problem
-
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ఘట్కేసర్ (మల్కాజ్గిరి జిల్లా) : కూతురును ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని ఓ తల్లి ఆడిన డ్రామాను ఘట్కేసర్ పోలీసులు ఛేదించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి (60) కూతురు ఆర్థిక సమస్యల్లో ఉంది. కూతురు పడుతున్న కష్టాలను గమనించిన తల్లి.. ఏదైనా సాయం చేయాలనుకుంది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో పుస్తెల తాడు విక్రయించాలనుకుంది. బంగారం అమ్మితే కుమారుడికి తెలుస్తుందని భయపడి మిన్నకుండిపోయింది. ఎలాగైనా కూతురికి సాయం చేయాలని చైన్ స్నాచింగ్ డ్రామాకు తెరలేపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకొని తన మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఏడ్వసాగింది. దీంతో పలువురు స్థానికులు అక్కడ గుమికూడారు. ఈ క్రమంలో వృద్ధురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు పోలీస్ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వృద్ధురాలు పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుల ఆచూకీ లభించలేదు. దీంతో వృద్ధురాలిని గట్టిగా నిలదీయడంతో.. కూతురిని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని డ్రామా ఆడినట్లు తెలిపింది. కూతురి ఆర్థిక సమస్యలు తీర్చాలని పోలీసులను తప్పుదోవ పట్టించిన వృద్ధురాలిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అత్యవసర సమయాల్లో వినియోగించే డయల్ 100ను దుర్వానియోగపర్చవద్దని పోలీసులు సూచించారు. -
ఆన్లైన్ షాపింగ్‌లో బిజీనా.. అయితే బీకేర్‌ఫుల్!
ఐరన్ మ్యాన్ 3 టీ షర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌కు వెళ్లు, బ్లూటూత్ అవసరమా నెట్లో చూడు.. లంచ్‌కి వెజిటబుల్స్ లేవా జొమాటోలో ఆర్డర్ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్‌కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్ ట్రెండ్.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్ ముల్లర్ అన్నారు. కాంప్రహెన్సివ్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్ ద్వారా నిర్ధారిస్తారు. తక్షణ ఉత్సాహం కోసం.. ఆన్లైన్ షాపింగ్ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంకుర్ సింగ్. ఆన్లైన్ షాపింగ్ వ్యసనాన్ని కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ దాటి ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. హార్మోన్లపై ప్రభావం.. కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్‌ను ఓపెన్ చేసిన మరుక్షణమే డోపమైన్ హోర్మోన్ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్‌ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.నష్టాలెన్నో.. సాధారణ వ్యక్తిగత షాపింగ్ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. ఇలా వదులుకోవాలి.. ⇒ ఆన్లైన్లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి. ⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను నిర్ణయించుకోవాలి. ⇒ ప్రచార ఈ మెయిల్స్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసేయడం, ఫోన్ వగైరా డివైజ్‌ల నుంచి షాపింగ్ యాప్‌లను తగ్గించేయాలి. ⇒ తరచూ షాపింగ్ వెబ్సైట్లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి. ⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి. మొదటి పది ఇవే.. నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్ డివైజ్‌లు, ఫుట్‌వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్ సైట్లలో.. స్నాప్ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్‌కార్డ్, షాప్‌క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్ ఎన్ యు.. వంటివి ఉన్నాయి.నగరమా బీకేర్‌ఫుల్.. కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల నగరవాసులు ఫిజికల్ స్టోర్లను విస్మరించి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్ఫోన్ల వినియోగం ఆన్లైన్ షాపింగ్ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్‌కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేవలం పుస్తకాలే.. తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్లైన్ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్ ఈ–షాపర్ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాను. – నికుల్గుప్తాతక్కువ ధరలకు.. నగరంలోని షోరూమ్‌లు అందించే వాటికన్నా.. ఆన్లైన్ ద్వారానే ఎక్కువ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయి. బర్త్‌డే లేదా పార్టీ, ఫంక్షన్‌కు తగినవి, లేటెస్ట్ ఫ్యాషనబుల్ గూడ్స్ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్‌లో దాదాపు 70 శాతం ఆన్లైన్ మీదే. – పూజానేతి -
ద.కొరియా: మరో విమానానికి తప్పిన ప్రమాదం
సియోల్:సౌత్‌కొరియాలో ఘోర విమాన ప్రమాదం మరువకముందే మరో విమానానికి పెద్ద గండం తప్పింది. ఈ విమానం కూడా ఆదివారం 179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం గమనార్హం. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోమవారం(డిసెంబర్30) ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో విమానాన్ని తిరిగి గింపో విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. అయితే ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్యనే వచ్చినట్లు తెలుస్తోంది.కాగా, ఆదివారం సౌత్కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 181 మందిలో ఇద్దరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. జెజు ఎయిర్‌లైన్స్‌కు సామాన్యులకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపే బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీగా పేరుంది.ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్
నా వయసు 24 సంవత్సరాలు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని. నా పనిలో బాగా రాణిస్తున్న తరుణంలో ఒకరోజు లిఫ్ట్‌లో 15 నిమిషాలు ఒక్కదాన్ని స్ట్రక్ అయ్యాను. అపుడు నాకు విపరీతంగా చెమటలు పట్టి, గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుని, ఒళ్ళంతా చల్లబడి, ఊపిరి ఆడనంత పరిస్థితి. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనేంత భయం వేసింది. ఇది జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ, దీని తర్వాత నేను లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లే ఎక్కడం కాకుండా, ఫ్లైట్ ట్రావెల్‌ని కూడా అవాయిడ్ చేస్తున్నాను. మరల అలాంటి ఎటాక్ వస్తుందేమో అన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అనేక సార్లు వచ్చిన ప్రమోషన్ అవకాశాన్ని కూడా ఈ ట్రావెల్ ఫోబియా వల్ల వదులుకున్నాను. నాకు సహాయం చేయండి. – నందిని, కాకినాడనందినీగారూ! మీకున్న ఈ సమస్యను ప్యానిక్ ఎటాక్ అంటారు. ఇటువంటి సమస్య తరచూ వస్తున్నా లేదా వస్తాయనే భయంతో మీరు లిఫ్ట్, ఫ్లైట్ వంటివి అవాయిడ్ చేస్తుండటాన్ని ప్యానిక్ డిజార్డర్ అంటారు. ఇది చాలా సాధారణ మానసిక కండిషన్. కొంతమంది బాగా జనం ఉన్న ప్రదేశాలలో మరికొంత మంది తలుపులు అన్ని మూసేసిన గదిలో ఉన్నా ఇలా అనేక సందర్భాల్లో ప్యానిక్ అటాక్ రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే అకారణంగా కూడా ఈ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ప్యానిక్ అటాక్‌ని ట్రీట్ చేయడానికి ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ ‘మైండ్‌ఫుల్‌నెస్ ట్రెయినింగ్’ ‘రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్’తో పాటు కొన్ని రకాల మంచి మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. మీ జీవితంలో ఇబ్బంది వల్ల మీరు ఎంతో కోల్పోతున్నట్లు తెలుస్తుంది. కనుక మీరు తొందరలో మంచి మానసిక వైద్యుణ్ణి కలిసి దీని నుండి విముక్తి పొందాలని, మీ పూర్తి సామర్థ్యాన్ని తిరిగి సాధించాలని ఆశిస్తున్నాను. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!) -
హాయ్.. ఏఐ
కృత్రిమ మేధ.. సాంకేతిక విప్లవంలో మానవుడి ఆలోచనలకు అందనంత దూరం వెళ్లిపోయింది. మెషీన్ లెర్నింగ్, డీప్ లెరి్నంగ్ సాయంతో మనిషి కూడా చేయలేని ఎన్నో పనులకు పరిష్కారం చూపుతోంది. భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మించాలని ప్రణాళికలు కూడా రచిస్తోంది. యువత కూడా ఏఐలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమ సృజనాత్మకతకు పదును పెడుతోంది. ఏఐతో నడిచే కొత్త కొత్త యాప్‌లను సృష్టించి.. ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. ఏదో ఒక ఉద్యోగం చేయడం కన్నా.. సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమాజానికి తమ చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టీ–హబ్ వేదికగా ఎన్నో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. ఎన్నో స్టార్టప్‌లకు టీ–హబ్ ప్రోత్సాహం అందిస్తోంది. సాధారణంగా మనుషుల జాతకం గురించి వినే ఉంటాం. కానీ వాహనాలకు కూడా జాతకం ఉంటుందా అనే కదా మీ అనుమానం. ఏఐతో వాహనం జాతకం గురించి చెప్పే యాప్‌ను చరణ్ సింగ్, మల్లికారెడ్డి అనే ఇద్దరు యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ తీసుకొచ్చారు. వీళ్లు రూపొందించిన చిన్న పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుంది. దాన్ని కనుక వాహనానికి అమర్చుకుంటే వాహనం కండీషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మన మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఎప్పుడు బ్రేక్‌డౌన్ అవుతుంది.. ఎప్పుడు సరీ్వసింగ్ చేయించాలి.. అన్న వివరాలను మనకు తెలుపుతూ ఉంటుంది. వాహనం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని మనకు చెబుతుందన్న మాట. 2018లోనే ఈ ఐడియాతో ఓ స్టార్టప్ మొదలు పెట్టాలని భావించారు. చివరకు 2022లో దీన్ని ప్రారంభించి ఔరా అనిపించుకుంటున్నారు. సాధక్ అనే ఈ పరికరంతో వాహనాల లైఫ్‌టైం భారీగా పెంచుకోవచ్చని చరణ్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తుందని ముందే పసిగట్టి చెబుతుంది కాబట్టి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవడం లేదా జాగ్రత్తలు పాటించడం ద్వారా వాహనం షెడ్డుకు వెళ్లకుండా కాపాడుకోవచ్చని వివరించారు. వేక్.ఇన్ అనే పోర్టల్ ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు.మూసీ పరిరక్షణలోనూ ఏఐ.. మూసీ ప్రక్షాళనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించట్లేదు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో కనుక్కొని ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే కృత్రిమ మేధతో పరిష్కారం చూపుతామని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకొచ్చారు. నాలుగు దశల్లో మూసీని పూర్తిగా పరిశుభ్రం చేయొచ్చని చెబుతున్నారు. తొలుత డ్రోన్ల సాయంతో మూసీ నదిలో, పరీవాహక ప్రాంతంలోని చెత్తను తొలగించాలని పేర్కొంటున్నారు. సెన్సార్ల ద్వారా మూసీలో చెత్త వేస్తే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది. అంతేకాదు.. వరదలు, విపత్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వరదలు రావడానికి ముందే ముప్పును పసిగట్టి స్థానికులకు సమాచారం అందజేస్తుంది. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారులు త్వరగా సహాయక చర్యలు చేపట్టే వీలు కలి్పస్తుంది. అర్బన్ ప్లానింగ్‌లో కూడా కృత్రిమ మేధను వినియోగించుకుని, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రణాళికలు రచించవచ్చని పేర్కొంటున్నారు. ఇక, ఎక్కడెక్కడ బ్రిడ్జిలు అవసరం ఉన్నాయనే విషయం కూడా కృత్రిమ మేధ చెప్పేస్తుందని చెబుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టేసేలా..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ సాయంతో వినూత్నంగా కళ్లద్దాలను పర్వ్యూ ఎక్స్ అనే కంపెనీ అభివృద్ధిపరిచింది. వీటిని ధరించిన పోలీసు జస్ట్ అలా వాహనాన్ని తరచి చూస్తే చాలు.. కృత్రిమ మేధ సాయంతో సమాచారం మన ముందుంచుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, అద్దాలు ఉన్నాయా లేదా ఇలా అన్ని వివరాలను ఫోన్‌కు పంపుతుంది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చలాన్లు కూడా జెనరేట్ చేసి, వాహనదారుడికి పంపుతుంది. ఉన్నతాధికారులకు ఈ విషయాలను పంపుతుంది. వాయిస్ రూపంలో సదరు అధికారికి వివరాలను చెబుతోంది. అలాగే ట్రాఫిక్ ఎలా ఉందనే వివరాలను కూడా అంచనా వేసి, ట్రాఫిక్ నియంత్రణలో మేలు చేస్తుంది. చాలా కచి్చతత్వంతో వివరాలను నమోదు చేస్తుంది. అలాగే దీంతో కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకత పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.భవిష్యత్తు ఏఐదే.. భవిష్యత్తులో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏఐ నిర్ణయించే రోజు వస్తుంది. మనం చేయాల్సిన ప్రతి పనినీ ఏఐ అ«దీనంలోకి తీసుకుంటుంది. కృత్రిమ మేధతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. కాకపోతే ఏఐని సరైన క్రమంలో మలుచుకుని, స్కిల్స్ పెంచుకుంటే మాత్రం కృత్రిమ మేధ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. – చరణ్‌సింగ్, వేక్ వ్యవస్థాపకుడుస్టార్టప్లో పనిచేస్తూ సొంతంగా.. స్టార్టప్ ఏర్పాటు చేసే ముందు ఏదైనా స్టార్టప్ కంపెనీలో పనిచేస్తే మంచిది. అందులో ఉండే కష్టనష్టాలు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడితే.. నిర్వహణలో విజయం సాధించవచ్చు. నేను కూడా అలా ముందు ఓ కంపెనీలో పనిచేసి.. సొంతంగా స్టార్టప్ స్థాపించాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా సంస్థను నడిపిస్తున్నాను. మా బాబాయి మెకానిక్. ఆయన లాంటి మెకానిక్‌లకు ఉపయోగపడేలా ఏదైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వేక్‌ను స్థాపించాను. – మల్లికారెడ్డి, వేక్ సహ వ్యవస్థాపకురాలు -
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య! ప్రశాంతమైన నిద్రపట్టాలంటే..?
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...నిద్రను దూరం చేసేవి ఇవే!మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. – నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్‌కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.ఆలోచనలకు కళ్లెం వేయాలి..శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్‌లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.నిద్రలేమిని అరికట్టాలంటే!కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి – పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:– నిద్రపోయే ముందు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.– రాత్రిభోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.మంచి నిద్రకు... మంచి ఆహారం!నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్‌లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే! ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఎదిగే పిల్లలకు ఎముకల సమస్య వస్తుందా..?
సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి, అవి గట్టిగా మారడాన్ని ‘ఆర్థరైటిస్’గా వ్యవహరిస్తుంటారు. మామూలుగానైతే పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, పిల్లల్లోనూ కనిపిస్తుంది. ఇటీవల ఈ ధోరణి కాస్త ఎక్కువగానే ఉంది. పదహారేళ్ల లోపు పిల్లల్లో కారణమేమిటో తెలియకుండా వచ్చి, ఎదిగే ఎముకల్ని ప్రభావితం చేసే ఈ ఆర్థరైటిస్‌ను ‘జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్’ అనీ, ‘పీడియాట్రిక్ రుమాటిక్ డిసీజ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం... చిన్నారుల వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత ఎముకల కీళ్ల కణాలను దెబ్బతీయడంతో వస్తుంది కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (జేఐఏ)లో అనేక రకాలు ఉండటంవల్ల లక్షణాలూ వేర్వేరుగా ఉంటాయి. జేఐఏలోని రకాలు: సిస్టమిక్ ఆన్సెట్ జేఐఏ : ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒంటిమీద ర్యాష్‌తో కొన్నిసార్లు గుండె, కాలేయం, స్లీ్పన్, లింఫ్నోడ్స్ను ప్రభావితం చేయవచ్చు. ఆలిగో ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆరు నెలల్లో ఇది ఒకటి నుంచి నాలుగు రకాల కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఆర్నెల్లు దాటాక ఇంక ఏ కీలునూ ప్రభావితం చేయక΄ోతే దీన్ని ‘పర్సిస్టెంట్’ రకంగా పిలుస్తారు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత మరిన్ని కీళ్లను ప్రభావితం చేస్తే దీన్ని ‘ఎక్స్టెండెడ్’ రకంగా చెబుతారు. లీ ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆర్నెల్లలో ఇది 5 లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ (ఆర్.ఎఫ్.) అనే రక్తపరీక్ష రిజల్ట్‌లో ఇది ఆర్ఎఫ్ పాజిటివ్‌గా లేదా ఆర్ఎఫ్ నెగెటివ్‌గా ఇలా ఎలాగైనా కనిపించవచ్చు. ఎంథసైటిస్ జేఐఏ : ఇందులో చిన్నారికి ఆర్థరైటిస్తోపాటు ఎంథసైటిస్ సమస్య కూడా ఉంటుంది. అంటే టెండన్ లేదా లిగమెంట్‌తో ఎముక కలిసే చోట వాపు కనిపిస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : ఇందులో ఆర్థరైటిస్తోపాటు చర్మవ్యాధి అయిన సోరియాసిస్ కూడా కనిపిస్తుంది లేదా ఆర్థరైటిస్తోపాటు చేతి వేలు / కాలి బొటనవేలి ఇన్ఫ్లమేసన్ లేదా ఆర్థరైటిస్తోపాటు చేతి గోళ్ల మీద చిన్న చిన్న గుంటల్లా / గ్రూవ్స్లా రావచ్చు.చికిత్స: పిల్లల్లో సగం మందికి చికిత్స తర్వాత దాదాపుగా పూర్తిగా కోలుకునే అవకాశాలుంటాయి అయితే రుమటాలజిస్ట్ ఆధ్వర్యంలో నిశితమైన చికిత్స అందించాలి. చికిత్సలో భాగంగా... నొప్పులూ, వాపు, మంట తగ్గించడానికి నాన్‌స్టెరాయిడల్ యాంటీ–ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) జేఐఏను అదుపులో పెట్టడానికి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ మెడిసిన్స్ (డిఎమ్ఏఆర్డీ) డాక్టర్ నిర్ణయించిన మోతాదులో కార్టికోస్టెరాయిడ్స్ మిగతా మందులు అంతగా ప్రభావం చూపనప్పుడు‘బయాలజిక్స్’ అనే పేరున్న అధునాతన మందులు. మందులతోపాటు కండరాలు, కీళ్లను సక్రమంగా పనిచేయించడం కోసం ఫిజియోథెరపీ, మంచి ఆహారం కోసం న్యూట్రిషనల్ కౌన్సెలింగ్, క్రమం తప్పని వ్యాయామాలు, కంటి పరీక్షలు కూడా అవసరమవుతాయిలక్షణాలు : మోకాలు, చేతి /పాదాల, మడమ, భుజాలు, మోచేయి లేదా ఏ ప్రదేశంలోని కీళ్లలో వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళ లేదా నిద్రలేవగానే ఈ కీళ్లవాపు కనిపించవచ్చు కళ్లు ఎర్రబారడం, మంట, వాపు కీళ్ల ఎర్రబారడంతోపాటు వేడిగా అనిపించడంకదలికలకు కీళ్లు సహకరించక΄ోవడం ∙తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఆకలి మందగించడం, బరువు అలాగే ఎత్తు వయసుకు తగినట్లుగా పెరగకపోవడం లింఫ్‌నోడ్స్ వాపు.నిర్ధారణ : యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ (ఏఎన్ఏ) పరీక్షతోపాటు ఇతర యాంటీబాడీ పరీక్షలు కంప్లీట్ బ్లడ్ కౌంట్ ∙ఎరిథ్రోసైటిస్ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్) పరీక్ష సీ రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్పీ) పరీక్ష ∙క్రియాటినిన్ (కిడ్నీలు సరిగా పనిచేస్తున్నాయా అని తెలిపే పరీక్ష) హిమాటోక్రిట్ (రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను తెలిపే పరీక్ష. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతతో బాధపడటం ఎక్కువ) రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష అలాగే ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, బోన్ స్కాన్ వంటి కొన్ని ఇమేజింగ్ పరీక్షలతోపాటు మూత్ర పరీక్ష, కీళ్లలోని కందెన వంటి ద్రవాన్ని పరీక్షించే ‘ఆర్థ్రోసెంటైసిస్ పరీక్ష... ఇంకా పూర్తిస్థాయి కంటి పరీక్షలు అవసరం. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్(చదవండి: అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?) -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.శ్రీరాముడి దేవాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని విశ్వహిందూ పరిషత్ లేఖలో పేర్కొంది. -
ఆక్వా రైతుల ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్వా రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న తలపెట్టిన ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీర ప్రాంత జిల్లాల రైతులు పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో చర్చించే అంశాలు, తీర్మానాల వివరాలను అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ డైరెక్టర్ షేక్ అలీ హుసేన్, ఆక్వా రైతు సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు సోమవారం మీడియాకు వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ⇒ ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏటా కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి ⇒ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేపలు, రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ⇒ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలి ⇒ అప్సడా చట్టం ద్వారా హేచరీలను నియంత్రించాలి. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలి. ⇒ అప్సడా చట్టం ద్వారా ఆక్వా రైతుల రిజి్రస్టేషన్‌ను మరింత సరళతరం చేసేందుకు మండల స్థాయిలో రిజి్రస్టేషన్ మేళాలు నిర్వహించాలి ⇒ వ్యవసాయ, ఉద్యాన పంటల మాదిరిగానే మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఏఏ ఆక్వా ఉత్పత్తులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఏటా పంటల ప్రణాళిక ముందస్తుగా తయారు చేసి కచి్ఛతంగా అమలు చేయాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే పెట్రో ఉత్పత్తులను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందించాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ⇒ ఆక్వా రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రవేశÔ¶ పెట్టాలి. ⇒ దళారీల వల్ల మోసపోతున్న రైతుల కోసం తీర ప్రాంత జిల్లాల్లో ఆక్వా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ⇒ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు అనుబంధంగా మండలానికో ల్యాబ్, మండలానికో యాంటీ బయాటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి ⇒ గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆక్వా యూనివర్శిటీని వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలి. యూనివర్సిటీ ద్వారా వనామీ రొయ్యల సాగులో మెళకువులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి ⇒ ఆక్వా పరికరాలకు 90 శాతం సబ్సిడీ, రిటైల్ అవుట్లెట్లకు 90 శాతం ఆరి్ధక సాయం అందించాలి ⇒ ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల నిల్వకు 90 శాతం సబ్సిడీతో శీతల గిడ్డంగులు నిర్మించాలి ⇒ జోన్‌తో సంబంధం లేకుండా ఎకరాకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేయాలి. హేచరీలు, ఆక్వా నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా సబ్సిడీపై విద్యుత్ అందించాలి. ⇒ తల్లి రొయ్యలు, లార్వా, పోస్ట్ లార్వా ఫీడ్లతో పాటు మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలి -
ఆతిశిని పరామర్శించిన అఖిలేష్
ఢిల్లీలో తలెత్తిన నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిశి ఆరోగ్యం దిగజారడంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.మంత్రి ఆతిశి చికిత్స పొందుతున్న లోక్ నాయక్ ఆసుపత్రికి వచ్చిన అఖిలేష్ ముందుగా అక్కడి వైద్యులను అడిగి మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆతిశిని పరామర్శించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆతిశి మంగళవారం అస్వస్థతకు గురవడంతో ఆమె పార్టీ నేతలు ఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు.ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో మంత్రి ఆతిశి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 21న నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆతిశి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
నేనున్నానంటూ భరోసా
ఆత్మకూరు/నెల్లూరు(దర్గామిట్టా)/కావలి/కోవూరు: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం నెల్లూరు జిల్లాలో తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘బాధపడకండమ్మా.. ఆదుకుంటానంటూ’ వారి కన్నీళ్లు తుడిచారు. అప్పటికప్పుడు తగిన సాయమందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.. అండగా నిలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడుకు చెందిన గడ్డం పెద సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్‌ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు శనివారం నెల్లూరు సింహపురి ఆస్పత్రి సెంటర్‌కు చేరుకున్నాడు. బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న సీఎం జగన్ అంతమంది జనంలోనూ వీల్‌చైర్‌లో ఉన్న పెద సుబ్బయ్యను చూసి.. పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సుబ్బయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నా బిడ్డను బతికించన్నా.. నెల్లూరు జిల్లా సింగపేటకు చెందిన వ్యవసాయ కూలీ రవిచంద్ర తన నాలుగేళ్ల కుమార్తె బ్లెస్సీతో కలిసి సీఎం జగన్‌ను కలిసేందుకు ఉలవపాళ్ల కూడలి వద్దకు వచ్చాడు. ‘నా కుమార్తె పుట్టినప్పటి నుంచే జన్యు సంబంధిత సమస్యలతో బధిరత్వం, ఫిట్స్‌తో బాధపడుతోంది. రెండేళ్ల కిందట నా భార్య కూడా చనిపోయింది. చికిత్స కోసం నా కుమార్తెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లా.. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు రాయవెల్లూర్లో చూపిస్తున్నా. నా బిడ్డను బతికించుకునేందుకు.. చికిత్సకు తగిన సాయం కోసం సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చా’అని రవిచంద్ర చెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. అవ్వా.. పింఛన్ వస్తోందా? బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నార్త్రాజుపాలేనికి చెందిన పుల్లా లక్ష్మమ్మను ‘అవ్వా, పింఛన్ వస్తోందా’ అంటూ ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో∙తేదీనే వలంటీర్ తమ ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారని.. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈనెల అష్టకష్టాలు పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మళ్లీ నువ్వే రావాలి.. మాలాంటి వృద్ధులను కంటికి రెప్పలా కాపాడాలి’ అని సీఎం జగన్‌ను కోరింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో నీ మనవడి ప్రభుత్వం మళ్లీ రాబోతోంది. మీ సమస్యలు తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. కాలు దెబ్బతిన్న బాధితుడికి అండ అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన సత్యనారాయణకు 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బతింది. మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ సాయం కోరేందుకు నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ దేవుడికి సమస్యలు చెప్పుకున్నాం.. బుజబుజనెల్లూరుకు చెందిన చల్లా కృష్ణ దంపతులు సీఎం జగన్‌ను కలిసేందుకు జాతీయ రహదారిపైకి వచ్చారు. వారిని చూసిన సీఎం జగన్ బస్సులో నుంచి దిగివచ్చి.. చల్లా కృష్ణ దంపతులతో మాట్లాడారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని.. తనకు రెండుసార్లు వైద్యులు ఆపరేషన్ చేశారని చల్లా కృష్ణ సీఎం జగన్‌కు తెలిపారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. ముగ్గురు సంతానం ఉన్నారని వివరించారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ ‘బాధపడకండి.. ఆదుకుంటా’నంటూ భరోసా ఇచ్చారు. పేదల పాలిట దేవుడైన సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నామని మీడియాకు చల్లా కృష్ణ తెలిపారు. -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
మన పని ఈజీగా అయ్యేలా చేశారు! -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్‌కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్‌లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. అలీగఢ్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి? -
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ఎన్సీపీకి షాక్ ఇచ్చిన శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన శరద్ పవార్.. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. కుటుంబంలో రాజకీయాల గురించి మాట్లాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాట నాయకుడు వై బీ చౌహాన్ స్మారకాన్ని దర్శించడానికి సతారాకు ఈ రోజు ఉదయమే శరద్ పవార్ వెళ్లారు. నిన్న నుంచి ఎవ్వరినీ తాను కలవలేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయ పరమైన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అయితే.. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం కలగదని శరద్ పవార్ చెప్పారు. బెంగళూరులో త్వరలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జులై 16-18 మధ్య ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ మేరకు రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అజిత్ పవార్‌తో పాటు షరద్ పవార్‌కు నమ్మిన బంటు ఛగన్ భుజ్‌భల్, ప్రఫుల్ పటేల్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఏంపీలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఇదీ చదవండి: ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది.. -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు
కొందరికి జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవైనా విందులు, వినోదాలు ఉంటే చాలు ఫుల్లుగా లాగించేస్తుంటారు. అయితే అలా అప్పుడప్పుడు అతిగా తినడం వల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ, తరచు అతిగా తింటూ ఉంటే మాత్రం, అది మీరు బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది, ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు మొదలుకొని రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం, గుండె సంబంధ సమస్యలతో బాధపడవలసి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కువగా తినేసి కడుపులో అసౌకర్యంగా భావించినపుడు ఈ చిట్కాలు పాటించండి చాలు... తక్షణ ఉపశమనం లభిస్తుంది. అమ్మమ్మల కాలం నుంచి నేటి వరకు అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏదైనా ఉంటే, అది వాము అని చెప్పవచ్చు. వాము నమలడం వల్ల కడుపులో అసౌకర్యం లేదా నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం , ఆమ్లత్వం వంటి ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అలాగే మంచి విరేచన కారి కావడం వల్ల అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నవారు.. కొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి, భోజనం తర్వాత చప్పరించి గోరువెచ్చటి నీళ్లు తాగితే సరి! పుదీనా టీజీర్ణ సంబంధ సమస్యలను దూరం చేయడంలో పుదీనా టీ బాగా సహాయపడుతుంది, మిరియాలు, పుదీనా కలగలిసిన టీ మీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం, విరేచనాలు ఇతర కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. పెరుగు తినండి మీరు కడుపులో పట్టనంతగా నిండుగా తిన్ననప్పటికీ, ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు అనేది ్ర΄ోబయోటిక్స్ కు మూలం కాబట్టి, ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. ఇది కడుపు ఉబ్బరం సహా ఇతర కడుపు బాధలను తగ్గించగలదు. తాజా సాదా పెరుగు ఎంచుకోండి. చల్లని పాలు తాగాలి చల్లటి పాలు తాగడం అసిడిటీని ఎదుర్కోవడానికి సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. ΄ాలలోని కాల్షియం, కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల అదనపు స్రావాన్ని నియంత్రిస్తుంది, తద్వారా కడుపులోని ఆమ్లాలను శోషిస్తుంది. చల్లని ΄ాలు అసిడిటీకి సరైన విరుగుడు, ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. తిన్న వెంటనే నిద్ర వద్దు బాగా తిన్న తర్వాత నేరుగా వెళ్లి హాయిగా నిద్ర΄ోతారు కొందరు. అయితే ఇది అసలు మంచిది కాదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ జరిగి, జీర్ణక్రియ ఆటంకాలకు కారణమవుతుంది. దాంతోబాటు మనం తిన్న ఆహారం మూలంగా వచ్చి చేరే కేలరీలు కరిగే అవకాశం ఉండక బరువు పెరుగటానికి దారితీస్తుంది. అరకిలోమీటరైనా నడవండి నడక మీ జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, మీ రక్తంలో చక్కెర స్థాయులను సమం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకునే బదులు, కాస్త నడవండి, తేలికగా అనిపిస్తుంది. కేవలం 15 నిమిషాలు చిన్న నడకకు వెళ్లి వచ్చినా చాలు మంచి అనుభూతి చెందుతారు. అయితే పరుగు, జాగింగ్ లేదా వ్యాయామాలు వద్దు. తక్కువలో తక్కువగా రెండు వందలనుంచి ఐదువందల అడుగుల దూరం నడిస్తే చాలు. . కాబట్టి, అతిగా తిన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పై చిట్కాలను ప్రయత్నించండి. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
ఓవైపు కన్నడనాట హోరాహోరీ.. మరోవైపు కాంగ్రెస్‌లో ఇంటి పంచాయితీ!
రాజస్తాన్ కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఓ రేంజ్లో సచిన్ పైలట్.. సీఎంపై విమర్శల దాడి చేశారు. గెహ్లాట్ నాయకురాలు వసుంధర రాజేనని.. సోనియా గాంధీ కాదేమో! అని సెటైరికల్ కామెంట్ చేశారు. సచిన్ పైలట్ 2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటుకి యత్నించారు. ఐతే ఆ సయమంలో తనని బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తనని ఆదుకున్నారని ప్రభుత్వం పడిపోకుండా సాయం చేశారని ధోల్పూర్లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ ఆయనకు చురకలు అంటిస్తూ కామెంట్ చేశారు. ఆయన దృష్టి (గెహ్లాట్)లో వసుందర రాజే తనకు చీఫ్ అని సెటైర్ వేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరి సచిన్ పైలట్ అటు గెహ్లాట్‌ను, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. అంతేగాదు తాను పదేపదే అవినీతి గురించి అభ్యర్థనలు చేసినా.. ఆయన ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మెతకగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అర్థమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి, సీఎం మధ్య అవగాహన ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని తెలిసిందన్నారు. గత రెండున్నరేళ్లుగా గెహ్లాట్ తనపై ఎన్నోసార్లు మాటల దాడి చేసినా, దూషించినా, పార్టీని దెబ్బతీయకూడదనే మౌనంగా ఊరుకున్నాని చెప్పారు. నా యాత్ర సీఎం గెహ్లాట్‌ని లక్ష్యంగా చేసుకుని చేయడం లేదని కూడా పైలట్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే తాను వ్యతిరేకినని ఆయన నొక్కి చెప్పారు. రాజస్తాన్‌లో కూడా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారంటూ తాను గతంలో గెహ్లాట్‌పై చేసిన తిరుగుబాటుని సమర్థించుకునే యత్నం చేశారు పైలట్.అయితే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని వీడే యోచనలో పైలెట్ ఉన్నారని, ఈ క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, 2018లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుపొందడంతో ముఖ్యమంత్రి మంతి పదవిపై గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం రాజుకుంది. ఈ విషయమై 2020లో కొందరు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడమే గాక ఢిల్లీలో రోజుల తరబడి నిరసన చేశాడు పైలట్. ఐతే కాంగ్రెస్ అధినాయకత్వం అతని సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సచిన్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ సమస్య మింగుడుపడని అంశంగా మారింది. (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
‘దున్నపోతు’ సమస్యకు పరిష్కారం.. ఏంటా కథ.. అసలేం జరిగింది?
కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది ఎటూ తేల్చని పంచాయితీ.. ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు. సెంటిమెంట్‌తో రాజీ కుదిర్చిన సీఐ.. చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు. చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా? సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్ -
స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్‌జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆకాశంలో ఆగిన విమాన ఇంజన్.. తప్పిన ముప్పు
ముంబై: విమాన ప్రయాణికులకు ఈ మధ్యకాలంలో వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. తాజాగా గురువారం మరో ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-639 విమానం ఉదయం పది గంటల ప్రాంతంలో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే 27 నిమిషాల తర్వాత ఇంజన్లలో ఒకదానికి సమస్య తలెత్తింది. అధిక ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రతల కారణంగా.. ఇంజన్ షట్ డౌన్ అయ్యింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ప్రయాణికులు అందోళనకు లోనయ్యారు. ఇంజన్‌పై పీడనం పెరగడంతో ఆగిపోయినట్లు పైలెట్ గుర్తించారని, వెంటనే తిరిగి ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరుకు చేర్చామని తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణకు ఆదేశించింది. చదవండి: బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి.. -
20 రోజులుగా తాగునీళ్లు లేవు
బనశంకరి: బెంగళూరు దక్షిణ నియోజకవర్గపరిధిలోని ఉత్తరహళ్లి వార్డు (184) యాదాళం నగరలో గత 20 రోజులుగా తాగునీటిని సరఫరా కావడం లేదు. గుక్కెడు నీటికోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ప్రజలు వాపోయారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నేత ఆర్కే.రమేశ్, ఉత్తరహళ్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే.కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప విఫలమయ్యారని కాంగ్రేస్‌నేతలు ఆరోపించారు. నేతలు బాలకృష్ణ, బైరప్ప, గుండుమణిశ్రీనివాస్, ఉమాదేవి పాల్గొన్నారు. ఉమ్మడిగా సంక్షేమ కార్యక్రమాలు బనశంకరి: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటరామరాజు గురువారం బెంగళూరు బనశంకరి గాయత్రిభవన్లో అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు అశోక్ హర్నహళ్లి, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌మూర్తిని కలిశారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతు న్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే– ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే! ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే– మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే!! ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచ ఆహార మార్కెట్లు మరోసారి అల్లకల్లోలాన్ని చవిచూస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడనుంది. ఉక్రెయిన్‌లో బుల్లెట్లు, బాంబులు ప్రపంచ క్షుద్బాధా సంక్షోభాన్ని మనం కనీవినీ ఎరుగని స్థాయికి తీసుకుపోనున్నాయని ప్రపంచ ఆహార పథకం కార్యనిర్వాహక అధికారి డేవిడ్ బీస్లే ఇటీవలే వ్యాఖ్యానించారు. 2007–08 సంవత్సరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రపంచ ఆహార సంక్షోభం కారణంగా సరకుల ధరలు అదుపుతప్పి పోయాయని చెబుతుంటారు. పెరిగిన చమురు ధరలు, అధిక ఆహార ఉత్పత్తి, కమోడిటీ ఫ్యూచర్స్ ద్వారా కలిగిన అధిక ధరలు వంటి కారణాలన్నీ పరస్పరం కలసిపోయి ప్రపంచ ఆహార సరఫరాలను స్తంభింపజేయ డమే కాదు... ఆనాడు 37 దేశాల్లో ఆహార దాడులకు దారితీశాయి. అలనాటి సంక్షోభం పునరావృతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సరుకుల ధరలు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముందే పెరుగుతూ వచ్చాయి. 2021లో ఆహార ధరలు మునుపటి రికార్డులను బద్దలు గొట్టాయి. ఇతరేతర కారణాలు కూడా బలంగా తోడవడమే కాకుండా ప్రపంచ సరఫరాల్లో 30 శాతం గోదుమలను, 28 శాతం బార్లీని, 18 శాతం మొక్కజొన్నలను, 75 శాతం పొద్దుతిరుగుడు నూనె సరఫరాకు వీలుకలిగిస్తున్న నల్లసముద్ర రీజియన్‌లో ప్రస్తుతం సాగుతున్న ఘర్షణను గమినిస్తే ప్రపంచం మరోసారి తీవ్రమైన ఆహార సంక్షోభం వైపు పయనిస్తోంది. ఇది ఎంత తీవ్రమైన సంక్షోభం అనే అంశాన్ని భవిష్యత్తు మాత్రమే చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఇరాక్, శ్రీలంక దేశాల్లో ఆహారం కోసం నిరసన ప్రదర్శ నలను ప్రపంచం చూస్తోంది. అనేక దేశాలు దేశీయ ఆహార సరఫరాకు దెబ్బ తగలకుండా ఉండటానికి స్వీయరక్షణ విధానాలకు మళ్లి పోయాయి. ముంచుకొస్తున్న సంక్షోభం వెనుక మరింత మంది దారి ద్య్రంలో కూరుకుపోనున్నారని బ్లూమ్‌బెర్గ్ సరిగ్గానే అంచనా వేసింది. ఇప్పటికే ప్రపంచమంతటా ఆహార ధరలు పెరిగాయి. సూపర్ మార్కెట్లకు వచ్చే సరఫరాలు కనుమరుగవుతున్నాయి. ఆహార భద్రత రోజురోజుకూ ప్రమాదపు అంచుల్లోకి వెళుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద నైట్రోజన్ ఎరువుల ఎగుమతిదారుగా ఉండటంతోపాటు ఈ ప్రాంతం మొత్తంగా ఫాస్పరస్, పొటాష్ ఆధారిత ఎరువుల ఉత్పత్తిదారుగా బలమైన స్థానంలో ఉంటోంది. యుద్ధం కారణంగా భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన రైతుల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోనున్నాయని చెబుతున్నారు. ఇది పంటల ఉత్పత్తిపై పడుతుంది. ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది. ఆహార కొరతలే కాదు... వాటి ధరవరలు కూడా ఆహార సంక్షోభం ఏ స్థాయిలో ఉండబోతోందన్న అంశాన్ని నిర్ణయిస్తాయి. ఈలోపు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంతో సహా ఉత్తర ఆఫ్రికా, అఫ్గా్గనిస్తాన్ వంటి దేశాలు సైతం ఈ సంక్షోభం తాకిడికి మొట్టమొదటగా దెబ్బతింటాయి. అలాగే ఆఫ్రికాలోని ఈజిప్ట్, మడగాస్కర్, మొరాకో, ట్యునీషియా, యెమెన్, లెబనాన్... ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతోపాటు టర్కీ, ఇరాన్, ఎరిత్రియా, ఇరాక్ కూడా ఈ సంక్షోభం బారిన పడనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ దేశాలన్నీ అధికంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవి. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే పెరుగుతున్న దాణా ధరలు అక్కడి మాంస పరిశ్రమపై బలంగా వేటు వేయనున్నాయి. దీనివల్ల మాంసం ప్రాసెసింగ్ ధరలు పెరిగి పోతాయి. ఇప్పటికే స్పెయిన్‌లో సూపర్ మార్కెట్లలో వంటనూనెల కొనుగోళ్లపై రేషన్ విధించారు. యుద్ధం మరికొంత కాలం ఇలాగే కొనసాగితే, పెరిగే ఆహార పదార్థాల ధరల ప్రభావం నిస్సందేహంగా అన్ని దేశాలపై పడు తుంది. యుద్ధానికి ముందే గోదుమ ధరలు రికార్డు స్థాయిని అందుకు న్నాయి. నిజానికి అధికంగా అమ్ముడుపోయే సరుకుల ధరలు చాలా కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. 2021లో అమెరికా ఆహార, వ్యవ సాయ సంస్థ ప్రకారం, గోదుమ, బార్లీ ధరలు మునుపటి ఏడాదితో పోలిస్తే 31 శాతం వరకు పెరిగాయి. దీంతో మొక్కజొన్న ధరలు కూడా పుంజుకున్నాయి. వీటి ధరలు కూడా సంవత్సరం లోపే 44 శాతం పెరగడం విశేషం. 2021లో సన్ ఫ్లవర్ ఆయిల్ 63 శాతం పెరిగిన ధరతో రికార్డు సృష్టించింది. పైగా, ఈ సంవత్సరం మార్చి నెల తొలివారంలో గోదుమ ఫ్యూచర్ల ధర 2008 సంక్షోభం నాటి స్థాయికి పెరిగిపోయింది. వీటి ధరలు మరింతగా అంటే మరో 22 శాతం పెరిగి గత రికార్డులన్నింటినీ బద్దలు చేస్తాయని అంచనా. దీనివల్ల 2022–23 సంవత్సరంలో పోషకాహర లేమి బారిన పడుతున్న వారి జనాభాకు మరో 8 నుంచి 13 మిలియన్ల మంది చేరతారని చెబుతున్నారు. భారతదేశంలోని గోదుమ ఎగుమతిదారులు సరఫరాల్లోని ఖాళీలను పూరించడానికి తపన పడుతుండగా, ఈ సంవత్సరం గోదుమ ఎగుమతిదారులు తమ ఎగుమతులను మూడు రెట్లకు పెంచనున్నారని ఐటీసీ ఊహిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం అదనపు మిగులును పండిస్తున్న భారతీయ రైతులను విమర్శించడానికి అలవాటుపడిన వారు, ఇప్పుడు ప్రపంచ ఆహార ధాన్యాల సరఫరాలో ఏర్పడిన భారీ కొరతను పూరించడానికి మన రైతులు సిద్ధపడుతుండటం చూసి పొంగిపోతున్నారు. ముందే చెప్పినట్లుగా ఏ రకంగా చూసినా ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార పంటలు ఉపయోగించుకునే బయో ఇంధన ఉత్పత్తి పెరిగిపోయింది. ఉదాహ రణకు అమెరికాలో పండుతున్న మొక్క జొన్న పంటలో మూడోభాగం ఎథనాల్ ఉత్పత్తి కోసం వాడుతున్నారు. యూరోపియన్ యూని యన్‌లో పండే 90 మిలియన్ టన్నుల ఆహార పంటల్లో, 12 మిలియన్ టన్నుల గోదుమ, వరిని ఎథనాల్‌గా మార్చివేశారు. వీటన్నింటి మధ్యలోనే కొన్ని ఖండాంతర స్థాయి కంపెనీలను రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించేందుకు అమెరికా అనుమతించింది. కార్గిల్, నెస్లె, అర్చర్ డెనియల్స్ మిడ్ లాండ్, పెíప్సీకో, బేయర్ వంటి బడా వ్యవసాయ ఆధారిత కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, కీలకమైన సప్లయ్ లింకును మాత్రం ఇవి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆహార భద్రత సమస్యను కొన్ని బడా కంపెనీల చేతుల్లో ఎందుకు పెడుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడే 2007–08 సంవత్సరం నాటి ప్రపంచ ఆహార పెను సంక్షోభాన్ని పునరావృతం కానివ్వకూడదన్న ప్రిస్క్రిప్షన్ తప్పుదోవ పట్టిందని స్పష్టమవుతోంది. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే, ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే ప్రస్తుత సంక్షోభానికి మూలం. ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే! ఈ సందర్భంగా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పిన మాటలు మనం ఎన్నటికీ మరచిపోరాదు. ‘‘తుపాకులు కాకుండా ఆహార ధాన్యాలను కలిగిన దేశాలదే భవిష్యత్తు!’’ దేవీందర్ శర్మ , వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
జంట జలాశయాలకు గోదావరి జలాలు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి ఆనుకొని ఉన్న చారిత్రక జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపే ప్రతిపాదనలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ల నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు నీటిని తరలించేందుకు వీలుగా జలమండలి, ఇరిగేషన్ విభాగాలు వేర్వేరుగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మల్లన్నసాగర్ నుంచి ఈ జలాశయాలకు భారీ పైప్‌లైన్ ద్వారా వర్షాకాల సీజన్లో గోదావరి జలాలను తరలించాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే జలమండలి వర్గాలు మాత్రం శామీర్‌పేట్‌కు సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి ఈ జలాశయాలకు గోదావరి జలాలను పైప్లైన్ల ఏర్పాటు ద్వారా తరలించవచ్చని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రెండు ప్రతిపాదనల్లో ఒకదానికి త్వరలో మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. సర్కారు యోచన ఇదీ... సుమారు తొమ్మిదిన్నర దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను గోదావరి జలాల తరలింపు ద్వారా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. మూసీ సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల నీటిని మూసీలోకి వదలడం ద్వారా మూసీ మురికి వదలడంతోపాటు స్వచ్ఛమైన జలాలు నగరంలో పారే అవకాశం ఉంటుందని కేబినెట్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ.) మార్గంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటంతోపాటు పర్యావరణం మెరుగుపడనుందని సర్కారు యోచిస్తోంది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు గృహ, పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయాల్లో చేరకుండా మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిబంధనలను పొందుపరుస్తూ ఉత్తర్వులివ్వాలని కేబినేట్ నిర్ణయించింది. మూసీ, ఈసా నదుల్లో కాలుష్య జలాలు చేరడానికి వీల్లేకుండా నూతన జీవోను రూపొందించాలని, ఈ ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఆమోదం తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. -
నగరంలో కుక్కల రచ్చ.. అసెంబ్లీలో స్ట్రాంగ్ చర్చ
శివాజీనగర(బెంగళూరు): బెంగళూరులో పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై విధానసభలో మంగళవారం ఘాటుగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. నగరంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు తిరిగేందుకు భయపడుతున్నారని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు. మంత్రి జేసీ మాధుస్వామి మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ శస్త్రచికిత్సల చేయడానికి టెండర్లను పిలిచినట్లు చెప్పారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయాలన్నారు. కుక్కలను చంపడానికి చట్టంలో అవకాశం లేదన్నారు. -
కాంగ్రెస్‌కు రాహులే పెద్ద సమస్య
పనాజీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీరును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయనే పెద్ద సమస్యగా మారారని చెప్పారు. రాహుల్ భావిస్తున్నట్లుగా అధికార బీజేపీకి, నరేంద్ర మోదీ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చిచెప్పారు. గోవా రాజధాని పనాజీలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ వీడియో దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌కు, ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి అవగతమవుతోంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు సీనియర్లు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లపాటు కాంగ్రెస్ హవా చెలాయించినట్లుగా... బీజేపీ సైతం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు దేశ రాజకీయ యవనికపై కచ్చితంగా కేంద్ర స్థానంలో కొనసాగుతుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం రాహుల్ గాంధీకి మాత్రం అర్థం కావడం లేదని, అదే ఆయనతో సమస్య అని చెప్పారు. ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 30 శాతానికిపైగా ఓట్లు దక్కించుకునే పార్టీకి అప్పటికప్పుడు వచ్చే ప్రమాదమేదీ ఉండదని వివరించారు. అందుకే ప్రధాని మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు పదవీ గండం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఒకవేళ ప్రజలు మోదీని పదవి నుంచి దించేసినా, బీజేపీ రాబోయే కొన్ని దశాబ్దాలపాటు అధికారం కోసం ఎన్నికల్లో పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ‘‘నరేంద్ర మోదీ బలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయనను ఓడించడం సాధ్యం కాదు’’అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు. Eventually, Prashant Kishor acknowledged that BJP will continue to be a force to reckon with in Indian politics for decades to come. That's what @amitshai Ji declared way too earlier. pic.twitter.com/wqrqC3xzaZ — Ajay Sehrawat (@IamAjaySehrawat) October 28, 2021 -
ఆ మధ్యలో... అలా అవుతోంది...
ప్రశ్న: నా వయసు 33 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 55 కిలోలు. గత ఏడాది రెండో కాన్పు తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా, మూత్రం సమయంలో మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సువర్ణ, నిర్మల్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్(కండపట్టడం), ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం, గర్భాశయంలో వాపు అండాశయంలో నీటిబుడగలు, నీటి గడ్డలు, సిస్ట్లు, కంతులు, గర్భాశయ ముఖ ద్వారంలో పుండ్లు, హార్మోన్ల అసమతుల్యత, కొందరిలో పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే సమయంలో బ్లీడింగ్ కనిపించవచ్చు. గైనకాలజిస్ట్‌కు సంప్రదించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్‌స్మియర్, వెజైనల్ పెల్విన్ అల్ట్రాసౌండ్, ఎస్ఆర్ టీఎస్‌హెచ్, సీబీపీ వంటి అవసరమైన రక్తపరీక్షలు వంటివి చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం తరచుగా రావడం, మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకుని దానిని బట్టి సరైన యాంటీ బయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. పీరియడ్స్ మధ్యలో అయ్యే బ్లీడింగ్‌కు పాలిప్, ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం వంటివి కారణం అయితే దానికి గర్భాశయంలో హిస్టెరోస్కోపీ ద్వారా చూస్తూ డీ అండ్ సీ చేయడం ద్వారా పొరను తొలగించి బయాప్సీకి పంపించడం, హార్మోన్స్ అసమతుల్యత చిన్న సిస్ట్లు ఉంటే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయడం, పెద్ద సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర కారణాలు ఉంటే ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడం వంటి చికిత్స విధానాలను గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవలసి ఉంటుంది. ప్రశ్న: మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఎత్తు 5.4, బరువు 38 కిలోలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యమవుతుందని విన్నాను. దీనికి ఇతర సమస్యలేవైనా కారణం కావచ్చా? పరిష్కారం వివరించగలరు. – అమ్మాజీ, యలమంచిలి మీ అమ్మాయి 5.4 ఎత్తుకి కనీసం బరువు 50 కేజీలు అయినా ఉండాలి. సాధారణంగా అమ్మాయి 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ కావడానికి హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యాలి అంటే శరీరంలో కనీసం 20 శాతం అయినా కొవ్వు ఉండాలి. మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది కాబట్టి రజస్వల కాకపోవడానికి అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కొందరిలో పుట్టుకలోనే గర్భాశయం, అండాశయాలు లేకపోవడం, లేదా వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల 16 ఏళ్లైనా మెచ్యూర్ కాకపోవచ్చు. మీ అమ్మాయికి 16 ఏళ్లు కాబట్టి.. మెచ్యూర్ కాకపోవడానికి వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్, సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ లోపల మీ అమ్మాయికి పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి పౌష్టికాహారం ఇవ్వండి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటే ఎండొక్రైనాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. డాక్టర్ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న గాయత్రి
-
సులభంగా శ్రీవారి దర్శనం
-
కిచెన్‌లో ఈవీ స్కూటర్! కారణమేంటీ?
ఎవరింట్లో అయినా కిచెన్ అంటే వంట పాత్రలు, గ్యాస్‌స్టవ్, మిక్సీ, మైక్రో ఓవెన్లు, పొపుల పెట్టె లాంటి వస్తువులు ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర్ ఇంట్లో రాత్రయితే చాలు స్కూటర్ వచ్చి చేరుతుంది. వంటింట్లో స్కూటర్‌తో పనేంటి ? ప్రతీ రోజు రాత్రి అదక్కడికి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రిక్ వెహికల్ హాబ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నివాసి భాస్కర్. పెరుగుతున్న పెట్రోలు ధరల భారం మోయలేక ఇటీవలే ముచ్చపడి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే పెట్రోలు బాధలు తప్పినా ఇరుగుపొరుగుకు శత్రువయ్యాడు. వంటిల్లులోకి స్కూటర్ తేవడంతో ఆఖరికి సొంతింట్లో కూడా మద్దతు సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి ఒక్క భాస్కర్‌కే కాదు నగరాల్లో నివాసం ఉంటూ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన చాలా మంది పరిస్థితి భాస్కర్లాగే మారింది. ఎక్కడ ఛార్జ్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్న వారిలో ఎక్కువ మంది అపార్ట్మెంట్లలోనే నివాసం ఉంటున్నారు. మన దగ్గరున్న నూటికి 99 శాతం అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లు లేవు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వారు దాన్ని ఛార్జింగ్ పెట్టుకునేందుకు నానా ఆగచాట్లు పడుతున్నారు. - అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అన్ని కుటుంబాలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఇంకా మారలేదు. - ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారిన వారు అపార్ట్మెంట్లో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటామంటే మిగిలిన వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. - ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే దానికి వచ్చే కరెంటు బిల్లు ఎవరు భరించాలి ? ఆ ఛార్జింగ్ పాయింట్‌ని సురక్షితంగా ఎవరు మెయింటైన్ చేయాలనేది సమస్యగా మారింది. - ఛార్జింగ్ పాయింట్లు పేలిపోతాయనే అపోహలు ఇంకా జనాల్లో ఉన్నాయి. దీంతో ఛార్జింగ్పాయింట్ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. ఏర్పాటు కూడా కష్టమే ఇక అపార్ట్మెంటులో ఉన్న వాళ్లందరినీ ఒప్పించి ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్ శాఖ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. - ఛార్జింగ్ పాయింట్‌కి ప్రత్యేకంగా మీటరు ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం విద్యుత్ డిస్కంలకు దరఖాస్తు చేయాలి. - ఇటీవల బెంగళూరుకి చెందిన నరేశ్ ఇలా కొత్తగా పాయింట్ ఏర్పాటు చేసుకుంటే ఈవీ ఛార్జింగ్ ఎక్వీప్మెంట్కి రూ. 2000ల ఖర్చు వస్తే విద్యుత్ శాఖ వారు వైరు లాగేందుకే రూ. 11,000 వసూలు చేశారు. - ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ సంస్థలకు ఓ విధానమంటూ లేదు. పై నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి గైడ్‌లైన్స్ లేవు. దీంతో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విషయంలో విద్యుత్‌శాఖ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తప్పని తిప్పలు కాలుష్యాన్ని తగ్గించాలంటూ ఓ వైపు ప్రభుత్వ విధానాలు, మరోవైపు పెరిగిపోతున్న పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ పెరిగిపోతుంది. అయితే ఈవీకి మారాలంటూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గ పరిస్థితులు సృష్టించడంలో విఫలం అవుతోంది. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు ఛార్జింగ్ పాయింట్ల కోసం తోటి వారితో పోరాటం చేయాల్సి వస్తోంది. లేదంటే ఇంటి వంట గదిలోకి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మా సమస్య పరిష్కరించండి అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాల్లో అర్జీలు నమోదు అవుతున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు అడ్డుపడుతున్న అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేన్స్ అభ్యంతరాలను కొట్టేయాలంటూ న్యాయస్థానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు సివిల్ కోర్టులో ఇప్పటికే రెండు వేల మంది సంతకాలతో కూడిన పిటిషన్ విచారణలో ఉంది. సమగ్ర విధానమేదీ? ఈవీ తయారీ, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ వాటి మెయింటెన్స్ విధానాలపై కూడా చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లను చేర్చడం, కొత్త కనెక్షన్ విషయంలో విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్తగా వచ్చే ఇళ్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, మెయింటనెన్స్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Yamaha: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. -
ల్యాండింగ్ ప్రాబ్లెమ్ తో క్రాష్ అయిన హెలికాప్టర్
-
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.. అయినా పని చేయని మూడో నేత్రం
సాక్షి, అంబర్‌పేట( హైదరాబాద్): అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు. సాక్ష్యాలు కనుమరుగు పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్‌పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్‌పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. నిర్వహణ బాధ్యత స్థానికులదే ‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను. – సుధాకర్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
Karimnagar: మంత్రి హమీ ఇచ్చిన.. ఏడాదికి అమలు కాలేదు..
గతేడాది జూలై 21వ తేదీన కరీంనగర్లో మంత్రి కేటీఆర్ రోజూవారి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ పథకం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విజయవంతం కాగా.. చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. అదే వేదికపై మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి ఏడాదిలోగా ఇంటింటికీ 24గంటల నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని, కార్యక్రమాన్ని మీరే ప్రారంభించాలని కేటీఆర్‌ను కోరారు. హామీఇచ్చి ఏడాది గడిచినా సాంకేతిక అనుమతులే రాలేదు. అధికారులు వేసవికి అందిస్తామని చెబుతున్నా.. ఆచరణలో ప్రగతి కనిపించడం లేదు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ప్రజలకు 24 గంటల మంచినీటి సరఫరా అందని ద్రాక్షగానే మారిందని చెప్పవచ్చు. హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. పనులు ముందుకు సాగడం లేదు. పైలెట్ ప్రాజెక్టుగా మూడు ప్రాంతాలను ఎంపిక చేసిన అధికారులు పనులే ప్రారంభించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మిషన్‌భగీరథ ద్వారా నిరంతర నీటి సరఫరా సాగుతుండగా.. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ప్రణాళికలకే అధికారులు పరిమితం అయ్యారు. రూ.80కోట్ల నిధులు పనులకు కేటాయించగా.. సాంకేతిక అనుమతుల ప్రక్రియనే పూర్తిచేయలేదంటే పాలకుల పనితనానికి నిదర్శనమని చెప్పవచ్చు. రూ.80కోట్ల నిధులు ► నగరపాలక పరిధిలో నిరంతర నీటిసరఫరా చేయడానికి స్మార్ట్‌సిటీ నుంచి రూ.80 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో తాగునీటి సరఫరాలో లీకేజీలు ఉన్నచోట పైప్లైన్లు వేయాలి. ఇంటర్ కనెక్షన్లు ఇచ్చి ఇంటింటా నీటిసరఫరా చేయాలి. ఇందుకు ముందుగా కాలనీల్లో డిస్టెన్స్ మీటర్ ఏరియాను ఏర్పాటు చేసి నీటిసరఫరా ఒత్తిళ్లను రికార్డు చేసి, డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ► నగరంలోని 60 డివిజన్లకు 16 రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఒక్కో రిజర్వాయర్ పరిధిని జోన్‌గా పరిగణిస్తారు. ప్రయోగాత్మకంగా భగత్‌నగర్, రాంపూర్, హౌసింగ్‌బోర్డ్‌కాలనీ జోన్లకు 24గంటల తాగునీరు అందించాలని అనుకున్నారు. ప్రస్తుతం నగరంలో 641 కిలోమీటర్ల పైప్లైన్లు ఉంది. 51వేలకు పైగా ఇళ్లలో, 195 పబ్లిక్ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 24గంటల నీటిసరఫరాకు అనుగుణంగా రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలను ఆధునీకరించడం, నూతన పనులు చేయడానికి నిర్ణయించారు. ఈ పనులకు డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉండగా.. సాంకేతికంగా అనుమతులు రాకపోవడంతో బ్రేక్ పడింది. ► 24గంటల నీటి సరఫరా చేయాలంటే ముందుకు నీటిలెక్కలు పక్కాగా ఉండాలి. ఇందుకు స్కాడా విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎంతనీటిని శుద్ధి చేస్తున్నారు. ఎంత సమయంలో ఎన్ని లీటర్లు సరఫరా జరుగుతోంది. ఫిల్టర్‌బెడ్ సామర్థ్యం, రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను లెక్కిస్తారు. ► స్కాడా విధానం అమలుకు స్మార్ట్‌సిటీ నుంచి రూ.46కోట్లతో అంచనాలు రూపొందించారు. మొదటగా 14ప్రాంతాల్లో 21 ఫ్లో మీటర్లు బిగించాలని నిర్ణయించగా 8ఫ్లో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ, హైలెవల్ జోన్లో కోర్టు, ఎస్ఆర్ఆర్ కాలేజీ, రాంనగర్, అంబేద్కర్‌నగర్, లో లేవల్లో మార్కెట్, హౌసింగ్‌బోర్డుకాలనీ, రాంపూర్, గౌతమినగర్, భగత్‌నగర్‌లో ఫ్లో మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ► ఫ్లో మీటర్ల బిగింపు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. సంబంధిత పనులకు స్మార్ట్‌సిటీ నుంచి రూ.25కోట్లు కేటాయించినా.. సాంకేతికంగా అనుమతులు రాకపోవడంతో ముందుకు సాగడం లేదు. సాంకేతిక అనుమతులు వస్తేనే టెండర్లు పిలిచి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. వేసవికి సిద్ధమయ్యేనా? వేసవివరకు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటుండగా.. ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికి సాంకేతిక అనుమతులే రాలేదని, ఇందుకు అధికారులు, పాలకులు కృషి చేయడం లేదని నగర ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం 24గంటల నీటిసరఫరాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయగా.. టెండర్లు అçహ్వానించనున్నారు. సాంకేతిక పనులు కూడా వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అ ధికారులు పేర్కొంటున్నారు. నగరం మొత్తం కా కున్నా.. ప్రయోగాత్మకంగా 15వేల ఇళ్లకు అయినా 24గంటల నీటిసరఫరా చేయడానికి పనులు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా.. కా గితాలు దాటడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవివరకు పూర్తిచేస్తాం 24గంటల నీటిసరఫరాలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన భగత్‌నగర్, రాంపూర్, హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ల పరిధిలో వచ్చే వేసవిలోగా నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక అనుమతులకు కొంత ఆలస్యమవుతున్నా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నాం. అతి త్వరలోనే 24 గంటల నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకుని వస్తాం. – వల్లూరు క్రాంతి, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ కలగానే మిగిలిపోతుందా నగరంలో 24గంటల నీటి సరఫరా కలగానే మి గిలిపోయింది. ప్రస్తుతం ఇస్తున్న నీటి సరఫరాలో పలు ఇబ్బందులు వస్తున్నాయి. లీకేజీలు బాగా ఉంటున్నాయి. 24గంటల నీటి సరఫరా చేయాలంటే లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ లీకైనా ఎంతో నీరు వృథాగా పొతుంది. నాయకులు, అధికారులు మొదట పైప్‌లైన్ పూర్తిస్థాయిలో మార్చివేసి కొత్తలైన్లు వేసి అప్పుడు 24 నీటి సరఫరాను చేపట్టాలి. – శ్రీలలిత, సప్తగిరికాలనీ, కరీంనగర్ ఆచరణ సాధ్యమేనా? నగరంలో 24గంటల నీటిసరఫరా సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రోజువారి నీటి సరఫరాలో చిన్నచిన్న లీకేజీలు అరికట్టడానికి వారాల తరబడి సమయం తీసుకుంటున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాంపూర్‌లో ఉన్న పైప్లైన్లు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. మొదటి దశ పనులకు ఇంతవరకూ సాంకేతిక అనుమతులు రాలేదు. వీటిని దాటుకుని ఎప్పుడు పథకం ప్రారంభిస్తారు. – మర్రి భావన, 32వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ -
పాఠాలు వినాలంటే.. 6 కిలోమీటర్లు నడవాల్సిందే
కొచ్చి: ఆ గ్రామంలోని విద్యార్థులంతా చదువుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి జరిగేవి గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇటువంటి పరిస్ధితులు లేవని అనుకుంటే మాత్రం మన పొరపాటు అవుతుంది. కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు ఇలా పాట్లుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్లోనే పాఠాలు వినాల్సి వస్తోంది. తమ ఊరిలో నెటవర్క్ సరిగా లేని సమస్యతో అక్కడి విద్యార్థుల పరిస్థితి ఇది. కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామంలో.. సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే నెట్ స్పీడ్‌గా బాగుంటే గానీ ఆన్లైన్లో క్లాసులు వినలేమని తెలిసిందే. ఈ కారణంగా ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు వినడం కోసం ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్గా ఉంటుండంతో అక్కడే ఆన్లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. Kerala: To attend online classes, students living in Idukki's Rajamala travel nearly 6-km daily to reach a location with internet connectivity in Eravikulam National Park. "In the morning, we reach here by auto & in evening, we walk back home," a Class 12 student said yesterday pic.twitter.com/xHVjz1srwu — ANI (@ANI) June 1, 2021 చదవండి: హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీ ! -
వాట్సాప్‌లో కొత్త సమస్య..! పరిష్కరించండి ఇలా...
వాట్సాప్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనలో చాలా మంది తెల్లవారగానే ముందుగా డేటా ఆన్ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయే లేదో చూసుకుంటాం. నేటి టెక్నాలజీ యుగంలో అప్పుడప్పుడు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవుతూంటాయి. దీనితో కాస్త ఇబ్బందికి గురవుతుంటాం. ప్రస్తుతం వాట్సాప్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాట్సాప్ కొత్త వినియోగాదారులకు మిస్సింగ్ మీడియా ప్రాబ్లమ్ వస్తోంది. వినియోగదారులు వారి వాట్సాప్ యాప్‌లో మీడియాను చూసుకోలేక పోతున్నారు. ఈ సమస్య కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ఆప్డేట్ చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వాట్సాప్ వర్షన్ 2.21.9.3 వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేసింది. తాజా వెర్షన్‌లోని కొంతమంది వినియోగదారులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఈ సమస్యను గుర్తించినప్పటీకి, సమస్యకు ఇంకా పరిష్కారం చూపలేదు. మీ మీడియా కంటెంట్‌ను తిరిగి తీసుకురావడానికి సరళమైన ప్రత్యామ్నాయం ఉంది. కొంత మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సమస్యకు గురయ్యారని వాట్సాప్ బేటా ట్రాకర్ డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది. ఈ మీడియాను మొబైల్ ఫోన్లో పొందినప్పటికి కింద సూచించిన విధంగా చేస్తే ఏకంగా మీడియాను మీ వాట్సాప్ యాప్‌లో చూసుకోవచ్చును. వాట్సాప్ యాప్‌లో మీడియా కనిపించాలంటే... ►ముందుగా మీ ఫోన్లో వాట్సాప్‌ను క్లోజ్ చేసి క్యాచీ డేటాను క్లియర్ చేయాలి ఇక్కడ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడవకుండా చూసుకోవాలి. ►తరువాత మీ ఫోన్లో ఫైల్ మెనేజర్లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్ఢర్ను సెలక్ట్ చేసుకోవాలి. ►ఇప్పుడు మీడియా ఫోల్డర్‌లోని కంటెంట్‌ను ఆండ్రాయిడ్ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్లో కామ్.వాట్సాప్‌లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాట్సాప్ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్ మాత్రమే మూవ్ చేయాలి. ►మీడియా కంటెంట్ పూర్తిగా మూవ్ అయ్యే వరకు నిరిక్షించాలి. ఈ స్టెప్స్ పూర్తి చేశాక మీడియా మిస్సింగ్ అనే బాధ ఉండదు. మీ వాట్సాప్ యాప్‌లో మీడియాను మీ కళ్లముందు ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య ఉన్నవారు పై స్టెప్స్నుపయోగించి మాన్యువల్ గా చేయాలని ఉద్ధేశ్యం లేకపోతే వాట్సాప్ యాప్‌ను ఆప్డేట్ చేసేదాక వేచి ఉండండి. -
నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చే సరుకుల విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం, రాష్ట్రాల సరిహద్దుల వద్ద అడ్డుకోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై గురువారం హోల్‌సేల్ వ్యాపారులు పౌర సరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. నిత్యావసరాల ధరలు పెంచవద్దని ప్రభుత్వం విన్నవిస్తోందని, అయితే సరుకు రవాణా జరుగకుండా ధరల పెరుగుదలను అడ్డుకోవడం సాధ్యం కాదని వ్యాపారులు ఆయన దృష్టికి తెచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వీటిని అనుమతిస్తేనే ధరల పెరుగుదలను అడ్డుకోవచ్చని తెలిపారు. స్పందించిన కమిషనర్, ఎక్కడైనా చెక్‌పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తే డ్రైవర్ పేరు, నంబర్ తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధిక ధరలకు విక్రయిస్తే పీడీ కేసులు లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యావసరాలను విక్రయించాలని పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. అధిక ధరలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచాయని, అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
ఫార్మా కంపెనీలకు అమెరికా FDA సమస్య లేదు
-
ఎలక్ట్రిక్ బస్సు సిటీ గడప దాటదా?
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మల్లగుల్లాలు పడుతోంది. దూర ప్రాంతాలకు నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏర్పడి మధ్యలో ఆగిపోతే ఎలా అని ఆందోళన చెందుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపైనా సంస్థ తీవ్రంగా మ«థనపడుతోంది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి ప్రాంతాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ప్రతిపాదననూ ఆర్టీసీ విరమించుకుంది. ఫలితంగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)’పథకం రెండో విడత కింద కేంద్రం పెద్ద సంఖ్యలో బ్యాటరీ బస్సులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పరిమిత సంఖ్యలోనే తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ పథకం కింద 600 బస్సులు మంజూరుకు వీలుగా కేంద్రాన్ని కోరాలని ముందుగా భావించింది. కానీ, హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు వాటిని నడిపితే ఏర్పడే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇప్పటికిప్పుడు లేనందున కేవలం 334 బస్సులు మాత్రమే కోరాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు కేంద్రానికి పంపే గడువు గురువారంతో ముగుస్తుండటంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి పంపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి పంపనున్నారు. సమస్యగా చార్జింగ్ స్టేషన్లు.. ఎలక్ట్రిక్ బస్సు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పథకం మొదటి దశ కింద మంజూరై హైదరాబాద్‌లో తిరుగుతున్న ఏసీ బస్సుల ధర ఒక్కోటి రూ.2.40 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 60 శాతం బ్యాటరీదే భారం. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు తయారువుతున్నా.. బ్యాటరీలను మాత్రం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో బ్యాటరీ బస్సులను వాడిన దాఖలాలు లేనందున ఎక్కడా వాటి చార్జింగ్ పాయింట్లు లేవు. గతేడాది హైదరాబాద్‌లో 40 బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీంతో వాటి కోసం 3 చోట్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. చార్జింగ్ కేంద్రం ఏర్పాటు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్‌లోనే చార్జ్ చేసి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా నగరం నుంచి ఇతర పట్టణాలకు వాటిని నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రయాణం మధ్యలో బస్సు బ్యాటరీలో సమస్య తలెత్తితే దాన్ని వెనక్కు తీసుకురావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే తరచూ సమస్యలు తలెత్తితే వాటిని నిర్వహించటం సాధ్యం కాదని తేల్చుకున్న అధికారులు.. వాటిని హైదరాబాద్ వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులే.. ఫేమ్ పథకం తొలి దశలో 40 బస్సులు కొన్నారు. అవన్నీ ఏసీ బస్సులే. వీటిని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిప్పుతున్నారు. ఇప్పుడు కొత్తగా నాన్ ఏసీ బ్యాటరీ బస్సులే కొనాలని నిర్ణయించారు. వీటి ధర తక్కువగా ఉండటంతో టికెట్ ధర కూడా తగ్గనుంది. దీంతో వీటికి సాధారణ ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందనేది అధికారుల ఆలోచన. నగరం, శివారు ప్రాంతాలు, సమీపంలోని చిన్న పట్టణాల వరకు మాత్రమే వీటిని తిప్పబోతున్నారు. వరంగల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే బస్సులను పూర్తిగా సిటీ బస్సులుగానే నడపాలని నిర్ణయించారు. అన్ని చోట్లా సిటీ సర్వీసులే.. ప్రస్తుతం దేశంలో ఎక్కడా దూర ప్రాంతాలకు వీటిని నడపటం లేదు. ఢిల్లీ, బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లో ఈ బస్సులు పరుగుపెడుతున్నా.. అన్ని చోట్లా సిటీ బస్సులుగానే తిరుగుతున్నాయి. దూర ప్రాంతాల మధ్య వాటిని ప్రారంభించనందున.. వాటి నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టీసీకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 వేల బస్సులు తిప్పాలని కేంద్రం నిర్ణయించినందున, కొన్ని చోట్ల దూరప్రాంతాల మధ్య తిప్పే అవకాశం ఉంది. అప్పుడు ఆయా సంస్థలకు ఎదురయ్యే అనుభవాలను తెలుసుకుని భవిష్యత్‌లో రాష్ట్రంలో కూడా దూర ప్రాంతాల మధ్య వాటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సుల వివాదం.. మరో కారణం.. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 25 శాతానికి మించకూడదనేది నిబంధన. కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో దీన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిమితి నిండిపోయింది. కొత్తగా అద్దె బస్సులను ఏర్పాటు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయి కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అద్దె బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనే బ్యాటరీ బస్సులను అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక సంఘాల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎదుర్కోవటం కూడా ఇబ్బందిగా అధికారులు భావించారు. వెరసి తొలుత 600 బస్సులు సమకూర్చుకోవాలని భావించినా ఇప్పుడు దాన్ని 334కే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఎక్కువ బస్సులు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే అందుకు వీలుగా 550, 450 బస్సులు తీసుకునేలా రెండు ప్రతిపాదనలు కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. స్మార్ట్ సిటీ బస్సులు.. స్మార్ట్ సిటీలకు ప్రత్యేకంగా ఈ బస్సులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఉన్న వరంగల్ పట్టణంలో కొన్నింటిని ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. 12 మీటర్లు, 9 మీటర్లు, 7 మీటర్ల పొడవుండే 3 కేటగిరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 40 బస్సులు 12 మీటర్ల పొడవైనవే. పాతబస్తీ లాంటి ఇరుకు దారులుండే రోడ్లపై వీటిని నడపడం ఇబ్బందిగా ఉంటుంది. టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉన్నందున వీటిలో రద్దీ కూడా తక్కువగా ఉంటోంది. అందుకోసం సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చిన్న బస్సులే తిప్పబోతున్నారు. ఇందుకోసం 9, 7 మీటర్ల బస్సులను కూడా కొంటున్నారు. మొత్తం 334 బస్సులు కొనాలని దాదాపు ఖరారు చేశారు. ఇందులో 309 బస్సులను హైదరాబాద్‌లో తిప్పాలని, మిగతా వాటిని వరంగల్ పట్టణంలో సిటీ బస్సులుగా తిప్పాలని భావిస్తున్నారు. -
దుబాయిలో కుల్కచర్ల మహిళ కష్టాలు
సాక్షి, కుల్కచర్ల: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఓ మహిళ తను అక్కడ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నానని, ఇక్కడి నుంచి తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ సోషల్ మీడియా లో పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ మౌలానా కూతురు సయ్యద్ సమీనా బేగంను హైదరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. భర్త సక్రమంగా చూసుకోకపోవడంతో తిరిగి పుట్టిల్లు కుల్కచర్లకు వచ్చింది. కొడుకు ఆరోగ్యం బాగలేదని, డబ్బులు కావాలని వైద్యులు చెప్పడంతో స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఆమె తన కు మారుడిని సోదరి వద్ద ఉంచింది. ఓ నకిలీ ఏజెంట్ ద్వారా మూడు నెలల క్రితం దుబాయికి వెళ్లింది. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. కొన్ని రోజులుగా షేక్ కుటుంబీకులు రేయింబవళ్లు పనిచేస్తుండడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె షేక్ ఇంటి నుంచి పారిపోయి వేరే వారి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి వాట్సప్ ద్వారా వీడియో సందేశాన్ని కుటుంబీకులకు పంపింది. తనను ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. తాను ఇక్కడ ఉండలేనని, ఇండియాకు తీసుకెళ్లాలని కోరింది. లేదంటే చనిపోతానని చెప్పింది. ఈ విషయం గురువారం కుల్కచర్ల మండలంలో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, కుల్కచర్ల సర్పంచ్ సౌమ్యా వెంకట్రామిరెడ్డి తదితరులు బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. వారికి భరోసా చెప్పి కొంతమేర ఆర్థికసాయం అందించారు. ఈ విషయమై ఆయన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరించారు. తప్పనిసరిగా బాధితురాలిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ప్రహ్లాద్‌రావు తెలిపారు. -
అతిథి బాధలు.. కాంట్రాక్ట్ వెతలు!
సాక్షి, తాండూరు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అగమ్యగోచరంగా మారింది. పాఠశాల, ఉన్నత విద్యకు నిచ్చెన లాంటి ఇంటర్ ఎడ్యుకేషన్ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురువుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల సంగతి పక్కన పెడితే కనీసం పాఠాలు బోధించేందుకు కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో చదువులు సవ్యంగా సాగడం లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని 9 కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. 9 మండలాల్లోనే కాలేజీలు.. జిల్లాలో 18 మండలాలు ఉండగా.. కేవలం 9 మండలాల్లోనే మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగతా ఒకటి రెండు చోట్ల ప్రైవేటు కాలేజీలే దిక్కవుతున్నాయి. మర్పల్లి, కొడంగల్, దోమ, పెద్దేముల్, మోమిన్‌పేట, నవాబ్‌పేట మండలాలతో పాటు తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ప్రభుత్వ కాలేజీలున్నాయి. వీటిలో 3వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 9 కాలేజీలకు సంబంధించి సుమారు 150 మంది రెగ్యులర్ అధ్యాపకులు అవసరం. వీరిలో కేవలం 5గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 81 మంది కాంట్రాక్ట్ విధానంలో, 48 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిన సేవలు అందిస్తున్నారు. 5 నెలలుగా అందని వేతనాలు.. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో 81 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 5 నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు. రెగ్యులరైజ్ చేయాలి పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు. – మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. వికారాబాద్, తాండూరులో తరగతి గదుల కొరత ఉంది. వసతుల కల్పనకు మావంతు కృషి చేస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల బకాయి వేతనాలు చెల్లింపు మా పరిధిలో లేదు. – శంకర్‌నాయక్, జిల్లా నోడల్ అధికారి రెగ్యులరైజ్ చేయాలి పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు. – మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ట్రాన్స్ఫార్మర్ అడ్డొచ్చిందని..!
సాక్షి, భవానీపురం: స్ట్రాం వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అడ్డొచ్చిందని కాలువను వంకరలు తిప్పుతూ చక్కటి రోడ్డును పగులకొట్టారు. అసలు స్ట్రాంవాటర్ డ్రెయిన్లే అనవసరంగా నిర్మిస్తున్నారని వాటి వలన ప్రయోజనం కూడా కనబడటం లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే గతంలో గట్టిగా ఉన్న సైడు కాలువలను పగులకొట్టి కొత్తగా నిర్మించిన స్ట్రాంవాటర్ డ్రెయిన్స్‌తో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడమే వారి అసంతృప్తికి కారణం. ఈ నేపథ్యంలో విద్యాధరపురం 26వ డివిజన్ పరిధిలోని శ్రీకన్యకాపరమేశ్వరి కల్యాణ మండపం రోడ్లో నిర్మిస్తున్న స్ట్రాంవాటర్ డ్రెయిన్ కు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అడ్డు వచ్చింది. విద్యుత్ సిబ్బందికి చెప్పినా అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ మార్చటం లేదని దానిని తప్పించి డ్రెయిన్ నిర్మించే క్రమంలో చక్కగా ఉన్న రోడ్డును పగులకొట్టారు. స్థానికులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటమే కాకుండా వెడల్పు కూడా తక్కువగా ఉన్న ఈ రోడ్డును పగులకొట్టడంతో కుచించుకుపోయింది. దీనిపై కామకోటినగర్, అండిమాని బ్రహ్మయ్య రోడ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వి కూడా వారం రోజులకుపైనే అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాంతాలవారీగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేయడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బందిపడినా పరవాలేదు..ఎలాగోలా తమ కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయే పరిస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. డ్రెయిన్ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు నిద్ర మత్తులోనో, ముడుపుల మత్తులోనో ఉండి పనులు జరుగుతున్న ప్రాంతంలో కానరావడం లేదు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైనా ఉంటే వారైనా స్పందించి డ్రెయిన్ నిర్మిస్తున్న ప్రాంతాలలో స్థానికుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలో పలు గ్రమాల్లో తాగు నీటి సమస్య
-
‘అవని’కి ఆశాజ్యోతి.. వైఎస్ జగన్
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ప్రారంభించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు అవనిగడ్డలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అవనిగడ్డ వంతెన సెంటర్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జనసంద్రం.. ప్రతిపక్ష నేత సభ మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ప్రజలు అప్పటికే భారీ సంఖ్యలో రావడంతో ఆ సర్కిల్ జనంతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జననేత కోసం ఎదుచుచూసే కళ్లే కనిపించాయి. ఒక వైపు మిట్ట మధ్యాహ్నం వేళ.. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నా.. ఎండ కాకరేపుతున్నా ఒక్క అడుగు సైతం పక్కకు పడలేదు. తమ అభిమాన నేతను చూడాలని, చేసే ప్రసంగాన్ని వినాలని ఎంతో ఆశతో ఎదురు చూశారు. జననేత కన్పించగానే ఒక్క సారిగా ప్రజల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈలలు, కేకలు, చప్పట్ల శబ్దాలతో సభ ప్రాంగణాన్ని హోరెత్తింది. జిల్లాకు చేసిందేమీ లేదు.. జననేత వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నారు. మచిలీపట్నం పోర్టు, రిఫైనరీ, పింగాణీ పరిశ్రమ, మెట్రోరైలు, ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్, ఫుడ్‌పార్క్, విజయవాడ మెగాసిటీ, స్మార్ట్‌సిటీ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్, నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఐదేళ్లయినా ఒక్కటైనా నెరవేర్చారా? అని జనసందోహాన్ని ప్రశ్నించగా.. ప్రజలు చేతులెత్తి లేదు.. లేదు.. అని సమాధానమిచ్చారు. నేనున్నాను.. పాదయాత్రలో చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడి చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఓటు వేసి వంచనకు గురైన విద్యార్థులు.. రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు కళ్లారా చూశానని.. వారి బాధలన్నీ విన్నానన్నారు. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, కైకలూరు, పామర్రు, బందరు, పెడన నియోజకవర్గాల సమన్వయ కర్తలు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్‌కుమార్, పేర్ని నానీ, జోగి రమేష్ పాల్గొన్నారు. మనసులేని మనిషి చంద్రబాబు మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య పేరును ఉళ్లిపాలెం–భవాణిపురం బ్రిడ్జికి నామకరణం చేయమని మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్ చంద్రబాబుని అడిగితే పట్టించుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ హయాంలోనే బ్రిడ్జి మంజూరైందని, ఆయన హయాంలోనే నిధులు కూడా వచ్చాయన్నారు. కేవలం పేరు పెట్టే విషయంలో అంబటి హరి అడిగితే చంద్రబాబు స్పందించలేదన్నారు. అధికారంలోకి రాగానే బ్రిడ్జికి అంబటి బ్రాహ్మణయ్య బ్రిడ్జ్‌గా నామకరణం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 10 వేల మందికి లబ్ధిచేకూరే ఎదురుమొండి వారథిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఐదేళ్లు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. మనసులేనివారు పరిపాలనచేస్తే అదే జరుగుతుందని.. ఈ బ్రిడ్జిని తాను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో జోష్.. జిల్లాలో మొదటి ఎన్నికల సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. అవినీతి టీడీపీ ప్రభుత్వానికి మరి కొద్ది రోజులే గడువు ఉందని, మనకు మంచి రోజులు రానున్నాయని చెప్పడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పథకాలు, నవరత్నాలతో జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమస్యలను గుర్తించి.. పరిష్కారానికి హామీ ఇవ్వాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధినేత ఇచ్చిన ధైర్యంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేసేందుకు నాయకులు సంసిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఆయన ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే సువర్ణపాలన తథ్యం. ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్న నమ్మకం ఉంది. –సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి ప్రజలు చల్లని దీవెనలతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పార్టీ అధినేత వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారు. తద్వారా ప్రజలకు తాగు, సాగునీటిని అందుతుంది. టీడీపీ పాలకులు రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా పంటలకు నీరందక రైతాంగం అల్లాడిపోతోంది. జననేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో మంచి జరుగుతుంది. –వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి -
మిర్చి రైతుల నేల చూపులు
సాక్షి, నర్సంపేట: మిర్చి రైతులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు ప్రకృతి అనుకూలించకపోవడం.. తెగుళ్లు విజృంభించడంతో దిగుబడి తగ్గి రైతులు నిండా మునిగారు. వచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తుందోనన్న అన్నదాతను మార్కెట్ మాయాజాలం మరింత నష్టాన్ని కలుగజేస్తోంది. క్వింటా మిర్చి ధర రూ.10 వేల లోపు పలుకుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది మిర్చి ధరలు మురిపించాయి. గిట్టుబాటు కావడంతో రైతులకు కాసింత ఆదాయం సమకూరింది. దీంతో ఈ ఏడాది మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఊహించని విధంగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశా యి. వర్షాల తర్వాత తెగుళ్లు దారుణంగా దెబ్బతీ శాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందు కు రూ.వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు రెండు రెండింతలయ్యాయి. దిగుబడులు మాత్రం దారుణంగా పడిపోయాయి. పంటను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగయింది. నర్సంపేట నియోజకవర్గం రైతులు ఈ ఏడాది భూగర్భ జలాలపై ఆధారపడి బోర్లు, వ్యవసాయ బావుల కిందనే వాణిజ్య పంటలను సాగు చేశారు. పెద్ద ఎత్తున మిర్చి పంట వేశారు. కోత దశకు చేరుకున్న సమయంలో మిర్చికి వైరస్ సోకి ఎకరాల కొద్ది పంట దెబ్బతింది. ఎకరానికి రూ.50 నుంచి రూ.60 వేల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు వైరస్‌తో ఎర్రబడి ఎండిపోతుండడంతో, నర్సంపేట మండలం దాసరిపల్లి రైతులు దిగులు పడుతున్నారు. -
ఉక్కపోత .. ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మెదక్ రూరల్: వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజూవారి పనులలో భాగంగా జనం బయటకు వెళ్లాలంటేనే మండుటెండలను చూసి జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఇంత తీవ్రత ఉంటే ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు ఏమేర ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండవేడి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏటా వేసవిలో మెదక్ జిల్లా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతారు. గతంతో పోలిస్తే ఈసారి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను సేవిస్తున్నారు. అలాగే ఎండలకు వడదెబ్బ తగులకుండా తలకు రక్షణగా టోపీలు ధరిస్తున్నారు. రుమాళ్లను చుట్టుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు గొడుగులు వేసుకుని వెళుతున్నారు. నీటి కష్టాలు మొదలు వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో బోర్లు నీళ్లు పోసే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సాగు నీరు లేకపోవడంతో పంటసాగు విస్తీర్ణం ఈసారి గణనీయంగా తగ్గింది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో పశువులు దాహం తీర్చుకునేందుకు అల్లాడుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్ల కోసం బిందెలు పట్టుకొని సమీప ట్యాంకులు, పొలాలకు పరుగులుపెడుతున్నారు. సింగూరులో నీటి మట్టం తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ఈసారి తాగు, సాగు నీటికి గడ్డుకాలమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి అధికారులకు సవాల్‌గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఊపందుకున్న సీజనల్ వ్యాపారాలు జ్యూస్ స్టాల్స్, శీతల పానీయాలు, టోపీలు, గొడుగులు వంటి వ్యాపారాలు ఇప్పటికే ప్రధాన రహదారుల వెంట వెలిశాయి. మట్టి కుండలు, రంజన్లను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేటువంటి కూలర్లు, ఏసీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. -
విమానంలో ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత : కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కొంతమంది ప్రయాణీకులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. విమాన టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే నలుగురు ప్రయాణికులకు ముక్కునుంచి రక్తం కారడం మొదలైంది. మరికొంతమంది చెవి నొప్పి లాంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మస్కట్ నుంచి ఎయిరిండియా విమానం కాలికట్( కాజీకోడ్) వెడుతుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. వెంటనే అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. బాధిత ప్రయాణీకులకు పూర్తి వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ప్రమాదం ఏదీ లేదని తేల్చడంతో మస్కట్ విమానాశ్రయం నుంచి విమానం తిరిగి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. విమానంలో వైమానిక పీడనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నలుగురు ప్రయాణీకులకు ముక్కునుంచి రక్తస్రావం జరిగిందని వారికి తగిన చికిత్స అందిచినట్టు తెలిపారు. బోయింగ్ 737 , 8 ఐఎక్స్ -350 విమానంలో మొత్తం 185 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ముగ్గురు శిశువులు. -
స్తంభించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్
ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్బుక్ దాని అనుబంధ సంస్థలు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు స్తంభించిపోయాయి. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ డేటా ఆధారంగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల ప్రాంతంలో సేవలు ఆగిపోయాయి. సోషల్ మీడియా సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేశారు. ఫేస్బుక్ వినియోగదారులు లాగిన్‌తోపాటు, పోస్టింగ్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలు/సందేశాలు కనబడకపోవడంతో నెటిజన్లు ఆందోళన చెందారు. వాట్సాప్‌లోనైతే మెసేజ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్విటర్‌ను ఆశ్రయించిన నెటిజన్లు ఫేస్బుక్ నువ్వు ఎక్కడికి వెళ్లావు, ఫేస్బుక్ డౌన్.. లాంగ్ లీవ్ ట్విటర్.. అంటూ తమ సమస్యలను షేర్ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమస్య కొనసాగినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి జే నాన్కర్రో స్పందిస్తూ.. సమస్య తలెత్తగానే తాము వెంటనే స్పందించామని, వీలైనంత త్వరగా సేవలు పునరిద్ధరించామని తెలిపారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. -
పిల్లలు/ పెద్దలు పాముకాటుకు గురైతే...?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మాది పల్లెటూరు. దాదాపు పొలాల పక్కనే మా ఇళ్లు ఉంటాయి. స్కూలైపోగానే పిల్లలెప్పుడూ ఆ పొలాల్లోనే ఆడుతుంటారు. పాములేవైనా కాటేస్తాయేమోనని మాకు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. పాము కాటేసినప్పుడు ఎలాంటి ప్రథమచికిత్స చేయాలి? ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పండి. – ఆర్. విజయలక్ష్మి, పోతవరం ఎవరినైనా పాము కాటు వేసినప్పుడు ముందుగా వారు ఆందోళన పడకుండా చూడాలి. అలాగే మనం కూడా కంగారు పడకూడదు. పాముకాటుకు గురయ్యామన్న భావనే చాలామందికి తీవ్ర ఆందోళన గొలుపుతుంది. కానీ పాముల్లో చాలావరకు విషసర్పాలు కావని గుర్తించాలి. విషసర్పం అయితే కాటువేసిన చోట రెండుగానీ లేదా ఒకటిగానీ గాట్లు ఉంటాయి. ముందుగా పాము కాటేసిన చోట సబ్బుతోనూ, నీళ్లతోనూ శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైనవారి తల వైపు ఎత్తు ఉండేలా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే విషం పైకి పాకే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత ఎలాస్టిక్ బ్యాండేజీ అంచులు ఒకదానిపై ఒకటి ఎక్కేలా (ఓవర్ల్యాపింగ్స్)తో అవయవం చుట్టూ ర్యాప్ చేస్తున్నట్టుగా కట్టాలి. ఇలా ఆ అవయవం పొడవునా... అంటే చేతికైతే భుజం వరకు, కాలికి అయితే పిక్కల వరకు కట్టాలి. మరీ బిగుతుగా కాకుండా చుట్టాలి. మరీ బిగుతుగా కడితే... ఆ కట్టిన అవయవానికి రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ వదులుగా చుడితే విషం పైకి ఎక్కకుండా ఆపడం కష్టం. కాబట్టి కట్టుకూ, చర్మానికి మధ్య మన చిటికెన వేలు పట్టేంత బిగుతుగా మాత్రమే ఆ కట్టు ఉండాలి. ఒకవేళ ఆ భాగంలో తిమ్మిరెక్కిట్లుగా ఉన్నా లేదా మొద్దుబారినట్లుగా ఉన్నా లేదా రంగు మారినట్లుగా అనిపించినా కట్టు మరీ బిగువైనట్టు అనుకోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా వదులు చేయాలి. ఎలాస్టిక్ బ్యాండేజీ లేని పక్షంలో రోలర్ బ్యాండేజీ వాడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కాటుకు గురైన అవయవం కదలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాము కాటుకు గురయ్యే అవయవం కాలు. ఇలాంటప్పుడు చీలమండలు, పాదాలు ఈ రెండింటినీ ఒక బట్టతో కట్టవచ్చు. కాళ్లు ఎక్కువగా కదిపితే విషయం పైకి వేగంగా ఎక్కే ఆస్కారం ఉంటుంది. కదలకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం.ఈ విధంగా కట్టాక చిన్నారిని / బాధితులను వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి. పాము ఫొటోను గాని, పామును చంపితే... ఆ చచ్చిన పామును వైద్యులకు చూపించగలిగితే వారు దానికి సరైన యాంటీ స్నేక్ వీనం (విషానికి సరైన విరుగుడు మందు) ఇవ్వలా లేదంటే అది విషరహితమైనా పామా అన్నది నిర్ధారణ చేయడం సులభమవుతుంది. యాంటీస్నేక్ వీనం వల్ల కొంతమందికి రియాక్షన్ వచ్చి ప్రాణానికే ప్రమాదం అవ్వవచ్చు. అందువల్ల కాటేసింది విషసర్పమైతే తప్ప వైద్యులు ప్రతి పాముకాటుకూ యాంటీవీనం ఇవ్వరు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకునేందుకు అవకాశమున్న సూచనలను, పరీక్షలను బట్టి వైద్యులు యాంటీ స్నేక్ వీనమ్ ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. అవసరమైతే బాధితుడిని ఐసీయూలో ఉంచి చాలా జాగ్రత్తగా గమనిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సినిమాల్లో చూపినట్లుగా కొన్ని పనులు చేయడం ఏమాత్రం సరికాదు. ఉదాహరణకు పాము కాటు గాయానికి మరింత పెద్ద గాటు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విషాన్ని నోటితో పీల్చడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల పీల్చేవారికీ విషం ఎక్కి వారి ప్రాణానికీ ప్రమాదం జరగవచ్చు. గాయం దగ్గర ఐస్ పెట్టవద్దు. ఆసుపత్రికి తరలించే సమయంలో దారిపొడవునా బాధితుడిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. స్పృహకోల్పోతే పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. శ్వాస ఆగిపోతే గుండెను పునరుత్తేజితం చేయడంతో పాటు శ్వాస ఆడేటట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) ప్రక్రియను ప్రారంభించాలి. (ఇలా చేయడం తెలిస్తే). ముందుగానే ఆసుపత్రికి ఫోన్ చేసి, పరిస్థితి వివరించాలి. ఇందువల్ల తగిన సలహా తీసుకోవడంతో పాటు... రోగి హాస్పిటల్‌కు చేరగానే అత్యవసర చికిత్స జరిగే ఏర్పాట్లను ముందుగానే చేయడానికి వీలవుతుంది. పిల్లల గొంతులో చేపముల్లు గుచ్చుకుంటే? మాకు తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు చేపలను ఇష్టంగా తింటారు. అయితే ఒకసారి చేపముల్లు గుచ్చుకున్నట్లుగా ఉందని అన్నా... ఆ తర్వాత మళ్లీ మామూలైపోయారు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఒకవేళ పిల్లల గొంతుల్లో నిజంగానే చేపముల్లు గుచ్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం జరిగితే ఏం చేయాలో సూచించండి. – రేష్మీ, నెల్లూరు పిల్లల గొంతులో చేపముల్లు గుర్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం అన్నది ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల ఒక్కోసారి గొంతు బాగా వాచి, గాలిపీల్చుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా గాలి అందని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. ఇలా పిల్లల గొంతులో గుచ్చుకున్న ముల్లును ఈఎన్టీ వైద్యులు చాల జాగ్రత్తగా తొలగిస్తారు. పిల్లల్ని వైద్యుల వరకు చేర్చేవరకు దారిపొడవునా పిల్లలతో ఐస్ చప్పరింపజేస్తూ ఉండాలి. ఈ చల్లదనం వల్ల వాపు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలా గొంతు వాపు రాకుండా, శ్వాసకి అడ్డం పడకుండా ఇలా కాస్తంత ముందుజాగ్రత్త తీసుకుంటే, గొంతులో ఉన్న ముల్లును తీయడం ఈఎన్టీ వైద్యులకు కూడా సులువవుతుంది. పాప పాలు తాగగానే వాంతి చేసుకుంటోంది మా పాపకు మూడు నెలలు. మా పాప పాలు తాగిన కొద్దిసేపటికే వాంతి చేసుకుంటోంది. ఇదేమైనా ఇబ్బందా? దీనికి పరిష్కారం ఏదైనా ఉందా? – ఎల్. ప్రసూన, వైరా చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి కొద్దిగా పాలను బయటకు తియ్యడం మామూలే. పాలు తాగే పిల్లల్లో ఇది చాలా సాధారణం. దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలుగానీ, నెమ్ము రావడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ పెరిగే కొద్దీ లేదా ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టాక ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాకగ కనీసం అరగంట సేపు తలవైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లుగా బిడ్డను ఎత్తుకుంటే చాలు... ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. పాలు తాగించాక తేన్పు తెప్పించడం కూడా ముఖ్యమే. అయితే కొంతమంది చంటిపిల్లలు ఎక్కువగా వాంతులు చేసుకుంటారు. దాంతో బరువు సరిగా పెరగరు. కొంతమంది పిల్లల్లో ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించి, తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. అరుదుగా ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. కొంతమంది చంటిపిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలవ్వవచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లుగా పెద్ద పెద్ద వాంతులు చేస్తారు. వారు బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్ స్టెనోసిస్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్ తప్పనిసరి. సమస్య ఏమైనప్పటికీ పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం ఒకసారి పిల్లల వైద్యనిపుణులను సంప్రదించడం అవసరం. డా‘‘ శివరంజని సంతోష్ సీనియర్ పీడియాట్రీషియన్,రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
70 కుటుంబాల ఆవేదన వినిపించదా?
పోలాకి : స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివక్ష తగ్గ లేదని ఉర్జాం గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వివక్ష రూపాంతరం చెందిందే తప్ప అంతరించిపోలేదని మండిపడ్డారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాంలో దాదాపు 70 దళిత కుటుంబాల ఆవేదన అధికారులకు, నాయకులకు వినిపించటంలేదా? అని ప్రశ్నించారు. కులవివిక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉర్జాం దళితులు బుధవారం కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రం వద్ద ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. తమ దళితవాడలో తాగునీటి కష్టాలు తెలిసేలా, వినతులు, విన్నపాలు వినలేని పాలకులు, అధికారులకు వినిపించేలా మహిళలు ఖాళీ బిందెలతో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, మేళాలతో మండలకేంద్రంలో ర్యాలీగా వెళ్లి ప్రత్యేకాధికారి దామోదరరావుకు తమగోడు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించడంలో వివక్ష చూపుతున్నారని, ఇచ్చిన మాటను అధికారులు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తాము కనీసం మంచినీటికి కూడా నోచుకోలేకపోతున్నామని, ఉప్పు నీళ్లు తాగుతున్నామని గ్రామానికి చెందిన మహిళ కె.లక్ష్మి వాపోయింది. మౌలిక వసతుల అభివృద్ధికి అడ్డుకుంటున్నారని, మృతదేహాలు దహనంచేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దళిత సంఘం నాయకుడు జె.గన్నయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తామూ ఈ గ్రామంలోనే పుట్టామని అలాంటప్పుడు వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉర్జాంలో జరుగుతున్నది కులవివక్షే అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ అన్నారు. పౌరహక్కుల దినం సందర్భంగా గ్రామంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. -
ప్రజల చెవుల్లో విద్యుత్ బల్బులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ ప్రగతి ప్రయాణంలో 2018, ఏప్రిల్ 28 మరిచిపోలేని చరిత్రాత్మక రోజు. అనేక మంది భారతీయుల జీవితాలు సమూలంగా మారిపోయేందుకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్న రోజు. భారత దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు వ్యాఖ్యానించారు. ఆఖరికి కరెంట్ అంటే తెలియని మణిపూర్‌లోని లైలాంగ్ గ్రామానికి కూడా కరెంట్ వచ్చిందని, ఇందుకు కషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఇంకా 12 రోజులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కేసింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఇతర మంత్రులందరూ ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్వీట్లు పంచుకున్నారు. ‘దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం లభించింది’ అని ప్రధాని మోదీ స్వయంగా పేర్కొన్నారు. అంటే దేశం నూటికి నూరుపాళ్లు విద్యుత్ సౌకర్యాన్ని సాధించినట్లే. అవునా, నిజమేనా!? అవునంటే మనం చీకట్లో కాలేసినట్లే. విద్యుత్ బల్బును చెవిలో పెట్టుకున్నట్లే. నేటికి కూడా కొన్ని వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. గూగుల్‌లో వెతికి ఆ గ్రామాలను తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. విద్యుత్ సౌకర్యం ఉన్న అనేక గ్రామాలకు రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేక కొన్ని వేల గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయి. దేశంలో మూడు కోట్లకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరానే లేదు. పైగా విద్యుత్ సౌకర్యం లెక్కలే కాకి లెక్కలు. రెండు రకాలుగా వీటిని లెక్కిస్తారు. గ్రామంలోని పది శాతం ఇళ్లకు కరెంట్ సౌకర్యం ఉంటే ఆ గ్రామానికి నూటికి నూరు శాతం విద్యుత్ ఉన్నట్లే లెక్క. ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆస్పత్రి ఇలా ప్రభుత్వ సంస్థలకు విద్యుత్ సౌకర్యం ఉన్నా, ఆ గ్రామానికి నూటికి నూరు శాతం విద్యుత్ సౌకర్యం ఉన్నట్లే. దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంలో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ విద్యుద్దీకరణ పథకాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 2014 సంవత్సరాల మధ్య ఆ ప్రభుత్వం 1,08,280 గ్రామీలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఏటా 12,030 గ్రామాలకు చొప్పున విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది. లక్ష్య సాధనలో 18, 452 గ్రామాల విద్యుద్దీకరణ మిగిలిపోయిందని నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్‌ను అందజేయడం తన లక్ష్యమని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 2015లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగంలో ప్రతి గ్రామానికి వెయ్యి రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని శపథం చేశారు. నేడు ఆ లక్ష్యాన్ని 987 రోజుల్లోనే సాధించామని, ఇది మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నేడు ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం వచ్చిందంటూ దేశమంతా పండుగ చేసుకుంటుంటే రాజీవ్ కుటుంబానికి ‘పవర్’ పోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఏడుస్తూ కూర్చుందంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అధికారిక లెక్కల ప్రకారం యూపీఏ ప్రభుత్వం మిగిల్చిన 18, 452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లయితే మోదీ ప్రభుత్వం ఏటా 4,613 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు. అదే యూపీఏ ప్రభుత్వం ఏటా 12,030 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. మధ్యప్రదేశ్‌లో 50 గ్రామాలు నేటికి చీకల్లో.... మధ్యప్రదేశ్‌లో చీకటి ప్రాంతంగా గుర్తింపు పొందిన అలిరాజ్పూర్ ప్రాంతాన్ని వెలుగులతో నింపామని ప్రభుత్వం ప్రకటించుకుంది. అదే ప్రాంతంలోని నర్మదా తీరానున్న ఝందన, అంబా, చమేలి తదితర ఐదు దళిత గ్రామాలకు కరెంట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఐదు గ్రామాల్లో ఒక గ్రామానికి మాత్రం రెండేళ్ల క్రితం విద్యుత్ స్తంభాలు వేశారట. నేటికి విద్యుత్ సౌకర్యం మాత్రం కల్పించలేదు. ఇదే రాష్ట్రంలోని రైసేన్ ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సాంచి నియోజకవర్గంలోని జైత్గఢ్, బిలి, పాండ్, రామ్‌గఢ్, ఖానన్పురా, గోపాల్ పూర్ అనే గ్రామాలకు కరెంట్ ఇవ్వడానికి కనీసం ప్రయత్నాలు కూడా జరుగలేదు. విద్యుత్ సౌకర్యం సంగతి పక్కన పెడితే తమ గ్రామాలకు సరైన రోడ్డుగానీ, మంచినీటి సౌకర్యంగానీ లేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రాజస్థాన్‌లోని ధోల్పూర్లో...... రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ ప్రాంతంలోని ఘురాయియా, హతియాకర్, కెహరీకా నగ్లా, రాజ్‌ఘాట్, హరీపురా, గోల్ కా పుర, శంకర్ పుర, ఠకూర్ పుర తదితర ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం లేదు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషేడ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని సప్రమ్ అనే పెద్ద గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో గ్రామానికి రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా ఉంది. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రే రెండు, మూడు సార్లు హామీ ఇచ్చారట. రెండేళ్ల క్రితమే విద్యుత్ స్తంభాలు పాతినప్పటికీ నేటికి కరంట్ సౌకర్యం లేదని మీడియాకు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇలా మీడియా చొచ్చుకుపోయిన ప్రతి రాష్ట్రంలో కరెంట్ నోచుకోని గ్రామాలు ఎన్నో కనిపించాయి. ప్రభుత్వం ప్రకటించిన డేటా ప్రకారమే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 40 శాతం ఇళ్లలో నేటికి విద్యుత్ సౌకర్యం లేదు. వాటిల్లో సమీపంలో పవర్ గ్రిడ్లు, విద్యుత్ స్తంభాల సౌకర్యం లేకనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. -
పరిమళించిన మానవత్వం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మానవత్వం పరిమళించింది. ఎంతలా అంటే... కాలువలో దీనావస్థలో పడి ఉన్న వృద్ధురాలికి మెరుపు వేగంతో ఆస్పత్రిలో వైద్యం చేయించడం... అనంతరం ఓ ఆశ్రమానికి తరలించడం... ఇదంతా ఒకే ఒక్క ఫొటో ఆధారంగా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం శివారు కొత్తపాలెం అండర్ పాత్ వే వద్ద 80 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు పడి ఉంది. మలమూత్ర విసర్జనలతో మూలుగుతోంది. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మనకెందుకులే అని ముందుకు సాగిపోయారు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా వెళ్తూ ఆ వృద్ధురాలిని గమనించాడు. మాట్లాడుదామంటే ఆమె నోట మాట లేదు. దగ్గరకెళ్తే తీవ్రంగా రోత... ఇలా ఉన్న చిత్రాన్ని అతను నేరుగా పోలీస్ కమిషనర్ యోగానంద్‌కు వాట్సాప్‌లో పంపారు. దయచేసి స్పందించాలని కోరాడు. అంతే యోగానంద్ నుంచి గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావుకు సమాచారం వచ్చింది. ఆయన ఎస్ఐ శ్రీనివాస్‌మహంతి, సిబ్బందితో హుటాహుటిన కొత్తపాలెం అండర్‌పాత్‌వే వద్దకు చేరుకుని రక్షక్‌లో గోపాలపట్నం ఎస్ఆర్ మల్టీస్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీఈవో గిరి, వైద్యులను ఒప్పించి ఉచితంగా వైద్యసేవలు చేయించారు. అనంతరం సీఐ వైకుంఠరావు ప్రేమసమాజం యాజమాన్యంతోనూ, పలు వృద్ధాశ్రమాల నిర్వాహకులతోనూ సంప్రదించారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రకాశరావు స్పందించడంతో అక్కడికి పోలీసులు వృద్ధురాలిని అంబులెన్స్‌లో తరలించారు. అయితే వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. మెరుపువేగంతో పోలీసులు, ఇక్కడి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్పందించిన తీరుకి సీపీ యోగానంద్ వాట్సాప్ ద్వారా ప్రశంసించారు. -
చిన్నాచితకా ఉద్యోగాలతో సరి
మనదేశంలోని నగరాల్లో నివసిస్తోన్న మహిళల ఉద్యోగాలపై రవాణా సదుపాయాల లేమి ప్రభావం చూపుతోందని ముంబైలో జరిపిన తాజా పరిశోధనలు తేల్చి చెప్పాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వారు మెరుగైన ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. దూరప్రయాణాలకు అనువైన రవాణా సౌకర్యాలు కరువై, తాము నివసిస్తోన్న ప్రాంతాల్లోనే తక్కువ వేతనాలు వచ్చే చిన్నా చితకా ఉద్యోగాలతో మహిళలు సరిపెట్టుకుంటున్నారని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ(ఐటిడిఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే 2013లో శ్రామిక మహిళల భాగస్వామ్యం కూడా 34.8 శాతం నుంచి 27 శాతానికి దిగజారినట్టు ఇండియా స్పెండ్ నివేదిక ఇటీవల వెల్లడించింది. వ్యాపార, ఆర్థిక పరిశోధనా సంస్థ మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2015 నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో 63 శాతం మంది శ్రామిక మహిళలు ఉంటే, బీహార్‌కి వచ్చేసరికి అది 9 శాతానికి పడిపోయింది. 2017 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2004 నుంచి 2011–12 లోపల 19.2 మిలియన్ల మంది శ్రామిక మహిళలు తగ్గిపోయారు. ఎఫ్ఐఏ ఫౌండేషన్ గతంలో నిర్వహించిన çసర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, నగర ప్రాంతాల్లో నివసిస్తోన్న కుటుంబాల్లో పురుషులు 27 శాతం మంది, స్త్రీలు 37 శాతం మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఎంచుకుంటున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అయితే తక్కువ ఖర్చు, భద్రత కారణాల రీత్యా మహిళలు ప్రభుత్వ రవాణావైపు మొగ్గుచూపుతున్నారని కూడా ఇందులో వెల్లడైంది. 2010 లో జగోరి అనే మహిళా రీసోర్స్ సెంటర్ యుఎన్ వుమన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఢిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దాదాపు 90 శాతం మంది స్త్రీలు ఏదో రకమైన వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు 51 శాతం మంది వేధింపులకు గురయ్యామనీ, బస్సుల కోసమో, లేక రైళ్ళకోసమో వేచిచూస్తున్న సమయంలో 42 శాతం మంది వేధింపులకు గురైనట్టు వెల్లడించారు. -
నత్తనడకన భూ పంపిణీ పథకం
‘వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో 17 మంది దళితులకు భూమి పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు 9 ఎకరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవగా యజమాని ఎకరానికి రూ.5.25 లక్షలకు విక్రయించేందుకు ముందుకొచ్చాడు. విషయం తెలుసుకున్న రియల్టర్లు ప్రభుత్వం చెల్లించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని చెప్పడంతో సదరు భూమి యజమాని అటువైపు మొగ్గుచూపాడు. దీంతో ఏమిచేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి’. సాక్షి, వరంగల్ రూరల్: భూమిలేని నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని, ఇందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎకరం భూమి రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల ధరతో కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయిం చింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 627 మంది దళితులకు మూడేళ్లలో 1739.33 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 220 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 40 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లో నాలుగేళ్లలో పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల వివరాలు.. మార్కెట్ కంటే తక్కువ ధర.. జిల్లాల పునర్విభజనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడి భూములు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.15లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల మధ్య కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భూమి అమ్మడానికి యజమానులు మందుకురావడం లేదు. 100 ఎకరాల పైన భూమి అమ్మడానికి యజమానులు ముందుకు వచ్చినా ధర విషయంలో వెనక్కి వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. తప్పని ఎదురు చూపులు.. దళితులకు భూ పంపిణీ పథకం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు భూమి పంపిణీ చేసింది కొద్దిమందికే. ఇచ్చిన భూముల్లోనూ నీటి వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికి పట్టాలు మాత్రమే ఇచ్చారు. భూములకు మాత్రం చూపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వేలాది మంది లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు భూములే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆర్భాటంగా పథకాన్ని ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 150 ఎకరాల స్థలం గుర్తించాం.. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాల భూమిని గుర్తించాం. అనువైన స్థలం ఎంపిక చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చుస్తున్నాం. త్వరలో పంపిణీ చేస్తాం. – సురేష్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ -
రాజకీయం చేయకుండా పరిష్కరించండి
సాక్షి, ముంబై: రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు మంత్రి గిరీశ్ మహాజన్ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి మహాజన్‌కు వివరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటిని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. -
ప్రాణం తీసిన ఆపరేషన్
హుజూరాబాద్: ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ తల్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. చిన్న కూతురికి గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కన్నీరుమున్నీరైంది. ఇరుగుపొరుగు వారి సలహాతో పిల్లలు పుట్టేందుకు రీకనలైషన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. బుధవారం ఆపరేషన్ చేయించుకుం ది. అది వికటించి ఆ మహిళ అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం ఘణపూర్‌కు చెందిన ఆవుల రఘుపతికి శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన మల్లీశ్వరి(28)తో ఆరేళ్లక్రితం వివాహమైంది. రఘుపతి హైదరాబాద్‌లో గుమాస్తగా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఐదు నెలల క్రితం చిన్నకూతురు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజులకు చిన్నకూతురుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి గుండెకు రంధ్రం ఉందని చెప్పడంతో బోరున విలపించారు. ఇంటి చుట్టుపక్కల వారి సలహా మేరకు మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. రీకనలైజేషన్ ఆపరేషన్ కోసం హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ జరుగగా అర్ధరాత్రి అది వికటించి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
దప్పిక తీరే దారేది..!
బజార్హత్నూర్(బోథ్): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు. 576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి. వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూగజీవాలపై నిర్లక్ష్యం.. వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. ఉపయోగంలోకి తేవాలి వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీఏ పీడీ -
తిప్పలు తప్పినట్లే...!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రేషన్ కార్డు ఏ గ్రామంలో ఉంటే.. కార్డుదారులు అక్కడే సరుకులు తీసుకునే విధానం ఉండేది. దీనివల్ల బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ఇబ్బందిపడేవారు. ఇక అటువంటి వాటికి పౌరసరఫరాల శాఖ స్వస్తి పలకనున్నది. అమలులోకి రానున్న కొత్త విధానంతో జిల్లాలో ఎక్కడి నుంచైనా లబ్ధిదారులు సరుకులు తీసుకునే వీలు కలగనుంది. జిల్లాలోని 21 మండలాల్లో గల 669 రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. వీటిని డీలర్లు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. రేషన్ పంపిణీ చేసే రోజుల్లో లబ్ధిదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. మరెక్కడైనా నివాసం ఉంటున్నా.. సరుకులు తీసుకునేందుకు స్వగ్రామానికి రావాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి లబ్ధిదారులకు ఆ అవసరం ఉండదు. అమలు ఇలా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేయనున్న విధానంతో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి కార్డు నంబర్ చెప్పి.. వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వాళ్లు ఎక్కడికి వెళ్లినా రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల రేషన్‌ను నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. దీనికి సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు ఎంత మేరకు రేషన్ సరుకులు సరఫరా చేయాలో ఆ మేరకే రేషన్ షాపులకు పంపిస్తారు. ఇతర దుకాణాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు తీసుకున్న సమయంలో రేషన్ తగ్గినప్పుడు పౌర సరఫరాల శాఖ తగ్గిన మేరకు రేషన్‌ను మళ్లీ సరఫరా చేస్తుంది. ఆన్లైన్ ద్వారా నమోదైన లెక్కల ప్రకారం లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ షాపు నుంచి ఆ బియ్యం, ఇతర వస్తువులను పంపిస్తారు. ఈ విధానాన్ని ఈ నెల నుంచి జిల్లాలో అమలు చేయనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మే నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. జిల్లాలో ఈనెల నుంచి పోర్టబులిటీ విధానం అమలవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల నుంచి అమలయ్యే అవకాశం ఉంది. మార్చి నెలలో లబ్ధిదారులు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా బియ్యం, సరుకులు తీసుకునే వీలుంటుంది. ఇక మే నెల నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేందుకు పౌరసరఫ«రాల శాఖ చర్యలు చేపట్టింది. దీంతో అప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు కలుగుతుంది. -
నాయకులు వేధిస్తున్నారు
ఉలవపాడు : తనకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడమే కాకుండా వేధిస్తున్నారని నాగులపాడు గ్రామానికి చెందిన యరజర్ల శేషమ్మ జగన్ ఎదుట వాపోయింది. తన పాత ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలేదని, నూతన గృహం నిర్మించుకోవడానికి గృహాన్ని మంజూరు చేయడం లేదని విన్నవించింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరింది. – యరజర్ల శేషమ్మ గుండెలో చిల్లు ఇబ్బంది పెడుతుందయ్యా... ఉలవపాడు: చిన్న వయసులో ఉన్న తన కుమారుడికి గుండెలో చిల్లు ఉందని, వైద్యం చేయిం చుకునే పరిస్థితి లేదని నాగులపాడు గ్రామానికి చెందిన అనూష జగన్‌ను కలసి విన్నవించింది. ఆరోగ్య శ్రీ ఉపయోగపడడం లేదని తెలిపింది. తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. – అనూష తాగునీటికి తంటాలు పడుతున్నాం కందుకూరు రూరల్: తమ కాలనీలో తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నామని నాగులపాడుకు చెందిన కంచర్ల రజినీ వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదని మీరైనా మా కాలనీకు మంచినీరు అందించాలని వేడుకుంది. – కంచర్ల రజినీ, నాగులపాడు -
అపెరల్‌కు ఎసరు
చేనేతల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరు సమీపంలో అపెరల్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రూ. 5.58 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో గార్మెంట్స్, హ్యాండ్లూమ్ పరిశ్రమల ఏర్పాటుతో చేనేతలను ఆదుకోవాలన్న వైఎస్ సంకల్పం నెరవేరకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేయకపోగా.. ఇప్పుడా స్థలంలో కొంత భాగం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్లూమ్, డైయింగ్, హ్యాండ్లూమ్ పరిశ్రమలతోపాటు గార్మెంట్స్ తయారీ యూనిట్ల కోసం ఈ స్థలాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. ఆ మేరకు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. 76.17 ఎకరాల స్థలంలో అపెరల్ పార్కు ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 15 నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 47 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పార్కు స్థలంపై పలువురి కన్ను... అపెరల్ పార్కు స్థలంపై పలువురు కన్నేశారు. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగకపోవడం.. అత్యంత విలువైంది కావడంతో దానిని హస్తగతం చేసుకోవాలని బడాబాబులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించడం.. ఆ ఆక్రమణలను తొలగించడానికి అధికారుల పడిన హైరానా అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందులో 5 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ కార్యాలయానికి విక్రయించడం జరిగింది. అప్పుడు 71.17 ఎకరాల స్థలం మాత్రమే అపెరల్‌పార్కుకు ఉంది. ప్రణాళిక ప్రకారమే పక్కన పెట్టారు.. వాస్తవానికి అపెరల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం దశాబ్దకాలం గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించకముందు వరకు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చకచకా పనులు జరిగాయి. ఆయన మరణించాక.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అపెరల్ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ స్థలం నుంచి 5 ఎకరాలను రవాణాశాఖకు కేటాయించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయంలో నిర్లప్తత చూపింది. ఇప్పుడు ఎన్టీఆర్ అర్బన్ పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని సేకరించాలని భావిస్తోంది. ప్రతిపాదించిన మంత్రి నారాయణ.. పురపాలకశాఖ మంత్రి నారాయణ అపెరల్ పార్కు స్థలంలోని 35 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని ఏపీఐఐసీ చైర్మన్‌కు ప్రతిపాదించారు. అందుకుగాను మరోప్రాంతంలో చేనేతలకు స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ. 69 లక్షల చొప్పున ఏపీఐఐసీ ధర నిర్ణయించింది. అయితే దీనిపై చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చేనేతల అభ్యున్నతి కోసం కేటాయించిన పార్కు స్థలాలను పూర్తిగా వారికి కేటాయించాలంటున్నారు. అపెరల్పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తయారయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించడంతోపాటు పెట్టుబడికి రుణసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు.. చేనేతలను ఆదుకునేందుకే అపెరల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి ఏపీఐఐసీనే చూస్తోంది. ఇప్పుడా స్థలంలో ఇంటి నిర్మాణాలకు కేటాయించాలనే ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు. అయితే చేనేతల కోసం కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయిస్తాం. అయితే ఏపీఐఐసీకి మా శాఖ నుంచి రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. – జయరామయ్య, ఏడీ, చేనేత జౌళి శాఖ అభివృద్ధి కోసమే వినియోగించాలి అపెరల్ పార్కు స్థలాన్ని చేనేతల అభివృద్ధి కోసమే వినియోగించాలి. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల దుస్థితిని చూసి 90 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఆస్థలాన్ని ఇళ్ల కోసం కేటాయిస్తామని చెప్పడం చేనేతలను అవమానించినట్లే. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడంటే అది చేనేతల పుణ్యమేనని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. మెండిగా ముందుకెళితే మా సత్తా ఏంటో చూపిస్తాం. – దశరథరామయ్య, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు చేనేతల అభ్యున్నతికి కృషిచేయాలి చేనేత పరిశ్రమలకే అపెరల్ పార్కు స్థలం వాడాలి. కడప జిల్లాలో చిన్నతరహా, భారీ పరిశ్రమలు లేవు. ప్రధానంగా అపెరల్‌పార్కును గార్మెంట్స్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞులైన కళాకారులు అందుబాటులో లేక పోవడం, పెట్టుబడీ దారులు ముందుకు రాక పోవడంతో చేనేతల అభ్యున్నతి కోసమే 2005లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. చేనేతల అభివృద్ధికి కృషి చేయాలి – అవ్వారు ప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రభుత్వ నిర్ణయం సరికాదు చేనేతలను అభివృద్ది చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అపెరల్ పార్కు స్థలాన్ని 13 ఏళ్ల కిందట కేటాయించినా ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. చేనేతలు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఆ స్థలాన్ని ఇళ్లకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం దారుణం. – నాగరాజు, చేనేత కార్మికుడు -
రెండేళ్లు...కన్నీళ్లు
‘అనంత’ కరువుకు చిరునామా.. ప్రకృతికి ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేస్తారు.. అరకొరగా పండినా ఆనందిస్తారు.. పంటమొత్తానికే పోతే..పాలకుల వైపు ఆశగా చూస్తారు..కానీ ప్రచార యావే తప్ప...రైతులను ఆదుకోవాలన్న ధ్యాసలేని సర్కార్...అమాయకులైన రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు గొప్పలు చెప్పిన పాలకులు... అర్హులైన వారికి మాత్రం అందివ్వకుండా వేధిస్తున్నారు. అందువల్లే 2016లోనే అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకూ చాలా మంది రైతుల ఖాతాల్లో పడలేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...రైతు గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. అనంతపురం అగ్రికల్చర్: 2016 ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఒక్కో రైతుకు ఒక్కో రకంగా అన్యాయం జరిగింది. పంట వేసినా పరిహారం రానివారు కొందరు... పదెకరాల్లో పంట వేసి నష్టపోయినా కేవలం రూ.2 వేలు, రూ.3 వేలు వచ్చిన వారు మరికొందరు, వేరుశనగ పంట స్థానంలో ఇతర పంటల నమోదు చేసి అరకొర పరిహారం దక్కించుకున్న వారు ఇంకొందరు రైతులు ఉన్నారు. అంతా ఆన్లైన్, పారదర్శకతకు పెద్దపీట అంటూ గొప్పగా చెబుతున్నా ఇన్పుట్ సబ్సిడీ జాబితాలు తయారు, పరిహారం వర్తింపు, పంపిణీ మాత్రం ఇష్టారాజ్యంగా తయారైంది. అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు తారుమారు చేయడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరగ్గా అనర్హులకు పరిహారం ఎక్కువగా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాలు, పరిహారాన్ని చూసి లక్షలాది మంది రైతులు కంగుతిన్నారు. అర్జీల పోటు ఇన్పుట్ జాబితాలు ప్రకటించగానే రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రైతుల కోపాన్ని తగ్గించడానికి రంగంలోకి దిగిన సర్కారు పెద్దలు, అధికార యంత్రాంగం అర్జీలు ఇస్తే జాబితాలు సరిచేసి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని గొప్పలు చెప్పారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీలు వెల్లువలా వచ్చాయి. అసలే రాని వారు, అరకొరగా పరిహారం వచ్చిన రైతులు లక్షలాది మంది మండల, డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో పట్టాదారు, ఆధార్, బ్యాంకు పుస్తకం అందించి అర్జీలు సమర్పించుకున్నారు. అందులో అసలే పరిహారం రాని వారు 59 వేల మంది రైతులు అర్జీలు ఇచ్చుకోగా తక్కువగా పరిహారం వచ్చిన వారు 42 వేల మంది అర్జీలు ఇచ్చారు. ఇలా లక్ష మందికి పైగా రైతుల నుంచి రూ.143 కోట్లకు అర్జీలు వచ్చిపడ్డాయి. వాటిని మరోసారి క్రోడీకరించిన అధికారులు రూ.126 కోట్లు పరిహారం అదనంగా అవసరమని నివేదిక తయారు చేశారు. అందులో 52 వేల మంది అసలే పరిహారం రాని రైతులకు రూ.84 కోట్లు, తక్కువగా వచ్చిన 35 వేల మంది రైతులకు రూ.42 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మేరకు రూ.126 కోట్లు మంజూరు చేయాలని ఆరు నెలల కిందట ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. పంపిణీ అస్తవ్యస్తం మరోపక్క మంజూరు చేసిన 2016 ఇన్పుట్ పరిహారం పంపిణీ అస్తవ్యస్తంగా తయారు కావడంతో వేలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికీ జమ కావడం లేదు. ఏడాదికో పద్ధతిలో పంపిణీ చేస్తుండటంతో గందరగోళంగా మారింది. జేడీఏ కార్యాలయాన్ని పక్కనపెట్టి 2016 సమస్యలు ఇపుడు మండలాలు, డివిజన్ స్థాయిలోనే జాబితాలు తయారీ, మిస్‌మ్యాచింగ్ సర్దుబాట్లు, ఆ తర్వాత పరిహారం జమ చేసే బాధ్యత ట్రెజరీకి అప్పజెప్పడంతో రైతులకు అర్థం కాకుండా పోయింది. పరిహారం రాని రైతులు ఎక్కడ సంప్రదించినా సరైన జవాబు లభించకపోవడంతో దారుణంగా తయారైంది. జాబితాల ఆధారంగా పరిహారం జమ చేసినట్లు ట్రెజరీ అధికారులు చూపిస్తున్నా రైతు ఖాతాల్లోకి జమ కానివి చాలానే ఉండటం విశేషం. డివిజన్ వ్యవసాయశాఖ కార్యాలయాల నుంచి వందలాది మంది జాబితాలు అప్లోడ్ చేసి ట్రెజరీకి పంపిస్తే అందులో 10 శాతం మందికి కూడా పరిహారం జమ కావడం లేదంటున్నారు. అలా పదే పదే జాబితాలు పంపాల్సివస్తోందని వాపోతున్నారు. జిల్లాకు విడుదలైన రూ.1,032 కోట్ల పరిహారంలో ఇంకా రూ.180 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి చేరలేదంటున్నారు. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాల తయారీ, పరిహారం వర్తింపు, పంపిణీ వ్యవహారం ఘోరంగా తయారైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి ఓ రైతు పేరు ఎం. నాగరాజు.. 2016 ఖరీఫ్‌లో 5.25 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. వర్షం లేక పంట ఎండిపోయి రూ.80 వేలు నష్టం వాటిల్లింది. ఇన్‌పుట్‌సబ్సిడీ కింద గరిష్టంగా రూ.30 వేలు వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. కానీ... జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. బెళుగుప్ప, కళ్యాణదుర్గం, అనంతపురం వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, జేడీఏ కార్యాలయాల్లో అర్జీలు ఇచ్చుకున్నా ఇప్పటికీ నాగరాజు పేరు జాబితాలో చేర్చలేదు. -
జిల్లాకు జలగండం
కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీనివల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రైల్వే ట్రాక్ అవతల ఉన్న బోరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గేటు మూసేస్తున్నారు. ఇప్పుడు నీటికోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. గత నెల 29న నిర్వహించిన జిల్లా గ్రీవెన్స్‌సెల్‌కు మండల లోక్‌సత్తా అధ్యక్షుడు ఐతంశెట్టి శ్రీనివాస్, ఇతర గ్రామస్తులు అందించిన వినతి. విజయనగరం గంటస్తంభం: తాగునీటికి ఒకప్పుడు బావులపై ఆధారపడే వారు. ఇప్పుడు బోర్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో బోర్లున్నా తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. ఉన్న బోర్లలో కొన్ని పనిచేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుంటే... మరికొన్ని బోర్లనుంచి వచ్చే నీరు తాగేందుకు పనికిరావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న చోట శాశ్వత తాగునీటికి రక్షిత మంచినీటి పథకాలే అనివార్యం. జిల్లాలో అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరు అందడంలేదు. 30శాతం గ్రామాలకు అసలు రక్షిత మంచినీటి పథకాలే లేవు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పథకాలు ఉన్నచోట కూడా పైపులైన్లు లేకపోవడం, నీటిసరఫరా వ్వవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, కుళాయిలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నీటి సమస్య మాత్రం తీరడంలేదు. జిల్లాలో 180 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నా రక్షిత మంచినీటి పథకాలున్న 70శాతం గ్రామాల్లో 10 నుంచి 20శాతం గ్రామాల్లో మినహా అన్నిచోట్లా తాగునీటి సరఫరా వీధులన్నింటికీ వెళ్లడంలేదు. ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో దాహం కేకలు వినిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి రక్షిత నీటిసరఫరా చేయాలని అధికారులు భావించారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు ద్వారా సమాచారం రావడంతో ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక తయారు చేయగా కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 2560 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు తాగునీటి వనరులైన రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, పాత వాటి విస్తరణ కోసం రూ.1024కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు గతేడాది ఆక్టోబర్‌లోనే ప్రభుత్వానికి వెళ్లాయి. రెండు, మూడు నెలల్లో నిధులు మంజూరైతే పనులు ప్రారంభించి వేసవికి ముందే పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని భావించారు. కానీ ఐదు నెలలు దాటుతున్నా ఇంతవరకు నిధుల విషయమే చర్చకు రాలేదు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ దీనపి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సర్కారు కూడా కనికరించలేదు. ఫలితంగా ఈ ఏడాది వేసవిలోనూ నీటి ఎద్దడి తప్పని పరిస్థితి నెలకొంది. నిధులు మంజూరైతే సమస్య తీరుతుంది జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. తాగునీటి సరఫరా అన్ని వీధులకు లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలున్నాయి. అలాంటి చోట బోరు నీరు బాగులేకపోతే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో నిధులకోసం ప్రతిపాదించాం. నిధులు విడుదలైతే పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత అంతగా సమస్య ఉండదు. – ఎన్.వి.రమణమూర్తి, ఆర్డబ్యూఎస్ ఎస్ఈ -
భౌబోయ్!
జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. జనంపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రమూ దృష్టి సారించడం లేదు. పెంపుడు కుక్కలకు కూడా రేబిస్ నివారణ టీకాలు నామమాత్రంగానే వేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): వీధి కుక్కల నియంత్రణ చర్యలను అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి సంతతి తగ్గించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు శస్త్ర చికిత్సలు చేయాలి. జిల్లాలో ఇటు అర్బన్ ప్రాంతాల్లోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీధి కుక్కల సంతతి అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది. 2012 పశుగణన ప్రకారం జిల్లాలో 65 వేల వీధి కుక్కలు ఉండగా, నేడు వీటి సంఖ్య 1.25 లక్షలకు చేరింది. కృష్ణగిరి మండలం చిట్యాలలో చిన్నారి ఇబ్రహీంను వీధి కుక్కలు కొరికి చంపాయంటే వీటి వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు. కర్నూలు నగరపాలక సంస్థలో వీధికుక్కల నియంత్రణకు కొంత ప్రయత్నం జరిగినా తర్వాత గాలికొదిలేశారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో, మేజర్, మైనర్ పంచాయతీల్లో శునకాల బెడద ఎక్కువగా ఉంది. జూనోసిస్ దినోత్సవం రోజునే టీకాలు పశుసంవర్ధక శాఖ ప్రతి ఏటా జూలై 24న జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు నామమాత్రంగా వేస్తోంది. వీధి కుక్కల గురించి అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వీధి కుక్కలు 1.25 లక్షల వరకు ఉండగా, పెంపుడు కుక్కలు దాదాపు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీధికుక్కలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా పశుసంవర్ధకశాఖ, మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలపైకి వదులుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని రేబిస్ రహితంగా తీర్చిదిద్దాలని భారత జంతు సంక్షేమ సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో చర్యలు మాత్రం లేవు. నియంత్రణే ముఖ్యం పెంపుడు కుక్కలతో పాటు వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి అవకాశాలున్నాయి. కర్నూలులో 9,600 వీధికుక్కలు ఉండగా.. ఇందులో 25 శాతం వరకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినప్పటికీ అవి జవాబుదారీతనంతో పనిచేయలేదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ఊసే లేదు. ఆపరేషన్ అయిన కుక్కలు దీర్ఘాయుస్సుతో బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కరవడం కూడా చాలా తక్కువ. చెవిని కత్తిరించి వీ ఆకారంలో ఉంటే ఆపరేషన్ అయ్యిందని గుర్తు. పెంపుడు కుక్కలకు కూడా విధిగా జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. ప్రపంచ ఆరోగ్య సంçస్థ తన నివేదికలో 75 శాతం వీధికుక్కలకు రేబిస్ టీకాలు వేయడం వల్ల ఆ ప్రాంతాన్ని రేబిస్ రహితంగా మార్చవచ్చని సూచించింది. వీటికి మూడు నెలల వయస్సులో తప్పనిసరిగా టీకాలతో పాటు ప్రతి ఏటా బూస్టర్ డోస్ వేయించాలి. అప్పుడే వాటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదు. ఈ నెల 21న ప్యాపిలి మండలం హుసేనాపురంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కన్పించిన వారినల్లా కరుస్తూ వెళ్లింది. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు. ఇదే రోజు గూడూరు మండలం చనుగొండ్ల, మునగాలలో నలుగురు వ్యక్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. - కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. - నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. - కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. - కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. నియంత్రణ చర్యలు తీసుకోవాలి వీధి వీధినా కుక్కలు ఉంటున్నాయి. వాటిని దాటుకొని పోవాలంటేనే భయమేస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉండడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చొరవ చూపాలి. – కర్రెక్కగారి నాగిరెడ్డి, వెల్దుర్తి రేబిస్ అత్యంత ప్రమాదకరం రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరం. కుక్క కాటు వల్ల ఇది సోకుతుంది. వ్యాక్సిన్ వేయించిన కుక్క కాటు వల్ల ప్రమాదం లేదు. వేయించని కుక్క కాటు అత్యంత ప్రమాదకరం. కావున వెంటనే యాంటీ రేబిస్ టీకా వేయించుకోవాలి. కరిచిన వెంటనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది. పెంపుడు కుక్కలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ మల్లికార్జున్, కర్నూలు -
‘పొగ’ కష్టాలు తప్పట్లేదు
సత్తుపల్లిరూరల్ : మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై చేసేందుకు వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు దొరకక పోవటం.. అటవీ ప్రాంతాల నుంచి పుల్లలు తీసుకొచ్చే వీలు లేకుండా పోవటంతో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది. పదిహేడేళ్లుగా కట్టెల పొగతో వంట చేస్తుండటంతో కళ్ల మంటలు వచ్చి కంటిచూపు తగ్గిపోతుందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 2017 నాటికే మధ్యాహ్న భోజనం చేసేందుకు గ్యాస్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు అమలుకు నోచుకోవటం లేదని మధ్యాహ్న భోజన వర్కర్లు వాపోతున్నారు. క్లాసురూంల్లోకి ఈ పొగ వెళ్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్లకు గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. వర్షం వస్తే గొడుగుల కిందే.. వర్షం వస్తే వంట షెడ్లు లేకపోవటంతో మధ్యాహ్న భోజన కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. భవనాల సన్‌సైడ్ కిందో.. గొడుగుల కింద వంటలు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడైపోవటంతో సొంతంగా వంట పాత్రలు కొనుగోలు చేసుకొని వంట వండాల్సి వస్తోందంటున్నారు. పదిహేడేళ్ల నుంచి చేస్తున్నా.. కనీస వేతన చట్టం అమలుకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వడ్డించే బిల్లులు రెండు నెలలుగా అందక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కారం వంటి సరుకులు అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని.. ప్రభుత్వం ఏ నెల బిల్లులు ఆ నెలలోనే చెల్లిస్తే తమ కష్టాలు తప్పుతాయంటున్నారు. గుడ్డు ధర పెరిగింది.. మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ.5 ఉండగా ప్రభుత్వం మాత్రం రూ.4 మాత్రమే చెల్లిస్తుండటంతో వారానికి రెండు సార్లు వడ్డించాలంటే నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరుతున్నారు. కళ్ల మంటలతో.. కట్టెల పోయ్యి మీద వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పొగతో కళ్లు మంటలు వస్తున్నాయి. ప్రభుత్వ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోవటం లేదు. పొగతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. – పూచి సీత, వర్కర్, సత్తుపల్లి -
డంపింగ్ యార్డుల జాడేదీ ?
‘‘పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే రిక్షాల్లోనే వేయాలి అని.. పేర్కొంటూ గ్రామాల్లో ఆర్భాటంగా డంపింగ్‌యార్డుల నిర్మాణాలు ప్రారంభించారు. అంతవరకూ బాగానే ఉన్నా నెలలు గడుస్తున్నా నేటికీ మండలంలో నాలుగు గ్రామాల్లోనే అవి పూర్తికాగా.. కొన్ని గ్రామాల్లో స్థలాలు లేక, మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన డంపింగ్‌యార్డుల నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో పారిశుద్ధ్యం పడకేసింది, చిన్నచింతకుంట : మండలంలోని ఆయా గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం గల గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డంపింగ్‌యార్డుల నిర్మాణాలు నెలల కిందట చేపట్టింది. మండలంలోని 18 గ్రామాల్లో డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు ప్రారంభించగా.. 4 గ్రామాలైన ఉంద్యాల, దాసర్పల్లి, ముచ్చింతల, అల్లీపూర్లో మాత్రం పూర్తయ్యాయి. డంపింగ్‌యార్డుల నిర్మాణాల కోసం ఈజీఎస్ అధికారులు స్థలాలు ఎంపిక చేశారు. అయితే, ఉపాధి కూలీలతో 8 గ్రామాలైన గూడూర్, నెల్లికొండి, వడ్డెమాన్, మద్దూర్, లాల్కోట, తిర్మలాపూర్ , అమ్మాపూర్, చిన్నచింతకుంటలో డంపింగ్‌యార్డు గుంతలను ఇప్పుడిప్పుడే తవ్వుతున్నారు. మిగిలిన 6 గ్రామాల్లో స్థలం లేక డంపింగ్ యార్డు పనులకు నోచుకోలేదు. పేరుకుపోతున్న చెత్తా చెదారం పట్టణంతో పాటు ఆయా గ్రామపంచాయతీలలో తడి, పొడి చెత్తలను ఎక్కడపడితే అక్కడ పారవేయడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్భరంగా తయారవుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాల్లో తప్ప మిగిలిన రోజుల్లో అధికారులు పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవడంతో చెత్తకుప్పలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు తడిపొడి చెత్తలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలు కూడా నిరుపయోగంగా మారాయి. అవి పంచాయతీ ఆవరణలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో చెత్తనిల్వల కోసం డంపింగ్‌యార్డులను వెంటనే చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అపరిశుభ్రంగా మారాయి గ్రామాల్లో డంపింగ్‌యార్డు పనులు నిలిచిపోవడంతో చెత్తా చెదారం రోడ్లపైనే పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పందుల సంచారం పెరిగింది. దీనితో పాటు ఈగలు, దోమలు వ్యాప్తిచెంది రోగాలబారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి డంపింగ్‌యార్డులు త్వరగా పూర్తిచేయాలి. – చంద్రశేఖర్‌గౌడ్, అప్పంపల్లి త్వరలో పూర్తి చేస్తాం మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తాం. పర్దిపూర్, బండ్రవల్లి, పల్లమర్రి, కురుమూర్తి దమగ్నాపూర్,అప్పంపల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఊరికి దూరంగా చూపించకపోవడంతో పనులు మొదలుపెట్టలేక పోయాం. త్వరలో స్థలాలు ఎంపిక చేసి పూర్తిచేస్తాం. – నవీన్‌కుమార్, ఏపీఓ -
దారిద్య్రం
బల్మూర్ : కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అలసత్వంతో రోడ్ల పనుల్లో నాణ్యత కొరవడింది. మండలంలోని పంచాయతీ రాజ్ నిధులతో అనంతవరం నుంచి అంబగిరి, లక్ష్మీపల్లి, బిల్లకల్, వెంకటగిరి, బాణాల, రామాజిపల్లి, జిన్‌కుంట, గ్రామాలకు ఐదేళ్ల క్రితం బీటీ రోడ్లు వేశారు. రెండేళ్ల నుంచి ఆ రోడ్లపై కంకర తేలి గతుకులమయంగా మారాయి. దీంతో వాహనదారులు గమ్యం చేరాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. పనుల్లో నాణ్యాత లోపం బీటీ రోడ్డు పనులు చేసే సమయంలో సరైన నాణ్యత ప్రమాణాలు æపాటించక పోవడం, అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఇష్టానుసారంగా పనులను చేసి బిల్లులు దండు కొంటుండటంతో కొద్ది కాలనికే రోడ్లు మరమ్మతుకు చేరుకుంటున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా కూడా ఈరోడ్లపై రెన్యూవల్ కోట్ పనులు చేయాల్సి ఉన్నా నిధులు మంజూరులో జాప్యం చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. గతుకుల మయంగా మారి న ఈ రోడ్లకు నిధులు మం జూరు చేసి పనులు ప్రారంభిం చాలని కోరుతున్నారు. రాకపోకలకు ఇబ్బందులు మా గ్రామానికి ఐదేళ్ల క్రితం వేసిన బీటీ రోడ్లు అప్పుడే కంకర తేలి గుంతల మయంగా మారాయి. రెండేళ్లుగా ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు కూడా తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేయడంతోనే రోడ్డు ఈ పరిస్థితికి చేరింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రెన్యూవల్ కోట్ ప నులకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలి. – వి.శ్రీనివాసులు, అంబగిరి, బల్మూర్ రెన్యూవల్ పనులకు నివేదిక పంపాం మండలంలోని అంబగిరి, బాణాల, లక్ష్మీపల్లి, రామాజిపల్లి తదితర రోడ్లపై రెన్యూవల్ కోట్ బీటీ పనులకు రూ.3కోట్ల50లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు మంజూరైన వెంటనే జాప్యం లేకుండా పనులు పూర్తి చేయిస్తాం. – జీజే రాబర్ట్, పీఆర్ ఏఈ, బల్మూర్ -
ఈ సారైనా.. చర్చిస్తారా?
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ జరిగలేదు. ఈసారి జరిగే సమావేశం ఏదైనా ప్రతిఫలం ఇస్తుందా.. లేక ఎప్పటిలాగే రచ్చ చేసి ఎవరిదారిన వారు పోతారా.. అనేది వేచి చూడాల్సిందే. జెడ్పీ పాలక మండలి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు 13 సమావేశాలు జరిగాయి. ఏ సమావేశంలో కూడా రాజకీయ రచ్చ తప్పి స్తే ప్రజా అవసరాలు, సమస్యలపై చర్చ ఏ మాత్రం జరగకపోవడం గమనార్హం. 6 జిల్లాలో 182 అంశాలు మొత్తం ఆరు జిల్లాలకు చెందిన 182 అంశాలపై అధికారులు ఎజెండా తయారు చేశా రు. ఇందులో 38 శాఖలకు చెందిన ఎజెం డా కాపీలు జిల్లా పరిషత్‌కు పంపలేదు. గత సమావేశంలో చర్చించిన అంశాలు పరి ష్కారం కావనే అభిప్రాయం సభ్యుల్లో ఉం డగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావడం లే దు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు స మావేశాని కి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ క్రమం లో సమావేశాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చర్చకు రాని ఎజెండాలు... పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి ఎజెండాలోని అంశాలు ఎన్నడూ చర్చకు రాలేదు. ఒక వేళ జరిగినా రెండు, మూడు ఎజెండాలపై మాత్రమే ఎవరైనా మాట్లాడతారు. ఎప్పటికీ తాగునీటి సమస్య (ఆర్డ బ్ల్యూఎస్), వ్యవసాయం, ఉపాధి హామీ (డీఆర్డీఓ) తప్పితే మరో శాఖ మీద చర్చే జరగలేదు. ఈ సారి 182 అంశాల ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 38 శాఖల ప్రగతి నివేదికలను జెడ్పీ అధికారుల కు ఆయా శా ఖ అధికారులు ఇంకా సమర్పించనేలేదు. ఉ మ్మడి జిల్లా ఉన్నప్పుడు 68 ఎజెండాలు ఉం టేవి. అప్పుడే మూడుకు మించి అంశాలపై చర్చ జరుగలేదు. కొత్త జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో 182 అంశాల ఎజెండా జిల్లా పరిషత్ ముందు ఉంది. ఇందులో ఎన్ని అం శాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉంది. మొదటి ఎజెండాగా ఆర్‌డబ్లు్యఎస్ శాఖను పెట్టగా.. వ్యవసాయం, ఇరిగేషన్, డీఆర్డీ, ఎస్సీ సంక్షేమ శాఖలు ఆ తర్వాత ఉన్నాయి. కొత్త పంచాయతీలపై ప్రశ్నిస్తారా? ప్రభుత్వం ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామపంచాయతీలను ఏ ర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. 500 జనాభా ఉన్న గ్రామపంచాయతీల ప్రతిపాదనలను అధికారులు సి ద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తమ గ్రా మాన్ని పంచాయతీగా మార్చాలని, లేక వద్ద ట సభ్యులు పట్టు బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీతో సహా అందరు సభ్యులు నిధుల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కారణంతో శనివారం జరగనున్న సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనవసర చర్చలు జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇప్పటిదాక 13 జెడ్పీ సర్వసభ్య సమావేశాలు కొనసాగాయి. గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశం మొత్తం రచ్చరచ్చగా జరిగింది. జెడ్పీటీసీ సభ్యులకు తెలియకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సభ్యుల ఆందోళన చేపట్టారు. అది కాస్తా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ రగడకు దారి తీసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే సభను ముగించారు. ఇలాగే ప్రతి సభలో ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి పక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలకు మధ్య వాదోపవాదాలు సర్వసాధారణమయ్యాయి. ఉన్నది మూడే సమావేశాలు జెడ్పీ సమావేశాలు ఇక మూడే ఉన్నాయి.. ఇన్నిరోజులు జరిగిన సమావేశాల్లో ఏ సమస్యా పరిష్కారం కాలేదు. నిధులు లేక జెడ్పీకి వెళ్లలేక పోతున్నాం. ప్రతి మూన్నెళ్లకోసారి సభ నిర్వహించాలని కోరినా నిర్వహించలేని పరిస్థితి నెలకుంది. సభ నిర్వహణ కూడా గందరగోళంగా మారుతోంది. – శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, మక్తల్ నిధులు కేటాయించాలి జిల్లా పరిషత్‌కు పూర్వ వైభవం రావాలంటే అధిక నిధులను కేటాయించాలి. తాము ఎన్నికైన మండలంలో అభివృద్ధి పనులు చేపడతామం. నిధులు లేక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాం. – రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు, ఖిల్లాఘనపూర్ జెడ్పీని బలోపేతం చేస్తాం... జిల్లా పరిషత్‌ను బలోపేతం చేస్తాం. త్వరలో ప్రభుత్వం జెడ్పీకి అధిక నిధులను కేటాయించనుంది. జెడ్పీటీసీల గౌరవం పెంచే విధంగా కృషి చేస్తాం. జిల్లా పరిషత్ సమావేశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. పక్షపాత వైఖరి లేకుండా అందరికి సమాన అవకాశం కల్పిస్తాం. – బండారి భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ -
వెలగని దీపం
చారకొండ : దీపం సిలిండర్లు అందక మండల పరిధిలోని గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటచెరుకుకోసం మహిళలు, వృద్ధులు పడరాని పా ట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తున్నామని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని నేటికి వంటగ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మంజూరు కాని సిలిండర్లు... మండలంలో ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలలో 2000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 160 మంది దీపం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు మంజూరు కాలేదు. వీరి బాధలు అధికారులు, ప్రజాప్రతినిదులకు పట్టడం లేదు. గ్యాస్ గోదాముల్లో కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అడవుల్లో వంట చెరుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సిలిండర్లు కొనుగోలు చేయడానికి అదిక ధరలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు నేటికి వాటిని వినియోగించడం లేదు. వంటగ్యాస్ కనెక్షన్‌కు రూ.4500 నుంచి రూ5500 వరకు ఉండడంతో ఎంతో మంది వీటికి దూరమవుతున్నారు. గ్యాస్ ఒక సారి నింపడానికి రూ.850 రూ పాయలు ఖర్చవుతున్నాయి. నగదు బది లీ ద్వారా 177 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలలో జమచేస్తున్నారు. కట్టెల పొయ్యితో కష్టాలు.. ఆధునిక ప్రపంచంలో నేటికీ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిలు వాడుతూ అనారోగ్య పాలవుతున్నారు. కళ్లు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీ పం సిలిండర్లను పంపిణీ చేయాల్సిన అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక గ్రామాల్లో వంటచెరు కు కోసం కొన్ని సందర్భాల్లో ఇంటిల్లిపాది అడవుల వెంట తిరుగుతున్నారు. అధికారులు స్పందించాలి చారకొండ: మా గ్రామంలో చాలా మందికి సిలిండర్లు లేవు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలతో ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న సిలిండర్లు పేదలకు అందడం లేదు. దీంతో మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్తూ అనేక పాట్లు పడుతున్నారు. అదికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కనికరించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి సబ్సిడీపై నిరుపేద కుటుంబాలకు సిలిండర్లు మంజూరు చేయాలి. మహిళల పాట్లు తొలగించాలి. – కొండల్, జూపల్లి -
చంపేస్తున్న ఈగ
ఈగల గోల మేం భరించలేకపోతున్నాం అని 8 గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. రాజమౌళి ఈగ సినిమా చూశాక చాలామందికి ఈగను తక్కువగా అంచనా వేయరాదనే ఒక భావన వచ్చి ఉంటుంది. కానీ ఈ గ్రామాల వాసులకు ఆ సినిమాలో చూపించిన కష్టాల కంటే ఎక్కువే చుట్టుముట్టాయి. ఈగలు 24 గంటలూ వెంటాడి వేధిస్తున్నాయి. దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలోని హుస్కూరు చుట్టుపక్కల ఉన్న సుమారు 15 కోళ్లఫారాల కారణంగా ఉత్పత్తవుతున్న ఈగలు దండయాత్ర మాదిరిగా పరిసర గ్రామాలపైబడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఓపిక నశించిన హుస్కూరు సహా 8 గ్రామాల ప్రజలు సోమవారంనాడు ఆ కోళ్లఫారాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈగలనైనా అరికట్టండి, లేదా ఊరు వదిలి వెళ్లిపోండి అని కోళ్లఫారాల యజమానులకు స్పష్టంచేశారు. మా కష్టాలు అన్నీఇన్నీ కావు బాధితులు మాట్లాడుతూ ‘15 సంవత్సరాలుగా హుస్కూరు చుట్టుపక్కల పలు కోళ్లఫారాలు నడుస్తున్నాయి, అక్కడి చెత్త వల్ల ఉత్పత్తవుతున్న ఈగలు మా గ్రామాలపైబడి అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి, ఇంట్లో, బయట, గోడల మీద, పాత్రలమీద, వాహనాలమీద ఈగలు ముసురుకుంటున్నాయి. ఇటీవలి వర్షాలకు మరింత ముదిరాయి. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా ఈగలు ముసురుకుంటున్నాయి. కనీసం టాయ్లెట్లోనూ ప్రశాంతత కరువైంది. చేతులతో నిర్విరామంగా ఈగలను తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భోజనం చేయాలంటేనే బేజారెత్తిపోయింది. అన్నం పెట్టుకుని కంచం ముందు పెట్టుకుంటే చేతికన్నా ముందు ఈగలే అన్నం మీద వాలుతున్నాయి. దీంతో గ్రామంలో చాలామంది అంటురోగాల బారినపడ్డారు. మనుషుల పరిస్థితి ఇదయితే పశువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పశువులపై ఈగలు వాలి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈగల పీడ వల్ల గత వారం రోజుల్లోనే పదికి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి’ అని బాధితులు ఆవేదనను ఏకరువు పెట్టారు. పట్టించుకోని నేతలు, అధికారులు పశువుల కళ్ళల్లోకి, ముక్కుల్లోకి వేళ్లే ఈగలు ఒంటిమీద గాయాలు ఉంటే రక్తాన్ని పీల్చి చంపుతున్నాయన్నారు. ఈగల సమస్యపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈగల బాధ ఇలాగే కొనసాగితే గ్రామాలు వదలి వెళ్లిపోవాల్సిందేనని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఒక కోళ్లఫారం మేనేజర్ మాట్లాడుతూ ఈగల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.