వైవిధ్యమైన టైటిల్‌తో తనిశ్‌ కొత్త సినిమా | Tanish Upcoming Movie KCPD First Look Launch | Sakshi
Sakshi News home page

Tanish: వైవిధ్యమైన టైటిల్‌తో తనిశ్‌ కొత్త సినిమా

Published Thu, Feb 16 2023 6:52 PM | Last Updated on Thu, Feb 16 2023 6:52 PM

Tanish Upcoming Movie KCPD First Look Launch - Sakshi

నటుడు, బిగ్‌బాస్‌ ఫేం తనిశ్‌ హీరోగా వేద ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రం రూపొందుతోంది. లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను వాలంటైన్స్‌ డే సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు కేసీపీడి(కొంచ చూసి ప్రేమించు డూడ్‌) అనే సరికొత్త టైటిల్‌ను ఖరారు చేశారు.  గౌతమ్ మన్నవ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను రిలీజ్‌ చేసన అనంతరం మేకర్స్‌ మాట్లాడుతూ.. అ ఈ సినిమా షూటింగ్‌ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈఏడాది వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రజెంట్ జనరేషన్‌లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement