Band Baaja
-
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. వివాహాల్లో మోగనున్న పోలీస్ బ్యాండ్
పోలీస్ బ్యాండ్ అంటే కేవలం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మోగించడం సహజమే. దీంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పోలీస్ బ్యాండ్ మోగుతుంది. అయితే పంజాబ్‌లోని పోలీస్ శాఖ మాత్రం కాస్త ఢిఫరెంట్‌గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. పెళ్లిలలో కూడా పోలీస్ బ్యాండ్ మోగించాలని భావించింది. ఇంకేం అనుకున్నదే తడవుగా దాని అమలుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. సాధారణంగా పెళ్లి బ్యాండ్ తరహాలోనే ఈ పోలీస్ బ్యాండ్ కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ పోలీస్ బ్యాండ్ కోసం గంటకు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న నిర్ణీత సమయం దాటితే మాత్రం.. గంటకు వారి నుంచి రూ.2500 వసూలు చేయనున్నారు. అలానే సామాన్య ప్రజలు గంటకు రూ.7000 చెల్లించాలి. బుకింగ్ సమయం దాటితే అదనంగా గంటకు రూ. 3500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ బుకింగ్ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రవాణా ఖర్చుగా కిలోమీటరుకు రూ.80 చెల్లించాలని అధికారులు తెలిపారు. అయితే, ఈ నిర్ణయం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి)కి మింగుడు పడలేదు. ఫిరోజ్‌పూర్ పార్లమెంటు సభ్యుడు, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్ ట్వీట్ చేస్తూ, “ ఇదే వారి నిజమైన చిత్రం! రాష్ట్రానికి నిధులు సమకూర్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలాంటివో ఈ ప్రకటన రుజువు చేస్తోందని మండిపడ్డారు. -
బ్యాండ్ బాజా 4th Jan 2020
-
బ్యాండ్ బాజా 7th Sep 2019
-
బ్యాండ్ బాజా 29th June 2019
-
బ్యాండ్ బాజా 25th May 2019
-
బ్యాండ్ బాజా 11th May 2019
-
బ్యాండ్ బాజా 4th May 2019
-
బ్యాండ్ బాజా 16th March 2019
-
బ్యాండ్ బాజా 9th March 2019
-
బ్యాండ్ బాజా 9th Feb 2019
-
బ్యాండ్ బాజా 2nd Feb 2019
-
బ్యాండ్ బాజా 26th Jan 2019
-
బ్యాండ్ బాజా 23rd January 2019
-
బ్యాండ్ బాజా 19th Jan 2019
-
బ్యాండ్ బాజా 22nd Dec 2018
-
బ్యాండ్ బాజా 3rd Nov 2018
-
బ్యాండ్ బాజా 20th Oct 2018
-
బ్యాండ్ బాజా 6th Oct 2018
-
బ్యాండ్ బాజా 22nd Sep 2018
-
బ్యాండ్ బాజా 8th Sep 2018
-
బ్యాండ్ బాజా 1st Sep 2018
-
బ్యాండ్ బాజా 18th August 2018
-
బ్యాండ్ బాజా 11th August 2018
-
బ్యాండ్ బాజా 4th August 2018
-
బ్యాండ్ బాజా
-
బ్యాండ్ బాజా 14th July 2018
-
బ్యాండ్ బాజా 7th July 2018
-
బ్యాండ్ బాజా 30th June 2018
-
బ్యాండ్ బాజా 11th June 2018
-
పెళ్లి ఘనంగా నిర్వహించాడని...అమానుషం
భోపాల్: మధ్యప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. సుమారు 500మందికి దాహార్తిని తీర్చే మంచినీళ్ల బావిలో దుండగులు కిరోసిన్ కుమ్మరించారు. దీనికి గల కారణాలను ఆరాతీస్తే.. కుల, వర్ణ వివక్షపై అసహ్యం కలగ మానదు. గ్రామానికి చెందిన ఒక దళితుడు తన కుమార్తెకు మేళ తాళాలతో ఘనంగా వివాహం చేశాడన్న అక్కసుతో ఆధిపత్య కులానికి చెందిన గ్రామస్తులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. దళితులు ఉపయోగించే మంచినీటి బావిలో కిరోసిన్ కలిపారు. మధ్యప్రదేశ్‌లోని మాదా గ్రామంలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్ లోని మాదా లో దళితుడైన మేఘ్వాల్ (47) తన కుమార్తె మమత వివాహం ఘనంగా జరిపించాలని అనుకున్నాడు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ఆలోచనే ఆధిపత్య కులాలకు ఆగ్రహం తెప్పించింది. బ్యాండ్ మేళం పెట్టవద్దని హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు "కట్టుబాట్లు" ఉల్లంఘిస్తే తన కుటుంబానికి సాధారణ బావి నుంచి నీటిని తోడుకోవడానికి వీల్లేదని, స్థానిక ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని గట్టిగా హెచ్చరించారు. అయినా మేఘావాల్ లెక్కచేయలేదు. ఏప్రిల్ 23 బ్యాండ్ బాజాలు, గ్రామంలో ఊరేగింపుతో అట్టహాసంగా ఈ శుభకార్యాన్ని ముగించాడు. ముఖ్యంగా బ్యాండ్ పార్టీతో పూర్తిస్థాయి ఊరేగింపుతో వరుడు పెళ్లి వేదికకు తరలి వచ్చాడు. అదీ ఆధిపత్య కులాలకు మాత్రమే పరిమితమైన ప్రధాన రహదారి గుండా. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూర్తి ఆమోదంతో, రైఫిల్స్, బాటన్లు, టియర్ గ్యాస్ లాంటి ముందు జాగ్రత్త చర్యలతో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య శాంతి యుతంగా జరిగింది. ఇదే గ్రామంలోని ఆధిపత్య కుల పెద్దలకు త్రీవ ఆగ్రహం కలిగింది. రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నా.. ఆ తర్వాత ఆవేశంతో రగిలిపోయారు. ప్రతీకార చర్యకు దిగారు. గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు. ఇది గమనించిన దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నీటిని పరిశీలించిన అధికారులు...బావిలో నీటిని మోటారుతో తోడించి, వినియోగానికి అవసరమైన విధంగా బావిని శుభ్రం చేయించారు. దీంతో గత ఆరు రోజులుగా, గ్రామంలోని దళిత మహిళలు 2 కి.మీ.ల దూరంలో ఉన్న నదినుంచి నీటినిని మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే కావాలనే కిరోసిన్ పోసినట్టుగా భావిస్తున్నామని సీనియర్ దుర్విజయ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా హ్యాండ్ పంప్ వేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సందడి సందడిగా...
‘నలుగురు లేనివాడు అనాథ కాదు. ఎవరికీ ఏమీ కానివాడే అనాథ’. ‘బ్యాండ్‌బాజా’చిత్రంలో హీరో తనీష్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌కి అనుగుణంగానే ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని చెబుతున్నారు ఈ చిత్రం దర్శకుడు నగేశ్ నారదాసి. నయీమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రూపల్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేనేమీ భారతదేశానికి బామ్మర్దినని మెళ్లో బోర్డేసుకొని తిరగట్లా... అంటాడు ఇందులో ఓ సన్నివేశంలో తనీష్. కచ్చితంగా ఆయన క్యారెక్టరైజేషన్‌కి అద్దం పట్టే డైలాగ్ ఇది. నేటి యువతరానికి ప్రతీక లాంటి పాత్ర ఇందులో ఆయనది. టైటిల్‌కి తగ్గట్టు సినిమా కూడా సందడిగా ఉంటుంది. ప్రతి సీన్లో నలభై, యాభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపి, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
బ్యాండ్ బాజా మోగనుంది
తనీష్, రూపల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాండ్ బాజా’. నగేష్ దర్శకుడు. షేక్ నయీమ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ రాని కొత్త పాయింట్‌తో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అనేక పెళ్లిళ్లతో ఈ కథ ముడి పడి ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తనీష్ కనిపిస్తారు. అందరి సహకారం వల్ల సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. విజయ్ కూరాకుల మంచి సంగీతం ఇచ్చారు. మూడు పాటలు బ్యాంకాక్‌లో తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. ఈ నెల 15న పాటలను, ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: పార్వతీచంద్, పాటలు: సాహితి, కెమెరా: అమర్, సమర్పణ: నల్లమల శంకర్.