బ్యాండ్ బాజా మోగనుంది
బ్యాండ్ బాజా మోగనుంది
Published Thu, Aug 8 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
తనీష్, రూపల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాండ్ బాజా’. నగేష్ దర్శకుడు. షేక్ నయీమ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ రాని కొత్త పాయింట్‌తో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అనేక పెళ్లిళ్లతో ఈ కథ ముడి పడి ఉంటుంది.
రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తనీష్ కనిపిస్తారు. అందరి సహకారం వల్ల సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. విజయ్ కూరాకుల మంచి సంగీతం ఇచ్చారు. మూడు పాటలు బ్యాంకాక్‌లో తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. ఈ నెల 15న పాటలను, ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: పార్వతీచంద్, పాటలు: సాహితి, కెమెరా: అమర్, సమర్పణ: నల్లమల శంకర్.
Advertisement
Advertisement