tanish
-
వైవిధ్యమైన టైటిల్‌తో తనిశ్ కొత్త సినిమా
నటుడు, బిగ్‌బాస్ ఫేం తనిశ్ హీరోగా వేద ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రం రూపొందుతోంది. లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు కేసీపీడి(కొంచ చూసి ప్రేమించు డూడ్) అనే సరికొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. గౌతమ్ మన్నవ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌ను రిలీజ్ చేసన అనంతరం మేకర్స్ మాట్లాడుతూ.. అ ఈ సినిమా షూటింగ్‌ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈఏడాది వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామన్నారు. -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
బిగ్‌బాస్ తనీష్ హీరోగా 'అంతేలే కథ అంతేలే'
బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనీష్, వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "అంతేలే కథ అంతేలే". మహారాజశ్రీ, లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అనంతపురం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నివాస్ మాట్లాడుతూ.. రిధిమ క్రియేషన్స్ పతాకంపై అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఇందులో అనేక భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్‌లలో మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ.. 'ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన పాత్ర ఇది. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి' అన్నారు. హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ.. 'నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు' అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది' అన్నారు. చదవండి: నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను త్రిష రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ తల్లి! -
‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ
టైటిల్ : మరో ప్రస్థానం నటీనటులు : తనీష్, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మిర్త్ మీడియా నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం: జాని సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే), విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ‘నచ్చావులే’తో హీరోగా మారాడు తనీష్. ఆ తర్వాత రైడ్, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్ పరంగా తనీష్ చాలా వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న తనీష్.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం కథేంటంటే ముంబై క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్( కబీర్ సింగ్ దుహాన్ ) ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్‌లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. శివ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా..రాణె భాయ్ గ్యాంగ్ సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తుంటారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునేందుకు రాణె భాయ్ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా) రాణె భాయ్ నేరాలను ఆధారాలతో సహా డాక్యుమెంట్ చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసిన రాణె భాయ్ గ్యాంగ్, ఆధారాలు ఇచ్చేయమని హింసిస్తుంటారు. రాణె భాయ్ గ్యాంగ్ లోని బ్లాక్ షీప్ ఎవరు, జర్నలిస్ట్ సమీర ఆధారాలతో గ్యాంగ్ ను పట్టించిందా. తన లీడర్ రాణె భాయ్ తో శివ ఎందుకు గొడవపడ్డాడు అనేది మిగిలిన కథ. ఎలా చేశారంటే.. శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జరిగే కథను సింగిల్ షాట్లో చిత్రీకరించాలనుకున్న దర్శకుడి ఆలోచన మాత్రం బాగుంది. అందుకు తగ్గట్లు సన్నివేశాలను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీకరిస్తూ వచ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్ కూడా రోటీన్‌గా సాగడం కాస్త మైనస్. సునీల్ కశ్యప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. సింగిల్ షాట్ మూవీ కావడం, రీటేక్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో టెక్నికల్‌గా ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది
‘‘మరో ప్రస్థానం’ సినిమా నా కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది’’ అని హీరోయిన్ ముస్కాన్ సేథి అన్నారు. ‘పైసా వసూల్, రాగల 24 గంటల్లో’ చిత్రాల ఫేమ్ ముస్కాన్ సేథి నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’. తనీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ–‘‘ఎమోషనల్‌గా సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో నేను యాక్షన్ సీన్స్‌లో కూడా నటించా. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్ని సీన్స్‌లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేశాం. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం ఈ సినిమా ప్రత్యేకత. సింగిల్ షాట్లో చేసిన మొదటి సినిమా ఇదే కావడం మరో విశేషం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ‘మరో ప్రస్థానం’ లో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.. థియేటర్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అన్నారు. -
ఈ వారం బాక్సాఫీస్ పోటీలో ‘లవ్ స్టోరీ' వర్సెస్ ‘మరో ప్రస్థానం'
ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలా కాలం తరువాత థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నాయి. చాలా సినిమాలు ఓటీటీకే పరిమితం కాగా, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ కాగా రెండో సినిమా మరో ప్రస్థానం. లవ్‌స్టోరీ సినిమాను భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఆదివారం లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే సినిమా పాటలు, ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే, లవ్‌స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే తనీష్ ‘మరోప్రస్థానం' సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. విలన్ బృందం వరస హత్యలు చేస్తుండగా, వాటిపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమెరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమెరా విలన్లకు దొరుకుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన అంశంలో థ్రిల్లింగ్‌గా కథను తెరకెక్కించారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ సినిమాగా తెరకెక్కించారు. చదవండి: భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ -
డ్రగ్స్ కొనలేదు .. డబ్బు ఇవ్వలేదు.. ఈడీ మళ్లీ రమ్మనలేదు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనీష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని నిమిత్తం డబ్బు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చారు. బుధవారం నటుడు తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. ఈవెంట్ల వల్లే కెల్విన్‌తో పరిచయం డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో ఉన్న పరిచయం, అతడితో లావాదేవీలపై తనీష్‌ను ఈడీ అధికారులు ఆరా తీశారు. 2016–17 మధ్య కెల్విన్‌తో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్లు నిర్వహించాడని, ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని తనీష్ జవాబిచ్చారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగానికి ఎక్కడా తావు లేదని స్పష్టం చేశారు. కెల్విన్ విచారణలో తన పేరు బయటకు రావడానికి అతడితో ఈవెంట్ల పరంగా ఉన్న పరిచయమే కారణమని వివరణ ఇచ్చారు. మళ్లీ రమ్మనలేదు తాను బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగానని, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళితే అది సాధ్యమయ్యేది కాదని తనీష్ చెప్పారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ను ఈడీ అధికారులకు ఆయన అందించారు. విచారణ ముగించుకుని తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులను కోరిన వివరాలు అందించానని, వారు కొన్ని డాక్యుమెంట్లు సైతం పరిశీలించారని తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదని, ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వచ్చి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
Tollywood Drugs case: మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనపై ఆరా
-
ఈడీ విచారణకు హాజరైన హీరో తనీష్
Tanish Appears Before ED: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతుంది. హీరో తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలుపై కూడా ఆరాతీయనుంది. అంతేకాకుండా ఎఫ్ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కెల్విన్ సమక్షంలో తనీష్‌ను సుధీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2017లో తనీష్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే 10మంది సినీ ప్రముఖులను ఈడీ విచారించింది. -
Maro Prasthanam : ప్రపంచంలో ఆ ఇద్దరే అసలైన మనుషులు..
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం' మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇది స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది . విలన్ చేసే వరుస హత్యలను హీరో బృందం కెమెరాల్లో బంధించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ని కట్ చేశారు. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ...ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం’అన్నారు. చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్ జరగలేదు. ఫస్ట్ రిహర్సల్ చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది’అన్నారు హీరో తనీష్. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి. -
డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తనీష్ ‘మరో ప్రస్థానం’
యంగ్ హీరో తనీష్ నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’.జాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘మరో ప్రస్థానం’విషయానికొస్తే.. ఇదొక ఎమోషనల్ కిల్లర్ జర్నీ మూవీ. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా అదే టైమ్‌కు సినిమా పూర్తి అవుతుంది. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న తమ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి. -
ఆ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటాడు: తనీష్
Tanish About Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలై ఇంకా వారం కూడా అవలేదు. అప్పుడే కంటెస్టెంట్లకు బయట ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. ఇక షో మొదటివారంలోనే కొందరు కంటెస్టెంట్లు దూకుడు చూపిస్తుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఆ ఇంటిని అలవాటు చేసుకునే పనిలోనే ఉన్నారు. తాజాగా ఈ షో గురించి బిగ్‌బాస్ సెకండ్ సీజన్ కంటెస్టెంట్ తనీష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదో సీజన్లో తన క్లోజ్ ఫ్రెండ్ మానస్ ఉన్నాడని, అతడు చాలా మంచి మనిషని చెప్పుకొచ్చాడు. అతడు తప్పకుండా టాప్ 5లో అడుగు పెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ యూట్యూబర్ షణ్ముఖ్ తనకు పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. అలాగే దీప్తి సునయన తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు. కాగా బిగ్‌బాస్ రెండో సీజన్లో తనీష్‌తో పాటు దీప్తి సునయన కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె తన ప్రియుడు, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌ను ఒంటరిగా వదిలేసి మరీ షోలో అడుగు పెట్టింది. అయితే హౌస్‌లో అడుగు పెట్టాక ఆమె తనీష్‌కు దగ్గరైంది. హౌస్‌లో దీప్తి సునయనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆమె వెన్నంటే నిలబడ్డాడు తనీష్. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో వాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందని అభిప్రాయపడ్డారు జనాలు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు సైతం వెలువడ్డాయి. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ ఇద్దరూ తాము కేవలం స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా వుంటే గతంలో పలు కారణాల వల్ల దీప్తి సునయన, షణ్నూల మధ్య కొంత దూరం పెరిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం మళ్లీ క్లోజ్ అయిపోయారు. ఈమధ్యే బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తన ప్రియుడు షణ్నూకు గట్టి సపోర్ట్ ఇస్తోందీ భామ. -
యాంకరింగ్‌తో అలరించిన హీరో తనీష్
సాక్షి, విశాఖపట్నం : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం పోర్టు స్టేడియంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉండాలని, అది సీఎం వైఎస్ జగన్‌లో పరిపూర్ణంగా ఉందని చెప్పారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదురొడ్డి ముందుకు సాగుతూ తన లక్ష్యాన్ని సీఎం చేరుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత సీఎం వైఎస్ జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించాలనే విశాఖ యువత అభిలాషను సాకారం చేసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వజ్ర సంకల్పంతో కృషి చేస్తే యువత తమ లక్ష్యాన్ని సాధించగలరని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా సౌకర్యాలు, వనరులు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలరించిన సినీ హీరో తనీష్ సినీ హీరో తనీష్ వేదికపై యాంకరింగ్ చేస్తూ అలరించారు. పంచ్ డైలాగ్‌లతో యువతలో ఉత్సాహం నింపారు. 422 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేత జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. 20 రోజుల పాటు 14 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడా జ్యోతితో స్టేడియంలో ఎంపీ విజయసాయిరెడ్డి నడవగా.. మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎన్సీసీ క్యాడెట్లు వెంట పరుగులు తీశారు. జట్ల కెప్టెన్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అరకులోని 18 గిరిజన తెగల మహిళలు ధింసా నృత్యంతో అలరించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విశాఖలో మరిన్ని క్రీడా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇటీవలే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ అనే పదంలోనే వైబ్రేషన్ ఉందన్నారు. ఈ టోర్నీ విశాఖలో యువత కెరీర్‌కు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖను క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక రచిస్తే ముఖ్యమంత్రి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా యువత విస్తృతంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నీలో పోటీ పడాలన్నారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యువతను మహాశక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. జీవీఎంసీ కమిష నర్ జి.సృజన మాట్లాడుతూ మనిషి సంపూర్ణ అభివృద్ధిలో విద్యే కాకుండా ఆటలు కూడా దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా సృజనాత్మకత, విద్య, వినోదానికి దూరంగా ఉన్న యువతకు ఈ టోర్నమెంట్ మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఎస్.ఎ.రెహమాన్, సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్, నగర మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ప్రగతి భారతి ఫౌండేషన్ సభ్యులు గోపీనాథ్ రెడ్డి, మావూరి వెంకటరమణ, ఉమేష్‌కుమార్, బాలాజీ, ముఖ్య నాయకులు ఫరూఖీ, రవిరెడ్డి, కొండా రాజీవ్, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, గెడ్డం ఉమ, వార్డు అధ్యక్షు లు, కార్పొరేట్ అభ్యర్థులు, క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?
ఉగాది పచ్చడిలో అయినా షడ్రుచులు కాస్త అటూఇటుగా ఉంటాయోమో కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం అన్ని రసాలు పండించే కంటెస్టెంట్లను లోనికి పంపిస్తారు. ఆవేశం స్టార్లను, అతి సహనపరులను, నవ్వించేవాళ్లను, డ్యాన్స్ చేసేవాళ్లను.. ఇలా ప్రతీది ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ సీజన్లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనేది పక్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విషయానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మరి మొదటి సీజన్ నుంచి నాల్గవ సీజన్ వరకు ఆ అర్జున్‌రెడ్డి ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.. ఇస్మార్ట్ సోహైల్ ఇప్పుడు అతడిని కెప్టెన్ సోహైల్ అని పిలుచుకోవాలి. ఈ సీజన్లో ఐదో కెప్టెన్‌గా అవతరించాడు. మొదట్లో కాస్త సాఫ్ట్‌గా కనిపించిన సోహైల్ ఉన్నట్టుండి వయొలెంట్‌గా మారిపోయాడు. గొడవ ప్రారంభమైందంటే చాలు కథ వేరుంటది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేస్తాడు. దీంతో అతడంటేనే ఓ రకమైన భయం వచ్చేసింది కొందరు కంటెస్టెంట్లకు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కూడా సోహైల్ నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడని చెప్పింది. ఆఖరికి నాగార్జున కూడా చాలా కోపం ఉందని, కాస్త నియంత్రించుకోమని సూచించారు. తమన్నా సింహాద్రి మొట్టమొదటిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చారు. మొదట బాగానే ఉన్న ఆమె తన విశ్వరూపం చూపించింది. సహ కంటెస్టెంటు రవికి చుక్కలు చూపించింది. పప్పు అని ఆడుకుంటూ అతడిని ఏడిపించింది. అటు అలీ రెజా, రోహిణితో కూడా కయ్యానికి కాలు దువ్వేది. అలా హౌస్‌లో ఆమె పేరు చెప్తేనే వణికే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన ప్రేక్షకులు ఆమెను తొందరగానే హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా కోపంగా ఉంటూ గొడవలు పెట్టుకుంటూనే తను షోలో ఉన్నానన్న విషయం అందరికీ తెలుస్తుందనే ఈ ట్రిక్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. (చదవండి: అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?) అలీ రెజా టాస్క్ అంటే చాలు.. ఉన్న శక్తినంతా కూడదీసుకుని మరీ టాస్క్‌లో తన ప్రతాపాన్ని చూపేవాడు. అతని ఆటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ అతని కోపమే అతని పాపులారిటీని, ఓట్లను దెబ్బ తీసింది. వీరావేశంతో ఎదుటివారిపై నోరు జారడంతో ఆయన షో మధ్యలోనే వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు. ఈ సారి గేమ్ ప్లాన్ మార్చి ఆడటంతో ఫైనల్ వరకు వెళ్లాడు. తనీష్ అల్లాడి రెండో సీజన్లో పాల్గొన్న హీరో తనీష్‌ను కోపానికి కేరాప్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. కౌశల్, నూతన్ నాయుడుతో తరచూ గొడవలు జరిగేవి. వీటికి హద్దూ అదుపూ ఉండేది కాదు. అయినా సరే, తనీష్‌కు అభిమాన గణం మెండుగానే ఉండేది. దీనికితోడూ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా బాగానే వర్కవుట్ అయింది. దీంతో టాప్ 3 స్థానంలో నిలబడ్డాడు. ((చదవండి: 'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!) తేజస్వి మడివాడ రెండో సీజన్లో తేజస్వి కూడా చీటికి మాటికీ రుసరుసలాడుతుండేది. తనకు ఏదైనా నచ్చకపోతే చాలా ఆ విషయాన్ని చీల్చి చెండాడేది. వివాదం, ఫిజికల్ టాస్క్, బ్రెయిన్ టాస్క్ ఇలా ఏదైనా సరే అందులో తన మార్క్ చూపించేది. ముక్కు మీద కోపం ఉన్న ఈ భామ ఏడో వారంలోనే బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్‌బాస్ అంత ఇస్తున్నాడా?) శివబాలాజీ అన్నీ అమర్చిన బిగ్‌బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయితే ఇలాంటి సందర్భాల్లో బిగ్‌బాస్‌ను అభ్యర్థించాల్సింది పోయి అతడిపైనే ఆవేశపెట్టాడు శివబాలాజీ. మొదటి సీజన్లో పాల్గొన్న శివబాలాజీ ఓ రోజు నీళ్లు సడన్‌గా రాకపోవడంతో బిగ్‌బాస్‌పైనే ఆగ్రహించాడు. కోపంతో పాటు మిగతా ఎమోషన్స్ కూడా ఎక్కువే కావడంతో ఆ ఆగ్రహాన్ని కవర్ చేయగలిగాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ విజేతగా నిలిచాడు. -
ఆవేశం ఆయుధమైతే...
‘గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’ అంటూ భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్‌తో విడుదలైన ‘మహాప్రస్థానం’ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. తనీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహాప్రస్థానం’. ‘ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ కథానాయిక. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవికి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ జాని మాట్లాడుతూ– ‘‘తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్‌గా తన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఎంఎన్ బాల్ రెడ్డి. -
అప్పుడు నృత్యం చేశా.. ఇప్పుడు అతిథిగా వచ్చా
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మండలంలోని గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని సినీ హీరో తనీష్ చెప్పారు. శుక్రవారం గాలాయగూడెం శ్రీ అచ్చమ్మపేరంటాలు తల్లి 63వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా తొలుత ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఏనుగు సర్వేశ్వరరావు తదితరులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తనిష్ విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్నవయస్సులోనే అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో నృత్యం చేశానన్నారు. మళ్లీ సినీ హీరోగా అమ్మవారి సన్నిధిలో ముఖ్య అతిథిగా రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ 20కి పైగా సినిమాలు చేశానన్నారు. హిందుస్తాన్ సినిమాకు నంది అవార్డు వచ్చిందని, నచ్చావులే, రైడ్, మేము వయసుకు వచ్చాం సినిమాలు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు. చలనచిత్ర పరిశ్రమకు అంబికా కృష్ణ తనను పరిచయం చేశారని, హీరోగా రవిబాబు అవకాశం కలి్పంచారని చెప్పారు. ప్రస్తుతం మహాప్రస్థానం సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. -
మహాప్రస్థానం మొదలైంది
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. ‘వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తనీష్ మాట్లాడుతూ– ‘‘సినిమా సెట్లో నేను అడుగుపెట్టి ఏడాదిన్నర అవుతోంది. కథలు వింటున్నా నచ్చడం లేదు. జానీగారు చెప్పిన ‘మహాప్రస్థానం’ కథ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది’’ అన్నారు. ‘‘నేను గతంలో ‘అంతకుమిం చి’ చిత్రాన్ని తెరకెక్కించా. ‘మహాప్రస్థానం’ నా రెండో సినిమా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు జాని. శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్ నటిస్తున్న ఈ చిత్రానికి సం గీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
మాకూ స్వాతంత్య్రం కావాలి
వీధి బాలల నేపథ్యంలో శ్రీ తారక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీధిబాలలం’. ‘మాకూ స్వాతంత్య్రం కావాలి’ అన్నది ఉపశీర్షిక. ఎ.వి. వర్మరాజు సమర్పణలో వాహిని క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పాటలను సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజానికి సందేశమిచ్చే ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. వీధిబాలల కథాంశంతో సినిమా చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమా విడుదల విషయంలో నా వంతు సాయం చేస్తా’’ అన్నారు. ‘‘సుమారు 1200 మంది పిల్లలను వివిధ స్కూల్స్ నుంచి ఎంపిక చేసి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలోని ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీ తారక్. ‘‘ఈ సినిమా మీద వచ్చిన ప్రతి పైసా అనాథ పిల్లల సహాయార్థం ఉపయోగిస్తాం’’ అన్నారు ఎ.వి. వర్మరాజు. ‘‘నేను కూడా బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నటుడు తనీష్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాటల రచయిత దుర్గాప్రసాద్, విజయవాణి, ఎఫ్ఎమ్ బాబాయి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలీ,తనీష్
-
‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్
బిగ్ బాస్ షోతో ఆకట్టుకున్న యువ నటుడు తనీష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిహద్దు. ఇటీవల రంగు సినిమాతో తనీస్ను డైరెక్ట్ చేసిన కార్తికేయ సరిహద్దు సినిమా కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ ‘భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక తెగ అనీ...కొన్ని తెగలకు ఒక కులం అనీ.. కొన్ని కులాలు కలసి ఒక మతం అనీ విడిపోతూ మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి తెగలుగా... తెగలనునుండి.. కులాలుగా.. కులాలనుండి మతాలుగా... మతాలనుండి రాష్ట్రాలుగా... రాష్ట్రాలనుంచి దేశాలుగా.. సరిహద్దుల్ని గీసుకొంటూ... బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది ’ అన్నారు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఆ పేరు తెచ్చుకోకూడదు!
చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 17 సినిమాలు చేసిన నటుడు తనీష్ హీరోగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్ష త్రం’ సినిమాలో విలన్‌గా నటించారాయన. హీరోగా తనీష్ తొలి చిత్రం ‘నచ్చావులే..!’ విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో తనీష్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు డిఫెన్స్‌లో జాబ్ చేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇరవైఏళ్ల క్రితం వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఆ తర్వాత నా కెరీర్ కోసం మా నాన్నగారు జాబ్ నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉండేవాళ్లం. చాలా కష్టాలు పడ్డాం. చైల్డ్ ఆర్టిస్టుగా ఇక చాలు.. హీరోగా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో ఓ చాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో సైన్ చేయాలి. ఇంతలోనే రవిబాబుగారి ‘నచ్చావులే..!’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాను. నువ్వు లావు తగ్గితే మా సినిమాలో తీసుకుంటాం అన్నారాయన. ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను. ముందు వచ్చిన అవకాశాన్ని వద్దనుకుని అసలు సెలెక్ట్ అవుతానో లేదో తెలియని రవిబాబుగారి సినిమా కోసం కష్టపడ్డాను. రెండు వారాల్లో దాదాపు 10 కేజీలు తగ్గి ఆయన దగ్గరికి వెళ్లాను. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా రిలీజైన తర్వాత నా తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. నచ్చినప్పుడు నచ్చావ్ అన్నారు. నచ్చనప్పుడు నచ్చలేదు అంటూనే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు.. స్పెషల్‌గా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుగారికి థ్యాంక్స్. ఫిబ్రవరి లేదా మార్చిలో నేను హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ‘బిగ్ బాస్ షో’ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సక్సెస్, ఫెయిల్యూర్స్ నా చేతిలోనే కాదు. ఎవరి చేతిలోనూ లేవు. ఇప్పటివరకు నా జర్నీని ప్లాన్ చేసుకోలేదు. ఇకపై ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం ఉన్నా వీడు మారలేదురా’ అంటారు. ఆ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. అలాగే ఇక రాంగ్ స్టెప్స్ కూడా వేయను. నేను స్టార్‌ని కాదు. యాక్టర్‌ని. నెగటీవ్ పాత్రలే కాదు చాలెంజింగ్‌గా ఉన్న ఏ పాత్ర చేయడానికైనా రెడీ. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు’’ అన్నారు. -
‘రంగు’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగు జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : తనీష్, ప్రియా సింగ్, పరుచూరి రవి, షఫీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వర్రావు తదితరులు సంగీతం : యోగేశ్వర్ శర్మ దర్శకత్వం : కార్తికేయ నిర్మాత : పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు బాలనటుడిగా సక్సెస్ అయిన తనీష్.. హీరోగా సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. తనీష్ తెరపై హీరోగా కనపడి చాలా కాలమే అయింది. ఇటీవలె బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన తనీష్.. రంగు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. విజయవాడ రౌడీ షీటర్ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రంగు చిత్రం.. తనీష్‌ను హీరోగా నిలబెట్టిందా?.. అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది ఓసారి చూద్దాం.. కథ : బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది. లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్ పోషించాడు. పవన్ కుమార్ అలియాస్ లారా(తనీష్) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్ ఫస్ట్. అయితే కాలేజ్‌లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. అటుపై రౌడీ షీటర్‌గా మారతాడు. అక్కడినుంచి సెటిల్మెంట్లు చేస్తూ.. ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ. నటీనటులు : లారా పాత్రలో తనీష్ బాగానే నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తడబడ్డట్టు అనిపించినా.. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇక ఏసీపీ రాజేంద్రన్ పాత్రలో పరుచూరి రవి నటన గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు కావల్సిన బాడీలాంగ్వేజ్‌తో బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో తనీష్ తరువాత ఎక్కువగా కనిపించేది, గుర్తుండేది పరుచూరి రవి పాత్రే. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ : ఓ వ్యక్తి రౌడీగా మారడానికి దారితీసే కారణాలు.. ఆవేశంలో చేసే పనులు.. ఆలోచన లేకుండా భవిష్యత్తును నాశనం చేసుకోవడం, తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలనుకోవడం అయినా గతం వెంటాడటం లాంటి సంఘటనల్లో సినిమా కావాల్సినంత కమర్షియల్ కంటెంట్ ఉంది. కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా.. వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఈ కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడం ప్లస్ పాయింట్. వారి మాటలు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ ; కథ కొన్ని పాత్రలు మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు సినిమా నిడివి కథనం బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
ఏ పాత్ర చేయడానికైనా రెడీ
‘‘నేను ఇండస్ట్రీకి నటుడిగానే పరిచయమయ్యా. హీరోగా రాలేదు. హీరోనా.. విలనా..? అన్నది ఆలోచించను. నాకు ఎగై్జటింగ్‌గా అనిపిస్తే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’ అని హీరో తనీశ్ అన్నారు. తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య పాత్రల్లో కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తనీశ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో చాలా రంగులు, భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగు’ అని టైటిల్ పెట్టాం. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో లారా పాత్ర చేశా. కాలేజ్‌లో స్టేట్ ర్యాంకర్ అయిన లారాపై రౌడీషీటర్ అనే ముద్ర ఎలా పడింది. 27ఏళ్లకే ఆయన ఎందుకు చంపబడ్డారు? అనే విషయాలతో పాటు ఆయన గురించి ప్రజలకు తెలియని ఎన్నో అంశాలను ‘రంగు’లో చూపించాం. లారా కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. చివరి 30 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది. కృష్ణవంశీగారి ‘నక్షత్రం’లో విలన్‌గా చేసినందుకు గర్వంగా ఉంది. ఆ సినిమా తర్వాత ఎవరూ విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించలేదు. హీరో పాత్ర కోసమే కథలు వినిపిస్తున్నారు’’ అన్నారు. -
అభ్యర్థి నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..
బంజారాహిల్స్: ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్ రోజు వినియోగిస్తేనే దానికి సార్థకత. ఐదేళ్ల పాటు మన మంచీచెడులను చూసే నేతలను ఎన్నుకునే ఈ క్రతువులో ఓటు అనే ఆయుధమే ప్రజా అస్త్రం. ఈ వజ్రాయుధాన్ని వినియోగించుకోకుంటే మనం విజయవంతమైనట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మెరుగైన సమాజం కోసం ఓటు వేసి బాధ్యతను నెరవేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా అనే మరో ఆప్షన్ ఉందనే విషయం మర్చిపోకూడదు. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగింకుంటాను. మీరు కూడా తప్పనిసరిగా ఓటు వేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఓటు మాత్రమే. – తనీష్, సినీ నటుడు -
హీరోలు లేరు... విలన్లు లేరు!
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నేను నటించిన తొలి సినిమా (బాలనటుడు) ‘ప్రేమంటే ఇదేరా’ హిట్ అయిన రోజు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ‘రంగు’ సినిమాతో మళ్లీ ఇంత ఆనందంగా ఉంది’’ అని తనీష్ అన్నారు. తనీష్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తనీష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మా అమ్మగారు నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోలు, విలన్లు లేరు.. అన్నీ పాత్రలే’’ అన్నారు. ‘‘ఓ ఫ్రెండ్ ద్వారా లారా గురించి విన్నాను. ఆయన స్నేహితులను కలిసి కథను తయారు చేసుకున్నాను. పరుచూరి బ్రదర్స్ ఈ కథని కమర్షియల్ ఫార్మాట్లోకి మార్చి అద్భుతంగా మలిచారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త బ్యానర్ పెట్టుకుని కొత్తవారితో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా సినిమా వల్ల ఎవరికీ నష్టం రాదు.. రానివ్వను. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. తక్కువ ఖర్చులో సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘రంగు’ సినిమా బాగుంటుంది’’ అని పద్మనాభరెడ్డి అన్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రియా సింగ్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రవి, రామసత్యనారాయణ, రాజ్‌కందుకూరి తదితరులు పాల్గొన్నారు.