో ఇక ముందు టాస్క్‌లు అలానే ఉంటాయని తనీష్ చెప్పి.. కౌశల్‌ను సేవ్ చేశాడు. గతంలో తన కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడని.. ఇప్పుడు గణేష్ కోసం రోల్ రైడా తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పి గణేష్‌ను సేవ్ చేశాడు. ఇక నూతన్ నాయుడు, దీప్తిలది మరో విచిత్రం. దీప్తి తాను హౌజ్‌లో ఉండడానికి గల కారణాలను తనేదో తన భాషలో చెప్పుకొచ్చింది. ఇక నూతన్ నాయుడు మాత్రం మిత్ర ధర్మం అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. కానీ, తాను ఉండటానికి గల కారణాలను చెప్పలేకపోయాడు. ఇక అంతిమ నిర్ణయం తీసుకోవడానికి అమిత్, తనీష్, సామ్రాట్ , కౌశల్‌లు చర్చించుకుని.. గత కొన్ని వారాలుగా టాస్కుల్లో బాగా చేస్తుందని, ఎంతో కష్టపడుతోందని దీప్తిని సేవ్ చేశారు. ఇక శ్యామల, దీప్తి సునయనలది మరో గాథ. తాను మొదట్నుంచీ అందరితో బాగున్నాని, మొదటి వారంలో కెప్టెన్ లేకపోయినా అందరి బాగోగులు చూసుకున్నానని, తానుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటానని శ్యామల తన కారణాలను చెప్పుకొచ్చింది. మొదట్లో గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదనీ, ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నానని, హౌజ్‌లో ఉంటే ఇంక ఎంతో నేర్చుకుంటానని తన కారణాలను వివరించింది. అయితే ఈ అంతిమ నిర్ణయంలో.. తనీష్ రాకుండా.. అమిత్, సామ్రాట్, కౌశల్‌ను ముందుకు పంపాడు. తాను కూడా ఉంటే నిర్ణయం వేరే లాగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక్కడే తనెంత బలహీనుడో తెలిసేలా చేశాడు. ఈ నిర్ణయంలో కూడా పాల్గొని ఇద్దరి కారణాలను, వారి ప్రతిభను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే.. ప్రేక్షకుల దృష్టిలో ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేవాడు. కానీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. దీప్తి సునయన హౌజ్‌లో ఉండేందుకు గల కారణాలను చెబుతుండగా.. కౌశల్ మధ్యలో కలగజేసుకుని శ్యామల కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నావా? అని అడిగితే.. కాదని ఒప్పుకుంది. అయితే వీరిద్దరిలో ఎవరిని సేవ్ చేయాలని అమిత్, కౌశల్, సామ్రాట్లు చర్చించుకుని.. తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని ఒప్పుకోవడం వల్ల.. అందరం ఓ ఏకాభిప్రాయానికి వచ్చి.. శ్యామలను సేవ్ చేయాలనుకుంటున్నామని కౌశల్ తెలిపాడు. అయితే ఇలా ఐదు గురు డేంజర్ జోన్లోకి వెళ్లాక.. కెప్టెన్ అయిన కారణంగా స్పెషల్ పవర్‌తో.. ఇప్పటిదాకా సేవ్ అయిన కంటెస్టెంట్లోంచి ఒకరిని నామినేట్ చేయాలని తనీష్‌పై పిడుగును పడేశాడు బిగ్‌బాస్. ఇక్కడైనా తను సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తే... సేవ్ అయిన ఐదుగురిలో వీక్ కంటెస్టెంట్ ఎవరా? అని ఆలోచించకుండా.. అరవై మూడు రోజులు మాతో కలిసి ఆ నలుగురు ప్రయాణించారు.. శ్యామల వెళ్లిపోయి మధ్యలో వచ్చింది.. తనను నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్‌కు తెలిపాడు. గీతా మాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునయనలు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు మజా మొదలైంది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీత ఎలాగూ ఎలిమినేట్ కాదని మెజారిటీ అభిప్రాయం. ఇటీవలె శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరు గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. కాబట్టి వీరు కూడా వెళ్లే అవకాశం లేదనే చెప్పవచ్చు. పూజ వచ్చికొద్ది రోజులే అయినా... మంచి పేరే తెచ్చుకుంది. తనకు చాలానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మిగిలిన వారిలో దీప్తి కంటే రోల్ రైడా కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా.. సోషల్ మీడియాలో దీప్తి సునయన హవానే ఉంటోంది. మరి వీరందరిలోంచి ఎవరు వెళ్తారో చూడాలి. ఆట మొదలైంది ఇప్పుడే కాబట్టి ఏదీ చెప్పలేం... ఈ వారం టాస్క్‌లు ఏముంటాయో.. వాటిని ఎలా నెట్టుకొస్తారో... చూద్దాం.. బిగ్‌బాస్ అంటే.. ఏదైనా జరుగొచ్చుగా! చదవండి... బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్ -
బిగ్‌బాస్ : తారాస్థాయికి చేరిన రచ్చ
ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో. చిన్న మాట పెద్ద చర్చకు దారి తీసి రచ్చ రచ్చ అయింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో కౌశల్, దీప్తి, నందిని టీమ్ గెలిచారు. అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఈ సభ్యులకు వచ్చాయి... వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగా.. కౌశల్ మాత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మా టీమ్ గెలిస్తే... ఇంటిలోని ఓ ఇద్దరు సభ్యులు మా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పలేదంటూ వింత సమాధానం చెబుతూ.. ఇంటిలోని అందరు సభ్యులు మంచిగా ఉండాలని అందరం కలిసే లగ్జరి బడ్జెట్ పంచుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో గీత కలగజేసుకుంటూ ఆ ఇద్దరి సభ్యులెవరో చెప్పండి అనగా .. ఒకరు బాబు గోగినేని అని కౌశల్ చెప్పగా.. రెండో వ్యక్తి నేనేనంటూ తనీష్ చెప్పాడు. ఈ తతంగం అంతా జరుగుతుంటే ... బాబు గోగినేని స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ.. నేను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్ వచ్చిన ఐటమ్స్ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్, సామ్రాట్లు తెలిపారు. బాబు గోగినేని నాన్ సెన్స్ పదం వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్సెన్స్ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్ అయ్యారు. తనకు కంగ్రాట్స్ చేయలేదంటూ కౌశల్ అనడంతో మొదలైంది ఈ గొడవ. అయితే తన ఉద్దేశ్యం మాత్రం అందరూ కలిసి ఉండాలని, ఒకరు గెలిచినప్పుడు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెబితే బాగుంటుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. కంగ్రాట్స్ చెప్పలేదు.. కాబట్టి వారికివ్వను.. అని అన్నట్లు ఉందంటూ... ఏదో గీతా మాధురి బలవంతంగా ఒప్పించినట్లు ఉందని అందుకే తనకు లగ్జరి బడ్జెట్‌ను తీసుకోవాలని లేదంటూ.. తనీష్ ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. టాస్క్ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్ వద్దని సామ్రాట్ తెలిపాడు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పుంటే క్షమించమని కౌశల్ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్ ఫైర్ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్ కూడా ఫైర్ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్ అటాక్ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. తనే చేజేతులా చేసుకుంటున్నాడని, అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకోవడం బాలేదని దీప్తి, గీతా మాధురి మాట్లాడుకున్నారు. ఇక కౌశల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి గీతా మాధురి, దీప్తి, రోల్ రైడా, నందిని, పూజలతో మాట్లాడారు. ఇదిలా వుండగా.. ఈ వారం నామినేషన్లో ఉన్న బాబు గోగినేనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్, గీతా మాధురిలను ఎలాగైనా బయటకు పంపించడమే తన ధ్యేయమంటూ ఇంటి సభ్యులతో అంటున్నాడు. ఈ వారం నేను వెళతానేమో.. వెళ్లాక చేసే మొదటి పని కౌశల్‌ను బయటకు పంపడమే, ఆ తరువాత గీతా మాధురిని అంటూ చెప్పుకొచ్చాడు. గత ఎపిసోడ్స్‌లో తనతో పెట్టుకుంటే హౌజ్‌లోంచి బయటకు వెళతారని కౌశల్ అన్నాడని.. అది నిజం కాదంటూ దాన్ని బ్రేక్ చేయడానికి కౌశల్‌తో పెట్టుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్ : మరోసారి కౌశల్ టార్గెట్
ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆసక్తి పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం నామినేషన్లో భాగంగా ఒక ఇంటి సభ్యుడు తనకు ఇష్టంలేని మిగతా సభ్యుడిని ఎంచుకుని అందుకు గల కారణాలు తెలిపి అనంతరం వారి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలని ఆదేశించాడు. తనీష్ కెప్టెన్ అయినందున అతని పేరును ఎవరూ చెప్పకూడదనీ బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఎవరి నెత్తిపై అధిక గుడ్లు పగులుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. అమిత్, రోల్ రైడా, తనీష్, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. కౌశల్ వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు. సోమవారం షోలో నందిని వర్సెస్ కౌశల్ హైలైట్‌గా నిలిచింది. తనకు అనవసరంగా అడ్వైజ్ చేస్తున్నాడని, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసానని ఎప్పటికీ గుర్తు చేస్తున్నాడంటూ కౌశల్ గురించి ఇంటి సభ్యులతో చెప్పుకుంటూ వచ్చింది. నామినేషన్ టైమ్‌లో కూడా నందిని ఇదే విషయం ప్రస్తావించి కౌశల్‌పై గుడ్డు పగలగొట్టింది. కాగా.. నందిని ఫ్రెండ్షిప్ విషయంలో మోసం చేసిందని, బాబు గోగినేని రాజమౌళి విషయంలో తప్పుగా మాట్లాడాడని, అందుకే నామినేట్ చేస్తున్నాని వారిద్దరిపై గుడ్లు పగలగొట్టాడు. అయితే దీనిపై బాబు గోగినేని ఇంటి సభ్యులతో చర్చిస్తూ.. అదంతా నటనా అని, రాజమౌళి అభిమానులు తనకు సపోర్ట్ చేయాలని అలా చేశాడని చెప్పుకొచ్చాడు. అనూహ్య ఎంట్రీ.. అర్దరాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి ప్రవేశించారు. ఆమె ఎవరో కాదు స్వామిరారా ఫేం పూజా రామచంద్రన్. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక యాంకర్ ప్రదీప్‌లా గెస్ట్ అన్న విషయం మంగళవారం ఎపిసోడ్లో రివీల్ కానుంది. ఈవారం ఎలిమినేషన్ లేదు.. అయితే ఈ వారం హౌస్ మేట్స్ ఎలిమినేషన్ లేదని ఎపిసోడ్ చివర్లో బిగ్‌బాస్ ప్రకటించాడు. ‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్ మేట్స్‌ను సేవ్ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్ ఈజ్ యువర్స్! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఎలిమినేట్ అయిన వారి కోసం ఓటింగ్ లైన్‌ను ప్రారంభించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే తేజస్వీని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునేందుకే మళ్లీ ఇలా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు తేజస్వీ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్‌లోకి వచ్చి తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సందర్భంలో కొందరు తేజస్వీపై మండిపడగా, మరికొందరు సపోర్ట్‌గా నిలిచారు. పరిస్థితి కౌశల్ ఆర్మీ వర్సెస్ తేజస్వీ ఫ్యాన్స్‌గా మారిపోయింది. మరి ఇదంతా దాటుకుని తేజస్వీ ఇంట్లోకి అడుగుపెడుతుందా? లేక మరెవరైనా అడుగుపెడతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.. అసలే బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు. బిగ్‌బాస్ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు! -
కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 ఏమైనా జరగొచ్చు.. అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీషో అలానే ప్రేక్షకులకు కావల్సిన అసలు సిసలు మజాను అందిస్తోంది. శనివారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్‌గా నాని ఆకట్టుకున్నాడు. గత రెండు వారాల్లో కనిపించిన నాని కన్నా ఈ ఎపిసోడ్లో భిన్నంగా కనిపించాడు. వస్తూ వస్తూనే అనగనగా.. ఓ రాజు.. ఏడుగురు పిల్లలు.. అంటూ ఓ పిట్టకథ చెప్పి హోస్ట్‌గా తనలోని వైవిధ్యాన్ని చూపించాడు. ఇక శుక్రవారం హౌస్‌లో చోటుచేసుకున్న వ్యవహారాలపైనే ఈ ఎపిసోడ్ అంతా చర్చ జరిగింది. ముఖ్యంగా కిరిటీ దామరాజు, కౌశల్ పట్ల వ్యవహరించిన తీరును నాని తప్పుబట్టాడు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా చేతులు కట్టేసిన కౌశల్ ముందు నిమ్మరసంతో బాధపట్టే ప్రయత్నం.. మాటలతో రెచ్చగొట్టడం.. అమ్మాయిల తరఫున మాట్లాడుతూ.. తన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం.. మగతనమా అని ఘాటుగా ప్రశ్నించాడు. కిరీటి దామరాజు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని, తోటి కంటెస్టెంట్లను సైతం హెచ్చరించాడు. దానికి సంబంధించిన వీడియోలను చూపించాడు. అంతేకాకుండా కిరిటీ ఎలిమినేషన్ ప్రకియలో ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా తిరస్కరించేవారని, అంతలా ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారని కూడా హెచ్చరించాడు. దీనికి కిరీటి ఆ వ్యతిరేకతను తొలిగించుకుంటానని నానికి మాటిచ్చాడు. అంతా కపట ప్రేమ.. ఇక తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలి రోజు నుంచి కొందరు ఓ గ్రూప్‌గా ఏర్పడి ఇతరులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఓ టాస్క్‌లో భాగంగా చేసిన పనిని పదేపదే ఎత్తి చూపుతున్నారని, కెప్టెన్ టాస్క్‌లో భాగంగా.. హౌస్మెట్స్ కనీస మానవత విలువలు పాటించేలేదన్నాడు. ఒకరేమో నిమ్మరసం, మరొకరేమో పసుపుతో, ఇంకొకరేమో.. అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడారని, ఆ సమయంలో తన పిల్లలు ‘నాన్నకు ఏమైంది అమ్మా అని ప్రశ్నిస్తే నా భార్య ఏమని’ సమాధానం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రతి ఒకరు జైలు కార్డ్ విషయంలో తనని తప్పుబడుతున్నారని, ఎవరూ నిజాయితీగా కనిపించకపోవడంతోనే జైలు కార్డు ఇవ్వలేదని, ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తనదని తెలిపాడు. ఇక్కడంతా కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి నాని బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరుగవచ్చు అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపాడు. కౌశల్ Vs తనీష్.. ఇక ఈ ఎపిసోడ్లో కౌశల్, తనీష్‌ల మధ్య ఉన్న మనస్పర్ధలు మరొకసారి బయటపడ్డాయి. శుక్రవారం ఎపిసోడ్‌లోనే కొట్టుకున్నంత పనిచేసిన వీరిద్దరు ఆ ఆగ్రహాన్ని ఈ ఎపిసోడ్లో సైతం కొనసాగించారు. ఈ ఎపిసోడ్లో భాగంగా బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన ఎమోజీల కాన్సెప్ట్‌తో వీరి మధ్య కోపాలు చల్లారలేదని తేటతెల్లమైంది. తొలుత తనీష్‌కు ఇరిటేటింగ్ ఎమోజీ రాగా.. దాన్ని అతను కౌశల్ మెడలో వేసి హౌస్‌లో తనకు చికాకు తెప్పించేది అతనే అని తెలిపాడు. దీనికి జైలు కార్డు దీప్తికి ఇవ్వకపోవడమేనని వివరణ ఇచ్చాడు. ఇక కౌశల్‌కు సైతం తన ఎమోషన్‌కు తగ్గట్టే పంచ్ ఎమోజీ వచ్చింది. దీన్ని వెంటనే కౌశల్, తనీష్ మెడలో వేసాడు. హౌస్‌లో కొట్టే అవకాశం వస్తే తనీష్నే కొడతానన్నట్లు ఆ ఎమోజీ అతని మెడలో వేసాడు. బాబు గోగినేనికి ప్రశంసలు హౌస్‌లో బిగ్‌బాస్‌పై ఫైర్ అయిన బాబు గోగినేనిని నాని ప్రశంసించాడు. కంటెస్టెంట్లకు గాయాలైనా బిగ్‌బాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అలా చేశానని, ఒకరికి బానిసను కాదు అనే మనస్థత్వం తనదని బాబుగోగినేని వివరణ ఇచ్చాడు. దీనికి నాని స్పందిస్తూ తమ టీమ్ ఎలాంటి తప్పిదాలు జరగకుండా 100 శాతం ప్రయత్నిస్తోందని, అప్పుడప్పుడు చిన్నతప్పిదాలు జరుగుతాయని, ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చాడు. గాయాలైతేనే స్పందించే మీరు ఇంత గొడవలు జరుగుతున్నా.. ఎందుకు స్పందించలేదని ఆయనను నాని ప్రశ్నించాడు. ఆవేశంలో ఉన్నవారి మధ్య తానేప్పుడు తలదూర్చనని, టీవీ, కెమెరాల కోసం అలాంటి పనులు చేయనన్నాడు. దీప్తి సునైనా చిన్న పిల్ల కాదు.. గత వారం దీప్తి సునైనా పై ట్రోల్స్ రావడాన్ని తప్పుబడుతూ.. 20 ఏళ్లకే ఆమె ఎంతో పేరు తెచ్చుకుందని, నాని ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అలా ఆమెపై పొగడ్తలు కురిపించడం తాను చేసిన పెద్ద తప్పన్నట్లు నాని తన పిట్టకథతో పరోక్షంగా తెలియజేశాడు. ఆమె కంటెస్టెంట్లతో వ్యవహరించిన వీడియోలు చూపిస్తూ.. చిన్నపిల్ల అనుకుంటున్నారు.. కాదు జాగ్రత్త అని హెచ్చరించాడు. అందరూ దీప్తి సునైనాను కంటెస్టెంట్‌గానే చూడాలని, చిన్నపిల్ల అనుకోవద్దని తెలిపాడు. ‘కౌశల్‌ను నీ విషయంలో ఇతర కంటెస్టెంట్లు ప్రశ్నిస్తున్నా.. ఎందుకు సమాధానం చెప్పలేదని’ నాని ప్రశ్నించగా.. తాను ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదని, అందుకే పట్టించుకోలేదన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి దీప్తి ప్రొటెక్ట్ అయ్యారు. సామన్య కేటగిరిలో ఎంట్రీ ఇచ్చిన గణేశ్ అంచనాలు అందుకోవడంలేదని, భయపడవద్దని సూచించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నూతన నాయుడు ఫన్నీ డ్యాన్స్ నవ్వులు పూయించింది. -
కౌశల్ వికాస్‌కు దరఖాస్తు చేసుకోండి
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జయరామయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు మరమగ్గాల్లో వారి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆర్పీఎల్లో అధునాతనమైన డిజైన్స్ నేర్పించడంతోపాటు డిజిటల్ లెర్నిం గ్, మొబైల బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి తదితర రంగాలలో శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల చేనేత మరమగ్గాలకు చెందిన కార్మికులందరూ తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్‌కార్డుతోపాటు వృత్తి, బ్యాంకు వివరాలతో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 దినసరి ఇస్తామన్నారు. జిల్లాలో చేనేత కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఆదరణ–2కు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో బీసీ వర్గాలకు ఆదరణ–2కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు జయరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు ఆదాయ వృద్ధి, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ. 2.5 లక్షల వరకు ఆధునిక ఉపకరణాలు (గుంతమగ్గాలు, పైమగ్గాలు, జాకాడ్ మగ్గాలు)ను అందించనున్నామన్నారు. మూడు సంవత్సరాల కాలంలో మగ్గాలలో లబ్ధిపొందని చేనేత కార్మికుల వివరాలను తమకు తెలుపాలన్నారు. జిల్లాలోని చేనేత వృత్తిపై జీవిస్తున్న వారు తమ పూర్తి చిరునామా, వృత్తి, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్, ఐఎస్ఎ‹ఫ్ కార్డు, ఏ మగ్గంపై పనిచేస్తున్నది తది తర వివరాలను సహాయ సంచాలకులు, చేనేత జౌళిశాఖ, డి–బ్లాక్, కొత్త కలెక్టరేట్లోని తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. -
సెయిలింగ్ చాంప్స్ కౌషల్, విష్ణు జోడి
సాక్షి, హైదరాబాద్: హోబీ-16 ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో కౌషల్ కుమార్ యాదవ్, విష్ణు ప్రసాద్ జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరిగిన 10 రేసుల్లో ఈ జోడి 12 పాయింట్లు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా... జస్ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ జోడి 26 పాయింట్లతో రెండో స్థానంలో, ఆశిష్ కుమార్, నగి బెహరా జోడి 29 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాయి. రెండో రోజు ఫలితాలు ఏడో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. దిలీప్ సర్మాహ్- దర్శన్ 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. ఎనిమిదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. ఆశిష్ కుమార్- నగి బెహరా, 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. తొమ్మిదో రేసు: 1. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్, 2. కౌషల్ -విష్ణు ప్రసాద్, 3. ఆశిష్ కుమార్- నగి బెహరా. పదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. అమన్‌కుమార్- యాసన్ అలీ, 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్.