![Puri Temple: Boys Head Stuck In Barricade - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/5/boy.jpg.webp?itok=85oOtZ2y)
బారికేడులో ఇరుక్కున్న బాలుడు
సాక్షి, భువనేశ్వర్: జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ బాలుడు బారికేడ్ల మధ్య ఇరుక్కున్నాడు. కలహండి జిల్లా భవనీపట్నం నుంచి వచ్చిన ఓ కుటుంబం స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. చెప్పుల స్టాండ్‌లో ఉన్న చెప్పులు తీసుకునే క్రమంలో బాలుడు బారికేడ్ ఊచల మధ్య తలదూర్చాడు.
తల ఇరుక్కోవడంతో కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు బాలుడ్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసుల, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కటర్‌తో ఊచలను తొలగించి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment