పూరీ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతండే పూరీ జగన్నాథుని ఆలయాన్ని కోవిడ్ -19 దృష్ట్యా కొత్త నిబంధనల కారణంగా తొమ్మిది రోజులు మూసేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జగన్నాథుడు 'సున భేష' (బంగారు వస్త్రధారణ)లో దర్శనమిస్తాడు. పైగా ఈ దసరా సమయంలో భక్తుల తాకిడి అధికమవుతుందన్న నేపథ్యంలోనే వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్రిమూర్తులు భగవాన్ బలభద్రడు, దేవి సుభద్ర దేవి జగన్నాథుడుని దసరాలో విజయ దశమి పర్వదినం రోజుతో సహా సంవత్సరంలో ఐదుసార్లు 'సునా భేస' (బంగారు వస్త్రధారణతో) అలంకరిస్తారు.
(చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?)
అయితే ఈ ఉత్సవానికి 12వ శతాబ్దకాలం నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రత్యేకతను సంతరించకున్న ఈ దర్శనం కోసం ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మళ్లీ అక్టోబర్ 20 నుంచి ఆలయం తెరిచి ఉంటుందని, ఈ మేరకు ప్రజలు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 'దీపావళి' (నవంబర్ 4), 'బడా ఏకాదశి' (నవంబర్ 15) 'కార్తీక పూర్ణిమ' (నవంబర్ 19) వంటి పర్వదినాల్లో కూడా ఆలయానన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment