స్పందిస్తారా... సరిచేసుకోమంటారా ? | koppavaram road problem | Sakshi
Sakshi News home page

స్పందిస్తారా... సరిచేసుకోమంటారా ?

Published Sat, Aug 5 2017 11:26 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

స్పందిస్తారా... సరిచేసుకోమంటారా ? - Sakshi

స్పందిస్తారా... సరిచేసుకోమంటారా ?

రోడ్ల దుస్థితిపై డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం
ప్రభుత్వ తీరుపై విమర్శలు 
కొప్పవరం - అనపర్తి వరకు పాదయాత్ర
అనపర్తి : అనపర్తి మండలం కొప్పవరం గ్రామ రహదారులు దుస్థితికి చేరి ప్రయాణికులు ఇబ్బందులు ఎరుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు చేపడతామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొమరిపాలెం–కొప్పవరం–అనపర్తి, మహేంద్రవాడ–కొప్పవరం–లక్ష్మీనరసాపురం అభివృద్ధి పరచాలని కోరుతూ డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి శనివారం కొప్పవరం నుంచి అనపర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. తొలుత గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, కొప్పవరం, మహేంద్రవాడ, కొమరిపాలెం, తొస్సిపూడి గ్రామస్తులు ఆయన పాదయాత్రను అనుసరించారు. పాదయాత్ర అనంతరం అనపర్తి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన సభలో డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడారు. కొప్పవరం గ్రామానికి సంబంధించిన అత్యధిక రోడ్లు కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలకులు కొప్పవరం గ్రామ రోడ్లపై చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యం కారణంగా వాటిని రోడ్లు అని కూడా అనే పరిస్థితి లేనంతగా శిథిలస్థితికి చేరాయని ఆయన విమర్శించారు. పదిహేను రోజుల లోపు ఈ రోడ్లను కనీసం మరమ్మతులైనా చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టని పక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులకు అత్యవసర రహదారి అయిన కొప్పవరం–అనపర్తి రోడ్డు గోతులను పూడ్చి మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల  కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఒంటిమి సూర్యప్రకాశ్, పడాల శ్రీనివాసరెడ్డి, అడబాల వెంకటేశ్వరరావు, తిబిరిశెట్టి ఆదినారాయణ, నియోజకవర్గ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, అనపర్తి, బిక్కవోలు మండల కన్వీనర్లు మల్లిడి ఆదినారాయణరెడ్డి, ఒంగా రామ్‌గోపాల్‌రెడ్డి, అనపర్తి, బిక్కవోలు యువజన విభాగం కన్వీనర్లు కర్రి బులిమోహన్‌రెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, మండల కార్యదర్శి పాదూరి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement