Gods
-
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
మోక్షసాధన మార్గం
శమీక మహర్షి కుమారుడు శృంగి శాప కారణంగా తన ఆయుష్షు ఇంకా ఏడురోజులు మాత్రమే మిగిలి ఉందని తెలుసుకున్నాడు పరీక్షిన్మహారాజు. వెంటనే శుకమహర్షిని రప్పించి, భాగవత పురాణాన్ని వినడం ప్రారంభించాడు. శుకుడు ఎంతో మధురంగా శ్లోకాలను గానం చేస్తూ పరీక్షిత్తుకు పురాణ గాథలు వినిపిస్తూ, అందులో ఖట్వాంగుని ఉదంతాన్ని ఇలా వివరించాడు. పూర్వం ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన మహాబల సంపన్నుడు, శక్తిసామర్థ్యాలు కలవాడు కావడంతో ఒంటిచేత్తో సప్తద్వీపాలను పరిపాలించేవాడు. ఇది ఇలా ఉండగా అప్పటి భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేకపోతున్నారు. దాంతో ఇంద్రాది ప్రముఖులు ఖట్వాంగుడిని యుద్ధంలో సాయం రమ్మని పిలిచారు.ఖట్వాంగుడు గొప్ప పరాక్రమం కలవాడు కావడంతో చండప్రచండంగా విజృంభించి దానవులను అందరినీ అవలీలగా వధించి, దేవతలందరికీ ఊరట కలిగించాడు. అతని సాయానికి మెచ్చిన దేవతలు ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు ఖట్వాంగుడు చేతులు జోడించి ‘మహాత్ములారా, నేను ఇంకెంతకాలం బతుకుతాను?’ అని అడిగాడు.దానికి దేవతలు ఎంతో విచారపడుతూ ‘ఏమని చెప్పమంటావు ఖట్వాంగా! ఇంకో ముహూర్త కాలం మాత్రమే నీ ఆయుర్దాయం ఉన్నది’ అని చెప్పారు. అందుకు ఖట్వాంగుడు ఏమాత్రం దిగులు పడకపోగా, ఇంకో ముహూర్తం కాలం పాటు తన జీవితం మిగిలి ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. వెంటనే భూలోకం వచ్చి తనకున్న సకల సంపదలను దానం చేశాడు. పుత్ర మిత్రాది బంధాలు, భయాలు విడిచిపెట్టి, శ్రీహరిని సేవిస్తూ మోక్షం పొందాడు. ఈ కథ చెప్పిన శుక మహర్షి, పరీక్షిత్తుతో ‘‘రాజా నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. ఎంతటి సిద్ధులు పొందినవారైనా, దేవతలైనా సరే మోక్షాన్ని ఇవ్వలేరు. మోక్షాన్ని తనంతట తనే సంపాదించాల్సిందే. ఎందుకంటే, మోక్షం సాధించాలంటే ముందుగా సంసార బంధాలను, భయాన్ని వదలాలి. పరిపూర్ణంగా విష్ణుభక్తి కలిగి ఉండాలి. మరో విషయం ఏమిటంటే, మోక్షసాధన స్వర్గంలో సాధ్యం కాదు, భూలోకంలోనే సాధన చేయాలి’’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న పరీక్షిత్తు... వైరాగ్యం పొంది, వెంటనే తన కుమారుని పిలిచి, రాజ్యపాలన పగ్గాలు అప్పగించి, తాను విష్ణుభక్తి పరాయణుడై నిశ్చింతగా ఉన్నాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆయనకు గుడి లేదు, పూజా లేదు!
గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏమీ లేదు కనుక. అంటే... మనం చేసిన కర్మఫలితానికి ఈ శరీరాన్ని ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే ఈ శరీరం పడిపోవాలి. ఈ శరీరంతో ఉండగా ఇక బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది.. అందుకని ఆయనకు గుడిలేదు, పూజలేదు. స్థితికారుడైన విష్ణువు, జ్ఞానదాత అయిన మహేశ్వరుడు మాత్రం అనుగ్రహిస్తారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టికంతటికీ పెద్దవాడు. అందువల్ల ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తుంటాడు. మనుష్యుడు పొందిన ఈ శరీరాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ’జంతూనాం నరజన్మ దుర్లభం’అంటారు శంకరభగవత్పాదులు. అంటే అందరూ పశువులే. పశువుకానివాడు ఉండడు. పశువు అంటే పాశం చేత కట్టబడినది. జన్మ అది ఒక రాట(పశువులను కట్టే గుంజ). కర్మపాశాలు పలుపుతాళ్ళు. అవి మెడకు తగిలి ఉండడంవల్ల ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మనుష్యుడు ఒక శరీరంలోకి వస్తాడు. ఆ కర్మపాశాలను తెగకోయకలిగినవాడు–పశుపతి. ’ఈశ్వరా! నేను పశువుని. మీరు పశుపతి. నన్ను ఉద్ధరించడానికి మనిద్దరి మధ్య ఈ సంబంధం చాలదా’ అన్నారు శంకరులు. కాబట్టి బ్రహ్మగారిచ్చిన ఈ శరీరం ఒక అద్భుతం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, మిగిలిన తిర్యక్కులు (భూమికి వెన్నుపాము అడ్డంగా కలిగిన ప్రాణులు).. అలా అన్నిటిలోకి మనుష్యుల శరీరమే గొప్పది. మనుష్యుడు ఎక్కడుంటాడు... మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకమంటే.. మృత్యువుచేత గ్రసింపబడేది. అంటే ఈ లోకంలోకి ఏ ప్రాణివచ్చినా అది వెళ్లిపోతుంది ఒకనాడు.‘జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. వచ్చిన ప్రతి శరీరం వెళ్ళిపోవలసిందే. అయినా మనుష్య శరీరం చాలా గొప్పది. కారణం ? దేవతలు మనకన్నా గొప్పవాళ్ళంటారేమో! కానీ వారి శరీరాలకు కర్మాధికారం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వాళ్లకా అధికారం లేదు. వాళ్ళ పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లోఉండి తరువాత మర్త్య లోకంలో పడిపోయి మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడు అలా కాదు. ఇక్కడుండి పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు. లేదా చిత్తశుద్ధి కలిగి, దాని వలన జ్ఞానం కలిగి, మోక్షం కావాలని కోరుకుని తద్వారా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. మనుష్యశరీరంతో వచ్చినా, దానివిలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలం తాను బతికితే చాలని, ఇతరులగురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చేయకుండా, గురువుగారి పాదాలు పట్టుకోకుండా స్వార్థంతో బతికి చివరకు మళ్ళీ కొన్ని కోట్లజన్మల వెనక్కి తిర్యక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా, తిర్యక్కుగా వెళ్ళిపోవాలన్నా... మనుష్య శరీరానికే. అంటే పైకెక్కాలన్నా, కిందకుపోవాలన్నా ఇక్కడికి రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మచేయగల అధికారం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే. ఈ శరీరాన్ని బ్రహ్మగారిచ్చారు. ఇస్తే... ఏమిటి దానివల్ల ఉపయోగం? సనాతనధర్మంలో ఆశ్రమ వ్యవస్థ వచ్చింది ఎందుకు... మెలమెల్లగా వ్యామోహాన్ని తీసేసి భగవంతునివైపు నడిపించడానికి. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఆ మార్పుచేత కట్టు మీద కట్టు వేసినా, ఆ కట్టువేయవలసినవాడు ఎవడు... అంటే... గురువొక్కడే. గురువుకు తప్ప ఆ కట్టువేసే అధికారం మరెవ్వరికీ లేదు. -
దేవుళ్ల పేర్ల మీద మాన్యం భూములు
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ కర్నూలు(అగ్రికల్చర్): మాన్యం భూములు దేవుళ్ల పేరుమీదే ఉండాలని..వాటిని అర్చకులు సాగు చేసుకంటుంటే వెబ్‌ల్యాండ్‌లో అనుభవదారులు(అక్రమణదారులు)గా నమోదు చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్రపునీట ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాసాధికార సర్వేను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం 100 గజాలలోపు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే ఎలాంటి రుసుం తీసుకోకుండా క్రమబద్ధీకరించాలన్నారు. అదే 500లోపు గజాలు అక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే నిర్ణీత పీజుపై క్రమబద్ధీకరించాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో దేవుళ్లకూ స్థానం లేకుండా చేస్తారా?
-విచక్షణా రహితంగా గుడులను, మసీదులను కూల్చేస్తున్నారు -వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతో పాటుగా దేవుళ్లకు కూడా స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణా రహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాలను, మసీదులను కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలు ఘజనీ, ఘోరీలను తలపిస్తున్నాయన్నారు. దేవాలయాలే కాకుండా మసీదులను కూడా విచక్షణా రహితంగా పడగొడుతున్నారన్నారు. ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకూ దేవాలయాలను, కొన్ని మసీదులను పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు ఎంత వ్యతిరేకించినా, బంద్ పాటించినా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలను, మసీదులను కూల్చేసుకుంటూ పోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం ఇలాంటి వాటన్నింటితో పాటుగా రామవరప్పాడు మసీదును కూడా పడగొట్టడం దారుణమని విమర్శించారు. రామవరప్పాడు మసీదు ప్రాంతంలో ఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చి వేశారన్నారు. గోశాల, నిన్న గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చి వేయడం దుర్మార్గమని పార్థసారథి మండిపడ్డారు. గోశాల ఉంటున్న భూమిలో సగం గోశాలకే చెందినదని, మరో సగం ఇరిగేషన్ శాఖదని ఆయన అన్నారు. దేవాలయాలను, మసీదులను పడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ వారు దేవాలయాల కూల్చి వేతపైన వెంటనే స్పందించాలని, మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వద్దని తాము అనడం లేదని అయితే ఈ సమయంలో మతభావాలను గౌరవించాలని ఆయన కోరారు. -
దేవుళ్లారా! మీ పేరేమిటి?
- జీవన కాలమ్ ఐస్లాండ్ - విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్న దేశం ప్రపంచ బంతాటలో పాల్గొంటోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీలలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించుకోలేదు. స్క్రీన్‌ప్లే మొదటి సూత్రం- తెలియనిదాన్ని తెలిసిన విషయంతో పోల్చి చూపడం. ఇతని కంటే ఇతను గొప్ప అంటే ‘ఇతని’ గొప్పతనం తెలుస్తుంది. మనదేశంలో క్రికెట్ అంటే పిచ్చి. ఇంతమంది చూసే, ఇంత ఆదాయాన్నిచ్చే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పుడు క్రికెట్‌తో బంతాటని పోల్చి చూద్దాం. ప్రధానంగా ప్రపం చంలో తొమ్మిది దేశాలు మాత్రమే క్రికెట్ ఆడుతాయి. కానీ 203 దేశాల్లో బంతాట పాపులర్. ప్రపంచంలో వంద నుంచి వందా యాభయ్ కోట్ల మంది క్రికెట్‌ని చూస్తారు. తేలికగా 300 నుంచి 400 కోట్లు బంతాట చూస్తారు. ఫ్రాన్స్‌లో జరిగే ఈ యూరో 2016 పోటీల్లో ప్రపంచంలోని 24 దేశాలు పాల్గొంటున్నాయి. జూన్ 10 నుంచి ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ పోటీలు సరిగ్గా నెలరోజులు, 10 చోట్ల సాగుతాయి. ఫ్రాన్స్‌లో నవంబర్‌లో జరిగిన మారణహోమంతో 130 మంది మరణం దృష్ట్యా ఇది చాలా బాధ్యతాయుతమైన, క్లిష్టమైన టోర్న్‌మెంట్. కారణం, ఒక్క బ్రిటన్ నుంచే 5 లక్షల మంది ఈ ఆటల్ని చూడడానికి వస్తున్నారు. ఆటగాళ్లు, మిగతా సిబ్బంది, ఉద్యోగులు- వీరుకాక ఇన్ని లక్షల మంది క్షేమంగా ఈ ఆటల్ని చూసే అవ కాశాన్ని ఫ్రాన్స్ కల్పించాలి. ఇందుకు కేవలం 90 వేల మంది రక్షణ దళాల్ని మోహరించారు. ఈ ఆటలకు గాను సిద్ధపరిచిన 250 లక్షల టికెట్లలో 99 శాతం ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ పోటీలో పాల్గొంటున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లెవరు? ఎవరు గెలుస్తారని మీరనుకుంటు న్నారు? ప్రపంచం అంతటిలోనూ ఏరి ఒక టీమ్‌ని తయారు చేయమంటే మీరు ఎవరిని ఎంపిక చేస్తారు? మెస్సీ, క్రిస్టియానో రొనాల్జినో, పాల్ బోగ్బా, డేవిడ్ అలబా- ఇలా ఇలా. ఆవేశపూరిత మైన ఊహాగానాలు టీవీల్లో సాగుతున్నాయి. గత పోటీల్లో చాంపియన్షిప్ని గెలుచుకున్న స్పెయిన్‌ని ఈ పోటీల్లో ఫ్రాన్స్ ఓడించవచ్చునన్న పండితుల కథనాలు వినిపిస్తున్నాయి. అనుకోని విచిత్రమైన మలుపులు ఎన్నో జరిగే విచిత్రమైన పోటీలు ఇవి. ఒక అరుదైన ఉదాహరణ. 1968లో ఇటలీ-రష్యా అద్భుతంగా తలపడ్డాయి. ఎన్ని ఆటలు జరిగినా ఏ జట్టూ బెసగలేదు. అప్పుడేం చెయ్యాలి? నేపుల్స్ డ్రెస్సింగు రూంలో బొమ్మా బొరుసు వేశారు. ఇటలీ గెలిచింది. ప్రపంచాన్నే ఆనంద సాగరాల్లో ముంచెత్తిన గొప్ప గొప్ప బంతాట ఆటగాళ్ల చరిత్రలెన్నో ఉన్నాయి. క్రికెట్‌కి టెండూల్కర్ ఒక్కడే దేవుడు. ఆయా దేశాలకి, ఆ ఆటకి ఎందరో దేవుళ్లు. పీలే, మారడోనా, రొనాల్డో, మెస్సీ, నిల్టన్ శాంటోస్, కాఫూ, జికో, బాబీ మూర్- ఇలాగ. ఒక్క పీలే కథ చాలు. ఆయనకి ఇప్పుడు 75. ‘ఈ శతాబ్దపు ఆటగాడు’గా గౌరవాన్ని దక్కించుకున్నాడు. టైమ్ మేగజైన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేరు గణించుకున్న 100 మందిలో పీలేను పేర్కొంది. ఫ్రెంచ్ ఆటగాడు జినెదానే జిదానే గత 50 సంవత్స రాలలో అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నికయ్యాడు. 2005లో జిదానే మళ్లీ ఫ్రెంచ్ టీమ్‌లోకి చేరినప్పుడు అతని తోటి ఆటగాడు ధియరీ హెన్రీ ఒకమాట అన్నాడు, ‘ఫ్రాన్స్‌లో అందరికీ తెలుసు దేవుడున్నా డని. అతను ప్రస్తుతం ఫ్రెంచ్ టీమ్‌లో చేరాడు.’ మరొకపక్క జరుగుతున్న కోపా అమెరికా బంతాట పోటీల్లో మొన్న అర్జెంటీనా మీద కేవలం 19 నిమిషాల్లో మరో ‘దేవుడు’ మెస్సీ హ్యాట్రిక్ (మూడు గోల్స్) కొట్టి పనామాను గడ్డి కరిపించిన దృశ్యాలు, ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే బ్రెజిల్ మొన్న పెరూతో ఆడుతూ చివరి 15 నిమి షాల్లో రాల్ రూయ్డిజ్ చెయ్యితో గోల్ చేసిన కారణంగా పోటీలోంచే వైదొలగడం ఎంతమంది అభిమానుల గుండెల్ని పగలగొట్టిందో! ఇలా ప్రతి రోజూ నరాల్ని వేడెక్కించే ఎన్నో ఎన్నో సంఘటనలు. అయితే ఒక్క విషయం నన్నెప్పుడూ ఆశ్చ ర్యపరుస్తుంది. ఐస్లాండ్ జనాభా మూడు లక్షల ముప్పయ్వేలు. ఒక్క విశాఖనగరం జనాభా ఒక కోటీ డెబ్బై లక్షలు. అంటే విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్నదేశం ప్రపంచ బంతాటలో పాల్గొం టోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీ లలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించు కోలేదు. సెర్బియా 9 కోట్లు జనాభా గల దేశం. అంటే మన తెలుగుదేశం జనాభా కంటే తక్కువ. ఆ దేశస్తుడు డొకోవిచ్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడు, ఆనా ఇవానోవిచ్ టెన్నిస్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళా క్రీడాకారిణి. ఇంత పెద్దదేశం - మనం- ఎందుకు ఈ స్థాయికి చేరలేకపోతున్నాం? ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యం అఖండ జ్యోతి. అది అవినీతి మధ్య, అసహనం మధ్య, చెప్పుడు మాటలు, తప్పుడు రాద్ధాంతాలు, దొంగ ధనార్జన, దీక్షలు, రిజర్వేషన్ల మధ్య వెలగదు. అది నరాల్ని వేడెక్కించే నిప్పు. దాని గుర్తు పట్టాలంటే రొనాల్జినో ఆట, మెస్సీ గోల్, డొకోవిచ్ బాక్ హ్యాండ్లో వెతకాలి. - గొల్లపూడి మారుతీరావు -
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!
ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి. చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. -
వ్యక్తి పూజలకు కొత్త మంత్రాలు!
అక్షర తూణీరం మనకి దేవుళ్లకేం కొదవలేదు. కాని రాముడంటే మనందరికీ మహాయిష్టం. ఆయన దగ్గర చనువు. సాటివాడు కదా, గోడు వింటాడని నమ్మకం. మనిషి పెద్ద మాయగాడు. అవసరాలను బట్టి మనిషిని దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడి చుట్టూ అభేద్యమైన గూడు అల్లుతాడు. ఆ దేవుడికి శతనా మావళులు, సహస్ర నామావళులు రచిస్తాడు. గూటికి గట్టి తలుపులు ఏర్పాటు చేసి, బయట ఓ జేగంట ఏర్పాటు చేస్తాడు. నేన్నిన్ను స్తుతిస్తూ మేల్కొలుపులు పాడతాను, అంతవరకూ నువ్ నిద్ర లేవరాదని భక్తిగా దేవుణ్ణి శాసిస్తాడు. ఎంతైనా దేవుళ్లలో మానవాంశ అంతో ఇంతో ఉంటుంది కదా! అందుకని పొగడ్తలకు మెత్తబడతారు. చెవికింపైన అతిశయోక్తులు వల్లిస్తూ, ‘రామ! రామ! ఇవి సహజోక్తుల’ని వినయం ఒలకబోస్తే నల్లశిల అయినా మెత్తబడాల్సిందే. ఒక్కో తెలివి మీరిన భక్తుడు చిత్రంగా నిందాస్తుతులు, స్తుతినిందలు చేసేసి చక్కిలిగింతలు పెట్టేస్తాడు. అప్పుడు మూల విరాట్ తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. నల్లరాతి బుగ్గలు ఎరుపెక్కుతాయి. ‘‘మహా సృష్టిలో మనిషిని తయారుచేసి పప్పులో కాలేశానని నిత్యం పలుమార్లు సృష్టికర్త నాలుక్కరుచుకుంటాడట’’. కానీ వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక సతమతమవుతూ ఉంటాడు. పూజల పేరిట చెవిలో పువ్వులేమిటి? లేకపోతే దేవుళ్లకి పూజలేమిటి? సరే, పెళ్లిళ్లేమిటి? పట్టాభిషేకాలేమిటి? ఉత్సవాల పేరిట వసూళ్లే మిటి? అందులో కైంకర్యా లేమిటి? ఇంత జరుగుతున్నా బొమ్మలా ఉండిపోయానే అని దేవుడు సుప్రభాతానికి ముందు లేచి అప్పుడప్పుడు వర్రీ అవుతూ ఉంటాడు. ఇతిహాసాలలో, మన ప్రబంధాలలో, కొన్ని నాటకాలలో, నవలల్లో పాత్రలు కవితో సృష్టించబడతాయి. ఒక్కోసారి అవి తెలివిమీరి సృష్టికర్త అదుపు తప్పుతాయి. ఎదురు శాసించడం మొదలుపెడతాయి. శ్రీరామనవమి పేరు చెప్పుకుని వడపప్పు, పానకాలు సేవించి తరించింది జాతి. భక్తిని నిషాగా ఎక్కించగల ప్రత్యేక మానవులు మనలోనే ఉన్నారు. మనిషిని దేవుణ్ణి చేసి గుడి కట్టినప్పుడు, ఆ మనిషి ఆదర్శాలన్నీ గుడి పునాదిరాళ్లు అవుతాయి. అక్కడ నుంచి గుడి తాలూకు ధర్మకర్తల జగన్నాటకానికి తెరలేస్తుంది. ఇంతకీ విగ్రహంగా నిలిచిన నిన్నటి మనీషి ఏమి హితం చెప్పాడో వినిపించుకోరు. పెద్దగా శంఖాలు ఊదుతూ, మంత్రాలు చదువుతూ హితాలు, ఆదర్శాలు చెవిన పడనియ్యరు. ఇక జనానికి కనిపించేవి- బొమ్మకి క్షీరాభిషేకాలు, సమయానికి తగుదండలు మాత్రమే. అంబేడ్కర్ స్ఫూర్తిని పంచడం శ్రేయోదాయకమే గాని ఆకాశాన్ని ముద్దాడే స్థాయి విగ్రహం ఆ మహనీయుని ఆత్మకు సంతృప్తిని ఇస్తుందా? పులిని చూసి నక్క వాత అన్నట్టు, ఇప్పుడు అమరావతిలో ఇంకో అంగుష్ఠమాత్రం ఎత్తయిన విగ్రహం అవతరించబోతోంది. పీఠం ఎక్కి రెండేళ్లయాక అసలు అంబేడ్కర్ చలవతోనే నేను ప్రధాని పీఠం ఎక్కానంటూ మోదీ గద్గదస్వరంతో ప్రకటించారు. శిలావిగ్రహాలు, వాటికి పూజలు వద్దు. రాముడి ఆదర్శం ఒక్కటి ఆచరణలో పెడదాం. ఆకాశమెత్తు అంబేడ్కర్ బొమ్మలొద్దు. బాబాసాహెబ్ ఒక్కమాటని అనుసరిద్దాం. వ్యక్తి పూజలకు కొత్త మంత్రాల రచన వద్దు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మనుషుల్లో దేవుళ్లు
ఈ రెండు కథలకీ పోలికలున్నాయి. సానుభూతికి అడ్రస్ అక్కరలేదు. ఒకాయన మృత్యువుని సుఖవంతంచేయడాన్ని ఉద్యమం చేసుకున్నాడు. మరొకాయన- మృత్యువులో పోగొట్టుకుంటున్న సానుభూతిని సంపాదించి పెట్టాడు. ఆయన వయసు దాదాపు 30 ఏళ్లు. రోజూ ముంబైలో టాటా క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద నిలబ డేవాడు. ప్రతిదినం మృత్యు వుకి భయపడుతూ లోనికి వెళ్లే వారినీ, వాళ్లని తీసుకెళ్లే బంధువులనీ చూసేవాడు. దీనికి దేవుడు తప్ప ఎవరూ పరిష్కా రం చూపించలేరు. ఈ నిస్సహాయత అతన్ని వేధిస్తూ ఉండేది. వీరిలో చాలామంది పేదవారు. దూరప్రాంతం నుంచి వచ్చినవారు. ఏం చెయ్యాలో, ఎవరిని కలుసుకో వాలో తెలియని నిరక్షరాస్యులు. మందులు కొనడానికీ, భోజనానికీ డబ్బు చాలనివారు. రోగానికి దాక్షిణ్యం లేదు. రోగం సమదర్శి. అందరినీ ఒకే విధంగా బాధి స్తుంది. నిస్సహాయంగా ఈ యువకుడు - ఏం చెయ్యా లో తెలీని పరిస్థితిలో ఇంటి ముఖం పట్టేవాడు. ‘వీళ్లకి ఏదైనా ఉపకారం చెయ్యగలనా?’ అని ఆలోచించేవాడు. చివరికి ఒక మార్గం కనిపించింది. తనకున్న ఓ చిన్న హోటల్ని అద్దెకిచ్చేశాడు. హోటల్ లాభదాయకంగానే ఉండేది కనుక మంచి డబ్బే వచ్చింది. ఆ డబ్బుతో కొం డాజీ బిల్డింగ్ పక్కన తాను ఊహించుకున్న సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంతకాలం? గత 27 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నా యి. అసలు ఏమిటి ఈ కార్యక్రమం. ఆసుపత్రికి వచ్చే రోగులకూ, వారి బంధువులకూ ఉచితంగా ఆహారం ఇవ్వడం. ఆ చుట్టుపక్కల వారంతా హర్షించారు. ఆహ్వా నించారు. 50 మందికి మొదట్లో ఈ సహాయం అందేది. క్రమంగా సంఖ్య వంద, రెండు వందలు, మూడు వంద లయింది. మంచితనం అంటువ్యాధి. అవసరాన్ని ఆశిం చే పేదల సంఖ్య పెరిగిన కొద్దీ, అవసరం తీర్చే వదా న్యుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. సంవత్సరాలు గడి చిన కొద్దీ ఈ ఉపకారం నిరుపేదలకి అందుతోంది. ఇప్పుడు పేదల సంఖ్య 700 అయింది. ఈ పుణ్యాత్ముడి పేరు హరఖ్‌చంద్ సావ్లా. అవసరాలు పెరిగినా సావ్లా అక్కడే ఆగిపోలేదు. అవసరమున్న పేదవారికి మందు లు కూడా ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. ఒక ఫార్మసీ బ్యాంక్ ప్రారంభించారు. వెంటనే ముగ్గురు డాక్టర్లు, మూడు ఫార్మసీ సంస్థలు చేయి కలపడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడే పిల్లల సహాయ కార్యక్రమం ‘జీవనజ్యోతి’ తరఫున ఇప్పుడు కనీసం 60 అనుబంధ సంస్థలు నడుస్తున్నా యి. సావ్లాకి ఇప్పుడు 57 సంవత్సరాలు. 27 సంవత్స రాల కిందట లక్ష్యసిద్ధి, దీక్ష ఏమీ తగ్గలేదు. ఇది నిశ్శబ్ద విప్లవం. మానసిక విప్లవం. మానవీయ సంకల్పానికి పట్టాభిషేకం. ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్న ఓ ముసలాయ న దగ్గరకి నర్సు ఓ సైనిక మేజర్ని తీసుకొచ్చింది. ‘‘మీ కోసం మీ అబ్బాయి వచ్చాడు’’ అంటూ అతని చెవులో చెప్పింది. నీరసంగా ముసలాయన కళ్లిప్పాడు. ఆయనకి అర్థమయేలాగ చెప్పడానికి నర్సుకి చాలా సమయం పట్టింది. గుండె నొప్పి కారణంగా ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులో ఉన్న తండ్రి కొడుకు చేతిని బలహీనంగా పట్టు కున్నాడు. కొడుకు కళ్లలో ఆర్తిని గమనించిన నర్స్ అత ను కూర్చోవడానికి కుర్చీ వేసింది. రాత్రంతా తండ్రి చేతిని పట్టుకుని సముదాయించే చల్లని మాటలని చెబు తున్న కొడుకుని గమనించింది. ఆమెకీ కళ్ల నీళ్లు తిరి గాయి. కాస్సేపు విశ్రాంతి తీసుకోమని కొడుక్కి చెప్పిం ది. కొడుకు మర్యాదగా వద్దన్నాడు. అతని మాటలు తండ్రికి సగమే అర్థమవుతున్నాయి. కానీ తనని పట్టు కున్న చేతుల్లో ప్రేమ తెలుస్తోంది. తెల్లవారేసరికి ముస లాయన కన్నుమూశాడు. ప్రాణం లేని చేతిని వదిలి ఆ విషయాన్ని నర్స్‌కు చెప్పడానికి మేజర్ వెళ్లాడు. ‘‘ఆయ న చివరి క్షణాల్లో కొడుకుగా ఆయన కోరుకున్న మన శ్శాంతినిచ్చారు’’ అంది నర్స్. ‘‘ఇంతకీ ఎవరతను?’’ అన్నాడు మేజర్. నర్స్ తుళ్లి పడింది. ‘‘మీ నాన్న కాదా?’’ అంది నిర్ఘాంతపోతూ. ‘‘కాదు. నా జీవితంలో ఆయన్ని నేనెప్పుడూ - ఈ రాత్రి తప్ప చూడలేదు’’ అన్నాడు. ‘‘నేను విక్రమ్ సలా రియా అనే ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాను. ఆయ న కొడుకు ముందు రోజు రాత్రి పాక్ యుద్ధంలో చని పోయాడు.’’ ‘‘ఆయనే విక్రమ్ సలారియా’’ అంది నర్స్. ఇంతే కథ. ఈ రెండింటిలో ఒకటి వాస్తవం. మరొకటి కథ. అయితే ఈ రెండు కథలకీ పోలికలున్నాయి. సానుభూ తికి అడ్రస్ అక్కరలేదు. ఒకాయన మృత్యువుని సుఖ వంతంచేయడాన్ని ఉద్యమం చేసుకున్నాడు. మరొకాయ న- మృత్యువులో పోగొట్టుకుంటున్న సానుభూతిని సం పాదించి పెట్టాడు. మనం అప్పుడప్పుడు దేవుడిని తలచుకుని పరవ శించే మానవమాత్రులం మాత్రమే కానక్కరలేదు. ఓ చిన్న మానవతా చర్య మనం ఊహించకపోయినా మన ల్ని దేవుళ్లని చేస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
వినాయకుడికి హెల్మెట్ ఉంది.. మనకొద్దా..
న్యూఢిల్లీ: రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం దేవుళ్లతో ఓ కొత్త త్రీడీ వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో ఉంచింది. ఇప్పుడా ప్రచార చిత్రం విరివిగా ప్రజలను ఆకర్షిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు అజాగ్రత్తలో వ్యవహరించడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలకు లోనవుతూ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుందని 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాను రూపొందించిన ప్రచార చిత్రంలోభాగంగా 'దేవుళ్లు మన రక్షకులు.. అనుక్షణం మనల్ని కాపాడుతూ వెన్నంటి ఉండేవారు.. సర్వశక్తిమంతులు. అలాంటి దేవుళ్లే రోడ్డు భద్రత పాటిస్తుంటే మనమెందుకు పాటించకూడదు' అని ఈ వీడియో ద్వారా 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' ప్రశ్నించింది. ఈ వీడియోలో దుర్గామాత, వినాయకుడు, విష్ణుమూర్తి.. సింహం, ఎలుక, గరుడను అదిరోహిస్తూ ప్రయాణం ప్రారంభిస్తూ ఒక్కసారిగా ఆగి తమ కిరీటాలను ధరిస్తారు. దీనిద్వారా దేవుళ్లే బయటికెళ్లేటప్పుడు కిరీటాలు లేకుండా వెళ్లేవారు కాదని, అవి తమ తలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా ఉంటాయని సూచిస్తూ మనుషులైన మనం తప్పకుండా హెల్మెట్ ధరించకూడదా అని అందులో ఉంది. -
నచ్చావులే
‘దేవుళ్లు’ మూవీలో అయ్యప్పగా నటించిన తనీష్.. హీరోగా కూడా ‘నచ్చావులే’ అనిపించుకున్నాడు. కాన్పూర్‌లో పుట్టిన ఈ తెలుగబ్బాయికి హైదరాబాద్‌తో బచ్‌పన్‌కా దోస్తీ ఉంది. గల్లీ క్రికెట్లో లొల్లి.. ఫిల్మ్‌నగర్‌లోని హోటల్స్‌లో ఇడ్లీ.. ట్యాంక్‌బండ్ పక్కన పల్లీ.. ఏదైనా సరే సిటీకి లింకుంటే చాలు తనకు నచ్చుతుందంటున్నాడు. అందుకే ఐ లవ్ హైదరాబాద్ అంటూ భాగ్యనగరంతో తన అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్‌గా చేయడంతో స్కూల్ డేస్ సరదాగా గడిచిపోయాయి. కృష్ణనగర్‌లోని శ్రీసాయిరాం హై స్కూల్లో చదివాను. షూటింగ్స్‌కు వెళ్లడంతో క్లాసులు మిస్సయ్యేవి. మా టీచర్లు స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ చదివించేవారు. మేథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. హిస్టరీ లెక్చర్ బోర్ కొట్టినా, హిస్టారికల్ పిక్చర్ అనగానే ఫుల్ జోష్ వచ్చేది. హైదరాబాద్ వంటి చరిత్రాత్మక నగరంలో పెరిగినందుకు గర్వంగా అనిపిస్తుంటుంది. సిటీలో ఉన్న హిస్టారికల్ స్పాట్స్ చూడటం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్‌లో సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, జూపార్క్, ట్యాంక్‌బండ్ వంటి ప్రదేశాలకు పిక్నిక్ వెళ్లేవాళ్లం. గల్లీలో లొల్లి ఇంటర్ ఎస్ఆర్ నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్‌లో చేశాను. మా కాలేజ్ ఎదురుగానే హంగ్రీ జాక్స్ బేకరీ ఉండేది. కాలేజ్ ఆయిపోగానే మా గ్యాంగ్ అంతా అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్లం. అక్కడ బర్గర్, కస్టర్డ్ ఆపిల్ జ్యూస్ టేస్టీగా ఉండేవి. అయితే ఇప్పుడా ప్లేస్‌లో టైటాన్ వాచ్ షోరూం వచ్చింది. ఆ రూట్లో వెళ్లినప్పుడల్లా కాలేజ్ డేసే గుర్తుకొస్తాయి. నేను క్రికెట్ సూపర్బ్‌గా ఆడతాను. గ్రౌండ్లో కాదు.. గల్లీలో. కాస్త తీరిక దొరికితే చాలు ఇరుగుపొరుగు పిల్లలతో కలసి గల్లీలో క్రికెట్ మొదలుపెడతాం. ఆ పిల్లలంతా నాకు థిక్ ఫ్రెండ్సే. నేను ఆడుదామని.. కిందకు దిగితే చాలు సందడే సందడి. హ్యాపీగా ఉన్నా.. డిస్టర్బ్డ్గా ఉన్నా.. క్రికెట్ ఆడతాను. స్వాద్ షహర్ అన్ని ప్రాంతాల రుచులు హైదరాబాద్‌లో దొరుకుతాయి. ఇందిరానగర్‌లోని మంగ టిఫిన్ సెంటర్లో పనీర్ దోశ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఫిలింనగర్‌లోని మయూరి హౌస్‌లో దొరికే కాకినాడ పెసరట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. డైలీ జిమ్ అయిపోగానే మయూరి హౌస్‌లో వాలిపోతాను. ఫిలింనగర్‌లోని కేఫ్ మిలేంజ్, జూబ్లీహిల్స్‌లోని టె స్టారోస్సాకు తరుచూ వెళ్తుంటాను. డెరైక్టర్స్, స్టోరీ రైటర్స్‌తో డిస్కషన్స్‌కు కూడా అక్కడే చేస్తుంటాను. ఇండియాకు జిరాక్స్ నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతానో.. హైదరాబాదీ అని చెప్పుకోవడానికి కూడా అంతే ప్రౌడ్‌గా ఫీలవుతాను. సిటీని మించిన కూల్ ప్లేస్ మరొకటి లేదు. ఇండియాకు హైదరాబాద్ జిరాక్స్ కాపీలా ఉంటుంది. ఇక్కడ అన్ని సంస్కృతులు ప్రతిబింబిస్తాయి. ఇక హైదరాబాదీల గురించి చెప్పాలంటే.. వారి మనసుల్లో ప్యూరిటీ ఉంటుంది. కొత్తవారికి భాగ్యనగరం ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుంది. సినిమాల విషయానికి వస్తే.. షూటింగ్‌ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ నా సెకండ్ బర్త్ ప్లేస్ అనిపిస్తుంటుంది. -
అంతర్యామిని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం
ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం. మనస్సు, ప్రాణం, మాట, కనులు, చెవులు ఎలా ప్రేరేపితమై మనిషినీ, మానవజాతితో సృష్టి మనుగడనూ నడిపిస్తున్నాయనే విషయాన్ని వివరిస్తుంది కేనోపనిషత్తు. దేవతలకూ దానవులకు ఎప్పుడూ గొడవలే. ఒకసారి వారిద్దరికీ జరిగిన యుద్ధంలో విజయం సాధించిన దేవతలు అందరి ప్రశంసలూ అందుకుంటారు. పొగడ్తలతో గర్వం పెరిగిన దేవతలు తమ విజయానికి కారణమైన పరబ్రహ్మ శక్తిని మరిచారు. అహంకారంతో లోకంలో మాకంటే గొప్పవారే లేరనుకుంటూ తమను తామే ప్రశంసించుకోసాగారు. ఈశ్వరుని సర్వ శక్తిమత్వ భావనే వారి మనసులలో లేదు. భగవంతుడు భక్తుల క్షేమాన్నే సదా కోరుకుంటాడు. దేవతలు గర్వంతో చెడిపోతారనే భావంతో వారిని ఉద్ధరించి గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అమరావతీ పట్టణంలోని నందనవనంలో ఒకనాడు ఇంద్రుని కొలువు జరుగుతుండగా పరమాత్మ అతిప్రకాశమైన యక్షరూపంలో దేవతలముందు ప్రత్యక్షమవుతాడు. మహా తేజస్సు నిండిన ఆ యక్షస్వరూపాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. యక్షరూప తత్వాన్ని తెలుసుకోమని దేవతలు సమర్థుడైన అగ్నిని పంపగా, అతన్నే నీవెవరు అని ప్రశ్నించింది ఆ యక్షరూపం. ప్రపంచంలోని వస్తువులనన్నీ క్షణంలో భస్మం చేయగల అగ్నిని నేనంటాడు జాతవేదుడు. ‘‘ఓ అలాగా! ఈ గడ్డిపోచను దగ్ధం చేయి’’అన్నాడు యక్షుడు. అగ్ని తన శక్తినంతా ఉపయోగించి ఓడిపోయి దేవతలను చేరాడు. ప్రపంచం మనుగడ అంతా తన చేతుల్లోనే ఉందనుకునే వాయువును యక్షరూపం గురించి తెలుసుకుని రమ్మంటారు. ‘‘నీవెవరు?’’అని మళ్లీ యక్షుడు వాయువునడుగుతాడు. వాయువు గర్వంగా నేనే తెలియదా? ప్రపంచానికి ఊపిరే నేనంటాడు. యక్షుడు ‘‘ఈ గడ్డిపోచను నీ వాయువేగంతో ఎగురగొట్టు చూద్దాం’’ అనగానే వాయువు తన బలాన్నంతా చూపించినా గడ్డిపోచను కొంచెమైనా కదిలించలేక తోకముడిచాడు. దేవతలందరూ చివరగా ఇంద్రుని పంపగా, యక్షరూపాన్ని ఇంద్రుడు చేరేలోపే ఆ దివ్యరూపం మాయమై పోతుంది. యక్షరూపం కనిపించక అన్నివైపులా వెదుకుతున్న ఇంద్రునికి ఆకాశంలో శోభాయమానంగా వెలుగుతూ పార్వతీ దేవి ప్రత్యక్షమైంది. ఇంద్రుడు ఆమెకు నమస్కరించి ‘‘దేవీ! దేవతలందరినీ ఆశ్చర్యపరచిన ఆ యక్షరూపమెవరిది?’’అని అడిగాడు. జగన్మాత నవ్వుతూ ‘‘ఇంద్రా! నీవు వెదికే ఆ యక్షస్వరూపం సాక్షాత్తూ పరబ్రహ్మం. సకల చరాచర ప్రపంచమంతా నిండి ఉన్న ఆ బ్రహ్మమే మీ విజయానికి కారణం. పరబ్రహ్మను కాదని ఎంత శక్తిమంతుడైనా గడ్డిపోచను కూడా కదిలించలే రనే సత్యాన్ని తెలియజేసేందుకే ఇదంతా అని చెప్పి ఆ తల్లి అంతర్థానమవుతుంది. నిజం తెలుసుకున్న ఇంద్రుడు భగవంతుని తత్త్వాన్ని దేవతలందరికీ వివరిస్తాడు. ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం. - ఇట్టేడు అర్కనందనాదేవి మీకు తెలుసా? సమస్త ప్రపంచం తన స్వరూపంగా భావించేవారికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహ్యం, రాగం ఉండవు. అశాశ్వతమైన జీవితం కోసం కర్మలు చేసేవారు గాఢాంధకారంలో, సామాన్యమైన జ్ఞానంతోనే తృప్తిపడేవారు అంతకంటే చీకటిలో మగ్గిపోతారు. బ్రహ్మమంటే ఏమిటి? ఈ సమస్త సృష్టీ దేనినుండి పుట్టిందో, ఆవిర్భవించిన సృష్టి దేనిపై ఆధారపడి నిలబడి... మనుగడ దిశగా సాగిందో, చివరికి దేనిలో లీనమవుతుందో ఆ మూలతత్త్వమే బ్రహ్మం. ఏ ఉపనిషత్తులో ఏముంది? జీవకోటికి ఆనందమే ధ్యేయం. మూలస్వరూపం. అదే బ్రహ్మం. ఆత్మస్వరూపం. ఆనందం నుండే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది. ఆనందం చేతనే జీవిస్తుంది. ఆనందంలోనే లయమవుతుందని చెప్పడమే తైత్తిరీయ ఉపనిషత్తు సారం. ప్రాపంచిక విషయాలను మనిషెన్నడూ సాధారణ దృష్టితో చూడలేడు. ప్రగాఢమైన ఎల్లలు లేని ఏదో ప్రజ్ఞ సృష్టిని నడిపిస్తుందని అతని అనుమానం. ఎలా...? ఎలా...? అనే అన్వేషణకు సమాధానం చక్కగా వివరిస్తుంది కేనోపనిషత్తు. -
దుర్గతులను దూరం చేసే తల్లీ!
అమ్మవారు జ్ఞానదాయిని, మోక్షదాయిని, సర్వవిద్యాప్రదాయిని. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి దశమి వరకు ఉండే పది తిథులలోనూ నిష్ఠగా ఉండి ఇంద్రియాలను జయించాలని, దానివల్ల పునర్జన్మ ఉండదని దేవ్యుపనిషత్తు తెలుపుతోంది. అమ్మ అంటే ప్రకృతి. ఈ ప్రకృతిని ప్రేమించడం, దానిని వికృతిని చేయక రక్షించడమే అమ్మపూజ అని, అదే మానవ ధర్మమనీ బ్రహ్మాండపురాణం చెబుతోంది. ఈర్ష్యను వదలడం, సత్యం, అహింస, ధర్మం, దురాశను వదలడం, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, దురాచారాలు, పాపాలు త్యజించి, పరస్త్రీని, పరధనాన్నీ కోరకుండా ఉండటం, ఆత్మస్థైర్యంతో సర్వకార్యాలనూ సాధించడం... ఇవే శరన్నవరాత్రుల పూజలలోని విశేషార్థం. అమ్మవారికి వసంతకాలంలో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా, శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా ఇష్టమైన రోజులు. ఈ ఋుతువులు రెండూ రోగాలు వ్యాపింపజేసే లక్షణాలున్నవే. వర్షాలు వెనకబడటం వల్ల శరత్కాలంలోనూ, చలి తొలగడం వల్ల చైత్రంలోనూ కొత్త రోగాలు వచ్చి ప్రజలను పీడించి ప్రాణాలు తీస్తాయనీ, అందువల్ల వీటిని యముని కోరలుగా పిలుస్తారనీ, ఈ బాధల నుండి బయటపడటానికి అమ్మను పూజించాలని వేదవ్యాసుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు. కేవలం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. శరన్నవరాత్రులు ఆరంభం కావడానికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని కొడుకు రురుడు. వాడి కొడుకు దుర్గముడు. వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరం వాడికి బ్రహ్మ ఇవ్వడంతో విప్ర, మునులంతా వేదాలు మరచిపోయారు. దాని వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. హవిస్సులు అందక దేవతలు కృశించిపోయారు. దేవతలు కృశించడంతో వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. అప్పుడు వారంతా అమ్మను ప్రార్థించగా, శ్రీదేవి వారికందరికీ ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ వాడికిచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చింది. శ్రీమత్ దేవీభాగవతంలోని సప్తమ స్కంధంలో ఈ కథ ఉంది. దుర్గాసప్తశతిలో కూడా అమ్మ స్వయంగా, దుర్గముడిని చంపిన తనకు దుర్గ అనే పేరు వచ్చిందని చెప్పింది. ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు అమ్మవారు దుర్గముడిని అమ్మవారు చంపడం వల్ల ఆనాటి నుండి దుర్గాష్టమిగా దానిని పేర్కొన్నారు. శరన్నవరాత్రులు ఉత్తమ మనువు కాలంలో ఈ దుర్గమ వధ వల్ల ప్రారంభమైనట్లు కాళికాపురాణం చెప్తోంది. పూర్వం శ్రీరాముడు సీతాన్వేషణ సమయంలో లంకకు వెళ్లే ముందు నారదుని సలహాపై అంబికను ప్రతిష్ఠించుకుని దేవీనవరాత్రి పూజలు చేశాడు. అష్టమినాడు అమ్మవారిని 1008 తామరపూలతో, అవి కూడా వేయి రేకులున్న వాటితో పూజించదలిచాడు. సహస్రార కమలాలు కేవలం సౌగంధిక సరస్సులోనే ఉంటాయి. వాటిని హనుమంతుడు రాముడికి తెచ్చి ఇచ్చాడు. నారదుని పౌరోహిత్యంలో అష్టమీ పూజ శ్రీలలితాసహస్రనామాలతో జరుగుతోంది. ఇంక రెండు నామాలున్నాయనగా రెండు పూలు తక్కువయ్యాయి. నారదుడు దీక్షలో నుండి కదలకూడదనీ, ఆలస్యం లేకుండా ఆ రెండు పూలూ కూడా సమర్పించకపోతే పూజ అంతా వ్యర్థమేననీ, పైగా అమ్మవారికి మహాపచారం కూడా చేసినట్లేననీ అన్నాడు. అప్పుడు రాముడు... నా కళ్లే తామరపూలకు బదులుగా ఇస్తాననీ, నన్ను ప్రజలు ‘రామః కమల పత్రాక్షః’ అంటారనీ పలికి, ఆ రెండు నామాలనూ నారదుడు చదువుతుండగా, తన కళ్లు పీకి అమ్మకు సమర్పించాడు. అప్పుడు అమ్మ అష్టమినాటి ఆ రాత్రి వేళ ఆయనకు ప్రత్యక్షమై, తానే రాముడిని పరీక్షించడానికి పూలు మాయం చేశానని చెప్పి, రాముని అనన్య భక్తికి వరాలిచ్చి, దశమినాడు లంకకు వెళ్లమని, ఆయనకు సీతాసమాగమం అవుతుందని వరమిచ్చింది. అప్పటి నుంచి దుర్గాష్టమి రామాష్టమిగా, విజయాష్టమిగా, మోక్షాష్టమిగా ప్రసిద్ధికెక్కిందని కాళికాపురాణం, శ్రీమత్ దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలోనూ వ్యాసుడు వివరించాడు. నవరాత్రులు తొమ్మిదిరోజులూ అమ్మవారిని పూజించలేనివారు కనీసం అష్టమి నుండి అయినా అమ్మను అర్చించడం ఫలదాయకం. అర్చన విధానం అమ్మవారిని ఉంచే మండపాన్ని తోరణాలతో అలంకరించాలి. ఉదయమే లేచి పవిత్ర స్నానం చేయాలి. అమ్మవారిని వస్త్రాదులతో అలంకరించాలి. అమ్మవారి పాదాల వద్ద నవార్ణవ మంత్రంతో కూడిన యంత్రం స్థాపించాలి. వేదికపై కుడివైపు అంటే మనకు ఎడమవైపు కలశస్థాపన చేయాలి. కలశంలో పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మేడి, మద్ది, మామిడిచిగుళ్లు ఉంచాలి. కలశంలో నదీజలం, సువర్ణం, రత్నం వీలును బట్టి వేయాలి. ముందుగా ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకుని పూజను ఆరంభించాలి. గురూపదేశ మంత్రం జపించి, సహస్రనామాలతో శ్రీచక్రాన్ని పూజించాలి. నిత్యార్చనలో పంచామృతాలు ఉపయోగించాలి. అమ్మవారి పూజలో గంధం, అగరువత్తులు, కర్పూరం, సుగంధ పుష్పాలు, అమ్మవారి పూజకు మందారం, కానుగ, అశోకం, సంపెంగ, గన్నేరు, మాలతి, బిల్వపత్రాలు, తామరపూలు, కలువపూలు ఉండాలి. నల్ల కలువలు శ్రేష్ఠం. నైవేద్యంలో ఉండవలసిన ఫలాలు: కొబ్బరికాయ, నిమ్మ, దానిమ్మ, అరటి, నారింజ, పనస, మారేడుకాయ. పిండివంటలు: దద్ధ్యోదనం, పాయసం. - వద్దిపర్తి పద్మాకర్, ప్రణవ పీఠాధిపతి అమ్మవారి పూజాదులలో అనే కాంతరార్థాలున్నాయి. ‘దురాచార విఘాతినీం’ అని అమ్మను శ్రీ దేవ్యధర్వ శీర్షం వర్ణించింది. మనలోని అహంకార మమకా రాలు, కోమక్రోధాదులు, జంతువు లను బలి ఇచ్చే హింసాది లక్షణాల కు ‘దుం’ అని పేరు. వాటిని తొలగించే తల్లి దుర్గ అని, దురా చారాలను తొలగించుకోవడమే శరన్నవరాత్రుల పూజలోని అంత రార్థమనీ, మనలోని నవరంధ్రాల ను శుద్ధి చేసుకోవడమే నవరాత్ర పూజ అనీ, అథర్వ శీర్షంలోని మంత్రాలు వివరిస్తున్నాయి.