నచ్చావులే | special interview to hero tanish | Sakshi
Sakshi News home page

నచ్చావులే

Published Sun, Oct 5 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

నచ్చావులే

నచ్చావులే

‘దేవుళ్లు’ మూవీలో  అయ్యప్పగా నటించిన తనీష్.. హీరోగా కూడా ‘నచ్చావులే’ అనిపించుకున్నాడు. కాన్పూర్‌లో పుట్టిన
 ఈ తెలుగబ్బాయికి హైదరాబాద్‌తో  బచ్‌పన్‌కా దోస్తీ ఉంది. గల్లీ క్రికెట్‌లో లొల్లి..  ఫిల్మ్‌నగర్‌లోని హోటల్స్‌లో ఇడ్లీ.. ట్యాంక్‌బండ్ పక్కన పల్లీ.. ఏదైనా సరే సిటీకి లింకుంటే చాలు తనకు నచ్చుతుందంటున్నాడు. అందుకే ఐ లవ్ హైదరాబాద్ అంటూ భాగ్యనగరంతో తన అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నాడు.
 
చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్‌గా చేయడంతో స్కూల్ డేస్ సరదాగా గడిచిపోయాయి. కృష్ణనగర్‌లోని శ్రీసాయిరాం హై స్కూల్‌లో చదివాను. షూటింగ్స్‌కు వెళ్లడంతో క్లాసులు మిస్సయ్యేవి. మా టీచర్లు స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ చదివించేవారు.  మేథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. హిస్టరీ లెక్చర్ బోర్ కొట్టినా, హిస్టారికల్ పిక్చర్ అనగానే ఫుల్ జోష్ వచ్చేది. హైదరాబాద్ వంటి చరిత్రాత్మక నగరంలో పెరిగినందుకు గర్వంగా అనిపిస్తుంటుంది. సిటీలో ఉన్న హిస్టారికల్ స్పాట్స్ చూడటం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్‌లో సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, జూపార్క్, ట్యాంక్‌బండ్ వంటి ప్రదేశాలకు పిక్నిక్ వెళ్లేవాళ్లం.

గల్లీలో లొల్లి

ఇంటర్ ఎస్‌ఆర్ నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్‌లో చేశాను. మా కాలేజ్ ఎదురుగానే హంగ్రీ జాక్స్ బేకరీ ఉండేది. కాలేజ్ ఆయిపోగానే మా గ్యాంగ్ అంతా అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్లం. అక్కడ బర్గర్, కస్టర్డ్ ఆపిల్ జ్యూస్ టేస్టీగా ఉండేవి. అయితే ఇప్పుడా ప్లేస్‌లో టైటాన్ వాచ్ షోరూం వచ్చింది. ఆ రూట్‌లో వెళ్లినప్పుడల్లా కాలేజ్ డేసే గుర్తుకొస్తాయి. నేను క్రికెట్ సూపర్బ్‌గా ఆడతాను. గ్రౌండ్‌లో కాదు.. గల్లీలో. కాస్త తీరిక దొరికితే చాలు ఇరుగుపొరుగు పిల్లలతో కలసి గల్లీలో క్రికెట్ మొదలుపెడతాం. ఆ పిల్లలంతా నాకు థిక్ ఫ్రెండ్సే. నేను
 ఆడుదామని.. కిందకు దిగితే చాలు సందడే సందడి. హ్యాపీగా ఉన్నా.. డిస్టర్బ్‌డ్‌గా ఉన్నా.. క్రికెట్  ఆడతాను.

 స్వాద్ షహర్

అన్ని ప్రాంతాల రుచులు హైదరాబాద్‌లో దొరుకుతాయి. ఇందిరానగర్‌లోని మంగ టిఫిన్ సెంటర్‌లో పనీర్ దోశ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఫిలింనగర్‌లోని మయూరి హౌస్‌లో దొరికే  కాకినాడ పెసరట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. డైలీ జిమ్ అయిపోగానే మయూరి హౌస్‌లో వాలిపోతాను. ఫిలింనగర్‌లోని కేఫ్ మిలేంజ్, జూబ్లీహిల్స్‌లోని టె స్టారోస్సాకు తరుచూ వెళ్తుంటాను. డెరైక్టర్స్, స్టోరీ రైటర్స్‌తో డిస్కషన్స్‌కు కూడా అక్కడే చేస్తుంటాను.

ఇండియాకు జిరాక్స్

నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతానో.. హైదరాబాదీ అని చెప్పుకోవడానికి కూడా అంతే ప్రౌడ్‌గా
 ఫీలవుతాను. సిటీని మించిన కూల్ ప్లేస్ మరొకటి లేదు. ఇండియాకు హైదరాబాద్ జిరాక్స్ కాపీలా ఉంటుంది. ఇక్కడ అన్ని సంస్కృతులు ప్రతిబింబిస్తాయి. ఇక హైదరాబాదీల గురించి చెప్పాలంటే.. వారి మనసుల్లో ప్యూరిటీ ఉంటుంది. కొత్తవారికి భాగ్యనగరం ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుంది. సినిమాల విషయానికి వస్తే.. షూటింగ్‌ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ నా సెకండ్ బర్త్ ప్లేస్ అనిపిస్తుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement