బిగ్‌బాస్‌ : దీప్తి ఎలిమినేషన్‌ ఖాయం! | Bigg Boss 2 Telugu Is Deepthi Nallamothu Going To Be Eliminated | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 21 2018 9:00 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Is Deepthi Nallamothu Going To Be Eliminated - Sakshi

బిగ్‌బాస్‌ షో చివరి అంకానికి రాబోతోంది. ఇక మిగిలింది కొన్ని రోజులే. దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ సాగిన బిగ్‌బాస్‌ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్‌ అయిన దీప్తీ, పూజ, తనీష్‌, కౌశల్‌లో మరి తనీష్‌, కౌశల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే లెక్క.

ఎలిమినేషన్‌ అంటే చాలు తెగ టెన్షన్‌ పడిపోయి, గాబర పడిపోయే దీప్తి గతవారం ఆ ప్రక్రియలో లేకపోయేసరికి కాస్త ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈ సంబరం ఎంతో సేపు లేదు. ఈ వారం మళ్లీ నామినేషన్‌లోకి వచ్చాక.. తనలో మళ్లీ అదే టెన్షన్‌. అందరితో కలిసి ఉన్నానని, ఎవరు తనను నామినేట్‌ చేసుంటారా అని గణేష్‌తో తన గోడును వెల్లిబుచ్చుకుంటుంటే.. కౌశల్‌ మధ్యలో వచ్చి.. ‘తనను ఎవరు నామినేట్‌ చేసుంటారో తనకు ఐడియా ఉంద’ని.. నామినేషన్‌లోకి రావాలంటే మినిమమ్‌ నాలుగు ఓట్లైనా రావాలని.. మరి ఎవరు వేశారో ఆలోచించుకోండంటూ దీప్తితో చెప్పుకొచ్చాడు. 

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్‌ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్‌లోకి వచ్చింది. మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్‌ చేస్తారో లేదో చూడాలి. లేక బిగ్‌బాస్‌ ఏదైనా ట్విస్ట్‌ అని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చూసుకుంటే ఈ సారి దీప్తి, పూజలపై వేటు పడే అవకాశమే ఎక్కువ. ఎందుకుంటే కౌశల్‌ ఎలాగూ సేవ్‌ అయిపోతాడు అది వేరే విషయం.. తనీష్‌పై సోషల్‌ మీడియాలో నెగెటివిటి ఉన్నా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది కాబట్టి సేవ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి.. దీప్తి చేసే చేష్టలకు, అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. పూజకు మరీ అంత ఫాలోయింగ్‌ లేదు కాబట్టి తను కూడా వెళ్లే అవకాశమూ ఉంది. ఈ వారాంతానికి షోలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో? ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement