jagannath temple
-
నేడు మరోసారి తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం గది
-
46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ భాండాగారం
భువనేశ్వర్: ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత శ్రీ జగన్నాథుని రత్న భాండాగారం తెలుస్తామని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అన్నారు. పూరీ శ్రీజగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరవాలని ఆయన ఆధ్వర్యంలోని 16 మంది సభ్యుల తనిఖీ పర్యవేక్షక కమిటీ మంగళవారం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. 46 ఏళ్ల తర్వాత భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాలతో సహా విలువైన వస్తువుల వివరాలతో జాబితా రూపకల్పన కోసం పర్యవేక్షించేందుకు ఒడిశా హైకోర్టు విరామ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ రెండో సమావేశంలో రత్న భండార్‌ను తెరవడంపై నిర్ణయం తీసుకున్నారు. శ్రీ మందిరం పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి తనిఖీ పర్యవేక్షక కమిటీ ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఏకగ్రీవ తీర్మానం జులై 14న రత్న భాండాగారం లోపలి గది తాళం తెరవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినందుకు విస్తృ్తతంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం మరమ్మతు పనులు, అమూల్య రత్న సంపద మరియు విలువైన వస్తువుల లెక్కింపు రెండింటికీ ఎస్వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రతిపాదించినట్లు తెలిపారు. ఉన్న తాళం చెవితో రత్న భాండాగారం తాళం తెరవలేకపోతే పగులగొట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా పూరీ జిల్లా ఖజానాలో అందుబాటులో ఉన్న రత్న భాండాగారం తాళం చెవిని ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ముందు సమర్పించాల్సిందిగా శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి (సీఏవో)ని అభ్యర్థించారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో తోబుట్టువులతో శ్రీజగన్నాథుని రత్న వేదికపై దర్శించుకోవడంలో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నారు. అలాగే తమ వంతు చర్యలు చేపట్టేందుకు భక్తుల సహకారం కోరినట్లు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. మరమ్మతులు పూర్తి చేస్తాం: మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ రథయాత్ర తర్వాత దేవతలు రత్న సింహాసనంకు తిరిగి వచ్చేలోపు ఖచ్చితంగా మరమ్మతు పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. కమిటీ నిర్ణయించిన రోజునే రత్న భాండాగారం తెరిచి విలువైన వస్తువుల లెక్కింపు, తూకం మొదలవుతుందని తెలిపారు. కమిటీ ఎస్ఓపీని ప్రభుత్వం పరిశీలించి తదనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో దేవస్థానంలో దేవుళ్ల దైనందిన కార్యకలాపాలకు ఏమాత్రం అంతరాయం లేకుండా చూడాల్సి ఉందన్నారు. రత్న భాండాగారం సమగ్ర వివరాలు డిజిటల్ డాక్యుమెంట్ చేయబడుతుందన్నారు. అందుబాటులో ఉన్న తాళం చెవితో తాళం తెరవకుంటే, మేజి్రస్టేట్ సమక్షంలో పగలగొడతామని స్పష్టం చేశారు. ఇకపై రథయాత్రలో ప్రతి సంవత్సరం గర్భ గృహ, రత్న భాండాగారం మరమ్మతులు చేయనున్నట్లు వెల్లడించారు. రంగంలోకి ఏఎస్ఐ బృందం మరోవైపు శ్రీ మందిరం వార్షిక నిర్వహణ కార్యకలాపాలు పురస్కరించుకుని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సాంకేతిక కమిటీ పరిశీలన నిమిత్తం ఆలయానికి చేరుకుంది. నిర్వహణ కార్యకలాపాల విధివిధానాలను అనుబంధ కమిటీ ఖరారు చేయడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధత ప్రకటించింది. గర్భగుడి, నాట్య మండపం, జగ్మోహన్, రత్న సింహాసనం మరమ్మతుల పనులను ఏఎస్ఐ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. -
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు. #WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x— ANI (@ANI) June 13, 2024 -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
Puri Jagannath Temple: ఆ మూడో గదిలో అంతులేని ధనరాశులున్నాయా?
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి? అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు. పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
ఈ దసరా పండగకు ప్రముఖ పుణ్యక్షేత్రం మూసివేత
పూరీ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతండే పూరీ జగన్నాథుని ఆలయాన్ని కోవిడ్ -19 దృష్ట్యా కొత్త నిబంధనల కారణంగా తొమ్మిది రోజులు మూసేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జగన్నాథుడు 'సున భేష' (బంగారు వస్త్రధారణ)లో దర్శనమిస్తాడు. పైగా ఈ దసరా సమయంలో భక్తుల తాకిడి అధికమవుతుందన్న నేపథ్యంలోనే వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్రిమూర్తులు భగవాన్ బలభద్రడు, దేవి సుభద్ర దేవి జగన్నాథుడుని దసరాలో విజయ దశమి పర్వదినం రోజుతో సహా సంవత్సరంలో ఐదుసార్లు 'సునా భేస' (బంగారు వస్త్రధారణతో) అలంకరిస్తారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) అయితే ఈ ఉత్సవానికి 12వ శతాబ్దకాలం నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రత్యేకతను సంతరించకున్న ఈ దర్శనం కోసం ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మళ్లీ అక్టోబర్ 20 నుంచి ఆలయం తెరిచి ఉంటుందని, ఈ మేరకు ప్రజలు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 'దీపావళి' (నవంబర్ 4), 'బడా ఏకాదశి' (నవంబర్ 15) 'కార్తీక పూర్ణిమ' (నవంబర్ 19) వంటి పర్వదినాల్లో కూడా ఆలయానన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) -
బారికేడ్లో ఇరుక్కున్న బాలుడు
సాక్షి, భువనేశ్వర్: జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ బాలుడు బారికేడ్ల మధ్య ఇరుక్కున్నాడు. కలహండి జిల్లా భవనీపట్నం నుంచి వచ్చిన ఓ కుటుంబం స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. చెప్పుల స్టాండ్‌లో ఉన్న చెప్పులు తీసుకునే క్రమంలో బాలుడు బారికేడ్ ఊచల మధ్య తలదూర్చాడు. తల ఇరుక్కోవడంతో కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు బాలుడ్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసుల, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కటర్‌తో ఊచలను తొలగించి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆలయంలో బెంబేలెత్తించిన బాబా..
భువనేశ్వర్/పూరీ : జగతినాథుని దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతోంది. ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్నాథుని సేవాయత్ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు. కట్టుదిట్టమైన తనిఖీలతో స్వామివారి దర్శనం కోసం శ్రీమందిరం లోపలికి భక్తుల్ని అనుమతిస్తున్న తరుణంలో లొంగులి బాబా అకస్మాతుగా దూసుకుపోయిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక లొంగులి మఠంలో బస చేస్తున్న బాబా వైష్ణవ్‌పురి జగన్నాథుని దర్శనం కోసం బయలుదేరాడు. సింహద్వారం వద్ద భద్రత సిబ్బంది గుర్తింపు కార్డు కోసం నిలదీశారు. అయితే ఆవరణలో ఉన్న పతిత పావనుని విగ్రహాన్ని దర్శిస్తూ.. కాసేపటికే అకస్మాతుగా చేతిలో ఢమరకం మోగించుకుని సింహద్వారం ఆవరణలో భద్రతా సిబ్బంది వలయం ఛేదించుకుని చొరబడ్డాడు. 22 మెట్లు గుండా శ్రీమందిరం గర్భాలయానికి పరుగులు తీశాడు. బాబా వెంట ఆలయం భద్రత దళం జవాన్లు పరుగులు తీసిన బాబా.. స్వామి సన్నిధికి సునాయాశంగా చేరుకున్నాడు. స్వామి దర్శనంతో తన్మయం చెందుతున్న తరుణంలో జవాన్లు అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. ఇతర సేవాయత్‌ల తరహాలో స్వామి సేవకులుగా తమకు గుర్తింపు జారీ అయినా.. దేవస్థానం పాలక యంత్రాంగం ఈ మేరకు మంజూరు చేయక పోవడంతో తమవర్గం స్వామి సేవలకు దూరం అవుతుందని వాపోయాడు. స్వామి కనులలో కనులు కలిపి దర్శించాలనే తపనతో శ్రీమందిరం లోపలికి చొరబడి మనసారా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపాడు. -
అమ్మ మాట కోసం.. కోటి విలువ చేసే ఆస్తుల విరాళం
సాక్షి, జయపురం: తమ తల్లి చివరి కోరికను తీర్చి, పలువురికి ఆదర్శంగా నిలిచారు ముగ్గురు మహిళలు. సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చి, దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవరంగపూర్ పట్టణం భగవతీ వీధికి చెందిన భవానీసాహు భార్య వైజయంతీమాల సాహు జగన్నాథుని భక్తురాలు. ఇదే నెల 2న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. మృతికి ముందే జగన్నాథునిపై తన విశ్వాసాన్ని చాటుకుంటూ ఆస్తిని నవరంగపూర్ లోని జగన్నాథ మందిరానికి అప్పగించాలని కోరింది. విషయాన్ని తన ముగ్గురు కుమార్తెలు పుష్పాంజళి సాహు, గీతాంజళి శతపతి, శ్రద్ధాంజళీ పండలకు తెలియజేసింది. చదవండి: (పెళ్లింట్లో భారీ చోరీ.. 200 తులాల బంగారం మాయం) జగన్నాథుని మందిరానికి దానం చేసిన భవనం ఈ నేపథ్యంలో తమ తల్లి పేరున ఉన్న నవరంగపూర్ భగవతీ వీధిలోని 25 గదులతో గల మూడంతుస్తుల భవనాన్ని నవరంగపూర్ జగన్నాథ మందిరానికి విరాళంగా అందజేశారు. అలాగే ఆమె బంగారు, వెండి ఆభరణాలను నవరంగపూర్ నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీదేవి మందిరానికి దానం చేశారు. వైజయంతిమాల మరణానికి ముందు తన ఇష్టాన్ని తెలియజేసిందని, ఆమె కోర్కెను తీర్చేందుకు గర్విస్తున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమెకు మగ సంతానం లేకపోవడంతో జగన్నాథుడే తన కుమారుడని ఆమె భావించేదట. ఇదే కారణంతో తన పేరుతో ఉన్న ఆస్తిని జగన్నాథునికి అర్పించాలన్న మాటను వైజయంతిమాల మరణించిన 14వ రోజు కుమర్తెలు మందిరానికి సమర్పించారు. విరాళంగా అందజేసిన భవనంలో ప్రస్తుతం 9 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆ అద్దెలు జగన్నాథ మందిర నిర్వహణకు కేటాయించనున్నారు. చదవండి: (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..) -
జగన్నాథుడి భూమి గుట్టు అధికారులకే ఎరుక!
సాక్షి, చెన్నూర్: జగతి మెచ్చిన దేవుడు.. కొరికేలు తీర్చే కల్పతరువు.. ఆపద్బంధువైన జగన్నాథుడి భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోపక్క రికార్డుల్లోనూ స్వామిపేరున ఉన్న భూమి శ్రీరామబంటుగా పేరుగాంచిన హనుమంతుడి పేరిట మారడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. చెన్నూర్‌లోని జగన్నాథాలయం పేరున ఉన్న భూమి రికార్డుల్లో మాత్రం ఇదే పట్టణంలోని గోదావరితీరా హనుమాన్ పేరిట మారడంలో అధికారుల తప్పిదమా..? లేక ఇందులో ఏదైనా మతలబు ఉందా..? అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. దేవుడి భూమికే ఎసరు పెట్టాలని చూస్తున్నారని ఆల య కమిటీ మాజీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఆ భూమి ఎలా వచ్చింది..? పట్టణంలో జగన్నాథాలయానికి ఓ చరిత్రే ఉంది. అలాంటి పూర్వకాలపు ఆలయానికి స్థానికంగా కొంత మాన్యాలు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి రెవెన్యూ అధికారులు పట్టణ శివా రులోని 869/21 సర్వేనంబర్‌లోగల ప్రభుత్వ భూమి నాలు గెకరాలను 1972లో కేటాయించారు. ఆ భూమిని అప్పటి జగన్నాథాలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న వానమామలై వరదాచార్యులకు ఆయన పేరిట పట్టా చేసి అప్పగించారు. వరదాచార్యులు చనిపోయిన అనంతరం ఆయన సతీమణి వైదే హి పేరిట మారింది. అయితే ఆ భూమి మీదుగా జాతీయ ర హదారి నిర్మాణం కావడంతో సుమారు 20 గుంటల భూమి కోల్పోయింది. మిగిలిన 3.20 ఎకరాల భూమికి హక్కు పత్రాలను రెవెన్యూ అధికారులు అప్పుడే వైదేహికి అందించారు. ఆమె మరణానంతరం కుమారుడు రవీంద్రచారి పేరిటకు మారగా.. ఆయన గిఫ్ట్‌డీడ్ పేరుతో 2014లో జగన్నాథాలయం పేరిట భూమిని మార్పించారు. సుమారు 48 ఏళ్లుగా జగన్నాథాలయం పేరుతో భూమి ఉన్నట్లు గతేడాది అప్పటి తహసీల్దార్ 1–బీ సైతం అందించారు. తాజాగా సదరు భూమికి సంబంధించిన రికార్డును పరిశీలిస్తే గోదావరితీరా హనుమాన్ మందిర్ పేరిట మారినట్లు చూపిస్తోంది. ఈ అంశంలో అసలు రికార్డుల్లో పొరపాటు జరిగిందా..? ఎవరైన కావాలనే పేరు మార్పించారా..? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి జగన్నాథాలయం భూమిని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించాలని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. రెవెన్యూ లీలాలు.. జగన్నాథాలయం భూమి రికార్డులను పరిశీలిస్తే రెవెన్యూ అ ధికారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది రికార్డు ప్ర కారం 869/21 సర్వే నంబర్లో 3.20 ఎకరాల భూమి ఆల యం పేరిటే ఉంది. ప్రస్తుత రికార్డు ప్రకారం గోదావరి తీరా హనుమాన్ పేరున ఉంది. ఏడాది కాలంలోనే ఆలయం పే రు మారడంలోని ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందో..? జగన్నాథాలయం పేరిట ఉన్న భూమిని హనుమాన్ ఆలయం పేరిట మార్చాలని ఎవరు ఫిర్యాదు చేశారో అంతుచిక్కడం లేదు. ఏదేమైనా.. దేవుడిమాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రికార్డులు మారిస్తే ఎవరికి చెప్పేదని పలువురు పేర్కొంటున్నారు. ఆలయానికి ఇస్తే మంచిదే.. జగన్నాథాలయానికి కేటాయించిన భూమిని కాపాడాలి. గతంలో కొంతభూమిని అధికారులు చూపించారు. అక్కడ బోర్డులు వేశాం. ప్రస్తుతం ఆ బోర్డులు సైతం లేకుండాపోయాయి. రికార్డులు పరిశీలించి అధికారులు భూమిని ఆలయానికి ఇస్తే మంచిదే. – దామెర మోహనాచార్యులు, జగన్నాథాలయ వంశపారంపర్య అర్చకులు, చెన్నూర్ -
కిళ్లీ తిన్నారో.. 500 జరిమానా..!
ఒడిశా, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం లోనికి కిళ్లీ తింటూ ప్రవేశిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రవేశించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని పాలక మండలి హెచ్చరించింది. జగన్నాథుని దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టరేట్ సమన్వయంతో దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ నిషేధం పట్ల కార్యాచరణ ఖరారు చేస్తారు. దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ ఉమ్మడం నివారించాలని లోగడ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కార్యాచరణ మరుగున పడేయడంతో ఈసారి పాలక మండలి ఘాటుగా స్పందించింది. పూర్తి స్థాయి నిషేధానికి నడుం బిగించింది. భారీగా జరిమానా విధిస్తేనే ఈ తప్పిదాన్ని నివారించడం సాధ్యమవుతుందని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఏఓ అధ్యక్షతన జరుగుతున్న పాలక మండలి సమావేశం ప్లాస్టిక్ నిషేధం శ్రీ మందిరం ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించాలని పాలక మండలి ప్రకటించింది. ఈ కార్యాచరణ ఏప్రిల్ నెల ఒకటోతేదీ నుంచి అమలు జరుగుతుందని జగన్నాథ ఆలయం ప్రముఖ పాలన అధికారి (సీఏఓ) కిషన్ కుమార్ తెలిపారు. స్వామి అన్న ప్రసాదాలు నిత్యం ఆనంద బజార్లో విక్రయిస్తారు. ఈ ప్రసాదాల్ని సకాలంలో నివేదించి నిర్ధారిత సమయం కంటే ముందుగా భోగ మండపం నుంచి బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్న ప్రసాదాల్ని తాటి ఆకు బుట్టల్లో పంపిణీ చేస్తారు. ఈ మేరకు 20 రోజులు ముందస్తుగా చైతన్య కార్యక్రమం చేపడతారు. సీఏఓ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో డోలో పూర్ణిమ ఉత్సవ వేళల్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 36 నియోగుల సంఘం ప్రముఖులు, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హాజరయ్యారు. -
అతను బిచ్చగాడు కాదు.. ఇంజనీర్
పూరి : పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద సుమారు 51 ఏళ్ల వయసున్న ఒక బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా వారిద్దరు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవారు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని ఫిర్యాదు రూపంలో రాయమని పోలీసులు ఇద్దరిని అడిగారు. రిక్షా అతడికి చదువు రాకపోవడంతో ఫిర్యాదును సరిగా రాయలేకపోయాడు. కానీ విచిత్రంగా పక్కనే ఉన్న బిచ్చగాడు మాత్రం ఫిర్యాదును ఇంగ్లీష్‌లో రాయడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. అందులోనూ ఆ బిచ్చగాడు రాసిన ఫిర్యాదులో ఒక్క తప్పు కూడా లేకపోవడం విశేషం. దీంతో బిచ్చగాడి గురించి పోలీసులు ఆరా తీయగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అతను బిచ్చగాడు కాదని... ఒక ఇంజనీర్ అని తెలిసింది. వినడానికి అచ్చం సినిమా కథను తలపిస్తున్నా.. ఇది అక్షరాల నిజం. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా .. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ మిశ్రా కష్టపడి బీఎస్సీ గ్రూప్‌లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. తర్వాత సీపెట్ నుంచి ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని మిల్టన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్‌ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదే విషయమై గిరిజా శంకర్ మిశ్రాను అడడగా.. ' ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయి. నేను ఇంజనీర్‌గా పని చేసిన మాట నిజమే.. కానీ నాపై అధికారులతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని' తెలిపాడు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయొద్దని మిశ్రా పోలీసులను అభ్యర్థించడంతో వారు అందుకు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. మిశ్రా తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా.. రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని తెలిసింది. -
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
పూరి : జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు (పొహొండి) కార్యక్రమం చేపట్టారు. శ్రీ మందిరం నుంచి స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు ఉరకలేసుకుని ముందస్తుగా శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. రథ నిర్మాణ ప్రాంగణంలో తయారీ ముగించుకుని వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం వగైరా ఆర్భాటాలతో మూడు రథాలు ఒక దాని వెంబడి మరొకటిగా క్రమంలో స్వామికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా సింహదార్వం దగ్గర నిరీక్షించాయి. సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. మరోవైపు జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఆలయ చరిత్రలో రథయాత్రను పురస్కరించుకుని దేవస్థానం పుష్పాలంకరణతో శోభిల్లడం ఇదే తొలిసారి. యాత్ర నేపథ్యంలో శ్రీ మందిరం, గుండిచా మందిరాలు, ఉప ఆలయాల్ని పూలతో అలంకరిస్తారు. సీసీ టీవీ నిఘా స్వామి రథయాత్రను పురస్కరించుకుని అశేష జన వాహిని తరలి వస్తుంది. రోడ్డు, రైలు రవాణా సంస్థలు యాత్రికుల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పూరీ పట్టణం అంతటా పకడ్బందీగా సీసీటీవీ కెమెరా నిఘా కార్యాచరణలో ఉంటుందని రాష్ట్ర డైరెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రైలు, బస్సులు ఇతరేతర వాహనాలు, సముద్ర మార్గం గుండా చొరబాటుదారుల నివారణకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై జాగిలాల స్క్వాడ్‌తో బాంబు నిర్వీర్య దళాల్ని రంగంలోకి దింపారు. నలు వైపుల నుంచి తరలి వచ్చే వాహనాలతో అవాంఛనీయ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటుచేశారు. సాగర తీరం గుండా సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా మెరైన్ పోలీసు దళాల సమన్వయంతో సాగర తీరంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. -
సీబీఐ విచారణకు ఆదేశించండి
భువనేశ్వర్/కటక్ : ప్రతిష్టాత్మకమైన పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి కొలువుదీరిన శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి అదృశ్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ వ్యవహారంపై జగన్నాథుని భక్తుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ సంఘటనపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన న్యాయ కమిషను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అనుమతితో నిపుణుల బృందం.. భారతీయ పురావస్తు శాఖ రత్న భాండాగారాన్ని ఇటీవల సందర్శించింది. రత్న భాండాగారం అంతా బాగానే ఉందని, ఎటువంటి ఢోకా లేనట్లు శ్రీజగన్నాథ మందిరం పాలక వర్గం(ఎస్జేటీఏ) ప్రకటించింది. ఇంతలో భాండాగారం తాళం చెవి కనిపించడం లేదనే వార్త బయటకు పొక్కింది. దీంతో నిపుణుల బృందం రత్న భాండాగారాన్ని పరిశీలించడం బూటకమని తేలిన నేపథ్యంలో.. దిలీప్ కుమార్ మహాపాత్రో అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా చొరవ కల్పించుకుని ఈ సందిగ్ధత తొలగించాలని అభ్యర్థించారు. జగన్నాథుని ఆస్తులు అపారం ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథునికి అమూల్యమైన స్థిరచరాస్తులు ఉన్నాయి. దాదాపు 60,410 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. స్వామి ఆస్తులు పలుచోట్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. వీటికి విముక్తి కలిగించలేని దయనీయ స్థితిలో పాలక వర్గం కొట్టుమిట్టాడుతోంది. స్థిరాస్తుల్లో గనులు కూడ ఉన్నాయి. వీటిలో అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం సముదాయంలో ఏర్పాటు చేసిన రత్న భాండాగారంలో అమూల్యమైన సంపద ఉంది. రత్నాలు, వైఢూర్యాలు వంటి ఎంతో విలువైన సంపద ఉన్నా.. ఇప్పటికీ సమాచారం స్పష్టంగా తెలియడం లేదు. చివరి సారిగా 1985లో రత్న భాండాగారాన్ని లెక్కించినట్లు తెలుస్తోంది. అధికారవర్గం పూర్తి నిర్లక్ష్యం శ్రీ జగన్నాథుని అమూల్య రత్న సంపద నిర్వహణపై అధికార వర్గం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికార వర్గాల వ్యతిరేకంగా కఠిన చర్యలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించాలని పిటిషనరు అభ్యర్థించారు. అధికారులందరినీ ప్రశ్నించాలని కోరారు. తాళం చెవి గల్లంతు సంఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ నియమించి.. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని విన్నవించారు. క్షేత్ర స్థాయిలో ఈ కమిటీ విచారణ జరిపి రత్న భాండాగారంలో అలనాటి రత్న సంపద, ప్రస్తుతం రత్న సంపద గణాంకాల్ని సమీక్షిస్తే వాస్తవ స్థితిగతులు స్పష్టమవుతాయన్నారు. సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థిస్తు హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక కమిటి విచారణని అభ్యర్థించడం విశేషం. ఈ కేసులో 10 మందిని కక్షిదారులుగా నమోదు చేశారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు, శ్రీ జగన్నాథ మందిరం పాలక వర్గం ఉపాధ్యక్షుడు, శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి – సీఏఓ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రముఖ ప్రత్యర్థులుగా పేర్కొన్నారు. తాళం గల్లంతుపై కమిషన్ ∙జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన నియామకం భువనేశ్వర్: జగన్నాథుని రత్న భాండాగారం తాళం చెవి గల్లంతైన సందర్భంగా జస్టిస్ రఘువీర్ దాస్ న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన ఏర్పాటైన న్యాయ కమిషన్ తాళం చెవి గల్లంతుకు సంబంధించి 3 నెలల వ్యవధిలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు న్యాయ విచారణ పట్ల పెదవి విరిచి భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఆభరణాలు భద్రం
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని ఆభరణాలు, ఇతరేతర అమూల్యమైన సంపద భద్రంగా ఉన్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు కావడంతో స్వామి అమూల్య రత్న సంపద పట్ల పలు అపోహలు ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ నిరాధారంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. రత్న భాండాగారం రెండు అంచెల్లో ఉంటుంది. బాహ్య భాండాగారం(బహారొ భొండారొ), లోపలి భాండాగారం (భిత్తొరొ భొండారొ)గా పేర్కొన్నారు. స్వామి అమూల్య రత్న సంపద లోపలి భాండాగారంలో భద్రంగా ఉంటుంది. నిత్య వినియోగ ఆభరణాలు, పాత్రలు వగైరా సొత్తు బాహ్య భాండాగారంలో ఉంటుంది. అరుదుగా వినియోగించే ఆభరణాలు లోపలి భాండాగారంలో భద్రపరుస్తారు. బాహ్య భాండాగారం తెరిస్తే గానీ లోపలి భాండాగారం లోనికి ప్రవేశించడం అసాధ్యం. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం స్థితిగతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇటీవల బాహ్య భాండాగారం తెరిచారు. గోడలు అక్కడక్కడ స్వల్పంగా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాహ్య భాండాగారం గ్రిల్ నుంచి లోపలి భాండాగారం వైపు దృష్టి సారించారు. ఈ భాండాగారం తలుపుల తాళాలకు సీలు వేసినట్లు అధికార వర్గం గుర్తించింది. ఈ లెక్కన లోపలి భాండాగారం సురక్షితంగా ఉన్నందున దానిలో రత్న సంపద కూడా భద్రంగా ఉండడం తథ్యంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. తాళం గల్లంతు వాస్తవమే! రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం పరిశీలించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకు తా ళం చెవి కోసం వెతుకులాట మొదలైంది. జిల్లా ట్రెజరీలో ఉండాల్సిన తాళం చెవి కనిపించనట్లు జిల్లా కలెక్టరు బహిరంగపరిచారు. అధికార సమూహం అంతా ఏకమై గాలించిన రత్న భాండాగారం తాళం చెవి కాన రాని మాట వాస్తవం. కాగిత పత్రాలు, దస్తావేజులు వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. అంచెలంచెలుగా అధికారులు ఈ పరిస్థితిని సమీక్షించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిర్ణయించారు. 1985 సంవత్సరంలో లోపలి భాండాగారం తెరిచి ఆభరణాలు వగైరా లెక్కించినట్టు దస్తావేజులు స్పష్టం చేస్తున్నాయి. లెక్కింపు ముగించి ఈ భాండాగారానికి 3 తాళాలు వేశారు. ఒక తాళానికి సీలు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల 4వ తేదీన రత్న భాండాగారం పరిశీలించారు. తాళం చెవి గల్లంతుపట్ల 17 మంది సభ్యుల నిపుణుల బృందం తలకిందులు అయి ప్రయత్నించిన గాలించ లేకపోయింది. బాహ్య భాండాగారం తెరిచి పరిశీలన మొక్కుబడిగా ముగించేశారు. లోపలి భాండాగారం పరిశీలించాల్సిన అవసరం లేనట్లు నిపుణుల బృందం ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తే తాళం చెవి లేనందున లోపలి భాండాగారం పరిశీలన సాధ్యం కానట్లు తెలుస్తుంది. అంచెలంచెలుగా సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం రత్న భాండాగారం పరిశీలన ముగించిన వెంటనే శ్రీ మందిరం సబ్ కమిటీ అదే రోజు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయింది. తాళం చెవి గల్లంతు శీర్షికతో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం తీర్మానం మేరకు మర్నాడు భువనేశ్వర్ స్పెషల్ సర్క్యుట్ హౌసులో శ్రీమందిరం పాలక మండలి సమావేశం జరిగింది. పూరీ గజపతి మహా రాజా, శ్రీ జగన్నాథుని తొలి సేవకుడు దివ్య సింఘ్ దేవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కూడా తాళం చెవి జాడ కానరానందున విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్ ఆడిట్ తాళం చెవి జాడ కోసం ఇంటర్నల్ ఆడిట్ కూడా నిర్వహించారు. శ్రీమందిరం సేవా పాలక మండలి ప్రముఖుడు ఈ ఆడిట్ నిర్వహించారు. 1985 సంవత్సరంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు పురస్కరించుకుని శ్రీమందిరం పాలక మండలి డిప్యుటీ పాలకుడు రబీంద్ర నారాయణ మిశ్రా నుంచి రత్న భాండాగారం తాళం చెవి తీసుకున్నట్టు ఆడిట్ ఖరారు చేసింది. శ్రీ మందిరం ప్రధాన పాలకునికి ఈ నివేదిక సమర్పించారు. కలెక్టరేటులో రికార్డు రూమ్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంత ప్రయాసపడిన తాళం చెవి జాడ దొరక లేదు. న్యాయ విచారణకు సహకరిస్తాం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని శ్రీ జగన్నాథ ఆలయ అధికారవర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. -
జగన్నాథ్ ఆలయాన్ని దర్శించిన రాహుల్
సాక్షి, అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ మరోసారి గుజరాత్లో ఆలయాల సందర్శన చేశారు. ప్రధానంగా అహ్మదాబాద్‌లోని ప్రఖ్యాత జగన్నాథ్ ఆలయాన్నిరాహుల్ గాంధీ సందర్శించారు. ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు రాహుల్ గాంధీకి స్వామివారి పూలమాల, శాలువా బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గుజరాత్‌లోని పలు ఆలయాలను సందర్శించారు. ప్రధానంగా సోమనాథ్ ఆలయం, ద్వారకదేష్, చోటీలా, జలరామ్ బాపా ఆలయాలను రాహుల్ దర్శించారు. రాహుల్ ఆలయాల సందర్శనపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్‌పార్టీ ఓట్ల కోసమే ఇలా చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ అనుకూల వాదాన్ని అనుసరిస్తోందన్న సంకేతాలను ఇచ్చేలా రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన ఉందనే విమర్శలు వచ్చాయి. -
ఆలయంలో బాలికపై అత్యాచారయత్నం
ఒడిశా: ఒడిశాలోని బరిపడలో దారుణం వెలుగుచూసింది. దైవ దర్శనానికి వచ్చిన మైనర్ బాలిక పై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బరిపడ జగన్నాథ ఆలయంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ వికలాంగ బాలిక(11) శుక్రవారం రాత్రి జగన్నాథ స్వామి దర్శనానికి ఆలయానికి వచ్చింది. బాలిక ఒంటరిగా వచ్చిన విషయాన్ని గుర్తించిన ఓ యువకుడు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి ఆలయంలోని వెనుక భాగంలో ఉన్న స్నాన ఘట్టాల వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
క్షమాపణ చెప్పిన ఎయిర్ఇండియా
భువనేశ్వర్ : జగన్నాథ టెంపుల్‌పై తప్పుడు వ్యాసాన్ని ప్రచురించినందుకు గాను ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా క్షమాపణ చెప్పింది. పురీలోని జగన్నాథ టెంపుల్లో మాంసాహార వంటకాలను అందజేస్తున్నారని తప్పుడు ఆర్టికల్‌ను ఎయిర్ ఇండియా ప్రచురించింది. వారి నెలవారీ మ్యాగజీన్ శుభయాత్రలో రుచికరమైన భక్తి పేరుతో ఈ వ్యాసాన్ని రాసింది. అయితే ఈ కాఫీపై ఒడిశాలో తీవ్ర దుమారం రేగింది. పలు ఆర్గనైజేషన్లు, ప్రజలు ఈ ఆర్టికల్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఈ వ్యాసాన్ని తాము ప్రచురించలేదని ఎయిర్ ఇండియా తన క్షమాపణ చెప్పుకుంది. అన్ని ఎయిర్ క్రాప్ట్ల నుంచి మ్యాగజీన్‌ను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. ఇది ఓ దురదృష్టకరమైన సంఘటన అని, సంబంధిత అథారిటీలతో తాము దీనిపై విచారణ చేపడతామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా చెప్పారు. ఈ రిపోర్టుకు వ్యతిరేకంగా జగన్నాథ సేన సభ్యులు శ్రీ మందిర్ ఎదుట నిరసనకు దిగారు. -
ఆదరణకు నోచని శ్రీమంతుడు!
అధిక భూములున్నా కౌలు తక్కువే వచ్చే ఆదాయానికీ లెక్కల్లేవు ధూపదీప నైవేద్యాలకూ నోచని జగన్నాథుడు రథయాత్రలోనూ అపశ్రుతి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు నిద్రావస్థలో దేవాదాయశాఖ వీరఘట్టంలోని జగన్నాథుడు ఆగర్భ శ్రీమంతుడు. మెట్ట, పల్లపు భూములు, ఖాళీ స్థలాలతోపాటు.. ఏటా లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఇతరులు దర్జాగా అనుభవిస్తుండగా.. ఆయన మాత్రం కడు పేదరికం అనుభవిస్తున్నాడు. ఏడాదిలో ఓ పది రోజులు మినహా ఏనాడూ స్వామివారి ఆలనపాలనా చూసేవారు లేరు. ఇదీ వీరఘట్టం మండల కేంద్రంలో కొలువుతీరిన.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే ఉన్న జగన్నాథస్వామి వారి చరిత్ర. వీరఘట్టం: మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధిలో కొలువు తీరిన జగన్నాథుడికి సుమారు 45 ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూములను పలువురు వ్యక్తులకు కారుచౌకగా కౌలుకు తీసుకున్నారు. అలా అయినా ఏడాదికి సుమారు రూ. 3 లక్షలపైనే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో మేనేజరుకు రూ.1500, అర్చకులకు రూ. 4 వేలు, స్వీపర్‌కు రూ. 500, గుమస్తాకు రూ. 1000, కరెంటు బిల్లుకు సుమారు రూ. 1200 ప్రతి నెలా ఖర్చు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే జీతాలు, ఖర్చులు కలిపి ఏడాదికి సుమారు రూ. 90 వేల వరకు ఖర్చవుతోంది. ఖర్చులు పోను ఏడాది రూ. 2. 50 లక్షల మిగులు ఆదాయం కనిపిస్తోంది. అయితే మిగిలిన ఆదాయం ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉంది. ఈ విషయంపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. వాస్తవానికి కౌలుకు ఇచ్చిన భూములను ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్స్ చేయాలి. ప్రస్తుతం భూముల ధరలు పట్టణ ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పెరిగాయి. అయినా దేవాదాయ శాఖ కౌలుకు ఇచ్చిన ధరల్లో మాత్రం ఇప్పటి వరకు తేడా లేదు. స్వామివారికి కనీసం సరైన దీపధూప నైవేద్యాలూ అందడంలేదు. ఏటా రథోత్సవాల్లో అందరికీ గుర్తొచ్చే ఈ జగన్నాథుడిని.. ఉత్సవాల అనంతరం మరిచిపోవడం ప్రజలకు, దేవాదాయ శాఖ అధికారులకు పరిపాటిగా మారడం విచారకరం. లోపాయికారి ఒప్పందంతో ఆదాయానికి గండి! జగన్నాథస్వామి భూములను కౌలుకు తీసుకున్న వారితో దేవాదాయ శాఖ అధికారులు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తక్కువ రేట్లకు కౌలుకు ఇచ్చినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంవల్లే దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా మిన్నకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ భూముల, ఆదాయ వివరాలను బహిర్గతం చేసి ఆలయ అభివృద్ధికి కమిటీలు వేసి జగన్నాథస్వామి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రథయాత్రలో భక్తుల ఆవేదన కాగా, మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథచక్రం విరిగి నడిరోడ్డుపై రథం సుమారు మూడు గంటల సేపు నిలిచిపోయింది. రథాన్ని తయారు చేయించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, శ్రీమంతుడైన జగన్నాథ స్వామికి ఏమిటీ కష్టాలని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న కోవెల ఆలన పాలన ఎందుకు చూడడం లేదని ఈఓతో పాటు అర్చకులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యమే మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో జగన్నాథస్వామిని నడిరోడ్డుపై మూడు గంటల సేపు ఉంచారు. రథాన్ని పటిష్ఠంగా తయారు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. - బుక్కూరు దుర్గారావు, వీరఘట్టం ఆలయ ఆస్తులు వెల్లడించాలి జగన్నాథస్వామి ఆలయ ఆదాయ, వ్యయాలను బహిర్గతం చే యాలి. కమిటీలను వేసి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ అధికారులు చొరవ చూపాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. - జామి లక్ష్మీనారాయణ, సర్పంచ్ ప్రతినిధి, వీరఘట్టం -
జగన్నాథుడి ఆఖరి డాన్సర్ మృతి
న్యూఢిల్లీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఆఖరి డాన్సర్ (దేవదాసి) శశిమణి దేవి (92) ఇటీవల పూరిలో మరణించారు ఆమె మరణాన్ని రాష్ట్ర సాంస్కృతి విభాగంలో పనిచేసి రిటైరైన దేవదత్త సమంతా సింఘార్ ధ్రువీకరించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నిరుపేద కుటుంబానికి చెందిన శశిమణి తన ఎనిమిదవ ఏట దేవదాసిగా జగన్నాథ ఆలయంలో చేరారు. తన జీవిత సర్వస్వాన్ని ఆమే ఆ జగన్నాథుడికే అంకితం చేశారు. ఆమెను సాక్షాత్తు జగన్నాథుడి సజీవ భార్యగానే ఆలయ నిర్వాహకులు, భక్తులు పరిగణించేవారు. ఆలయ రికార్డుల ప్రకారం ఆమె బాల్యంలో ఆమెతోపాటు మొత్తం పాతిక మంది దేవదాసీలు ఉండేవారు. వారందరు ఇదివరకే చనిపోగా శశిమణి గురువారం చనిపోయారు. ఆలయం గర్భగుడిలో పవలింపు సేవ కింద జగన్నాథుడిని పాటలు, నృత్యాలతో ప్రతిరోజు అలరించడం దేవదాసిల విధి. ఉదయం లేవగానే ఆలయంలోని విగ్రహాలన్నింటికి స్నానపానాదులు చేయించడం కూడా వారి వృత్తి ధర్మంగానే చాలాకాలం కొనసాగింది. రానురాను ఆలయ విధుల్లో వారి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దేవదాసిల వ్యవస్థను రద్దు చేయాలంటూ సాంఘిక ఉద్యమాలు చెలరేగడంతో జగన్నాథ ఆలయంలో కూడా శశిమణి బ్యాచ్ తర్వాత మరెవరిని దేవదాసీలుగా స్వీకరించలేదు. 13 నుంచి 15వ శతాబ్దం వరకు ప్రతి హిందూ దేవాలయంలోవున్న ఈ ఆచారం క్రమంగా కనుమరగవుతూ వచ్చింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. ఒకప్పుడు దేవదాసీల జీవనోపాధికి గుడి మాన్యాలను కేటాయించేవారు. వారు ఆ మాన్యాల కౌలుపై వచ్చే సొమ్ముతో జీవించేవారు. గుడి మాన్యాల కేటాయింపు పద్ధతి నిలిచిపోయిన తర్వాత దేవదాసీలు జీవనోపాధి కోసం వ్యభిచారం చేసేవారు. పూరి జగన్నాథ ఆలయంతో మాత్రం దేవదాసీలు ఎవరూ కూడా వ్యభిచార వృత్తిని ఆశ్రయించలేదని, వారికి దేవాలయమే ఒక్కొక్కరికి ఆ రోజుల్లోనే నెలకు 700 రూపాయల చొప్పున పింఛను చెల్లించేవారని జగన్నాథుడి ఆలయ ఆచార, వ్యవహాలరాలపై విశేష పరిశోధనలు చేసిన సమంతా సింఘార్ తెలిపారు. 1990లో కూడా దేవదాసీలను నియామకం కోసం జగన్నాథుడి ఆలయంలో ప్రయత్నాలు జరిగాయని, దేవదాసీ ఆచార బాధ్యతలు స్వీకరించేందుకు స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాలేదని, దాంతో ఈ ఆలయంలో కూడా ఆ ఆచారం ఆగిపోయిందని సింఘాల్ వివరించారు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా సాంఘిక ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న 1950వ దశకంలో కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు శశిమణి నిరాకరించి దేవదాసీగా కొనసాగేందుకే ఇష్టపడ్డారని తెలిపారు.