పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు.. | Odisha Temples Rat Problem That Machines Opposed By Priest | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..

Published Tue, Mar 21 2023 7:53 PM | Last Updated on Tue, Mar 21 2023 7:53 PM

Odisha Temples Rat Problem That Machines Opposed By Priest - Sakshi

పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్‌ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు.

ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు.

ఇప్పటికే  ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు  నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. 

(చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement