ఆలయంలో బాలికపై అత్యాచారయత్నం
ఒడిశా: ఒడిశాలోని బరిపడలో దారుణం వెలుగుచూసింది. దైవ దర్శనానికి వచ్చిన మైనర్ బాలిక పై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బరిపడ జగన్నాథ ఆలయంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ వికలాంగ బాలిక(11) శుక్రవారం రాత్రి జగన్నాథ స్వామి దర్శనానికి ఆలయానికి వచ్చింది. బాలిక ఒంటరిగా వచ్చిన విషయాన్ని గుర్తించిన ఓ యువకుడు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి ఆలయంలోని వెనుక భాగంలో ఉన్న స్నాన ఘట్టాల వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కళాశాలకు తరలించారు.