క్షమాపణ చెప్పిన ఎయిర్ఇండియా
క్షమాపణ చెప్పిన ఎయిర్ఇండియా
Published Sat, Oct 29 2016 2:16 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
భువనేశ్వర్ : జగన్నాథ టెంపుల్పై తప్పుడు వ్యాసాన్ని ప్రచురించినందుకు గాను ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా క్షమాపణ చెప్పింది. పురీలోని జగన్నాథ టెంపుల్లో మాంసాహార వంటకాలను అందజేస్తున్నారని తప్పుడు ఆర్టికల్ను ఎయిర్ ఇండియా ప్రచురించింది. వారి నెలవారీ మ్యాగజీన్ శుభయాత్రలో రుచికరమైన భక్తి పేరుతో ఈ వ్యాసాన్ని రాసింది. అయితే ఈ కాఫీపై ఒడిశాలో తీవ్ర దుమారం రేగింది.
పలు ఆర్గనైజేషన్లు, ప్రజలు ఈ ఆర్టికల్ను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఈ వ్యాసాన్ని తాము ప్రచురించలేదని ఎయిర్ ఇండియా తన క్షమాపణ చెప్పుకుంది. అన్ని ఎయిర్ క్రాప్ట్ల నుంచి మ్యాగజీన్ను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. ఇది ఓ దురదృష్టకరమైన సంఘటన అని, సంబంధిత అథారిటీలతో తాము దీనిపై విచారణ చేపడతామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా చెప్పారు. ఈ రిపోర్టుకు వ్యతిరేకంగా జగన్నాథ సేన సభ్యులు శ్రీ మందిర్ ఎదుట నిరసనకు దిగారు.
Advertisement
Advertisement