దేవుళ్ల పేర్ల మీద మాన్యం భూములు
దేవుళ్ల పేర్ల మీద మాన్యం భూములు
Published Thu, Oct 13 2016 10:25 PM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ
కర్నూలు(అగ్రికల్చర్): మాన్యం భూములు దేవుళ్ల పేరుమీదే ఉండాలని..వాటిని అర్చకులు సాగు చేసుకంటుంటే వెబ్‌ల్యాండ్‌లో అనుభవదారులు(అక్రమణదారులు)గా నమోదు చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్రపునీట ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాసాధికార సర్వేను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం 100 గజాలలోపు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే ఎలాంటి రుసుం తీసుకోకుండా క్రమబద్ధీకరించాలన్నారు. అదే 500లోపు గజాలు అక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే నిర్ణీత పీజుపై క్రమబద్ధీకరించాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక‌్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement