సందడి సందడిగా...
సందడి సందడిగా...
Published Wed, Dec 4 2013 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
‘నలుగురు లేనివాడు అనాథ కాదు. ఎవరికీ ఏమీ కానివాడే అనాథ’. ‘బ్యాండ్‌బాజా’చిత్రంలో హీరో తనీష్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌కి అనుగుణంగానే ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని చెబుతున్నారు ఈ చిత్రం దర్శకుడు నగేశ్ నారదాసి. నయీమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రూపల్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేనేమీ భారతదేశానికి బామ్మర్దినని మెళ్లో బోర్డేసుకొని తిరగట్లా... అంటాడు ఇందులో ఓ సన్నివేశంలో తనీష్. కచ్చితంగా ఆయన క్యారెక్టరైజేషన్‌కి అద్దం పట్టే డైలాగ్ ఇది. నేటి యువతరానికి ప్రతీక లాంటి పాత్ర ఇందులో ఆయనది. టైటిల్‌కి తగ్గట్టు సినిమా కూడా సందడిగా ఉంటుంది. ప్రతి సీన్‌లో నలభై, యాభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లోని అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ జరిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపి, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
Advertisement
Advertisement