Bigg Boss Fame Nandini Rai Birthday Celebration With Tollywood Celebrities, Pics Viral - Sakshi
Sakshi News home page

Nandini Rai Birthday Celebrations: బిగ్‌బాస్‌ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌, టాలీవుడ్‌ తారల సందడి

Published Mon, Sep 19 2022 9:32 AM | Last Updated on Mon, Sep 19 2022 10:55 AM

Bigg Boss Fame Nandini Rai Birthday Celebration With Tollywood Celebrities - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, హీరోయిన్‌ నందిని రాయ్‌ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్‌ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్‌, రాజ్ తరుణ్, తనిష్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్‌, లహరి శారి, యాంకర్‌, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా నందిని రాయ్‌.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్‌, శివరంజని వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్‌ 2 సీజన్‌లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్‌ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్‌, సీనియర్‌ నటి రాధిక శరత్‌ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్‌ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement